ముంబై: ఆద్యంతం ఒడిదుడుకుల నడుమ సాగిన ట్రేడింగ్‌లో అమ్మకాలే పైచేయి సాధించాయి. ఫలితంగా సూచీలు వరుసగా మూడో రోజూ నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 136 పాయింట్లను కోల్పోయి 39,614 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 28 పాయింట్లను నష్టపోయి 11,642 నిలిచింది. ఎన్నికలకు ముందు అమెరికాలో అనిశ్చితి, యూరప్‌లో కరోనా రెండోదశ విజృంభణలతో అంతర్జాతీయ మార్కెట్లలో బలహీనత కొనసాగింది. ఈ ప్రతికూలాంశం మన మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. అటో, ఆర్థిక, బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో అమ్మకాలు జరిగాయి. మెటల్, మీడియా, ఐటీ, ఫార్మా షేర్లలో రికవరీ జరిగింది. ఎఫ్‌ఐఐలు రూ.871 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. డీఐఐలు రూ.631 కోట్ల విలువైన ఈక్విటీలను కొన్నార
Comments
Please login to add a commentAdd a comment