Godrej Industries
-
రియల్టీ మార్కెట్లో భారీ అమ్మకాలు
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ డెవలపర్లు జూన్ త్రైమాసికంలో రూ.35,000 కోట్ల విలువ చేసే ఇళ్లను విక్రయించారు. ఇందులో గోద్రేజ్ ఇండస్ట్రీస్ అత్యధిక అమ్మకాలతో మొదటి స్థానంలో నిలిచింది. 21 లిస్టెడ్ రియల్ ఎస్టేట్ సంస్థల డేటాను విశ్లేíÙంచగా.. బలమైన వినియోగ డిమాండ్ మద్దతుతో దాదాపు అన్ని సంస్థలు మెరుగైన విక్రయాలు నమోదు చేశాయి. గోద్రేజ్ ప్రాపర్టీస్ జూన్ త్రైమాసికంలో రూ.8,637 కోట్ల విలువైన ఇళ్లను ముందస్తు బుకింగ్‌లలో భాగంగా విక్రయించింది. → డీఎల్ఎఫ్ సేల్స్ బుకింగ్‌లు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే మూడు రెట్ల వృద్ధితో రూ.6,404 కోట్లుగా ఉన్నాయి. → ముంబైకి చెందిన మ్యాక్రోటెక్ డెవలపర్స్ (లోధా) సైతం రూ.4,030 కోట్ల బుకింగ్‌లు నమోదు చేసింది. → గురుగ్రామ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే సిగ్నేచర్ గ్లోబల్ (ఇటీవలే లిస్ట్ అయిన సంస్థ) రూ.3,120 కోట్ల బుకింగ్‌లను సాధించింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే మూడు రెట్లు అధికం. → బెంగళూరుకు చెందిన ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ సైతం రూ.3,029 కోట్ల అమ్మకాలు నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే తగ్గాయి. → బెంగళూరు కేంద్రంగా పనిచేసే శోభ లిమిటెడ్ రూ.1,874 కోట్లు, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ రూ.1,086 కోట్ల చొప్పున ముందస్తు బుకింగ్‌లు సాధించాయి. అలాగే, పురవంకర లిమిటెడ్ రూ.1,128 కోట్ల అమ్మకాలు నమోదు చేసింది. బెంగళూరుకు చెందిన శ్రీరామ్ ప్రాపరీ్టస్ రూ.376 కోట్ల విలువైన ప్రాపర్టీలను విక్రయించింది. → ముంబైకి చెందిన ఒబెరాయ్ రియాలిటీ రూ.1,067 కోట్ల విలువైన ప్రాపరీ్టలను విక్రయించింది. ముంబైకే చెందిన మహీంద్రా లైఫ్‌స్పేస్ డెవలపర్స్ రూ.1,019 కోట్లు, కీస్టోన్ రియల్టర్స్ రూ.611 కోట్లు చొప్పున బుకింగ్‌లు సాధించాయి. → ముంబైకి చెందిన మరో సంస్థ సన్‌టెక్ రియాలిటీ రూ.502 కోట్ల అమ్మకాలు చేసింది. అలాగే, ఈక్వినాక్స్ ఇండియా డెవలపర్స్ రూ.81 క్లోు, సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ రూ.140 కోట్ల విలువైన ప్రాపరీ్టలను విక్రయించాయి. బలమైన డిమాండ్.. కరోనా అనంతరం ఇళ్లకు బలమైన డిమాండ్ నెలకొనడమే మెరుగైన అమ్మకాల బుకింగ్‌లకు కారణమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల నిర్వహణలో మెరుగైన ట్రాక్ రికార్డు కలిగిన బ్రాండ్ల వైపు వినియోగదారులు మొగ్గు చూపిస్తున్నట్టు పేర్కొంటున్నాయి. ఇవన్నీ స్టాక్ ఎక్సే్ఛంజ్‌లలో లిస్ట్ అ యిన కంపెనీల గణాంకాలు మాత్రమే. అన్ లిస్టెడ్‌లో ఉన్న కంపెనీల విక్రయాలు కూడా కలిపి చూస్తే భారీ మొత్తమే ఉంటుంది. టాటా రియాలిటీ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్, అదానీ రియాలిటీ, పి రమల్ రియాలిటీ, హిరనందానీ గ్రూప్, ఎంబసీ గ్రూప్, కే రహేజా గ్రూప్ అన్లిస్టెడ్లో ప్రముఖ కంపెనీలుగా ఉన్నాయి. -
భారీ వృద్ధిపై గోద్రేజ్ క్యాపిటల్ కన్ను
చెన్నై: బ్యాంకింగేతర ఆర్థిక సేవల్లోని గోద్రేజ్ క్యాపిటల్ తన రుణ పుస్తకాన్ని భారీగా పెంచుకోవాలన్న లక్ష్యంతో ఉంది. 2028 నాటికి రుణ పుస్తకాన్ని రూ.50,000 కోట్లకు చేర్చే దిశగా పనిచేస్తున్నట్టు సంస్థ ఎండీ, సీఈవో మనీష్ షా ప్రకటించారు. గోద్రేజ్ ఇండస్ట్రీస్ నూరు శాతం అనుబంధ సంస్థగా గోద్రేజ్ క్యాపిటల్ 2020లో కార్యకలాపాలు ప్రారంభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో బ్రేక్ఈవెన్ సాధించినట్టు (లాభ, నష్టాల్లేని స్థితి) మనీషా తెలిపారు. 2028 నాటికి రూ.50,000 కోట్ల రుణ ఆస్తులను చేరుకునేందుకు వీలుగా తమకు అదనంగా రూ.4,000 కోట్ల నిధులు అవసరం అవుతాయని చెప్పారు. ‘‘2020 అక్టోబర్‌లో లైసెన్స్ లభించింది. 2028 నాటికి ఏయూఎంను రూ.50,000 కోట్లకు చేర్చాలని అనుకుంటున్నాం. 2024 మార్చి నాటికి ఏయూఎం రూ.10,000 కోట్లను చేరుతుంది. హోల్డింగ్ కంపెనీ (గోద్రేజ్ ఇండస్ట్రీస్) నుంచి రూ.2,000 కోట్లు అందుకున్నాం. రూ.50,000 కోట్ల పుస్తకాన్ని చేరుకునేందుకు ఏటా రూ.1,000 కోట్ల చొప్పున నిధులు అవసరం అవుతాయి’’అని చెన్నైలో మీడియా ప్రతినిధులకు షా తెలిపారు. 2026 నాటికి రూ.30,000 కోట్ల ఏయూఎంకు చేరుకుంటామన్నారు. ఎంఎస్ఎంఈ, గృహ రుణాలు తమ ప్రాధాన్య విభాగాలుగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న రూ.7,700 కోట్ల రుణాల్లో ఎంఎస్ఎంఈలకు ఇచ్చినవి రూ.4,000 కోట్లుగా ఉన్నట్టు తెలిపారు. మిగిలిన మొత్తం గృహ రుణాలుగా పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈ రుణ ఆస్తుల్లో రూ.5–50 కోట్ల మధ్య ఆదాయం కలిగినవి ఎక్కువగా ఉన్నట్టు చెప్పారు. ఎంఎస్ఎంఈలు తమ వ్యాపారాన్ని సమగ్రంగా వృద్ధి చేసుకునేందుకు వీలుగా త్వరలోనే ‘నిర్మన్’ పేరుతో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించనున్నట్టు షా ప్రకటించారు. నిర్మన్ సేవల కోసం అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్, ఆన్‌ష్యూరిటీ, జోల్‌విట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు చెప్పారు. తద్వారా ఎంఎస్ఎంఈలకు ఆన్లైన్ మార్కెట్ అవకాశాలు కల్పించనున్నట్టు పేర్కొన్నారు. -
లాభాల్లోకి గోద్రెజ్ ఇండస్ట్రీస్
న్యూఢిల్లీ: ప్రైయివేట్ రంగ దిగ్గజం గోద్రెజ్ ఇండస్ట్రీస్ గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు ప్రకటించింది. క్యూ4(జనవరి–మార్చి)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 423 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 92 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2,611 కోట్ల నుంచి రూ. 4,445 కోట్లకు జంప్‌చేసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 2,814 కోట్ల నుంచి రూ. 4,202 కోట్లకు పెరిగాయి. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి గోద్రెజ్ ఇండస్ట్రీస్ నికర లాభం రూ. 391 కోట్ల నుంచి రూ. 992 కోట్లకు ఎగసింది. మొత్తం ఆదాయం 51 శాతం జంప్‌చేసి రూ. 14,130 కోట్లకు చేరింది. 2020–21లో రూ. 9,334 కోట్ల టర్నోవర్ మాత్రమే సాధించింది. నాదిర్ గోద్రెజ్‌ను మరో మూడేళ్లపాటు అంటే 2026 మార్చి 31వరకూ చైర్మన్, ఎండీగా బోర్డు తిరిగి ఎంపిక చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో గోద్రెజ్ ఇండస్ట్రీస్ షేరు 9% జంప్‌చేసి రూ. 477 వద్ద ముగిసింది. -
ఇక గోద్రెజ్ ఇండస్ట్రీస్ ఆర్థిక సేవలు
ముంబై: గోద్రెజ్ ఇండస్ట్రీస్ (జీఐఎల్) సోమవారం గ్రూప్ ఆర్థిక సేవల విభాగం గోద్రెజ్ క్యాపిటల్ లిమిటెడ్ (జీసీఎల్)ను ప్రారంభించింది. గోద్రెజ్ హౌసింగ్ ఫైనాన్స్, గోద్రెజ్ ఫైనాన్స్ లిమిటెడ్‌కు హోల్డింగ్ సంస్థగా గోద్రెజ్ క్యాపిటల్ ఉంటుంది. తన కొత్త విభాగంలో ఈ నెలాఖరుకు గోద్రెజ్ ఇండస్ట్రీస్ రూ.1,500 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు పెట్టనుంది. 2026 నాటికి సంస్థ వ్యాపార అవసరాలకు రూ.5,000 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు అవసరం అవుతాయని భావిస్తున్నట్లు గోద్రెజ్ క్యాపిటల్ చైర్మన్ పిరోజ్షా గోద్రెజ్ తెలిపారు. ఆర్థిక సేవల విభాగంలో పటిష్టంగా నిలబడగలమన్న విశ్వాసం తమకు ఉందని ఆయన తెలిపారు. అందుకు తగిన పరిస్థితులు మార్కెట్లో ఉన్నాయని కూడా పేర్కొన్నారు. ఈ అంశమే తమ పెట్టుబడులకు ప్రధాన కారణమని వివరించారు. అవకాశంగా భావిస్తున్నాం... ఆర్థిక సేవల విభాగంలో వ్యాపార విస్తరణను తాము గొప్ప అవకాశంగా భావిస్తున్నట్లు పిరోజ్షా గోద్రెజ్ తెలిపారు. ‘‘పెట్టుబడులు అన్నీ గోద్రెజ్ ఇండస్ట్రీస్ బ్యాలెన్స్ షీట్ నుండి సమకూర్చాలన్నది మా ప్రణాళిక. ఈ నెలాఖరుకు రూ.1,500 కోట్ల పెట్టుబడులు పెడుతున్నాం. 2026 నాటికి అవసరమయ్యే మిగిలిన రూ. 3,500 కోట్ల కోసం మేము గోద్రెజ్ ఇండస్ట్రీస్ బోర్డు ఆమోదం పొందుతాము. ఈ మొత్తంలో అధికభాగం గ్రూప్ నుంచే సమకూర్చుకోవాలన్నది మా ఉద్దేశం’’అని పిరోజ్షా తెలిపారు. 2026 నాటికి కంపెనీ బ్యాలెన్స్ షీట్ రూ.30,000 కోట్లకు పెంచాలన్నది లక్ష్యమని కూడా వివరించారు. సురక్షిత రుణాలపైనే దృష్టి... కాగా, రాబోయే సంవత్సరాల్లో గోద్రేజ్ క్యాపిటల్ ఒక నూతన తరం, ప్రముఖ రిటైల్ ఆర్థిక సేవల సంస్థగా మారుతుందని తాము భావిస్తున్నట్లు జీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ మనీష్ షా తెలిపారు. గృహ రుణాలు, ఆస్తిపై రుణాలు (ఎల్ఏపీ– లోన్ ఎగైనెస్ట్ ప్రాపర్టీ)లతో కూడిన సురక్షిత రుణాల వృద్ధిపై కంపెనీ దృష్టి సారిస్తుందని తెలిపారు. సంబంధిత వర్గాల వివరాల ప్రకారం జీసీఎల్ ప్రస్తుతం ముంబై, బెంగళూరు, ఢిల్లీ–ఎన్సీఆర్, అహ్మదాబాద్, పుణేలలో కార్యకలాపాలు ప్రారంభించింది. త్వరలో హైదరాబాద్‌సహా జైపూర్, చండీగఢ్, చెన్నై, ఇండోర్, సూరత్‌లకు విస్తరిస్తుంది. -
గోద్రెజ్ ఇండస్ట్రీస్ అనూహ్య నిర్ణయం...ఇప్పుడు ఆ రంగంలోకి కూడా ఎంట్రీ..!
దేశీయ దిగ్గజ సంస్థ గోద్రెజ్ ఇండస్ట్రీస్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఆర్థిక సేవలను అందించేందుకుగాను సొంతంగా గోద్రెజ్ క్యాపిటల్ సంస్థను ప్రారంభిస్తున్నట్లు గోద్రెజ్ ఇండస్ట్రీస్ సోమవారం రోజున ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ సంస్థ గ్రోదెజ్ హౌసింగ్ ఫైనాన్స్ హోల్డింగ్‌కు అనుబంధ సంస్థగా ఉండనున్నట్లు సమాచారం. భారీ ఇన్వెస్ట్మెంట్స్..! 125 ఏళ్ల గోద్రెజ్ గ్రూప్ తన ఆర్థిక సేవల వెంచర్లో రూ. 1,500 కోట్ల పెట్టుబడి పెట్టడానికి కంపెనీ కట్టుబడి ఉందని పేర్కొంది. అంతేకాకుండా 2026 నాటికి ఈ వ్యాపారానికి మొత్తంగా రూ. 5,000 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు అవసరమవుతుందని అంచనా వేస్తోంది. ఎక్సేఛేంజ్ ఫైలింగ్‌లో కంపెనీ పేర్కొన్న వివరాల ప్రకారం...2026 నాటికి రూ. 30,000 కోట్ల బ్యాలెన్స్ షీట్‌తో రిటైల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వ్యాపారాన్ని నిర్మించాలని గోద్రెజ్ గ్రూప్స్ లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా ఈ ఆర్థిక సంవత్సరంలో కస్టమర్ విభాగాలను వైవిధ్యపరచడం , కొత్త వ్యాపార మార్గాలను ప్రారంభించడంతోపాటు కంపెనీ తన రిటైల్ కార్యకలాపాలను ఆరు కొత్త నగరాల్లో విస్తరించనుందని ఫైలింగ్‌లో పేర్కొంది. కొత్త నియమాకాలు..! ప్రస్తుతం ముంబై, బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్, అహ్మదాబాద్, పుణే నగరాల్లో గోద్రెజ్ క్యాపిటల్ విస్తరించి ఉంది. ఇక త్వరలోనే జైపూర్, చండీగఢ్, హైదరాబాద్, చెన్నై, ఇండోర్, సూరత్ వంటి ఆరు కొత్త నగరాల్లో కూడా విస్తరించేందుకు సన్నాహాలను రచిస్తోంది. గోద్రెజ్ గ్రూప్స్‌లో గోద్రెజ్ క్యాపిటల్ కీలక సంస్థగా మారుతుందని గోద్రెజ్ క్యాపిటల్ చైర్మన్ పిరోజ్షా గోద్రెజ్ అభిప్రాయపడ్డారు. గృహ రుణాలు, ఆస్తి రుణాలతో కూడిన సురక్షిత రుణాల వృద్ధిపై దృష్టిని కొనసాగించనున్నట్లు ఆయన తెలిపారు. కంపెనీ వ్యాపారాలను బలపరిచేందుకుగాను..ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు 500 మంది కొత్త వారిని నియమించే అవకాశం ఉన్నట్లు పిరోజ్షా గోద్రెజ్ పేర్కొన్నారు. ఇప్పటికే కస్టమర్లకు సరసమైన ఈఎంఐలతో గృహరుణాలను గోద్రెజ్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ అందిస్తోంది. రాబోయే సంవత్సరాల్లో గోద్రెజ్ క్యాపిటల్ ఒక నూతన, ప్రముఖ రిటైల్ ఆర్థిక సేవల సంస్థగా మారుతుందని భావిస్తున్నట్లు గోద్రెజ్ క్యాపిటల్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో మనీష్ షా అన్నారు. చదవండి: కీలక నిర్ణయం..వారికి అదిరిపోయే శుభవార్తను అందించిన ఐసీఐసీఐ బ్యాంక్..! -
గోద్రెజ్‌లో కీలక పరిణామం, చైర్మన్ పదవికి ఆది గోద్రెజ్ రాజీనామా
న్యూఢిల్లీ: పాతతరం పారిశ్రామికవేత్త ఆది గోద్రెజ్ తాజాగా గోద్రెజ్ ఇండస్ట్రీస్(జీఐఎల్) చైర్మన్ పదవి నుంచి వైదొలగారు. అంతేకాకుండా కంపెనీ బోర్డు నుంచి సైతం తప్పుకున్నారు. తమ్ముడు నాదిర్ గోద్రెజ్‌కు కంపెనీ పగ్గాలు అప్పజెప్పారు. అక్టోబర్ 1నుంచి చైర్మన్‌గా నాదిర్ బాధ్యతలు చేపట్టనున్నట్లు గోద్రెజ్ ఇండస్ట్రీస్ పేర్కొంది. 79ఏళ్ల ఆది గోద్రెజ్ ఇకపై గోద్రెజ్ గ్రూప్‌నకు చైర్మన్‌గా, జీఐఎల్‌కు గౌరవ చైర్మన్‌గానూ వ్యవహరించనున్నట్లు తెలియజేసింది. నాదిర్ గోద్రెజ్ ప్రస్తుతం జీఐఎల్‌కు ఎండీగా పనిచేస్తున్నారు. తాజా మార్పులతో చైర్మన్, ఎండీ పదవులను నిర్వహించనున్నారు. కృతజ్ఞతలు.. జీఐఎల్‌కు ఆది గోద్రెజ్ దశాబ్దాల తరబడి సర్వీసులు అందించారు. నాలుగు దశాబ్దాలకుపైగా కంపెనీలో బాధ్యతలు నిర్వహించడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు ఆది గోద్రెజ్ పేర్కొన్నారు. ఈ కాలంలో పటిష్ట ఫలితాలు సాధించడంతోపాటు కంపెనీలో సమూల మార్పులను తీసుకువచ్చినట్లు తెలియజేశారు. తన ప్రయాణంలో మద్దతుగా నిలిచిన బోర్డుతోపాటు, టీమ్ సభ్యులు, బిజినెస్ భాగస్వాములు, వాటాదారులు, ఇన్వెస్టర్లు తదితరులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. నాదిర్ సారథ్యంలో ఇకపై కంపెనీ మరింత పురోగాభివృద్ధిని సాధించగలదన్న ధీమాను వ్యక్తం చేశారు. కాగా.. ఆది గోద్రెజ్ నాయకత్వం, విజన్, కంపెనీని మలచిన తీరు, విలువలు వంటి అంశాలపట్ల జీఐఎల్‌తోపాటు, బోర్డు తరఫున నాదిర్ గోద్రెజ్ కృతజ్ఞతలు తెలియజేశారు. -
హైదరాబాద్‌లో గోద్రెజ్ ‘సోషల్ ఆఫీస్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫర్నీచర్ రంగ సంస్థ గోద్రెజ్ ఇంటీరియో దక్షిణాదిన తొలి ‘సోషల్ ఆఫీస్ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్’ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. కొండాపూర్‌లో 4,100 చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొన్న ఈ కేంద్రంలో కార్యాలయాలకు అవసరమయ్యే అత్యాధునిక ఫర్నీచర్ అందుబాటులో ఉంటుందని గోద్రెజ్ ఇంటీరియో సీవోవో అనిల్ మాథుర్ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘ఇప్పటికే ముంబై, కోల్‌కతలో ఇటువంటి సెంటర్లను విజయవంతంగా నిర్వహిస్తున్నాం. బెంగళూరు, పుణే, చెన్నై, చండీగఢ్‌లోనూ తెరవనున్నాం. రెండు మూడేళ్లలో ఈ విభాగం నుంచి రూ.200 కోట్ల ఆదాయం ఆశిస్తున్నాం. గోద్రెజ్ ఇంటీరియో 2018–19లో రూ.2,000 కోట్ల టర్నోవర్ సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,400 కోట్లు, 2020–21లో రూ.3,000 కోట్లు లక్ష్యంగా చేసుకున్నాం’ అని వివరించారు. -
గోద్రేజ్ ఇండస్ట్రీస్ లాభం రెండు రెట్లు
న్యూఢిల్లీ: గోద్రేజ్ ఇండస్ట్రీస్ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రెండు రెట్లకు పైగా పెరిగింది. గత క్యూ3లో రూ.51 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.121 కోట్లకు ఎగసిందని గోద్రేజ్ ఇండస్ట్రీస్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.2,169 కోట్ల నుంచి రూ.2,576 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ.2,197 కోట్ల నుంచి 17 శాతం పెరిగి రూ.2,580 కోట్లకు చేరాయని తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో గోద్రేజ్ ఇండస్ట్రీస్ షేర్ 1.6 శాతం నష్టపోయి రూ.483 వద్ద ముగిసింది. భారత్ ఫోర్జ్ లాభం రూ.310 కోట్లు వాహన విడిభాగాలు తయారు చేసే భారత్ ఫోర్జ్ లాభం ఈ క్యూ3లో 36 శాతం పెరిగింది. గత క్యూ3లో రూ.228 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.310 కోట్లకు పెరిగిందని కంపెనీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,412 కోట్ల నుంచి రూ.1,740 కోట్లకు పెరిగింది. అన్ని విభాగాల్లో మంచి పనితీరు సాధించామని కంపెనీ సీఎమ్‌డీ బి.ఎన్. కళ్యాణి పేర్కొన్నారు. వాణిజ్య వాహనాలు, పారిశ్రామిక రంగాల నుంచి 65 లక్షల డాలర్ల విలువైన కొత్త ఆర్డర్లను సాధించామని తెలిపారు. నాలుగో క్వార్టర్లో కూడా డిమాండ్ జోరు కొనసాగగలదని ఆయన అంచనా వేస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా అమిత్ బి. కళ్యాణి పునః నియామాకాన్ని డైరెక్టర్ల బోర్డ్ ఆమోదించిందని, ఈ ఏడాది మే 11 నుంచి ఐదేళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగుతారని పేర్కొన్నారు. బీఎస్ఈలో కంపెనీ షేర్ 1.4 శాతం నష్టపోయి రూ.477 వద్ద ముగిసింది. టేక్ సొల్యూషన్స్ డివిడెండ్ 30 పైసలు జీవ శాస్త్ర, సరఫరా చెయిన్ మేనేజ్మెంట్ కంపెనీ టేక్ సొల్యూషన్స్ ఈ ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్లో రూ.36 కోట్ల నికర లాభం సాధించింది. గత క్యూ3లో రూ.42 కోట్ల నికర లాభం వచ్చిందని వెల్లడించింది. మొత్తం ఆదాయం రూ.409 కోట్ల నుంచి రూ.524 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఒక్కో షేర్‌కు 30 పైసలు (30 శాతం) మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని పేర్కొంది. తొమ్మిది నెలల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే, నికర లాభం రూ.114 కోట్ల నుంచి రూ.151 కోట్లకు, మొత్తం ఆదాయం రూ.1,137 కోట్ల నుంచి రూ.1,529 కోట్లకు పెరిగాయని తెలిపింది. ఈ క్యూ3లో నికర లాభం తగ్గడంతో బీఎస్ఈలో ఈ షేర్ 5 శాతం పతనమై రూ.119 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో తాజా ఏడాది కనిష్ట స్థాయి, రూ.116ను తాకింది. అదానీ ట్రాన్సిమిషన్ లాభం రూ.189 కోట్లు అదానీ ట్రాన్సిమిషన్ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లో రూ.189 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) సాధించింది. గత క్యూ3లో రూ.842 కోట్ల నికర లాభం వచ్చిందని అదానీ ట్రాన్స్మిషన్ పేర్కొంది.రూ.742 కోట్ల వన్–టైమ్ ఇన్కమ్ కారణంగా ఈ స్థాయిలో గత క్యూ3లో లాభం సాధించామని వివరించింది. దీనిని పరిగణనలోకి తీసుకుకంటే గత క్యూ3లో రూ. 100 కోట్ల లాభమే వచ్చినట్లవుతుందని తెలిపింది. గత క్యూ3లో రూ.1,806 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో రూ.2,921 కోట్లకు పెరిగిందని పేర్కొంది. 2022 కల్లా అందరికీ విద్యుద్తును అందించాలనేది భారత ప్రభుత్వం లక్ష్యమని, అందుకే తాము కీలకమైన జిల్లాల్లో విద్యుత్ పంపిణీ వ్యాపారంలోకి ప్రవేశించాలనుకుంటున్నామని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తెలిపారు. ఫలితాలు సానుకూలంగా ఉండటంతో బీఎస్ఈలో అదానీ ట్రాన్సిమిషన్ షేర్ 2 శాతం లాభపడి రూ.216 వద్ద ముగిసింది. మరింత పెరిగిన సీజీ పవర్ నష్టాలు సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ కంపెనీ నికర నష్టాలు ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో మరింతగా పెరిగాయి. గత క్యూ3లో రూ.28 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ క్యూ3లో రూ.150 కోట్లకు ఎగిశాయని సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,537 కోట్ల నుంచి రూ.1,731 కోట్లకు పెరిగిందని పేర్కొంది. అయితే ఏప్రిల్–డిసెంబర్ కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే, నికర నష్టాలు రూ.584 కోట్ల నుంచి రూ.262 కోట్లకు తగ్గాయని తెలిపింది. మొత్తం ఆదాయం రూ.4,569 కోట్ల నుంచి రూ.4,884 కోట్లకు పెరిగిందని పేర్కొంది. నికర నష్టాలు భారీగా పెరగడంతో ఈ షేర్ భారీగా నష్టపోయింది. ఇంట్రాడేలో తాజా ఏడాది కనిష్ట స్థాయి, రూ.23.5ను తాకిన ఈ షేర్ చివరకు 30 శాతం నష్టంతో రూ.23.75 వద్ద ముగిసింది. బాష్ లాభం రూ.335 కోట్లు వాహన విడిభాగాలు తయారు చేసే బాష్ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లో రూ.335 కోట్ల నికర లాభం (స్డాండోలోన్)సాధించింది. గత క్యూ3లో ఆర్జించిన నికర లాభం(రూ.281 కోట్లు)తో పోల్చితే 19 శాతం వృద్ధి సాధించామని బాష్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.3,174 కోట్ల నుంచి రూ.3,274 కోట్లకు పెరిగిందని పేర్కొంది. వ్యయాలు రూ.2,784 కోట్లకు చేరాయని తెలిపింది. భాస్కర్ భట్‌ను ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా రెండోసారి నియామకానికి కంపెనీ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆయన ఐదేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారని వెల్లడించింది. జాయింట్ ఎమ్‌డీగా ఆండ్రియాస్ ఓల్ఫ్ను మళ్లీ డైరెక్టర్ల బోర్డ్ నియమించిందని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో బాష్ షేర్ 4 శాతం నష్టపోయి రూ.17,898 వద్ద ముగిసింది. రుచి సోయా లాభం రూ.6 కోట్లు దివాళా ప్రక్రియను ఎదుర్కొంటున్న రుచి సోయా కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.6 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.1,960 కోట్ల నికర నష్టాలు వచ్చా యని రుచి సోయా తెలిపింది. మొత్తం ఆదాయం రూ.3,050 కోట్ల నుంచి రూ.3,500 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఈ కంపెనీ రుణభారం రూ.12,000 కోట్లుగా ఉంది. న్యూట్రెలా, మహా కోశ్, సన్‌రిచ్, రుచి స్టార్, రుచి గోల్డ్ బ్రాండ్ల వంటనూనెలను ఈ కంపెనీ విక్రయిస్తోంది. ఫారŠూచ్యన్ బ్రాండ్ వంటనూనెలు విక్రయించే అదానీ విల్మర్, బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి కంపెనీలు ఈ కంపెనీ కొనుగోలు రేసులో ఉన్నాయి. బీఎస్ఈలో రుచి సోయా షేర 0.3 శాతం నష్టంతో రూ.6 వద్ద ముగిసింది. ఫోర్టిస్‌కు రూ.180 కోట్ల నష్టాలు ఫోర్టిస్ హెల్త్‌కేర్ కంపెనీకి ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.180 కోట్ల నికర నష్టాలు(కన్సాలిడేటెడ్) వచ్చాయి. గత క్యూ3లో నష్టాలు రూ.19 కోట్లని ఫోర్టిస్ హెల్త్‌కేర్ తెలిపింది. అసాధారణమైన వ్యయాల కారణంగా ఈ క్యూ3లో భారీగా నష్టాలు వచ్చాయని వివరించింది. ఆదాయం రూ.1,121 కోట్ల నుంచి రూ.1,103 కోట్లకు తగ్గిందని పేర్కొంది. బోర్డులోకి ఐదుగురు ఐహెచ్‌హెచ్ నామినీలు డైరెక్టర్ల బోర్డ్‌ను పునర్వ్యస్థీకరించామని, ఐహెచ్‌హెచ్ నామినీలను ఐదుగురిని డైరెక్టర్లుగా నియమించామని కంపెనీ చైర్మన్ రవి రాజగోపాల్ చెప్పారు. కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా వివేక్ కుమార్ గోయల్‌ను నియమించామని తెలిపారు. ఆయన నియామకం ఈ ఏడాది మే 1 నుంచి అమల్లోకి వస్తుందని వివరించారు. నికర నష్టాలు భారీగా రావడంతో బీఎస్ఈలో ఫోర్టిస్ హెల్త్‌కేర్ షేర్ 0.26 శాతం తగ్గి రూ.135 వద్ద ముగిసింది. -
క్రీమ్‌లైన్ డెయిరీ విస్తరణ..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జెర్సీ బ్రాండ్ పేరుతో పాలు, పాల ఉత్పాదనల తయారీలో ఉన్న క్రీమ్‌లైన్ డెయిరీ ప్రోడక్ట్స్ విస్తరణ చేపట్టనుంది. తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటకలో మూడేళ్లలో కొత్తగా ప్లాంట్లు ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రూ.400 కోట్లు వెచ్చిస్తామని సంస్థ ఎండీ కె.భాస్కర్‌రెడ్డి తెలిపారు. నూతన ఉత్పాదన జెర్సీ థిక్‌షేక్స్ ఆవిష్కరణ సందర్భంగా బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. కంపెనీ ప్రస్తుత ప్రాసెసింగ్ సామర్థ్యం రోజుకు 12 లక్షలు. విస్తరణతో 15 లక్షల లీటర్లకు చేరుతుందని చెప్పారు. రూ.35 కోట్లతో వైజాగ్ వద్ద నిర్మిస్తున్న రోజుకు లక్ష లీటర్ల కెపాసిటీగల ప్లాంటు ఈ ఏడాది చివరికి కార్యరూపంలోకి వస్తుందన్నారు. మూడు వేరియంట్లలో..: గోద్రెజ్ అగ్రోవెట్ అనుబంధ కంపెనీ అయిన క్రీమ్‌లైన్ డెయిరీ జెర్సీ థిక్‌షేక్స్‌ను మూడు వేరియంట్లలో ప్రవేశపెట్టింది. 180 మిల్లీలీటర్ల ఈ ఫ్లేవర్డ్ మిల్క్ ప్యాక్ ధర రూ.25 ఉంది. రూ.22,000 కోట్ల శీతల పానీయాల మార్కెట్లో పాలతో తయారైన ఉత్పత్తుల వాటా 4 శాతం. అయితే వృద్ధి పరంగా చూస్తే అత్యధికంగా 15 శాతం నమోదు చేస్తోందని క్రీమ్‌లైన్ డెయిరీ సీఈవో రాజ్ కన్వర్ తెలిపారు. దేశంలో డెయిరీ ఇండస్ట్రీ 5–6 శాతం వార్షిక వృద్ధితో రూ.6 లక్షల కోట్లుంది. 2025 నాటికి రూ.10 లక్షల కోట్లకు చేరుతుందన్న అంచనాలు ఉన్నాయని గోద్రెజ్ అగ్రోవెట్ ఎండీ బలరామ్ సింగ్ యాదవ్ వెల్లడించారు. రుచి సోయా ఆయిల్‌పామ్ వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు బిడ్లను దాఖలు చేశామని పేర్కొన్నారు. -
త్వరలో ఐపీవోకు గోద్రెజ్ అగ్రోవెట్
సెబీకి ఐపీవో పత్రాల సమర్పణ న్యూఢిల్లీ: గోద్రెజ్ ఇండస్ట్రీస్ విభాగం గోద్రెజ్ అగ్రోవెట్ తాజాగా ఐపీవో పత్రాలను మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి అందజేసింది. కంపెనీ ఐపీవోలో భాగంగా రూ.300 కోట్ల విలువైన తాజా షేర్లను ఇష్యూ చేయనుంది. ఐపీవోలో భాగంగానే ఆఫర్ ఫర్ సేల్ కింద కంపెనీ ప్రమోటర్ గోద్రెజ్ ఇండస్ట్రీస్ రూ.300 కోట్ల వరకు విలువైన షేర్లను, టెమాసెక్ విభాగమైన వి–సైన్సెస్ 1.23 కోట్ల షేర్లను జారీ చేయనుంది. కాగా కంపెనీ పబ్లిక్ ఇష్యూ ద్వారా మొత్తంగా రూ.1,000–రూ.1,200 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. కాగా గోద్రెజ్ అగ్రోవెట్‌లో ప్రధానంగా గోద్రెజ్ ఇండస్ట్రీస్‌కు 60.81 శాతం, టెమాసెక్ హోల్డింగ్స్‌కు 19.99 శాతం వాటా ఉంది. గోద్రెజ్ అగ్రోవెట్ కంపెనీ అగ్రో ఇన్పుట్స్, పామ్ ఆయిల్ తయారీ, డెయిరీ, పౌల్ట్రీ వంటి వ్యాపారాల్లో ఉంది. కాగా గోద్రెజ్ అగ్రోవెట్ పబ్లిక్ ఇష్యూకు కొటక్ మహీంద్రా క్యాపిటల్, యాక్సిస్ క్యాపిటల్, క్రెడిట్ సూసీ సెక్యూరిటీస్ సంస్థలు బ్యాంకర్లుగా వ్యవహరించనున్నాయి. పబ్లిక్ ఇష్యూ తర్వాత కంపెనీ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్టయ్యే అవకాశముంది. -
గోద్రేజ్ ఇండస్ట్రీస్ లాభం రూ. 95 కోట్లు
న్యూఢిల్లీ: గోద్రేజ్ ఇండస్ట్రీస్ 2017 మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో రూ. 95 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదేకాలంలో కంపెనీకి రూ. 57 కోట్ల నికరనష్టం వచ్చింది. తాజాగా ముగిసిన త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం 6.88 శాతం వృద్ధిచెంది రూ. 1,854 కోట్ల నుంచి రూ. 1,982 కోట్లకు పెరిగింది. కెమికల్స్ డివిజన్ ద్వారా రూ. 426 కోట్లు, వెజిటబుల్ ఆయిల్ డివిజన్ ద్వారా రూ. 109 కోట్ల చొప్పున ఆదాయాన్ని ఆర్జించగా, ప్రాపర్టీ డెవలప్మెంట్ విభాగం నుంచి రూ. 479 కోట్లు, యానిమల్ ఫీడ్ విభాగం నుంచి రూ. 583 కోట్ల చొప్పున ఆదాయాన్ని ఆర్జించింది. ఫలితాల నేపథ్యంలో గోద్రేజ్ ఇండస్ట్రీస్ షేరు 2 శాతం తగ్గుదలతో రూ. 565 వద్ద ముగిసింది.