Profit Losses
-
మొక్కుబడి
ఇద్దరు గ్రామస్తుల మధ్యన తమలో ఎవరు గొప్ప భక్తుడనే వాదన మొదలయ్యింది. వందలాది పుణ్య క్షేత్రాలు తిరిగి వచ్చిన తను గొప్ప భక్తుడినని ఒక గ్రామస్తుడు వాదించాడు. ఎన్నో ఉపవాసాలు, వ్రతాలు, దీక్షలు చేసిన తానే నిజమైన భక్తుడని మరో గ్రామస్తుడు వాదించసాగాడు. వాదనలు తీవ్ర రూపం దాల్చడంతో గ్రామం గుండా పోతున్న ఓ గురువును వారు ఆశ్రయించారు. ‘‘మా భక్తి నిరూపించుకోడానికి ఏమైనా చేస్తాం, ఎన్ని సాహసకార్యాలైనా చేయగలం’’ అని గట్టిగట్టిగా అరిచి చెప్పారు. వారిద్దరి వాదనలూ ఓపికగా విన్నాడు గురువు. చిన్న నవ్వు నవ్వి ‘‘మీలో ఎవరు నిజమైన భక్తుడో సులభంగా తెలుసుకోవచ్చు. మీరు నాతోపాటు రండి, ఎన్నో మహిమలను చూపే దేవుడు మా ఆశ్రమంలో ఉన్నాడు. ఆ దేవుడికి మీలో ఎవరు తలనీలాలు సమర్పిస్తారో వారే నిజమైన భక్తులు’’ అని సెలవిచ్చాడు. ‘‘అదెంత పని?’’ అని వారిద్దరూ ముందుకు వచ్చారు. ‘‘అయితే మా దేవుడికి తలనీలాలు ఎవరైతే సమర్పిస్తారో వారికి ఆ తదనంతరం తల పైన ఒక్క వెంట్రుక కూడా మొలకెత్తదు. దానికి సంసిద్ధులైనవారు మాత్రమే నాతో రాగలరు’’ అని గురువు చెప్పాడు. అంతే... అప్పటిదాకా గొప్ప భక్తులమని చెప్పుకున్న ఇద్దరూ, చల్లగా అక్కడినుంచి జారుకోబోయారు. వారిని ఆపిన గురువు ‘‘భవిష్యత్తులో వెంట్రుకలు రావని చెప్పేసరికి మీరు తలనీలాలు ఇవ్వడానికే సుముఖత చూపడం లేదు. బాహ్య సౌందర్యంలో చిన్న మార్పుకు సైతం అంగీకరించని మీరు అంతః సౌందర్యంలో మార్పులకు అంగీకరిస్తారా..? నిజమైన భక్తుడు ఎప్పుడూ లాభనష్టాలు బేరీజు వేయడు. సంపూర్ణంగా తనను నమ్మి సర్వస్వ శరణాగతి కోరే వారి వెంటే దేవుడు సర్వకాల సర్వావస్థలలోనూ ఉంటాడు’’ అని వివరించాడు. తప్పు తెలుసుకున్న ఆ ఇద్దరు గ్రామస్తులు గురువును క్షమాపణ కోరారు. అమృత బిందువులు ♦ ఎవరికీ తల వంచనిది ఆత్మగౌరవం. ఎవరి ముందూ చేయి చాచనిది ఆత్మాభిమానం. ఎవరినీ కాదనలేనిది ఆత్మీయత. ఈ మూడు ఆత్మలు కూడిన మనిషి జీవితం సఫలం. ♦ వేడినీరు ఒకటే... కాని కోడిగుడ్డును ఉడికిస్తే గట్టిపడుతుంది. ఆలుగడ్డను ఉడికిస్తే మెత్తబడుతుంది. రాగద్వేషాలు ఒక్కటే కాని ... ఆనందం కలిగినప్పుడు ఆనంద బాష్పాలు అవే. దుఃఖం కలిగినప్పుడు కన్నీటి ఓదార్పులు అవే. – ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
రికార్డుల ర్యాలీకి విరామం
ముంబై: జీవితకాల గరిష్టస్థాయిల వద్ద లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో సూచీల నాలుగురోజుల రికార్డుల ర్యాలీకి బుధవారం బ్రేక్ పడింది. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అంచనాల(2.2%)ను మించుతూ యూరోజోన్ ద్రవ్యోల్బణం 2.20 శాతంగా నమోదుకావడంతో యూరప్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. యూఎస్ ఫెడ్ రిజర్వ్ సమావేశపు మినిట్స్ వెల్లడికి ముందు అమెరికా మార్కెట్లలో అమ్మకాలు తలెత్తాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ రెండోరోజూ 11 పైసలు క్షీణించింది. మొహర్రం సందర్భంగా గురువారం ఎక్సే్చంజీలకు సెలవు కావడంతో ట్రేడర్లు తమ పొజిషన్లను తుదపరి వారానికి రోలోవర్ చేసుకునేందుకు ఆసక్తి చూపలేదు. ఈ ప్రతికూలతలతో సెన్సెక్స్ 163 పాయింట్లు క్షీణించి 55,629 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 46 పాయింట్లు నష్టపోయి 16,569 వద్ద ముగిసింది. దీంతో సెన్సెక్స్ నాలుగురోజులు, నిఫ్టీ ఏడురోజుల వరుసగా లాభాల ముగింపునకు అడ్డకట్ట పడినట్లైంది. ప్రైవేట్ బ్యాంక్స్, ఆర్థిక, మెటల్ షేర్లు అమ్మకాలు తలెత్తాయి. ఇన్వెస్టర్లు రక్షణాత్మక రంగాలు భావించే ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఫార్మా, ప్రభుత్వరంగ బ్యాంక్స్ షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. చిన్న, మధ్య తరహా షేర్లు మరోసారి అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు అరశాతం క్షీణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.595 కోట్ల షేర్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.729 కోట్ల షేర్లను విక్రయించారు. ఆరంభలాభాలు ఆవిరి..: ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్ ఉదయం లాభంతో మొదలైంది. సెన్సెక్స్ 281 పాయింట్ల లాభంతో తొలిసారి 56000 స్థాయిపైన 56,073 వద్ద, నిఫ్టీ 77 పాయింట్లు పెరిగి 16,692 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. తొలి గంటలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో సెన్సెక్స్ 326 పాయింట్లు ర్యాలీ చేసి 56,118 వద్ద, నిఫ్టీ 87 పాయింట్లు ఎగసి 16,702 వద్ద సరికొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. సూచీలు ఆల్‌టైం హై స్థాయిలను అందుకున్న తర్వాత లాభాల స్వీకరణ చోటుచేసుకుంది. యూరప్ మార్కెట్ల నష్టాలతో ప్రారంభం కావడం, యూఎస్ ఫ్యూచర్లు నష్టాలతో కదలాడటం ఇన్వెస్టర్లను నిరాశపరిచింది. దీంతో సూచీలు ఆరంభ లాభాల్ని కోల్పోయి నష్టాలతో ముగిశాయి. సరికొత్త గరిష్టానికి ఇన్వెస్టర్ల సంపద... స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసినప్పటికీ.., ఇన్వెస్టర్ల సంపద సరికొత్త గరిష్టానికి చేరింది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం విలువ రూ.242 లక్షల కోట్లకు ఎగసింది. బీఎస్ఈ మార్కెట్ విలువ విషయంలో ఇది ఆల్ టైం హై కావడం విశేషం. చివరి ఐదు ట్రేడింగ్ సెషన్లలో రూ.5.33 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. నాలుగురోజుల్లో 1,000 పాయింట్లు గతవారాంతన శుక్రవారం(ఆగస్ట్ 13న)సెన్సెక్స్ 55,000 స్థాయిని అందుకుంది. నాటి నుంచి సరిగ్గా నాలుగు ట్రేడింగ్ సెషన్లలో ఏకంగా 1000 పాయింట్ల లాభాల్ని మూటగట్టకుంది. ఈ ఏడాదిలో 1000 పాయింట్లను ఆర్జించేందుకు సెన్సెక్స్ తీసుకున్న అతితక్కువ సమయం ఇదే కావడం విశేషం. ఇదే ఏడాది జనవరి 21న సెన్సెక్స్ 50వేల మార్కును అందుకుంది. ఈ ఏడునెలల్లో 6,000 పాయింట్లు ఆర్జించి 56వేల స్థాయిని తాకింది. ఇదే సమయంలో నిఫ్టీ 2,111 పాయింట్లను ఆర్జించింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ► గతంలో విధించిన ఆంక్షలను ఎత్తివేస్తూ కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేసేందుకు ఆర్బీఐ అనుమతినిచ్చిందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్టాక్ ఎక్సే్చంజీలకు తెలిపింది. దీంతో ఈ షేరు ఇంట్రాడేలో మూడుశాతానికి పైగా లాభపడి రూ.1,565 స్థాయికి చేరింది. అయితే చివర్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో ఆరంభ లాభాలన్నీ ఆవిరయ్యి 0.21 శాతం నష్టంతో రూ.1,511 వద్ద ముగిసింది. ► ఈ వారం ప్రారంభంలో డిస్కౌంట్‌తో లిస్టైయిన విండ్లాస్ షేరు పతనం కొనసాగుతోంది. మూడు శాతం నష్టపోయి రూ.388 వద్ద ముగిసింది. ఇష్యూ ధర రూ.460తో పోలిస్తే మూడురోజుల్లో 16 శాతం నష్టపోయింది. -
పీవీఆర్‌కు పెరిగిన నష్టాలు
న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్ దిగ్గజం పీవీఆర్ లిమిటెడ్ గతేడాది(2020–21) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర నష్టం రూ. 289 కోట్లకు పెరిగింది. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో రూ. 74.5 కోట్ల నష్టమే నమోదైంది. మొత్తం ఆదాయం సైతం రూ. 662 కోట్ల నుంచి రూ. 263 కోట్లకు క్షీణించింది. కాగా.. కోవిడ్–19 కట్టడికి లాక్డౌన్ల అమలు, సామాజిక దూరం, కంటెంట్ తగ్గడం వంటి పలు ప్రతికూల అంశాలు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపినట్లు పీవీఆర్ పేర్కొంది. వెరసి ఫలితాలను అంతక్రితం ఏడాది పనితీరుతో పోల్చి చూడతగదని తెలియజేసింది. మల్టీప్లెక్స్ పరిశ్రమకు గత ఆర్థిక సంవత్సరం అత్యంత గడ్డుకాలమని వ్యాఖ్యానించింది. అయితే ఫిక్స్డ్ వ్యయాల తగ్గింపు, తగినంత లిక్విడిటీ వంటి చర్యలు చేపడుతున్నట్లు తెలియజేసింది. క్యూ4లో హాలీవుడ్, బాలీవుడ్ నుంచి ప్రాధాన్యతగల సినిమాలు విడుదలకాలేదని ప్రస్తావించింది. దక్షిణాదిలో కీలక సినిమాల కారణంగా రికవరీ కనిపించినట్లు పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో పీవీఆర్ షేరు ఎన్ఎస్ఈలో 1 శాతం బలపడి రూ. 1,319 వద్ద ముగిసింది. -
లాభాలు ఒకరోజుకే పరిమితం
ముంబై: స్టాక్ మార్కెట్ లాభాలు ఒకరోజుకే పరిమితమయ్యాయి. ఇంట్రాడేలో తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే సూచీలు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. కోవిడ్ ఉధృతి, లాక్డౌన్ భయాలతో పాటు ఆర్థిక రికవరీపై ఆందోళనలు మరోసారి మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతీశాయి. అలాగే డాలర్ మారకంలో రూపాయి విలువ 75 స్థాయికి దిగివచ్చింది. అమెరికాలో సంపన్నులపై అధిక పన్నులు విధించడంతో అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాలు నెలకొన్నాయి. ఈ పరిణామాలు కూడా ట్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా ఇంట్రాడేలో 596 పాయింట్ల పరిధిలో కదలాడిన సెన్సెక్స్ చివరకు 202 పాయింట్ల నష్టంతో 47,878 వద్ద ముగిసింది. అలాగే 188 పాయింట్ల రేంజ్లో ట్రేడైన నిఫ్టీ 64 పాయింట్లను కోల్పోయి 14,341 వద్ద స్థిరపడింది. ఎఫ్ఎంసీజీ, ఐటీ, రియల్టీ, మెటల్, ఫార్మా, ప్రైవేట్ రంగాల షేర్లలో అమ్మకాలు తలెత్తాయి. ప్రభుత్వరంగ బ్యాంక్, మీడియా, ఆర్థిక రంగాల షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. ఒడిదుడుకుల ట్రేడింగ్‌లోనూ మధ్య, చిన్న తరహా కంపెనీల షేర్లు రాణించాయి. దీంతో బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు అరశాతం లాభంతో ముగి శాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ. 1,361 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1,696 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి ఆరు పైసలు బలహీనపడి 75.01 వద్ద స్థిరపడింది. నాలుగు రోజులే ట్రేడింగ్ జరిగిన ఈ వారంలో సెన్సెక్స్ 953 పాయింట్లు, నిఫ్టీ 276 పాయింట్లు నష్టపోయాయి. సూచీలకిది వరుసగా మూడోవారమూ నష్టాల ముగింపు. ‘‘కరోనా వ్యాధి విజృంభిస్తున్న వేళ దేశీయ ఈక్విటీ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను పెద్ద ఎత్తున వెనక్కి తీసుకుంటున్నారు. స్థానిక లాక్డౌన్లతో ఆర్థి్థక కార్యకలాపాలు స్తంభించి కంపెనీల ఆదా యాలు క్షీణింవచ్చనే భయాలు ఇప్పటికీ ఇన్వెస్టర్లను వెంటాడుతున్నాయి. అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేంద్రం తీసుకుంటున్న చొరవతో స్వల్పకాలంలో అమ్మకాలు తగ్గే అవకాశం ఉంది’’ అని కోటక్ సెక్యూరిటీస్ ఫండమెంటల్ రీసెర్చ్ హెడ్ రస్మిక్ ఓజా అభిప్రాయపడ్డారు. ► ఇటీవల ఐపీఓకు పూర్తి చేసుకున్న నజరా టెక్ కంపెనీ మార్చి క్వార్టర్ ఫలితాలు మార్కెట్ వర్గాలను మెప్పించాయి. ఫలితంగా షేరు ఐదు శాతం లాభపడి రూ.1,692 వద్ద నిలిచింది. ► కోవిడ్ ఔషధ తయారీకి డీసీజీఐ నుంచి అనుమతి తో క్యాడిల్లా హెల్త్‌కేర్ 4% ర్యాలీ చేసి రూ.576 వద్ద స్థిరపడింది. -
అయిదో రోజూ ఆగని అమ్మకాలు
ముంబై: స్టాక్ మార్కెట్లో అయిదో రోజూ అమ్మకాలు ఆగలేదు. ఫలితంగా సెన్సెక్స్ 47వేల స్థాయిని, నిఫ్టీ 14వేల మార్కును కోల్పోయాయి. జనవరి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్అండ్ఓ) కాంట్రాక్టులకు చివరి రోజు కావడంతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల పరంపర కొనసాగడంతో బుల్స్ ఏ దశలో కోలుకోలేకపోయాయి. బడ్జెట్ ప్రకటనకు ముందు 2020–21 ఆర్థిక సంవత్సరపు సామాజిక ఆర్థిక సర్వే నేడు విడుదల కానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. అలాగే అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు, డాలర్ మారకంలో రూపాయి విలువ 13 పైసల పతనం ప్రతికూలాంశాలు మన మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీశాయి. ఫలితంగా సెన్సెక్స్ 536 పాయింట్ల నష్టంతో 46,874 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 150 పాయింట్లను కోల్పోయి 13,817 వద్ద నిలిచింది. ఒక్క ప్రైవేట్ రంగ బ్యాంక్స్ షేర్లు తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. అత్యధికంగా ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లు నష్టపోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 892 పాయింట్లు, నిఫ్టీ 185 పాయింట్లు క్షీణించాయి. మార్కెట్ ఐదురోజుల పతనంతో సెన్సెక్స్ 2,918 పాయింట్లు, నిఫ్టీ 827 పాయింట్లను కోల్పోయాయి. దేశీయ ఫండ్లు(డీఐఐ)లు జనవరి 1 తర్వాత దాదాపు 28 రోజుల తర్వాత తొలిసారి రూ.1737 కోట్ల షేర్లను కొని నికర కొనుగోలుదారులుగా నిలిచారు. ఎఫ్ఐఐలు రూ.3713 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఎదురీదిన ప్రైవేట్ బ్యాంకు షేర్లు... మార్కెట్ భారీ నష్టాల్లో ప్రైవేట్ రంగ బ్యాంకులు ఎదురీదాయి. డిసెంబర్ క్వార్టర్లో మొండిబకాయిలు తగ్గినట్లు యాక్సిస్ బ్యాంక్ ప్రకటించడంతో షేరు 6 శాతం లాభపడింది. మెరుగైన క్యూ3 ఫలితాలను ప్రకటించిన నేపథ్యంలో పలు బ్రేకరేజ్ కంపెనీలు బై రేటింగ్‌ను కేటాయించడంతో పాటు టార్గెట్ ధరను పెంచడంతో ఫెడరల్ బ్యాంకు షేరు 3 శాతం ర్యాలీ చేసింది. ఇదే రంగానికి చెందిన బంధన్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, సిటీయూనియన్ బ్యాంక్ షేర్లు 2.50 శాతం నుంచి అరశాతం వరకు ఎగిశాయి. నష్టాల్లో ప్రపంచ మార్కెట్లు ... రెండురోజుల పాటు సమీక్ష సమావేశాలను నిర్వహించిన యూఎస్ ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పాలసీ కమిటీ వడ్డీరేట్లపై యథాతథ విధానానికే ఓటు వేసినప్పటికీ.., ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో అమెరికా మార్కెట్ బుధవారం 3 నెలల్లో అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. ఆసియా మార్కెట్లు 2%, యూరప్ 1% నష్టంతో ముగిశాయి. బోర్డ్ మీటింగ్స్ ఐఓసీ, సెయిల్, వేదాంత, టాటా మోటార్స్, సన్ ఫార్మా, సిప్లా, డాక్టర్ రెడ్డీస్, టెక్ మహీంద్రా, జస్ట్ డయల్, ఇండస్ఇండ్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, డీఎల్ఎఫ్, మణిప్పురం ఫైనాన్స్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ -
కొత్త ఏడాదిలో అతిపెద్ద పతనం
ముంబై: మార్కెట్లో విస్తృతస్థాయి లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో శుక్రవారం సూచీలు ఈ ఏడాదిలో ఒకరోజు అతిపెద్ద పతనాన్ని చవిచూశాయి. బలహీన అంతర్జాతీయ సంకేతాలు, క్యూ3 ఆర్థిక ఫలితాలకు ముందు అధిక వెయిటేజీ రియలన్స్ షేరు వెనకడుగువేయడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. బ్యాంకింగ్, ఆర్థిక, మెటల్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 746 పాయింట్లను కోల్పోయి 48,878 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 218 పాయింట్లు క్షీణించి 14372 వద్ద నిలిచింది. నష్టాల మార్కెట్లోనూ ఆటో, ఐటీ షేర్లు లాభపడ్డాయి. సూచీలకిది వరుసగా రెండోరోజూ నష్టాల ముగింపు. ఈ వారం మొత్తం మీద సెన్సెక్స్ 156 పాయింట్లు, నిఫ్టీ 61 పాయింట్లను కోల్పోయాయి. అమెరికా నూతన ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలతో పాటు బడ్జెట్ అంచనాలు రానున్న రోజుల్లో సూచీలకు దిశానిర్దేశం చేస్తాయని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. స్వల్ప లాభాలతో మొదలై... భారీ నష్టాల్లోకి... ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలను అందుకున్న దేశీయ మార్కెట్ ఉదయం స్వల్ప లాభాలతో మొదలైంది. మార్కెట్లో నెలకొన్న బలహీన పరిస్థితుల్లో సూచీలు లాభాలను నిలుపుకోలేపోయాయి. మిడ్‌సెషన్‌లో యూరప్ మార్కెట్ల నష్టాల ప్రారంభం ఇన్వెస్టర్లను మరింత కలవరపెట్టింది. దీనికి తోడు మార్కెట్‌కు వారంతాపు రోజు కావడంతో విక్రయాలు వెల్లువెత్తాయి. తొలి నుంచి ఇన్వెస్టర్లు అమ్మకాలకే కట్టుబడటంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 793 పాయింట్లు కోల్పోయి 48,832 వద్ద, నిఫ్టీ 233 పాయింట్లు కోల్పోయి 14,357 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. మరికొన్ని సంగతులు... ► మూడో త్రైమాసికపు ఆర్థిక ఫలితాల ప్రకటనకు ముందు రిలయన్స్ షేరు 2.5 శాతం నష్టపోయింది. ► హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేరు రెండుశాతం నష్టంతో ముగిసింది. నిబంధనలకు విరుద్ధంగా స్టాక్ బ్రోకర్ బీఆర్‌హెచ్ వెల్త్ క్రియేట్స్ తనఖా పెట్టిన సెక్యూరిటీలను అమ్మడంతో సెబీ.., హెచ్డీఎఫ్సీ బ్యాంకుపై రూ.కోటి జరిమానా విధించడం షేరు పతనానికి కారణమైంది. ► క్యూ3 ఆర్థిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం బంధన్ బ్యాంక్ షేరు రెండోరోజూ నష్టాన్ని చవిచూసింది. బీఎస్ఈలో ఈ బ్యాంకు షేరు 8 శాతం క్షీణించి రూ.314.2 వద్ద ముగిసింది. ► ఆస్తుల నాణ్యత పెరిగినట్లు క్వార్టర్ ఆర్థిక ఫలితాల్లో వెల్లడి కావడంతో ఎస్బీఐ కార్డ్స్ షేరు 5 శాతం లాభంతో ముగిసింది. ► ఇదే మూడో క్వార్టర్లో అదిరిపోయే ఆర్థిక ఫలితాలను వెల్లడించిన బజాజ్ షేరు 11 శాతం లాభపడి రూ.4,130 వద్ద స్థిరపడింది. ఇండిగో పెయింట్స్ ఐపీఓకు భారీ స్పందన 117 రెట్లు సబ్‌స్క్రైబ్షన్‌ను సాధించిన ఇష్యూ ఇండిగో పెయింట్స్ ఐపీఓకు విశేష స్పందన లభించింది. చివరిరోజు నాటికి ఐపీఓ 117 రెట్ల సబ్‌స్క్రైబ్షన్‌ను సాధించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ మొత్తం 55.18 లక్షల షేర్లను ఆఫర్ చేయగా... 64.58 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. క్యూఐపీ విభాగంలో 189.57 రెట్లు, నాన్–ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ కేటగిరీలో 263.05 రెట్లు, రిటైల్ విభాగంలో 15.93 రెట్లు సబ్‌స్క్రైబ్ అయినట్లు ఎక్చ్సేంజీ గణాంకాలు తెలిపాయి. ఇష్యూను పూర్తి చేసుకున్న షేర్లు ఫిబ్రవరి 2న ఎక్చ్సేంజీల్లో లిస్ట్ కానున్నాయి. ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి మంగళవారం కంపెనీ రూ.348 కోట్లను సమీకరించింది. హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ రెండోరోజుకి 2.2 రెట్ల స్పందన మార్టిగేజ్ రుణాల సంస్థ హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ కంపెనీ ఐపీఓ రెండు రోజు ముగిసే సరికి 2.2 రెట్లు సబ్స్క్రిబ్షన్ సాధించింది. ఇష్యూ జనవరి 25న ముగియనుంది. -
మార్కెట్ మూడో రోజూ వెనక్కే...
ముంబై: ఆద్యంతం ఒడిదుడుకుల నడుమ సాగిన ట్రేడింగ్‌లో అమ్మకాలే పైచేయి సాధించాయి. ఫలితంగా సూచీలు వరుసగా మూడో రోజూ నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 136 పాయింట్లను కోల్పోయి 39,614 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 28 పాయింట్లను నష్టపోయి 11,642 నిలిచింది. ఎన్నికలకు ముందు అమెరికాలో అనిశ్చితి, యూరప్‌లో కరోనా రెండోదశ విజృంభణలతో అంతర్జాతీయ మార్కెట్లలో బలహీనత కొనసాగింది. ఈ ప్రతికూలాంశం మన మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. అటో, ఆర్థిక, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ షేర్లలో అమ్మకాలు జరిగాయి. మెటల్, మీడియా, ఐటీ, ఫార్మా షేర్లలో రికవరీ జరిగింది. ఎఫ్ఐఐలు రూ.871 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. డీఐఐలు రూ.631 కోట్ల విలువైన ఈక్విటీలను కొన్నార -
4 రోజుల ర్యాలీకి బ్రేక్
ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మన స్టాక్ మార్కెట్‌కు ప్రతికూల సంకేతాలు అందాయి. ఫలితంగా సూచీల నాలుగు రోజుల వరుస ర్యాలీకి గురువారం బ్రేక్ పడింది. ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్, ఆర్థిక, ఇంధన రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 149 పాయింట్లు తగ్గి 40,558 వద్ద సిర్థపడింది. నిఫ్టీ 41 పాయింట్లు నష్టపోయి 11,896 వద్ద నిలిచింది. మెటల్, మీడియా, ఎఫ్ఎంసీజీ, రియల్టీ రంగాల షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాలు... కొలిక్కిరాని అమెరికా ఉద్దీపన ప్యాకేజీ అంశం, పెరుగుతున్న కోవిడ్–19 కేసులతో అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాలు జరిగాయి. అలాగే అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్) ఈ ఏడాది కాలానికి ఏషియన్–పసిఫిక్ ప్రాంత వృద్ధి అవుట్‌లుక్‌ను మైనస్ 2.2 శాతానికి డౌన్‌గ్రేడ్ చేయడం కూడా ప్రపంచ మార్కెట్లలో నిరాశ నెలకొంది. ఆసియా, యూరప్‌లోని ప్రధాన మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అలాగే అమెరికా ఫ్యూచర్లు అరశాతం నష్టాల్లో కదిలాయి. అంతర్జాతీయ మార్కెట్లకు ఇది 2 వారాల కనిష్టం స్థాయి కావడం గమనార్హం. అరబిందో ఫార్మా షేరుకు రెగ్యులేటరీ కష్టాలు... అరబిందో ఫార్మా షేరు గురువారం బీఎస్ఈలో 3 శాతం నష్టపోయింది. అమెరికాలోని తన అనుబంధ సంస్థ అరోలైఫ్ ఫార్మాకు చెందిన న్యూజెర్సీ యూనిట్లో లోపాలను గుర్తించిన యూఎస్ఎఫ్డీఏ వార్నింగ్ లెటర్‌ను జారీ చేసింది. దీంతో ఒక దశలో షేరు 7 శాతం నష్టపోయి రూ.749.55 స్థాయికి పతనమైంది. చివరకు 3 శాతం నష్టంతో రూ.782 వద్ద ముగిసింది. ఈక్విటాస్ ఎస్ఎఫ్బీ ఐపీవోకు రెట్టింపు స్పందన ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఐపీవోకు చివరి రోజైన గురువారం ముగింపు సమయానికి రెండు రెట్లు అధికంగా బిడ్లు దాఖలయ్యాయి. ఐపీవోలో భాగంగా సంస్థ 11,58,50,001 షేర్లను ఆఫర్ చేయగా, 22,57,94,250 షేర్లకు బిడ్లు వచ్చాయి. క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయర్స్ (క్యూఐబీ) విభాగం 3.91 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్ అయింది. నాన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల విభాగంలో కేవలం 22 శాతం అధిక స్పందన వచ్చింది. ఇక రిటైల్ కోటా కింద ఉంచిన షేర్లకు 2.08 రెట్లు అధికంగా బిడ్లు వచ్చాయి. ఒక్కో షేరు ధరల శ్రేణి రూ.32–33గా ఉంది. -
‘బేర్’ బాజా !
ఆర్థిక రికవరీపై అనుమా నాలు, ఆందోళనతో ప్రపంచమార్కెట్లతో పాటే మన మార్కెట్ కూడా గురువారం భారీగా పతనమైంది. సెన్సెక్స్ 37,000 పాయింట్లు, నిఫ్టీ 10,850 పాయింట్ల దిగువకు పడిపోయాయి. రెండో దఫా కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్డౌన్ భయాలతో కలవరపడుతున్న ఇన్వెస్టర్లు ఎడాపెడా అమ్మకాలకు దిగారు. మరోవైపు వివిధ దేశాల కేంద్ర బ్యాంక్‌లు ఎలాంటి ఉద్దీపన ప్యాకేజీలు ఇవ్వకపోవడంతో సెంటిమెంట్ దెబ్బతిన్నది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 32 పైసలు క్షీణించి దాదాపు నెల కనిష్ట స్థాయి, 73.89కు పడిపోవడం, సెప్టెంబర్ సిరీస్ డెరివేటివ్స్ చివరి రోజు కావడంతో అమ్మకాలు జోరుగా సాగడం ప్రతికూల ప్రభావం చూపించాయి. అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 1,115 పాయింట్లు పతనమై 36,554 పాయింట్ల వద్ద, నిఫ్టీ 326 పాయింట్లు నష్టపోయి 10,806 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీలు చెరో 3 శాతం మేర నష్టపోయాయి. సెన్సెక్స్‌కు ఇది ఈ ఏడాది మూడో అతి పెద్ద పతనం. 7 నెలల్లో తొలిసారి... స్టాక్ సూచీలు వరుసగా ఆరో రోజూ క్షీణబాటలోనే సాగాయి. ఈ ఆరు రోజుల్లో సెన్సెక్స్ 2,749 పాయింట్లు, నిఫ్టీ 799 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. ఈ రెండు సూచీల నష్టాలు ఇన్నేసి రోజులు కొనసాగడం గత 7 నెలల్లో ఇదే తొలిసారి. ఆరంభం నుంచి నష్టాలే... బుధవారం అమెరికా స్టాక్ సూచీలు భారీగా నష్టపోయాయి. ఈ ప్రభావంతో గురువారం ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లోనే మొదలయ్యాయి. మన మార్కెట్ కూడా క్షీణబాటలోనే మొదలైంది. సెన్సెక్స్ 386 పాయింట్లు, నిఫ్టీ 121 పాయింట్ల నష్టాలతో ఆరంభమయ్యాయి. రోజు గడుస్తున్న కొద్దీ ఈ నష్టాలు పెరిగాయే కానీ, తగ్గలేదు. చివర్లో అమ్మకాల సునామీ కారణంగా నష్టాలు మరింతగా ఎగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1,172 పాయింట్లు, నిఫ్టీ 342 పాయింట్ల మేర నష్టపోయాయి. ఆసియా మార్కెట్లు 2–4 శాతం రేంజ్లో, యూరప్ మార్కెట్లు 1 శాతం రేంజ్లో క్షీణించాయి. ► సెన్సెక్స్ 30 షేర్లలో ఒక్క హిందుస్తాన్ యూనిలివర్ షేర్ మాత్రమే లాభపడింది. మిగిలిన 29 షేర్లు నష్టపోయాయి. ► గత ఐదు నెలలుగా పుంజుకుంటూ వస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్లు బాగా నష్టపోయాయి. ► మార్కెట్ భారీ పతనంలోనూ 100కు పైగా షేర్లు ఇంట్రాడేలో ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. రూట్ మొబైల్, మాజెస్కో, అపోలో హాస్పిటల్స్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► దాదాపు 380కు పైగా షేర్లు లోయర్ సర్క్యూట్లను తాకాయి. పతనానికి ప్రధాన కారణాలు ► అగాధంలోకి అమెరికా ఎకానమీ: డిమాండ్ బలహీనంగా ఉండటం, ఉద్యోగ కల్పన కొరవడడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ అగాధంలోకి కూరుకుపోయిందని అమెరికా ఫెడరల్ రిజర్వ్ వైస్ చైర్మన్ రిచర్డ్ క్లారిడ తాజాగా వ్యాఖ్యానించారు. ఆర్థికవ్యవస్థ రికవరీని అతిగా అంచనా వేశారని, మార్కెట్లు ఊహించిన స్థాయిలో రికవరీ లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ► పెరుగుతున్న కరోనా కేసులు: దేశీయంగా, అంతర్జాతీయంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ మహమ్మారి ప్రబలి దాదాపు పది నెలలు కావస్తున్నా, కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయే కానీ, తగ్గడం లేదు. ► మళ్లీ లాక్డౌన్ భయాలు: యూరప్ దేశాల్లో రెండో దఫా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ కేసుల కట్టడికి మళ్లీ లాక్డౌన్ విధించాలని పలు దేశాలు యోచిస్తున్నాయి. లాక్డౌన్ విధిస్తే, ఆర్థిక కార్యకలాపాలు మళ్లీ కుంటుపడి రికవరీ మరింత ఆలస్యమవుతుందనే భయాలు నెలకొన్నాయి. ► ప్రపంచ మార్కెట్ల పతనం: కరోనా కేసులు పెరుగుతుండటం, మళ్లీ లాక్డౌన్ భయాలు మొదలవ్వడం, రికవరీకి ఊతమిచ్చేలా వివిధ దేశాల కేంద్ర బ్యాంక్‌లు ఎలాంటి ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించకపోవడంతో ప్రపంచ మార్కెట్లు పతనమవుతున్నాయి. ► హెవీ వెయిట్స్‌లో అమ్మకాలు: సూచీల్లో వెయిటేజీ అధికంగా ఉన్న ఇన్ఫోసిస్, రిలయన్స్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఐటీసీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ► 32 పైసలు పతనమైన రూపాయి: రూపాయి మళ్లీ పతనబాట పట్టింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 32 పైసలు క్షీణించి 73.89కు చేరింది. ఇది దాదాపు నెల కనిష్ట స్థాయి. ► ఎఫ్ అండ్ ఓ ఎక్స్పైరీ: సెప్టెంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు చివరి రోజు కావడం కూడా ప్రతికూల ప్రభావం చూపించింది. 6 రోజులు... రూ.11 లక్షల కోట్లు ఆవిరి స్టాక్ మార్కెట్ భారీ పతనం కారణంగా రూ. 3.95 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.3.95 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.148.76 లక్షల కోట్లకు పడిపోయింది. గత 6 రోజుల నష్టాల కారణంగా మొత్తం రూ.11 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద కరిగిపోయింది. మరింత తీవ్రంగా ఒడిదుడుకులు.! ప్రస్తుతం నిఫ్టీ 200 రోజులు సింపుల్ మూవింగ్ యావరేజ్(ఎస్ఎమ్ఏ–10,839 పాయింట్లు), దిగువకు పతనమైంది. 200 రోజుల ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్(ఈఎమ్ఏ–10,761 పాయింట్లు)కు చేరువయింది. దీంతో రానున్న రోజుల్లో ఒడిదుడుకులు మరింత తీవ్రంగా ఉంటాయని, ట్రేడర్లు, ఇన్వెస్టర్లు జాగరూకతతో వ్యవహరించాలనేది విశ్లేషకుల సూచన. ఆర్థిక రికవరీపై అధిక అంచనాలు నెలకొన్నాయని, షేర్ల విలువలు అధికంగా ఉన్నాయని, దీంతో మార్కెట్లో కరెక్షన్ తప్పనిసరి అని వారంటున్నారు. ప్రపంచ మార్కెట్ల గమనాన్ని బట్టే మన మార్కెట్ కదలికలు ఉంటాయని నిపుణులంటున్నారు. సెన్సెక్స్ టాప్10 పతనాలు తేదీ నష్టం(పాయింట్లు) మార్చి9, 2020 1,942 ఆగస్టు 24,2015 1,625 ఫిబ్రవరి 28, 2020 1,448 జనవరి 21, 2008 1,408 సెప్టెంబర్ 24,2020 1,115 అక్టోబర్ 24,2008 1,071 ఫిబ్రవరి1, 2020 988 మార్చి 17,2008 951 మర్చి 3, 2008 901 మార్చి6,2020 894 -
చివరి గంటలో అమ్మకాలు
ట్రేడింగ్ చివరి గంటలో బ్యాంక్, ఆర్థిక, వినియోగ రంగ షేర్లలో అమ్మకాల కారణంగా శుక్రవారం స్టాక్‌మార్కెట్ నష్టపోయింది. అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉండటం ప్రతికూల ప్రభావం చూపించింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 21 పైసలు పుంజుకొని 73.45కు చేరినా, స్టాక్ మార్కెట్‌కు నష్టాలు తప్పలేదు. సెన్సెక్స్ 134 పాయింట్లు పతనమై 38,846 పాయింట్ల వద్ద, నిఫ్టీ 11 పాయింట్లు నష్టంతో 11,505 పాయింట్ల వద్ద ముగిశాయి. వరుసగా రెండో రోజూ స్టాక్ సూచీలు నష్టపోయాయి. ఫార్మా షేర్ల జోరు మాత్రం కొనసాగుతోంది. పలు ఫార్మా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. ఈ వారంలో సెన్సెక్స్ 9 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 41 పాయింట్లు లాభపడింది. 564 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్... ఆసియా మార్కెట్ల జోరుతో మన మార్కెట్ కూడా మంచి లాభాల్లోనే ఆరంభమైంది. రోజు గడుస్తున్న కొద్దీ ఈ లాభాలు కరిగిపోయాయి. చివరి గంటలో బ్యాంక్, ఆర్థిక రంగషేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఒక దశలో 220 పాయింట్లు ఎగసిన సెన్సెక్స్, మరో దశలో 344 పాయింట్ల మేర పతనమైంది. మొత్తం మీద రోజంతా 564 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఫార్మా షేర్లు పుంజుకోవడంతో నష్టాలు తగ్గాయి. ఆసియా మార్కెట్లు లాభాల్లో, యూరప్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ► హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.3 శాతం నష్టంతో రూ. 1,057 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► దాదాపు 160కి పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు చేరాయి. అలెంబిక్, అపోలో హాస్పిటల్స్, బయోకాన్, సిప్లా, దివీస్ ల్యాబ్స్, గ్రాన్యూల్స్ ఇండియా, లుపిన్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► 285 షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. రామ్‌కో సిస్టమ్స్, విసా స్టీల్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఆల్‌టైమ్ హైకి డాక్టర్ రెడ్డీస్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేరు దుమ్ము రేపుతోంది. క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే రెవ్లిమిడ్ ఔషధానికి సంబంధించిన న్యాయ వివాదాన్ని పరిష్కరించుకున్నామని కంపెనీ వెల్లడించింది. దీంతో ఈ కంపెనీ షేరు ఇంట్రాడేలో 14 శాతం లాభంతో ఆల్‌టైమ్ హై, రూ.5,497ను తాకింది. చివరకు 10 శాతం లాభంతో రూ.5,327 వద్ద ముగిసింది. కరోనా వైరస్ వ్యాక్సిన్, స్పుత్నిక్–వి టీకాను భారత్‌లో పంపిణీ చేయడానికి ఒప్పందం కుదుర్చుకోవడంతో ఈ షేర్ ఈ వారం జోరుగా పెరిగింది. గత నాలుగు రోజుల్లో ఈ షేర్ 20 శాతానికి మించి లాభపడింది. -
చివర్లో నష్టాలు
ట్రేడింగ్ చివర్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో సోమవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. అంతర్జాతీయ సంకేతాలు పటిష్టంగా ఉన్నా, బ్యాంక్, ఆర్థిక రంగ షేర్లలో అమ్మకాల జోరు కారణంగా స్టాక్ సూచీలు ఆరంభ లాభాలను కోల్పోయాయి. ఇంట్రాడేలో 375 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ చివరకు 98 పాయింట్లు పతనమై 38,757 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 24 పాయింట్లు తగ్గి 11,440 పాయింట్ల వద్దకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి గతంలో అంచనా వేసిన మైనస్ 5% కంటే మరింత దిగువకు మైనస్ 9%కి పడిపోతుందని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ పేర్కొనడం, ఐటీ షేర్లు మెరుపులు మెరిపించినప్పటికీ, హెచ్డీఎఫ్సీ జోడీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ వంటి బ్లూచిప్‌లు నష్టపోవడం ప్రతికూల ప్రభావం చూపించాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఆరంభ లాభాలను కోల్పోయి 5 పైసలు పెరిగి 73.48కు చేరింది. ఐటీ షేర్లు...అదరహో...: ఈ క్యూ2లో తమ ఆదాయం, నిర్వహణ మార్జిన్లు అంచనాలకు మించి పెరుగుతాయని ప్రకటించడంతో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్ 10 శాతం లాభంతో రూ.794 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. హెచ్‌సీఎల్ మార్కెట్ క్యాప్ రూ.19,715 కోట్లు ఎగసి రూ.2,15,384 కోట్లకు చేరింది. ఈ జోష్‌తో మిగిలిన ఐటీ షేర్లు కూడా వెలుగులు విరజిమ్మాయి. టీసీఎస్ షేర్ ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హై, రూ.2,504ను తాకింది. చివరకు 5 శాతం లాభంతో రూ.2,492 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 9.35 లక్షల కోట్లకు చేరింది. ఈ స్థాయి మార్కెట్ క్యాప్‌ను సాధించిన రెండో భారత కంపెనీ ఇది. గత ఏడాది అక్టోబర్‌లోనే ఈ స్థాయి మార్కెట్ క్యాప్‌ను సాధించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ ప్రస్తుతం రూ.15 లక్షల కోట్లకు మించింది. ∙భారతీ ఎయిర్టెల్ షేర్ 3 శాతం నష్టంతో రూ.475 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ∙దాదాపు 150కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. ఎల్ అండ్ టీ, డిక్సన్ టెక్నాలజీస్, ఎస్కార్ట్స్, మైండ్ ట్రీ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ∙ఫ్యూచర్ గ్రూప్ షేర్ల పతనం కొనసాగింది. -
మళ్లీ ‘డ్రాగన్’ షాక్!
స్టాక్ మార్కెట్ సోమవారం భారీగా నష్టపోయింది. దీంతో ఆరు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. యథాతథ స్థితిని కొనసాగించాలన్న ఒప్పందాన్ని ఉల్లంఘించి చైనా బలగాలు మళ్లీ తూర్పు లద్దాఖ్‌లో చొరబడటంతో చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు మరింతగా ముదురుతాయనే భయాలు దీనికి ప్రధాన కారణం. సెన్సెక్స్ 39,000 పాయింట్లు, నిఫ్టీ 11,400 పాయింట్లు దిగువకు పడిపోయాయి. సెన్సెక్స్, నిఫ్టీలు ట్రేడింగ్ ఆరంభంలోనే కీలకమైన స్థాయిలకు ఎగియడంతో పై స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం, క్యూ1 జీడీపీ గణాంకాలు ఎలా ఉండనున్నాయో అనే అనిశ్చితి, నేటి(మంగళవారం) నుంచి కొత్త ‘మార్జిన్’ నిబంధనలు అమల్లోకి రానుండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 21 పైసలు పతనం కావడం....ప్రతికూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్ 839 పాయింట్ల నష్టంతో 38,628 పాయింట్ల వద్ద, నిఫ్టీ 260 పాయింట్లు క్షీణించి 11,388 పాయింట్ల వద్ద ముగిశాయి. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్ 2.13 శాతం, నిఫ్టీ 2.23 శాతం చొప్పున నష్టపోయాయి. గత మూడు నెలల కాలంలో ఈ సూచీలు ఒక్క రోజులో ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే మొదటిసారి. అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి. ఇంట్రాడే గరిష్ట స్థాయి నుంచి చూస్తే, సెన్సెక్స్ 1,614 పాయింట్లు పతనమైంది. ఇక జపాన్ సూచీ లాభపడగా, మిగిలిన ఆసియా మార్కెట్లు నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు కూడా నష్టాల్లోనే ముగిశాయి. సెబీ కొత్త ‘మార్జిన్’ నిబంధనలు... స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌కు సంబంధించి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ రూపొందించిన మార్జిన్ నిబంధనలు నేటి(మంగళవారం) నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ కొత్త నిబంధనలు కఠినంగా ఉన్నాయని, మార్పులు, చేర్పులు చేస్తే మంచిదని, ఈ నిబంధనల అమలుకు సాంకేతికంగా సిద్ధంగా లేమని, ఒకవేళ మార్పులు చేయకపోయినా, వీటి అమలును ఈ నెల 30కు వాయిదా వేయాలని పలు బ్రోకరేజ్ సంస్థలు విన్నవించాయి. ఈ విన్నపాన్ని సెబీ మన్నించలేదు. ఈ నేపథ్యంలో మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో జోరుగా లాభాల స్వీకరణ జరిగింది. మరిన్ని మార్కెట్ విశేషాలు... ► సన్‌ఫార్మా షేర్ 7 శాతం నష్టంతో రూ.518 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► 30 సెన్సెక్స్ షేర్లలో మూడు షేర్లు–ఓఎన్జీసీ, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీలు మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన 28 షేర్లు నష్టపోయాయి. ► ఫ్యూచర్ గ్రూప్, రిలయన్స్ డీల్ నేపథ్యంలో ఫ్యూచర్ గ్రూప్ షేర్లన్నీ అప్పర్ సర్క్యూట్లను తాకాయి. ఫ్యూచర్ రిటైల్ 20 శాతం లాభంతో రూ.163కు చేరింది. ► స్టాక్ మార్కెట్ భారీగా పతనమైనా, వందకు పైగా షేర్లు ఇంట్రాడేలో ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. ► రూ.4.55 లక్షల కోట్ల సంపద ఆవిరి ► స్టాక్ మార్కెట్ భారీ పతనం కారణంగా రూ.4.55 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.4,55,915 కోట్లు హరించుకుపోయి రూ.153.76 లక్షల కోట్లకు పడిపోయింది. -
మూడో రోజూ నష్టాలే...
స్టాక్ మార్కెట్ నష్టాలు శుక్రవారం కూడా కొనసాగాయి. అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉండటం, అమెరికా ఉద్దీపన ప్యాకేజీ మరింత ఆలస్యం కానుండటం, సవరించిన స్థూల రాబడి(ఏజీఆర్) బకాయిల విషయమై సుప్రీం కోర్ట్ నిర్ణయం ఎలా ఉంటుందోనన్న అనిశ్చితి, బ్యాంక్, ఆర్థిక, వినియోగ రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో స్టాక్ మార్కెట్ పతనమైంది. స్టాక్ సూచీలు వరుసగా మూడో రోజూ నష్టపోయాయి. రిటైల్ ద్రవ్యోల్బణం 6.93%కి చేరడంతో రేట్ల కోత ఆశలు ఆవిరి కావడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 6 పైసలు క్షీణించి 74.90కు చేరడం, వాహన కంపెనీల క్యూ1 ఫలితాలు నిరాశపరచడం, అమెరికా–చైనాల మధ్య చర్చల విషయమై అనిశ్చితి నెలకొనడం..... ప్రతికూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్ 433 పాయింట్లు పతనమై 37,877 పాయింట్ల వద్ద, నిఫ్టీ 122 పాయింట్లు నష్టపోయి 11.178 పాయింట్ల వద్ద ముగిశాయి. వారం పరంగా చూస్తే, సెన్సెక్స్ 163 పాయింట్లు, నిఫ్టీ 36 పాయింట్లు నష్టపోయాయి. 866 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్..... ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉన్నా, మన మార్కెట్ లాభాల్లోనే ఆరంభమైంది. మధ్యాహ్నం వరకూ పరిమిత శ్రేణి లాభాల్లో కదలాడింది. మధ్యాహ్నం గం.2 తర్వాత నష్టాల్లోకి జారిపోయింది. ఒక దశలో 231 పాయింట్లు ఎగసిన సెన్సెక్స్ మరో దశలో 655 పాయింట్ల మేర నష్టపోయింది. మొత్తం మీద రోజంతా 886 పాయింట్ల రేంజ్లో కదలాడింది. చైనాలో పారిశ్రామికోత్పత్తి, రిటైల్ అమ్మకాలు గణాంకాలు నిరాశపరిచాయి. దీంతో అంతర్జాతీయంగా రికవరీపై అనిశ్చితి నెలకొనడంతో ప్రపంచ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడయ్యాయి. ► మహీంద్రా అండ్ మహీంద్రా షేర్ 3 శాతం నష్టంతో రూ.610 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► మొత్తం 30 సెన్సెక్స్ షేర్లలో ఐదు షేర్లు–సన్ ఫార్మా, ఎన్టీపీసీ, టాటా స్టీల్, టైటాన్, ఇన్ఫోసిస్‌లు మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన 25 షేర్లు నష్టపోయాయి. ► ఈ ఏడాది తొలి త్రైమాసికంలో రూ.55 కోట్ల నష్టాలు రావడంతో ఐషర్ మోటార్స్ షేర్ 7 శాతం నష్టంతో రూ.20,130 వద్ద ముగిసింది. ► దాదాపు వందకు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు చేరాయి. మైండ్‌ట్రీ,లుపిన్, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► మొత్తం 230 షేర్లు లోయర్ సర్క్యూట్లను తాకాయి. యస్ బ్యాంక్, లెమన్ ట్రీ హోటల్స్, అలోక్ ఇండస్ట్రీస్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. -
వొడా ఐడియా నష్టాలు రూ. 25,460 కోట్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థి క సంవత్సరం తొలి త్రైమాసికంలో టెలికం దిగ్గజం వొడాఫోన్ ఐడియా ఏకంగా రూ. 25,460 కోట్ల నష్టం ప్రకటించింది. లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బకాయిలకు భారీగా కేటాయింపులు జరపాల్సి రావడమే ఇందుకు కారణం. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నష్టాలు రూ. 4,874 కోట్లు. మరోవైపు, తాజా క్యూ1లో ఆదాయం రూ. 11,270 కోట్ల నుంచి రూ. 10,659 కోట్లకు క్షీణించింది. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్)పరంగా ప్రభుత్వానికి కట్టాల్సిన బాకీలకు సంబంధించి జూన్ క్వార్టర్లో రూ. 19,440 కోట్లు అదనంగా కేటాయించాల్సి వచ్చిందని వొడాఫోన్ ఐడియా వెల్లడించింది. ‘ తొలి త్రైమాసికంలో లాక్డౌన్ వల్ల స్టోర్లు మూతబడి రీచార్జి సదుపాయాలు లేకుండా పోవడం, ఆర్థిక వ్యవస్థ మందగమన ప్రభావిత కస్టమర్లు రీచార్జి చేసుకోలేకపోవడం తదితర అంశాల కారణంగా క్యూ1 చాలా గడ్డుకాలంగా గడిచింది‘ అని సంస్థ ఎండీ, సీఈవో రవీందర్ టక్కర్ తెలిపారు. -
మూడో రోజూ నష్టాల బాటే
ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో మూడో రోజూ అమ్మకాల ఒరవడి కొనసాగింది. బలహీన అంతర్జాతీయ సంకేతాలకు తోడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ కౌంటర్లో లాభాల స్వీకరణతో ప్రధాన సూచీలు స్వల్పంగా నష్టపోయాయి. సెన్సెక్స్ 129 పాయింట్లు కోల్పోయి 37,607 వద్ద ముగిసింది. నిఫ్టీ 29 పాయింట్ల నష్టంతో 11,073 వద్ద స్థిరపడింది. ఈ వారంలో సెన్సెక్స్ 522 పాయింట్లు (1.36 శాతం), నిఫ్టీ 121 పాయింట్లు (1.07శాతం) చొప్పున నికరంగా నష్టపోయాయి. రిలయన్స్‌కు అమ్మకాల సెగ ఫలితాల ప్రకటన తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ కౌంటర్లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో ఈ స్టాక్ బీఎస్ఈలో 2 శాతం నష్టపోయింది. గురువారం మార్కెట్ ముగిసిన తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ జూన్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. సెన్సెక్స్‌లో అత్యధికంగా నష్టపోయింది ఈ స్టాకే. ఇక హెచ్డీఎఫ్సీ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ, ఏషియన్ పెయింట్స్, కోటక్ బ్యాంకు, బజాజ్ ఆటో, అల్ట్రాటెక్ సిమెంట్ నష్టపోయిన వాటిల్లో ఉన్నాయి. సన్‌ఫార్మా, ఎస్బీఐ, హెచ్‌సీఎల్ టెక్, ఎంఅండ్ఎం, యాక్సిస్ బ్యాంకు లాభపడ్డాయి. ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించడంతో ఎస్బీఐ 3 శాతం వరకు లాభపడడం గమనార్హం. యూఎస్ జీడీపీ రికార్డు స్థాయిలో మైనస్ 32.9 శాతానికి జూన్ త్రైమాసికంలో పడిపోవడంతో ప్రపంచ మార్కెట్లలో ఉత్సాహం ఆవిరైంది. హాంకాంగ్, టోక్యో, సియోల్ నష్టపోగా, షాంఘై లాభపడింది. -
జీఎంఆర్‌కు రూ.1,127 కోట్ల నష్టం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ కంపెనీ జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్చి త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో రూ.1,127 కోట్ల నష్టం చవిచూసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీకి రూ.2,353 కోట్ల నష్టం వాటిల్లింది. టర్నోవరు రూ.1,994 కోట్ల నుంచి రూ.2,349 కోట్లకు చేరింది. ఎబిటా రూ.655 కోట్లుగా ఉంది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి రూ.2,198 కోట్ల నష్టం ప్రకటించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ.3,466 కోట్ల నష్టం పొందింది. టర్నోవరు రూ.7,576 కోట్ల నుంచి రూ.8,556 కోట్లకు చేరింది. ఎయిర్‌పోర్టుల ఆదాయం నాల్గవ త్రైమాసికంలో రూ.1,582 కోట్లు, ఆర్థిక సంవత్సరంలో రూ.6,191 కోట్లు నమోదైంది. -
ఆగని అమ్మకాలు
ముంబై: ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండో రోజూ గురువారం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. క్రితం రోజు యూఎస్ ఫెడ్ పాలసీకి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్త ధోరణి, లాభాల స్వీకరణతో మార్కెట్లు నష్టపోగా.. ఫెడ్ పాలసీ ప్రకటన సానుకూలంగానే వచ్చినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలకే ఇన్వెస్టర్లు మొగ్గు చూపించారు. ఫెడ్ తన డోవిష్ పాలసీని యథాతథంగా కొనసాగిస్తూ, వడ్డీ రేట్లను సున్నా స్థాయిలోనే కొనసాగిస్తూ, బాండ్ల కొనుగోలు సహా ఇతర ఆర్థిక ఉద్దీపన చర్యలు కొనసాగుతాయని ప్రకటించింది. అంచనాలకు అనుగుణంగానే పాలసీ చర్యలు ఉన్నాయి. అయినా, దేశీయంగా జూలై నెల ఎఫ్‌అండ్‌వో ముగింపు రోజున ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణను కొనసాగించారు. కరోనా కేసుల పెరుగుదలే ఇన్వెస్టర్ల ఆందోళనకు కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. బీఎస్ఈ ఉదయం లాభాలతో ట్రేడింగ్ మొదలు పెట్టినప్పటికీ.. చివరకు 335 పాయింట్లు (0.90 శాతం) నష్టంతో 37,736 వద్ద క్లోజయింది. అదే విధంగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 101 పాయింట్లు (0.90 శాతం) క్షీణించి 11,102 వద్ద స్థిరపడింది. ► నిఫ్టీలో ముఖ్యంగా హెచ్డీఎఫ్సీ 4%, హెచ్డీఎఫ్సీ బ్యాంకు 1.5% నష్టపోయాయి. ► బీపీసీఎల్‌లో ప్రభుత్వ పెట్టుబడుల విక్రయానికి సంబంధించి బిడ్ల దాఖలు గడువును ప్రభుత్వం సెప్టెంబర్ ఆఖరు వరకు పొడిగించడంతో ఈ స్టాక్ భారీగా 7 శాతం నష్టపోయింది. ► ఇండస్ఇండ్ బ్యాంకు 5 శాతం, ఐవోసీ 4 శాతం, యాక్సిస్ బ్యాంకు 3 శాతం, భారతీ ఎయిర్టెల్ 3 శాతం చొప్పున నష్టాల్లో ముగిశాయి. ► డాక్టర్ రెడ్డీస్ కౌంటర్లో ర్యాలీ కొనసాగింది. గురువారం మరో 5 శాతం వరకు లాభపడింది. ► అదే విధంగా సన్‌ఫార్మా 4 శాతం, విప్రో రెండున్నర శాతం, మారుతి ఒకటిన్నర శాతం వరకు లాభపడ్డాయి. ► రంగాల వారీ సూచీలను గమనిస్తే.. బీఎస్ఈ టెలికం, ఆయిల్ అండ్ గ్యాస్, ఫైనాన్స్, బ్యాంకెక్స్, యుటిలిటీస్, పవర్ సూచీలు నష్టపోయాయి. హెల్త్‌కేర్, ఐటీ సూచీలు లాభపడ్డాయి. జోష్‌నివ్వని అన్‌లాక్ 3.0 యూఎస్ ఫెడ్ పాలసీని యథాతథంగా కొనసాగించినప్పటికీ అంతర్జాతీయంగా మార్కెట్లు నష్టాలను ఎదుర్కొన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వ్యాపార పరిస్థితులు మందగమనంగా ఉండడం, వైరస్ కేసుల పెరుగుదల ఇందుకు కారణమైంది. దేశీయంగా అన్‌లాక్ 3.0 ఉత్సాహాన్నివ్వలేకపోయింది’’ – వినోద్ నాయర్, జియోజిత్ ఫైనాన్షియల్ రీసెర్చ్ హెడ్ -
డాక్టర్ రెడ్డీస్ లాభం 579 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఔషధ రంగ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్ఎల్) నికర లాభం 13 శాతం క్షీణించి రూ. 579 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో నికర లాభం రూ. 663 కోట్లు. ఇక ఆదాయం 15 శాతం పెరిగి రూ. 3,843 కోట్ల నుంచి రూ. 4,417 కోట్లకు చేరింది. డీఆర్ఎల్ సీఎఫ్‌వో సౌమేన్ చక్రవర్తి బుధవారం ఈ విషయాలు వెల్లడించారు. కరోనా వైరస్ సంక్షోభ సమయంలోనూ కార్యకలాపాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవడం, ఉత్పాదకతను పెంచుకునే చర్యలు కొనసాగించడం మొదలైన అంశాలపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు ఆయన వివరించారు. క్యూ1లో అన్ని అంశాల్లోనూ ఆర్థికంగా పటిష్టమైన పనితీరు కనపర్చగలిగామని డీఆర్ఎల్ సహ–చైర్మన్ జీవీ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. వోక్హార్డ్ నుంచి కొనుగోలు చేసిన వ్యాపారాన్ని డీఆర్ఎల్ వ్యవస్థకు అనుసంధానించే ప్రక్రియ ప్రారంభించినట్లు వివరించారు. ఆగస్టులో రెండు కోవిడ్ ఔషధాలు.. కోవిడ్–19 వ్యాధి చికిత్సలో ఉపయోగించే రెండు యాంటీ వైరల్ ఔషధాలు.. రెమిడెసివిర్, ఫావిపిరావిర్‌ను ఆగస్టులో ప్రవేశపెట్టేందు కు సన్నాహాలు చేస్తున్నట్లు చక్రవర్తి తెలిపారు. రెమ్డిసివిర్ను వర్ధమా న, ఆసియా దేశాలకు కూడా ఎగుమతి చేయాలని భావిస్తున్నట్లు సంస్థ సీఈవో ఎరెజ్ ఇజ్రేలీ పేర్కొన్నారు. భారత్ సహా 127 దేశాల్లో రెమ్డిసివిర్ విక్రయానికి సంబంధించి అమెరికన్ సంస్థ గిలీడ్ సైన్సెస్‌తో డీఆర్ఎల్కు ఒప్పందం ఉంది. అలాగే, అవిగాన్ ట్యాబ్లెట్స్ (ఫావిపిరావిర్) విక్రయానికి సంబంధించి జపాన్‌కు చెందిన ఫ్యూజి ఫిల్మ్ కార్పొరేషన్‌తో ఒప్పందం ఉంది. గ్లోబల్ జనరిక్స్‌కు యూరప్ ఊతం.. యూరప్, వర్ధమాన మార్కెట్ల ఊతంతో గ్లోబల్ జనరిక్స్ విభాగం ఆదాయాలు ఆరు శాతం పెరిగి రూ. 3,507 కోట్లకు చేరింది. కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడంతో పాటు అమ్మకాలు పెరగడంతో యూరప్‌లో ఆదాయం 48 శాతం ఎగిసింది. కీలకమైన ఉత్తర అమెరికా మార్కెట్లో ఆదాయం ఆరు శాతం పెరిగింది. కొత్త ఉత్పత్తులు, సానుకూల ఫారెక్స్ రేటు ఇందుకు తోడ్పడ్డాయని కంపెనీ తెలిపింది. క్యూ1లో ఉత్తర అమెరికా మార్కెట్లో ఆరు కొత్త ఔషధాలు ప్రవేశపెట్టినట్లు వివరించింది. భారత మార్కెట్లో మాత్రం ఆదాయం వార్షిక ప్రాతిపదికన 10 శాతం, సీక్వెన్షియల్‌గా 8 శాతం క్షీణించింది. కరోనా వైరస్ పరిణామాలతో అమ్మకాలు క్షీణించడమే ఇందుకు కారణం. తొలి త్రైమాసికంలో దేశీ మార్కెట్లో డీఆర్ఎల్ నాలుగు కొత్త బ్రాండ్స్‌ను ప్రవేశపెట్టింది. పీఎస్ఏఐకి కొత్త ఉత్పత్తుల తోడ్పాటు ఫార్మాస్యూటికల్ సర్వీసెస్, యాక్టివ్ ఇంగ్రీడియెంట్స్ (పీఎస్‌ఏఐ) విభాగం ఆదాయాలు వార్షికంగా 88 శాతం, సీక్వెన్షియల్‌గా 19 శాతం పెరిగాయి. కొన్ని ఉత్పత్తుల విక్రయాలు భారీగా పెరగడం, కొత్త ఉత్పత్తుల అమ్మకాలు, సానుకూల ఫారెక్స్ రేటు ఇందుకు తోడ్పడ్డాయి. సమీక్షాకాలంలో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై కంపెనీ రూ. 400 కోట్లు వెచ్చించింది. ప్రధానంగా సంక్లిష్టమైన జనరిక్స్, బయో–సిమిలర్స్ తదితర ఉత్పత్తుల రూపకల్పనపై దృష్టి పెడుతోంది. కోవిడ్–19 చికిత్స సంబంధ ఔషధాల అభివృద్ధి ప్రాజెక్టులపైనా కసరత్తు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. -
మారుతీ చరిత్రలో తొలిసారి నష్టాలు
న్యూఢిల్లీ: దేశీయ కార్ల మార్కెట్లలో రారాజు అయిన మారుతి సుజుకీ కరోనా దెబ్బకు నష్టాల పాలైంది. జూన్‌తో అంతమైన మూడు నెలల కాలంలో రూ.268 కోట్ల కన్సాలిడేటెడ్ నష్టం వచ్చింది. 2003 జూలైలో కంపెనీ స్టాక్ ఎక్ఛ్సేంజ్‌లలో లిస్ట్ అయిన తర్వాత నష్టాలు ఎదుర్కోవడం మొదటిసారి. సరిగ్గా ఏడాది క్రితం ఇదే జూన్ త్రైమాసికంలో మారుతి రూ.1,377 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాలను కళ్ల చూడగా, కరోనా మహమ్మారి కారణంగా కార్యకలాపాలపై గట్టి ప్రభావమే పడినట్టు తెలుస్తోంది. ఇక జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రూ.18,739 కోట్ల నుంచి రూ.3,679 కోట్లకు పరిమితమైంది. వాహన విక్రయాలు 76,599 యూనిట్లుగా ఉన్నాయి. వీటిల్లో దేశీయంగా 67,027 వాహనాలను విక్రయించగా, 9,572 యూనిట్లను ఎగుమతి చేసింది. కానీ సరిగ్గా ఏడాది క్రితం ఈ కాలంలో కంపెనీ విక్రయాలు 4,02,594 యూనిట్లుగా ఉండడం గమనార్హం. ‘‘కరోనా మహమ్మారి కారణంగా కంపెనీ చరిత్రలోనే ఇదొక అసాధారణ త్రైమాసికం. ఈ కాలంలో ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ కారణంగా అధిక సమయం ఎటువంటి ఉత్పత్తి, విక్రయాలకు అవకాశం లభించలేదు. మా మొదటి ప్రాధాన్యత ఉద్యోగులు, భాగస్వాములు, కస్టమర్ల ఆరోగ్యం, భద్రతకే. దీంతో జూన్ త్రైమాసికంలో చేసిన మొత్తం ఉత్పత్తి సాధారణ రోజుల్లో అయితే రెండు వారాల ఉత్పత్తికి సమానం’’ అని మారుతి సుజుకీ తన ప్రకటనలో వివరించింది. కరోనా ముందస్తు కార్యకలాపాల స్థాయికి చేరువ అవుతున్నట్టు తెలిపింది. ఫలితాల నేపథ్యంలో మారుతి సుజుకీ స్టాక్ బీఎస్ఈలో 1.6 శాతం నష్టపోయి రూ.6,186 వద్ద ముగిసింది. -
కోటక్ మహీంద్రా లాభం 9 శాతం డౌన్
న్యూఢిల్లీ: కోటక్ మహీంద్రా బ్యాంకు స్టాండలోన్ నికర లాభం (బ్యాంకు వరకే) జూన్ త్రైమాసికంలో 8.5 శాతం తగ్గి రూ.1,244 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.1,360 కోట్లుగా ఉండడం గమనార్హం. మార్చి త్రైమాసికం లాభం రూ.1,266 కోట్లతో పోల్చి చూస్తే పెద్దగా మార్పులేదు. ఆదాయం సైతం రూ.7,945 కోట్ల నుంచి రూ.7,685 కోట్లకు తగ్గింది. నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు), కంటింజెన్సీలకు చేసిన కేటాయింపులు గణనీయంగా పెరిగి రూ.962 కోట్లకు చేరాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో కేటాయింపులు రూ.316 కోట్లతో పోలిస్తే 3 రెట్లు పెరిగాయి. ఈ ఏడాది మార్చి క్వార్టర్లో కేటాయింపులు రూ.1,047 కోట్లతో పోల్చుకుంటే జూన్ క్వార్టర్లో తగ్గాయి. స్థూల ఎన్పీఏలు 2.19% నుంచి 2.70%కి (రూ.5,619 కోట్లు) చేరాయి. నికర ఎన్పీఏలు 0.73% నుంచి 0.87%కి (రూ.1,777 కోట్లు) చేరాయి. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం 4.1% తగ్గి రూ.1,853 కోట్లుగా ఉంటే, ఆదాయం రూ.12,129 కోట్ల నుంచి రూ.12,323 కోట్లకు ఎగసింది. ఆర్థిక మందగమనం కారణంగా రుణ ఎగవేతలు పెరగొచ్చని, దీంతో రానున్న కాలంలో గ్రూపు స్థాయిలో కేటాయింపులు పెరుగుతాయని కోటక్ బ్యాంకు పేర్కొంది. -
నిరాశపరిచిన జీ ఎంటర్టైన్మెంట్
న్యూఢిల్లీ: జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీల్) ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో రూ.766 కోట్ల కన్సాలిడేటెడ్ నష్టాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.292 కోట్లుగా ఉండడం గమనార్హం. మొత్తం ఆదాయం 4 శాతం తగ్గి రూ.1,992 కోట్లుగా నమోదైంది. ప్రకటనల రూపంలో ఆదాయం 15 శాతం క్షీణించి రూ.1,039 కోట్లుగా ఉంది. 2019–20 పూర్తి ఆర్థిక సంవత్సరానికి లాభం 67 శాతం తగ్గి రూ.524 కోట్లకు చేరగా, ఆదాయం రూ.8,185 కోట్ల నుంచి రూ.8,413 కోట్లకు పెరిగింది. -
మార్కెట్ ర్యాలీకి బ్రేక్..!
ముంబై: గరిష్ట స్థాయిల్లో అమ్మకాలతో మార్కెట్లు స్వల్పంగా నష్టపోయాయి. దీంతో ఐదు రోజుల వరుస లాభాలకు బుధవారం బ్రేక్ పడింది. ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్షియల్ స్టాక్స్‌లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపించినట్టు మార్కెట్ డేటా ఆధారంగా తెలుస్తోంది. బీఎస్ఈ సెన్సెక్స్ 59 పాయింట్లు నష్టపోయి 37,872 వద్ద క్లోజ్ అవగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 30 పాయింట్ల నష్టంతో 11,133 వద్ద ముగిసింది. క్రితం రోజు హిందుస్తాన్ యూనిలీవర్ జూన్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించగా.. ఈ కౌంటర్లో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో 3 శాతం నష్టపోయింది. జూన్ త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ లాభం 6 శాతం పెరగడం గమనార్హం. టాటా స్టీల్, మారుతి, ఇండస్ఇండ్ బ్యాంకు, ఇన్ఫోసిస్, ఎల్అండ్టీ, టీసీఎస్, ఏషియన్ పెయిం ట్స్ అధికంగా నష్టపోయిన వాటిల్లో ఉన్నాయి. మెరుగైన ఫలితాల నేపథ్యంలో యాక్సిస్ బ్యాంకు స్టాక్ 7% ర్యాలీ చేసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సంకేతాలు బలహీనంగా ఉండడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించినట్టు అనలిస్టులు పేర్కొన్నారు. హూస్టన్‌లోని కాన్సులేట్‌ను మూసేయాలంటూ చైనాను అమెరికా కోరడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత రా జుకున్నాయి. హాంగ్‌కాంగ్, సియోల్, టోక్యో మా ర్కెట్లు నష్టపోగా, షాంఘై సానుకూలంగా ట్రేడ్ అయింది. కాగా, గురువారం ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టుల ముగింపు కావడంతో అస్థిరతలు కొనసాగొచ్చు అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ పేర్కొన్నారు. ఆర్ఐఎల్ కొత్త రికార్డు రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) మార్కెట్ విలువ సరికొత్త గరిష్టాలకు చేరుకుంది. కంపెనీ షేరు 1.64 శాతం లాభపడి రూ.2,004 వద్ద బీఎస్ఈలో క్లోజయింది. దీంతో ఆర్ఐఎల్ మార్కెట్ విలువ రూ.12,70,480 కోట్లకు పెరిగింది. ఆర్ఐఎల్ స్టాక్ ఇంట్రాడేలో బీఎస్ఈలో రూ.2,010 వరకు పెరగడం గమనార్హం. పెరిగిన రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం: సెబీ చీఫ్ త్యాగి న్యూఢిల్లీ: లాక్డౌన్ నుంచి ఈక్విటీ మార్కెట్లో రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం పెరిగినట్టు సెబీ చైర్మన్ అజయ్ త్యాగి తెలిపారు. బుధవారం ఫిక్కీ నిర్వహించిన ఓ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. గడిచిన కొన్ని నెలల్లో నూతన డీమ్యాట్ అకౌంట్ల ప్రారంభం గణనీయంగా పెరిగిందని, ఇందులో మొదటిసారి ఇన్వెస్టర్లు ఎక్కువ మందే ఉన్నట్టు త్యాగి వెల్లడించారు. మొదటి సారి పెట్టుబడులు పెట్టే వారు రిస్క్‌లేని ప్రభుత్వ సెక్యూరిటీలతో (జీ–సెక్) ప్రారంభించడం అనుకూలంగా ఉంటుందని సూచించారు. ఇందుకు జీసెక్‌లను డీమ్యాట్ రూపంలో జారీ చేయాలన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. మార్చి షాక్ నుంచి మార్కెట్లు గణనీయంగా రికవరీ అయినట్టు చెప్పారు. -
‘ఆర్బీఐ’ నష్టాలు
ఆర్బీఐ అనూహ్యంగా రెపో రేటును తగ్గించినప్పటికీ, గురువారం స్టాక్ మార్కెట్ నష్టపోయింది. రెపో రేటును తగ్గించడంతో పాటు, రుణ చెల్లింపులపై మారటోరియాన్ని మరో మూడు నెలల పాటు పొడిగించడం తదితర ఆర్బీఐ చర్యలు స్టాక్‌మార్కెట్‌ను మెప్పించలేకపోయాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 34 పైసల మేర క్షీణించడం, అమెరికా–చైనాల మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరగడం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ రుణాత్మక వృద్ధిని నమోదు చేస్తుందన్న ఆర్బీఐ అంచనాలు.... ప్రతికూల ప్రభావం చూపించాయి. దీంతో మూడు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. ఇంట్రాడేలో 175 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ చివరకు 260 పాయింట్ల నష్టంతో 30,673 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 67 పాయింట్లు క్షీణించి 9,039 పాయింట్ల వద్దకు చేరింది. ఇక వారం పరంగా చూస్తే సెన్సెక్స్ 425 పాయింట్లు, నిఫ్టీ 98 పాయింట్ల మేర క్షీణించాయి. 633 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్... ఆసియా మార్కెట్ల బలహీనతతో సెన్సెక్స్ నష్టాల్లోనే మొదలైంది. ఆ తర్వాత లాభాల్లోకి వచ్చినా, మళ్లీ అరగంటకే నష్టాల్లోకి జారిపోయింది. అప్పటి నుంచి రోజంతా నష్టాలు కొనసాగాయి. ఒక దశలో 175 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ మరో దశలో 458 పాయింట్లు పతనమైంది. మొత్తం మీద రోజంతా 633 పాయింట్ల రంజ్‌లో కదలాడింది. ► యాక్సిస్ బ్యాంక్ షేర్ 6 శాతం మేర నష్టపోయి రూ.337 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► రుణ చెల్లింపులపై మారటోరియాన్ని మరో మూడు నెలల పాటు ఆర్బీఐ పొడిగించింది.ఈ నిర్ణయం వల్ల రుణ వసూళ్లలో జాప్యం జరగడమే కాకుండా, రికవరీ మరింత ఆలస్యమవుతుందనే భయాలతో బ్యాంక్, నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు 6 శాతం మేర నష్టపోయాయి. -
మార్కెట్లకు ప్యాకేజీ నచ్చలే..!
ఎంతో ఆశగా ఎదురుచూసిన ఆర్థిక ప్యాకేజీ ఉసూరుమనిపించడంతో గురువారం స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది. ప్రపంచ మార్కెట్లు పతనమవడం, ముడి చమురు ధరలు 4% మేర ఎగబాకడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించడం.....ప్రతికూల ప్రభావం చూపించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 32,000 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 9,200 పాయింట్ల దిగువకు పడిపోయాయి. ఇంట్రాడేలో 955 పాయింట్ల వరకూ పతనమైన సెన్సెక్స్ చివరకు 886 పాయింట్ల నష్టంతో 31,123 వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 241 పాయింట్లు క్షీణించి 9.143 పాయింట్ల వద్దకు చేరింది. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్ 2.77 శాతం, నిఫ్టీ 2.57 శాతం చొప్పున నష్టపోయాయి. రోజంతా నష్టాలు...: ప్రపంచ మార్కెట్ల బలహీనతతో మన మార్కెట్ కూడా భారీ నష్టాల్లో ఆరంభమైంది. రోజంతా స్టాక్ సూచీల క్షీణత కొనసాగింది. మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు మరింతగా పెరగడంతో నష్టాలు కూడా మరింతగా పెరిగాయి. క్యాపిటల్ గూడ్స్, మీడియా,హెల్త్‌కేర్, ఎఫ్ఎమ్సీజీ షేర్లు లాభపడ్డాయి. ఐటీ, లోహ, ఆర్థిక, ఇంధన, బ్యాంక్, టెలికం షేర్లు నష్టపోయాయి. మరిన్ని విశేషాలు.... ► టెక్ మహీంద్రా షేర్ 5% నష్టంతో రూ.516 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా పడిన షేర్ ఇదే. ► స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయినా, దాదాపు 40 షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. అలెంబిక్ ఫార్మా, ఆర్తి డ్రగ్స్, రుచి సోయా తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► కంపెనీల ఐటీ వ్యయాలు 8 శాతం మేర తగ్గుతాయని గార్ట్నర్ సంస్థ వెల్లడించడంతో ఐటీ షేర్లు 5 శాతం వరకూ నష్టపోయాయి. ► 200కు పైగా షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. ఎన్బీసీసీ,ఐనాక్స్ విండ్, జుబిలంట్ లైఫ్‌సైన్సెస్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ తదితర షేర్లు జాబితాలో ఉన్నాయి. మరోవైపు మహీంద్రా సీఐఈ ఆటోమేషన్ ,జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ తదితర 200 షేర్లు లోయర్ సర్క్యూట్లను తాకాయి. రూ.2 లక్షల కోట్లు ఆవిరి... మార్కెట్ భారీ నష్టాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ. 2 లక్షల కోట్ల మేర ఆవిరైంది. బీఎస్ఈలో లిస్టైన అన్ని కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ రూ.1.99,620 కోట్లు హరించుకుపోయి రూ.122.68 లక్షల కోట్లకు పడిపోయింది. నష్టాలు ఎందుకంటే.... నిరాశపరిచిన ప్యాకేజీ 2.0: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ 2.0 మార్కెట్ వర్గాలను నిరాశ పరిచింది. రూ.6 లక్షల కోట్ల మేర ఆమె ప్రకటించిన ఉద్దీపన చర్యలు సరిపోవని, ఆర్థిక వ్యవస్థ ఇప్పట్లో కోలుకునే అవకాశాల్లేవనే ఆందోళన ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఉద్దీపన చర్యలు సానుకూలంగానే ఉన్నాయని, కానీ వాటి ఆచరణే కీలకమని పలు బ్రోకరేజ్ సంస్థలు వ్యాఖ్యానించాయి. ప్రపంచ మార్కెట్ల పతనం: స్పానిష్ ఫ్లూ తదితర వైరస్‌ల్లాగా కరోనా వైరస్ కనుమరుగయ్యే అవకాశాల్లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. మరోవైపు అమెరికా ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు తీవ్ర అనిశ్చితిలో ఉందని అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమి పావెల్ వ్యాఖ్యానించారు. ఈ రెండు అంశాల కారణంగా ప్రపంచ మార్కెట్లు నష్టపోయాయి. ఆసియా మార్కెట్లు 1–2 శాతం, యూరప్ మార్కెట్లు 2–3 శాతం రేంజ్లో నష్టపోయాయి. లాక్డౌన్ 4.0: ఈ నెల 18 నుంచి కొత్త నిబంధనలతో నాలుగో దశ లాక్డౌన్ మొదలు కానున్నది. దీనికి సంబంధించిన విధి విధానాలు ఇప్పటివరకైతే వెల్లడి కాలేదు. ఇప్పటికే 50 రోజులకు మించిన లాక్‌డౌన్‌తో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థపై లాక్డౌన్ 4.0 మరింత ప్రతికూల ప్రభావం చూపగలదన్న ఆందోళన నెలకొన్నది. పెరుగుతున్న కరోనా కేసులు: దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా 2.0 కేసులు కూడా పెరుగుతుండటం తీవ్రమైన ప్రభావమే చూపుతోంది. -
కోటక్ బ్యాంక్ లాభం రూ. 1,905 కోట్లు
ముంబై: ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు గత ఆర్థిక సంవత్సరం(2019–20) మార్చి క్వార్టర్లో రూ.1,905 కోట్ల నికర లాభం వచ్చింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2018–19) ఇదే క్వార్టర్లో వచ్చిన నికర లాభం(రూ.2,038 కోట్లు)తో పోల్చితే 7 శాతం క్షీణించిందని కోటక్ మహీంద్రా బ్యాంక్ తెలిపింది. కేటాయింపులు బాగా పెరగడంతో నికర లాభం తగ్గిందని వివరించింది. మరిన్ని వివరాలు..... ► గత క్యూ4లో స్టాండ్అలోన్ నికర లాభం 10 శాతం తగ్గి రూ.1,267 కోట్లకు చేరింది. హా నికర వడ్డీ ఆదాయం రూ.3,036 కోట్ల నుంచి రూ. 3,560 కోట్లకు పెరిగింది. 4.72 శాతం నికర వడ్డీ మార్జిన్ సాధించింది. ► స్థూల మొండి బకాయిలు 2.14 శాతం నుంచి 2.25 శాతానికి పెరిగాయి. కేటాయింపులు రూ.171 కోట్ల నుంచి రూ. 1,047 కోట్లకు పెరిగాయి. కరోనా కేటాయింపులు కూడా దీంట్లో ఉన్నాయి. ► 2019–20 పూర్తి ఏడాదికి నికర లాభం 10% ఎగసి రూ.5,947 కోట్లకు పెరిగింది. రుణాలు 6%, డిపాజిట్లు 20% ఎగిశాయి. ► కరోనా వైరస్ కల్లోలం నేపథ్యంలో సెక్యూరిటీలేని క్రెడిట్ కార్డ్, వ్యక్తిగత రుణాల బకాయిలు పేరుకుపోతున్నాయని, ఇది తమ రుణ నాణ్యతపై తీవ్రంగానే ప్రభావం చూప నున్నదని బ్యాంక్ ఎండీ ఉదయ్ కోటక్ వ్యాఖ్యానించారు. ► ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్ 2.3 శాతం లాభంతో రూ. 1,186 వద్ద ముగిసింది.