BCCI Floats Media Rights Tender for IPL Seasons 2023 to 2027 - Sakshi
Sakshi News home page

IPL-BCCI: సుమారు రూ. 50 వేల కోట్లు! జూన్‌ 12 నుంచి ఈ- వేలం!

Mar 30 2022 7:51 AM | Updated on Mar 30 2022 4:19 PM

BCCI Floats Media Rights Tender For IPL Seasons 2023 To 2027 - Sakshi

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ(ఫైల్‌)

IPL Media Rights- ముంబై: ఐపీఎల్‌ మీడియా హక్కుల కోసం బీసీసీఐ టెండరు ప్రకటన జారీ చేసింది. 2023–2027 మధ్య ఐదేళ్ల కాలానికి బోర్డు హక్కులు అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను విశేషంగా అలరిస్తున్న ఐపీఎల్‌ స్థాయి, విలువ ఎన్నో రెట్లు పెరగడంతో హక్కుల కోసం భారీ స్థాయిలో పోటీ నెలకొంది. రెండు అదనపు జట్ల రాకతో మ్యాచ్‌ల సంఖ్య కూడా పెరిగింది.

దాంతో మీడియా హక్కుల ద్వారా బీసీసీఐ సుమారు రూ. 50 వేల కోట్లను ఆశిస్తోంది. జీ–సోనీ, రిలయన్స్‌ సంస్థలు ఎంత మొత్తం చెల్లించైనా హక్కులు సొంతం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దరఖాస్తులు స్వీకరించిన తర్వాత జూన్‌ 12 నుంచి బీసీసీఐ ఈ–వేలం ప్రక్రియ నిర్వహించి ఎవరికి హక్కులు దక్కాయో ప్రకటిస్తుంది. 

చదవండి: Nicholas Pooran: కోట్లు పెట్టి కొన్నాం.. డకౌట్‌ అయితే ఎలా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement