న్యూఢిల్లీ: గోద్రేజ్ ఇండస్ట్రీస్ 2017 మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో రూ. 95 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదేకాలంలో కంపెనీకి రూ. 57 కోట్ల నికరనష్టం వచ్చింది. తాజాగా ముగిసిన త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం 6.88 శాతం వృద్ధిచెంది రూ. 1,854 కోట్ల నుంచి రూ. 1,982 కోట్లకు పెరిగింది. కెమికల్స్ డివిజన్ ద్వారా రూ. 426 కోట్లు, వెజిటబుల్ ఆయిల్ డివిజన్ ద్వారా రూ. 109 కోట్ల చొప్పున ఆదాయాన్ని ఆర్జించగా, ప్రాపర్టీ డెవలప్‌మెంట్ విభాగం నుంచి రూ. 479 కోట్లు, యానిమల్ ఫీడ్ విభాగం నుంచి రూ. 583 కోట్ల చొప్పున ఆదాయాన్ని ఆర్జించింది. ఫలితాల నేపథ్యంలో గోద్రేజ్ ఇండస్ట్రీస్ షేరు 2 శాతం తగ్గుదలతో రూ. 565 వద్ద ముగిసింది.