
న్యూఢిల్లీ: జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ (జీల్) ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో రూ.766 కోట్ల కన్సాలిడేటెడ్ నష్టాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.292 కోట్లుగా ఉండడం గమనార్హం. మొత్తం ఆదాయం 4 శాతం తగ్గి రూ.1,992 కోట్లుగా నమోదైంది. ప్రకటనల రూపంలో ఆదాయం 15 శాతం క్షీణించి రూ.1,039 కోట్లుగా ఉంది. 2019–20 పూర్తి ఆర్థిక సంవత్సరానికి లాభం 67 శాతం తగ్గి రూ.524 కోట్లకు చేరగా, ఆదాయం రూ.8,185 కోట్ల నుంచి రూ.8,413 కోట్లకు పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment