హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ సంస్థ జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ జూన్ త్రైమాసి కం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో రూ.318 కోట్ల నష్టం చవిచూసింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.834 కోట్ల నష్టం వాటిల్లింది. టర్నోవర్ రూ.1,224 కోట్ల నుంచి రూ.1,897 కోట్లకు చేరింది. వ్యయాలు రూ.2,197 కోట్ల నుంచి రూ.2,331 కోట్లకు ఎగబాకాయి. ఎయిర్‌పోర్టుల ఆదాయం రూ.494 కోట్ల నుంచి రూ.898 కోట్లుగా ఉంది. విద్యుత్ విభాగం ఆదాయం రూ.300 కోట్ల నుంచి రూ.446 కోట్లకు చేరింది. క్రితం ముగింపుతో పోలిస్తే జీఎంఆర్ ఇన్‌ఫ్రా షేరు ధర శుక్రవారం 0.89 శాతం తగ్గి రూ.27.90 వద్ద స్థిరపడింది.
Comments
Please login to add a commentAdd a comment