జూన్ క్వార్టర్‌లో రూ.35వేల కోట్లు
అగ్రస్థానంలో గోద్రేజ్ ప్రాపరీ్టస్
కంపెనీలకు కలిసొస్తున్న డిమాండ్
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ డెవలపర్లు జూన్ త్రైమాసికంలో రూ.35,000 కోట్ల విలువ చేసే ఇళ్లను విక్రయించారు. ఇందులో గోద్రేజ్ ఇండస్ట్రీస్ అత్యధిక అమ్మకాలతో మొదటి స్థానంలో నిలిచింది. 21 లిస్టెడ్ రియల్ ఎస్టేట్ సంస్థల డేటాను విశ్లేíÙంచగా.. బలమైన వినియోగ డిమాండ్ మద్దతుతో దాదాపు అన్ని సంస్థలు మెరుగైన విక్రయాలు నమోదు చేశాయి. గోద్రేజ్ ప్రాపర్టీస్ జూన్ త్రైమాసికంలో రూ.8,637 కోట్ల విలువైన ఇళ్లను ముందస్తు బుకింగ్‌లలో భాగంగా విక్రయించింది.
→ డీఎల్‌ఎఫ్ సేల్స్ బుకింగ్‌లు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే మూడు రెట్ల వృద్ధితో రూ.6,404 కోట్లుగా ఉన్నాయి.
→ ముంబైకి చెందిన మ్యాక్రోటెక్ డెవలపర్స్ (లోధా) సైతం రూ.4,030 కోట్ల బుకింగ్‌లు నమోదు చేసింది.
→ గురుగ్రామ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే సిగ్నేచర్ గ్లోబల్ (ఇటీవలే లిస్ట్ అయిన సంస్థ) రూ.3,120 కోట్ల బుకింగ్‌లను సాధించింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే మూడు రెట్లు అధికం.
→ బెంగళూరుకు చెందిన ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ సైతం రూ.3,029 కోట్ల అమ్మకాలు నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే తగ్గాయి.
→ బెంగళూరు కేంద్రంగా పనిచేసే శోభ లిమిటెడ్ రూ.1,874 కోట్లు, బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజెస్ రూ.1,086 కోట్ల చొప్పున ముందస్తు బుకింగ్‌లు సాధించాయి. అలాగే, పురవంకర లిమిటెడ్ రూ.1,128 కోట్ల అమ్మకాలు నమోదు చేసింది. బెంగళూరుకు చెందిన శ్రీరామ్ ప్రాపరీ్టస్ రూ.376 కోట్ల విలువైన ప్రాపర్టీలను విక్రయించింది.
→ ముంబైకి చెందిన ఒబెరాయ్ రియాలిటీ రూ.1,067 కోట్ల విలువైన ప్రాపరీ్టలను విక్రయించింది. ముంబైకే చెందిన మహీంద్రా లైఫ్‌స్పేస్ డెవలపర్స్ రూ.1,019 కోట్లు, కీస్టోన్ రియల్టర్స్ రూ.611 కోట్లు చొప్పున బుకింగ్‌లు సాధించాయి.
→ ముంబైకి చెందిన మరో సంస్థ సన్‌టెక్ రియాలిటీ రూ.502 కోట్ల అమ్మకాలు చేసింది. అలాగే, ఈక్వినాక్స్ ఇండియా డెవలపర్స్ రూ.81 క్లోు, సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ రూ.140 కోట్ల విలువైన ప్రాపరీ్టలను విక్రయించాయి.
బలమైన డిమాండ్..
కరోనా అనంతరం ఇళ్లకు బలమైన డిమాండ్ నెలకొనడమే మెరుగైన అమ్మకాల బుకింగ్‌లకు కారణమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల నిర్వహణలో మెరుగైన ట్రాక్ రికార్డు కలిగిన బ్రాండ్ల వైపు వినియోగదారులు మొగ్గు చూపిస్తున్నట్టు పేర్కొంటున్నాయి. ఇవన్నీ స్టాక్ ఎక్సే్ఛంజ్‌లలో లిస్ట్ అ యిన కంపెనీల గణాంకాలు మాత్రమే. అన్ లిస్టెడ్‌లో ఉన్న కంపెనీల విక్రయాలు కూడా కలిపి చూస్తే భారీ మొత్తమే ఉంటుంది. టాటా రియాలిటీ అండ్ ఇన్‌ఫ్రా లిమిటెడ్, అదానీ రియాలిటీ, పి రమల్ రియాలిటీ, హిరనందానీ గ్రూప్, ఎంబసీ గ్రూప్, కే రహేజా గ్రూప్ అన్‌లిస్టెడ్‌లో ప్రముఖ కంపెనీలుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment