
న్యూఢిల్లీ: జీ ఎంటర్‌టైన్‌మెంట్ (జీల్), కల్వర్ మ్యాక్స్ (గతంలో సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా) విలీన అంశం తుది దశకు చేరుకుందని జీల్ ఎండీ పునీత్ గోయెంకా తెలిపారు. ప్రమోటర్లమైన తమకు, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి మధ్య నెలకొన్న వివాదం ఈ డీల్‌కు అడ్డంకి కాబోదని ఉద్యోగులకు రాసిన లేఖలో ఆయన వివరించారు.
ఈ విలీన ఒప్పందానికి షేర్‌హోల్డర్లతో పాటు కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ), స్టాక్ ఎక్సే్చంజీలు.. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ కూడా ఇప్పటికే ఆమోదముద్ర వేసినట్లు పేర్కొన్నారు. ప్రమోటరు కుటుంబ స్థాయిలో తాము ఎదుర్కొంటున్న సమస్యలు తమకు మాత్రమే పరిమితమని, కంపెనీకి ఇబ్బంది కలిగించబోవని గోయెంకా వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment