
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ కంపెనీ జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మార్చి త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో రూ.1,127 కోట్ల నష్టం చవిచూసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీకి రూ.2,353 కోట్ల నష్టం వాటిల్లింది. టర్నోవరు రూ.1,994 కోట్ల నుంచి రూ.2,349 కోట్లకు చేరింది. ఎబిటా రూ.655 కోట్లుగా ఉంది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి రూ.2,198 కోట్ల నష్టం ప్రకటించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ.3,466 కోట్ల నష్టం పొందింది. టర్నోవరు రూ.7,576 కోట్ల నుంచి రూ.8,556 కోట్లకు చేరింది. ఎయిర్‌పోర్టుల ఆదాయం నాల్గవ త్రైమాసికంలో రూ.1,582 కోట్లు, ఆర్థిక సంవత్సరంలో రూ.6,191 కోట్లు నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment