ముంబై: ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు గత ఆర్థిక సంవత్సరం(2019–20) మార్చి క్వార్టర్‌లో రూ.1,905 కోట్ల నికర లాభం వచ్చింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2018–19) ఇదే క్వార్టర్‌లో వచ్చిన నికర లాభం(రూ.2,038 కోట్లు)తో పోల్చితే 7 శాతం క్షీణించిందని కోటక్ మహీంద్రా బ్యాంక్ తెలిపింది. కేటాయింపులు బాగా పెరగడంతో నికర లాభం తగ్గిందని వివరించింది. మరిన్ని వివరాలు.....
► గత క్యూ4లో స్టాండ్‌అలోన్ నికర లాభం 10 శాతం తగ్గి రూ.1,267 కోట్లకు చేరింది.
హా నికర వడ్డీ ఆదాయం రూ.3,036 కోట్ల నుంచి రూ. 3,560 కోట్లకు పెరిగింది. 4.72 శాతం నికర వడ్డీ మార్జిన్ సాధించింది.
► స్థూల మొండి బకాయిలు 2.14 శాతం నుంచి 2.25 శాతానికి పెరిగాయి. కేటాయింపులు రూ.171 కోట్ల నుంచి రూ. 1,047 కోట్లకు పెరిగాయి. కరోనా కేటాయింపులు కూడా దీంట్లో ఉన్నాయి.
► 2019–20 పూర్తి ఏడాదికి నికర లాభం 10% ఎగసి రూ.5,947 కోట్లకు పెరిగింది. రుణాలు 6%, డిపాజిట్లు 20% ఎగిశాయి.
► కరోనా వైరస్ కల్లోలం నేపథ్యంలో సెక్యూరిటీలేని క్రెడిట్ కార్డ్, వ్యక్తిగత రుణాల బకాయిలు పేరుకుపోతున్నాయని, ఇది తమ రుణ నాణ్యతపై తీవ్రంగానే ప్రభావం చూప నున్నదని బ్యాంక్ ఎండీ ఉదయ్ కోటక్ వ్యాఖ్యానించారు.
► ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్ 2.3 శాతం లాభంతో రూ. 1,186 వద్ద ముగిసింది.
కోటక్ బ్యాంక్ లాభం రూ. 1,905 కోట్లు
Published Thu, May 14 2020 4:04 AM | Last Updated on Thu, May 14 2020 4:04 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment