Goenka
-
శాట్‌లో పునీత్ గోయెంకాకు చుక్కెదురు
న్యూఢిల్లీ: జీ గ్రూప్ సంస్థల్లో కీలక హోదాలు చేపట్టరాదన్న సెబీ ఆదేశాల విషయంలో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీల్) మాజీ చీఫ్ పునీత్ గోయెంకాకు సెక్యూరిటీస్ అపీలేట్ ట్రిబ్యునల్ (శాట్)లో చుక్కెదురైంది. సెబీ ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు శాట్ నిరాకరించింది. ఈ అంశంపై తన సమాధానాన్ని సెప్టెంబర్ 4లోగా తెలియజేయాలంటూ సెబీకి సూచించింది. తుది విచారణను సెప్టెంబర్ 8కి వాయిదా వేసింది. కంపెనీ నిధులను సొంత ప్రయోజనాల కోసం దారి మళ్లించారంటూ జీల్ మాజీ చైర్మన్ సుభాష్ చంద్ర, ఆయన కుమారుడు గోయెంకాలపై అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు, వారు జీ గ్రూప్‌లోని నాలుగు సంస్థలకు, అలాగే జీల్–సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా విలీనంతో ఏర్పడే సంస్థలోనూ డైరెక్టర్లుగా గానీ కీలక నిర్వహణ హోదాల్లో (కేఎంపీ) గానీ ఉండరాదంటూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఇటీవల ఆదేశాలు ఇచ్చింది. వీటిని సవాల్ చేస్తూ పునీత్ గోయెంకా .. శాట్‌ను ఆశ్రయించారు. -
తుది దశలో సోనీ–జీ విలీనం
న్యూఢిల్లీ: జీ ఎంటర్టైన్మెంట్ (జీల్), కల్వర్ మ్యాక్స్ (గతంలో సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా) విలీన అంశం తుది దశకు చేరుకుందని జీల్ ఎండీ పునీత్ గోయెంకా తెలిపారు. ప్రమోటర్లమైన తమకు, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి మధ్య నెలకొన్న వివాదం ఈ డీల్‌కు అడ్డంకి కాబోదని ఉద్యోగులకు రాసిన లేఖలో ఆయన వివరించారు. ఈ విలీన ఒప్పందానికి షేర్హోల్డర్లతో పాటు కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ), స్టాక్ ఎక్సే్చంజీలు.. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ కూడా ఇప్పటికే ఆమోదముద్ర వేసినట్లు పేర్కొన్నారు. ప్రమోటరు కుటుంబ స్థాయిలో తాము ఎదుర్కొంటున్న సమస్యలు తమకు మాత్రమే పరిమితమని, కంపెనీకి ఇబ్బంది కలిగించబోవని గోయెంకా వివరించారు. -
జీరో నుంచి మొదలుపెట్టి.. సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా దీపాలీ..
‘జీరో’ నుంచి ప్రయాణం ప్రారంభించి ఒక్కో పాఠం నేర్చుకుంటూ తమ కంపెనీ ‘వెల్స్పన్’ను ప్రపంచంలోని అతి పెద్ద టెక్ట్స్‌టెల్ కంపెనీల పక్కన నిలబెట్టింది దీపాలీ గోయెంకా... రాజస్థాన్‌లోని జైపుర్‌కు చెందిన దీపాలీకి పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే వివాహం జరిగింది. ఇంటికే పరిమితం కాకుండా, ఏదైనా చేయాలనిపించేది. ముప్ఫైసంవత్సరాల వయసులో భర్త చేసే టెక్ట్స్‌టైల్ వ్యాపారంలోకి అడుగు పెట్టింది.‘నా భార్యగా ఇక్కడ నీకు ప్రత్యేక గుర్తింపు, గౌరవం అంటూ ఏవీ ఉండవు’ అని చెప్పాడు ఆమె భర్త ‘వెల్స్పన్’ చైర్మన్ బీకే గోయెంకా. (సోషల్ మీడియా స్టార్, అన్‌స్టాపబుల్ టైకూన్ దిపాలీ: రతన్‌టాటా కంటే ఖరీదైన ఇల్లు) తొలిరోజుల్లో ‘బాస్ భార్య’గానే గుర్తింపు పొందిన దీపాలీ ఆ తరువాత కాలంలో తనదైన గుర్తింపు తెచ్చుకుంది. నిరుపమానమైన నాయకత్వానికి ప్రతీకగా ప్రత్యేక ప్రశంసలు అందుకుంది. సైకాలజీ చదువుకున్న దీపాలీకి వ్యాపార వ్యవహారాలలో ఎలాంటి అనుభవం లేదు. ఏమీ తెలియని శూన్యం నుంచి అన్ని తెలుసుకోవాలనే తపన వరకు ఆమె ప్రయాణం కొనసాగింది. నష్టాలు ఎక్కడా జరుగుతున్నాయి? వాటిని నివారించడం ఎలా? ఇలా ఎన్నో విషయాలను త్వరగా తెలుసుకుంది. ఆఫీసుకు వెళ్లామా, వచ్చామా...అనే తీరులో కాకుండా ప్రతి అంశంపై స్పష్టమైన అవగాహన పెంచుకుంది. ఒకానొక కాలంలో విదేశీ ఒప్పందాలు రద్దు అయిపోయి కంపెనీ సంక్షోభపుటంచుల్లోకి వెళ్లింది. ఇలాంటి పరిస్థితులలో దీపాలీ ట్రబుల్ షూటర్‌గా మారి కంపెనీని మళ్లీ విజయపథంలోకి తీసుకువచ్చింది. (వరల్డ్‌లోనే రిచెస్ట్ బిచ్చగాడు ఎవరో తెలుసా? ఎన్ని కోట్ల ఆస్థి తెలిస్తే..?) ఇంతలోనే కోవిడ్ రూపంలో మరో సంక్షోభం ఎదురైంది. దాన్ని కూడా తన నాయకత్వ లక్షణాలతో విజయవంతంగా అధిగమించింది.‘ఏ సంక్షోభాన్నీ వృథాగా పోనివ్వకూడదు. దానినుంచి నేర్చుకునే విలువైన పాఠాలు ఎన్నో ఉంటాయి. మనల్ని మనం పునఃపరిశీలన చేసుకోవడానికి, మెరుగు పెట్టుకోవడానికి సంక్షోభాలు ఉపయోగపడతాయి’ అంటుంది దీపాలీ. ప్రస్తుతం కంపెనీకి సంబంధించిన ఉత్పత్తుల్లో 94 శాతం బయటి దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్‌తో పాటు ఇండియన్ మార్కెట్‌పై కూడా దీపాలీ దృష్టి సారించింది. ‘వ్యాపారవేత్త నిలువ నీరులా ఒకచోట ఉండిపోకూడదు. ప్రవాహమైపోవాలి. ప్రతి అడుగులో కొత్త విషయాలు తెలుసుకోవాలి. కొత్తగా ఆలోచించడం అనేది వ్యాపారానికి ప్రాణవాయువులాంటిది’ అనేది తాను నమ్మిన సిద్ధాంతం. ఇప్పుడు కంపెనీ చేతిలో సరికొత్త ఆవిష్కరణలకు సంబంధించి 35 పేటెంట్స్ ఉన్నాయి.‘అందరికీ అన్నీ తెలియాలి అని ఏమీ లేదు. తెలుసుకోవడానికి మన దగ్గర ఉన్న శక్తి... ప్రశ్న. ఒక్క ప్రశ్నతో ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. మన అజ్ఞానం బయటపడుతుందేమో అని సంశయిస్తే అక్కడే ఉండిపోతాం. నాకు ఈ విషయం గురించి పెద్దగా తెలియదు. దయచేసి చెబుతారా? అని అడిగేదాన్ని. మనం తెలివి ఉన్న వ్యక్తి అయినంత మాత్రాన సరిపోదు. ఆ తెలివితో కంపెనీ ఎంత ముందుకు వెళ్లిందనేది ముఖ్యం. నేర్చుకోవడం అనే ప్రక్రియకు కాలపరిధి లేదు. అది నిత్యం జరుగుతూనే ఉండాలి’ అంటుంది దీపాలీ. ఈఎస్జీ–ఎన్విరాన్మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్ తమ వ్యాపారానికి కీలకం అనేది దీపాలీ చెప్పేమాట. కంపెనీ ప్రాడక్ట్స్‌కు సంబంధించి తయారీ ప్రక్రియలో రీసైకిల్ వాటర్‌ను ఉపయోగించడం కూడా ఇందులో భాగమే. మరోవైపు రైతులతో కలిసి పర్యావరణానికి సంబంధించిన విషయాలపై పనిచేస్తోంది.దీపాలీ ‘వెల్స్పన్’లోకి అడుగు పెట్టినప్పుడు కేవలం ఏడు శాతం మంది మహిళలే ఉండేవారు. ఇప్పుడు వారి ప్రాతినిధ్యం ముప్ఫై శాతానికి పెరిగింది.ఈతరం వ్యాపారవేత్తలకు దీపాలీ ఇచ్చే సలహా ఇది...‘వ్యాపారికి తన వ్యాపారం మాత్రమే ప్రపంచం కాకూడదు. తన మానసిక ఆరోగ్యం, తినే తిండి, వ్యాయామాలపై కూడా దృష్టి పెట్టాలి. మనం మానసికంగా చురుగ్గా ఉంటేనే ఉత్తమమైన ఆలోచనలు వస్తాయి’సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా నిరూపించుకున్న దీపాలీ గోయెంకాలో మరో కోణం దాతృత్వం. -
స్టార్ క్రికెటర్ కోహ్లీ పార్టనర్, ఈ బిలియనీర్ గురించి తెలుసా? నెట్‌వర్త్ ఎంతంటే?
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆటగాడిగానే కాదు దేశవ్యాప్తంగా అనేక వ్యాపారాలు, స్టార్టప్స్‌లో పెట్టుబడుల ద్వారా రాణిస్తున్నాడు. కోహ్లి ముఖ్యమైన వ్యాపార భాగస్వాములలో ఒకరు. బిలియనీర్ గురించి తెలుసా మీకు. ప్రత్యర్థి ఐపీఎల్ టీం ఓనరుతో కోహ్లి మధ్య వ్యాపార సంబంధాలు ఏంటో ఒకసారి చూద్దాం! ఆయన ఎవరోకాదు రూ. 7,090 కోట్ల ఐపీఎల్ టీం ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్ గొయెంకా దేశీయ దిగ్గజం కంపెనీ మల్టీ బిలియన్డాలర్ల విలువైన ఆర్పీ గోయెంకా గ్రూప్ చైర్మన్ కూడా. ఈ కంపెనీ పవర్, ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ మీడియా, ఎంటర్టైన్మెంట్, విద్య వంటి అనేక పరిశ్రమలలో విస్తరించి ఉంది. ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ప్రత్యర్థి జట్టు ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్ గోయంకాతో అనేక వ్యాపారాల్లో జతకట్టడంతో పాటు ఇతర భాగస్వామ్యాలు కూడా ఉన్నాయి. (నెలకు లక్షన్నర జీతం: యాపిల్ ఫోనూ వద్దు, కారూ వద్దు, ఎందుకు? వైరల్ ట్వీట్) 2017నుంచి కోహ్లీ ఫౌండేషన్, ఆర్పీసంజీవ్ ఇండియన్ స్పోర్ట్స్ ఆనర్స్ అవార్డ్స్ కోసంవిరాట్,సంజీవ్ జత కట్టారు. అలాగే పలు వ్యాపార వెంచర్లలో కీలక భాగస్వాములుగా ఉన్నారు. అంతేకాదు కోహ్లీ, గోయంకా ద్వయం సెలబ్రిటీ గోల్ఫ్ టోర్నమెంట్ కూడా నిర్వహించడం విశేషం దీంతో దాదాపు రూ. 50వేల కోట్ల ఆస్తి, రూ. 35,451 కోట్ల స్థిరమైన ఆదాయంతో ఆలరారుతున్న సంజీవ్ గోయెంకా ఆర్పీఎస్జీ గ్రూప్ నేతృత్వంలోని ప్రముఖ స్నాకింగ్ బ్రాండ్ ‘టూ యమ్’కి బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా విరాట్ కోహ్లీ ఉండటం గమనార్హం. (ఒకప్పుడు రెస్టారెంట్లో పని:.. ఇప్పుడు లక్షల కోట్ల టెక్ కంపెనీ సీఈవో) దీంతో పాటు ఐఎస్ఎల్ ఫుట్‌బాల్ జట్టు , ఏటీకే మోహన్ బగాన్ ఫుడ్ బాల్ క్లబ్ ఓనరు కూడా .2023 నాటికి, ఆర్పీఎస్జీ గ్రూప్ గ్రూప్ ఆదాయం 4.3 బిలియన్ల డాలర్లకు పైమాటే. అంటూ దాదాపు రూ. 35,451 కోట్లకు పైనే. ఫోర్బ్స్ ప్రకారం, సంజీవ్ గోయెంకా వ్యక్తిగత నికర విలువ రూ. 17,300 కోట్లు. ఫోర్బ్స్ 2022 నివేదిక ప్రకారం భారతదేశంలో 83వ అత్యంత సంపన్నుడు, మొత్తం ప్రపంచంలో 1238వ స్థానంలో ఉన్నారు. సంజీవ్ గోయెంకా ఎక్కడ పుట్టారు 1961, జనవరి 29న పశ్చిమ బెంగాల్, కోల్‌కతాలో వ్యాపారవేత్త రామ ప్రసాద్ గోయెంకా, సుశీలా దేవి దంపతులకు జన్మించారు. -
సోషల్ మీడియా స్టార్, అన్‌స్టాపబుల్ టైకూన్ దిపాలీ: రతన్‌టాటా కంటే ఖరీదైన ఇల్లు
వెల్స్పన్ ఇండియా సీఈవో సోషల్ మీడియా స్టార్ దిపాలి గోయెంకా ఎన్డీటీవీ స్వత్రంత్ర డైరెక్టర్‌గా నియమితులయ్యారు. సెబీ మాజీ ఛైర్మన్ యూకే సిన్హాతో పాటు మార్చి 27, 2023 నుండి రెండు సంవత్సరాల పాటు ఆ పదవిలో కొనసాగుతారు. నాన్-ఎగ్జిక్యూటివ్, స్వతంత్ర మహిళా డైరెక్టర్‌గా దిపాలి ఎంపిక కావడం విశేషంగా నిలిచింది. దీంతో ఫోర్బ్స్ ఆసియా అండ్ ఇండియాలో అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఒకరిగా గుర్తింపు పొందిన దిపాలి గోయెంకా ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. ఎవరీ దిపాలి గోయెంకా ? ప్రపంచంలోని అతిపెద్ద గృహ వస్త్ర కంపెనీలలో ఒకటైన వెల్స్పన్ ఇండియా లిమిటెడ్ సీఎండీ టెక్స్టైల్ మాగ్నెట్ దిపాలి గోయెంకా సైకాలజీలో గ్రాడ్యుయేట్, హార్వర్డ్ పూర్వ విద్యార్థి. దిపాలి గోయెంకా భర్త బీకే గోయెంకా వెల్స్పన్ గ్రూప్ చైర్మన్. 18 సంవత్సరాల వయస్సులో బీకే గోయెంకాను వివాహం చేసుకున్నారు దిపాలి. బీకే గోయెంకా ఇటీవల ముంబైలో రూ.240 కోట్లతో ఒక లగ్జరీ ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. రతన్ టాటా ఇంటి విలువ రూ.150 కోట్లు కావడంతో ఆ ఇంటి విలువ రతన్ టాటా ఇంటి కంటే ఖరీదైన ఇల్లుగా నిలిచింది. రూ.19 వేల కోట్ల కంపెనీకి సీఎండీగా రూ. 19000 కోట్ల కంపెనీకి సారధి, అన్‌స్టాపబుల్ టైకూన్ దిపాలి గోయెంకా సోషల్ మీడియా స్టార్ కూడా. ఆమె ట్విటర్, ఇన్‌స్టాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 191కే ఫాలోవర్లు ఉన్నారంటే ఆమె స్టార్ రేంజ్‌ను అర్థం చేసుకోవచ్చు. వెల్స్పన్ గ్రూప్‌లో 25వేల ఉద్యోగులతో 2.3 బిలియన్ల డాలర్ల ఆదాయంతో టాప్ టెక్స్టైల్ కంపెనీగా దూసుకుపోతోంది. ఇన్నోవేషన్, బ్రాండ్స్ అండ్ సస్టైనబిలిటీపై దృష్టి సారించి వెల్స్పన్ హోమ్ టెక్స్టైల్ వ్యాపారాన్ని బిలియన్ డాలర్లతో ప్రపంచస్థాయికి చేర్చడంలో ఆమెది కీలక పాత్ర. అసోచామ్ ఉమెన్స్ కౌన్సిల్ చైర్‌పర్సన్‌గా పనిచేసిన దిపాలీ ప్రస్తుతం వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో ఉన్నారు. చిన్నతనంలోనే పెళ్లి సాంప్రదాయ మార్వాడీ నేపథ్యం నుండి వచ్చిన తనకు సాధారణంగానే చిన్న వయస్సులో పెళ్లి అయిందని, అయినా మరింత నేర్చుకోవాలనే పట్టుదలతో దేన్నీ ఆపలేదని చెప్పారు. తన కుమార్తెలకు 10, 7 ఏళ్లు నిండిన తర్వాత తిరిగి కరియర్ మీద దృష్టిపెట్టినట్టు స్వయంగా దిపాలి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. డిజైన్ స్టూడియోతో ప్రారంభించి, 2003లో, దిపాలి గోయెంకా స్పేసెస్, ప్రీమియం బెడ్ అండ్ బాత్ బ్రాండ్‌ను ప్రారంభించారు. తనకెదురైన ప్రతీ చాలెంజ్‌ను ఒక అవకాశంగా తీసుకొని ఎదిగారు. సీఈవో విత్ సోల్ 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణంగా ఆమె వస్త్ర వ్యాపారంలోకి అడుగుపెట్టారు. 2016, ఆగస్టు ఒక పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంది. కంపెనీ సరఫరా చేసిన ప్రీమియం ఈజిప్షియన్ కాటన్ షీట్లు చౌకగా ఉన్నాయనే ఆరోపణలతో అమెరికన్ రిటైలర్ టార్గెట్ వెల్స్పన్ ఇండియాతో అన్ని డీల్స్‌ను ముగించింది. అపుడు వ్యాపారాన్ని తిరిగి గాడిలో పెట్టేలా సాహసంగా ముందుకు సాగారు. ప్రస్తుతం వెల్స్పన్ ఇండియా అమెరికాకు బెడ్ అండ్ బాత్, రగ్గు ఉత్పత్తుల అతిపెద్ద సరఫరాదారు. కస్టమర్-ఫస్ట్ అప్రోచ్ సూత్రాన్ని ఫాలో అయ్యే దిపాలి కూడా దాతృత్వంలో కూడా ముందే ఉన్నారు. అందుకే తన ప్రొఫైల్ బయోలో సీఈవో విత్ సోల్ రాసుకున్నారామె. -
రేసులో అదానీ, గోయెంకా
దుబాయ్: మళ్లీ పది జట్ల ఐపీఎల్‌కు నేడు అడుగు పడనుంది. రూ.వేల కోట్ల అంచనాలతో దాఖలైన టెండర్లను నేడు తెరువనున్నారు. సుమారు 22 కంపెనీలు రూ. 10 లక్షలు వెచ్చించి మరీ టెండర్ దరఖాస్తులు దాఖలు చేసినప్పటికీ పోటీలో ప్రధానంగా ఐదారు కంపెనీలే ఉన్నట్లు తెలిసింది. ఇందులోనూ ఎలాగైనా దక్కించుకోవాలనే సంస్థలు మూడే! దేశీయ దిగ్గజ కార్పొరేట్ సంస్థలైన అదానీ గ్రూప్, గోయెంకా, అరబిందో సంస్థలు ఐపీఎల్లో తమ ‘జెర్సీ’లను చూడాలనుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ అదాయంపై గంపెడాశలు పెట్టుకుంది. ఒక్కో ఫ్రాంచైజీ ద్వారా రూ. 7,000 కోట్ల నుంచి రూ. 10 వేల కోట్లు ఆశిస్తోంది. అందుకే కనీస బిడ్ ధర రూ. 2,000 కోట్లు పెట్టింది. అయినాసరే 22 కంపెనీలు టెండర్ల ప్రక్రియపై ఆసక్తి చూపాయంటే ఐపీఎల్ బ్రాండ్విలువ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పైగా బ్రాడ్‌కాస్టింగ్ హక్కుల మార్కెట్ ఏకంగా రూ.36 వేల కోట్లకు చేరింది. లీగ్‌కు సమకూరే ఈ ఆదాయాన్ని ఫ్రాంచైజీలకు పంపిణీ చేస్తారు. ఈ రకంగా చూసినా బోర్డు ఆశించినట్లు ఒక్కో జట్టుకు రూ. 7,000 కోట్లు కాకపోయినా రెండు కలిపి (రూ. 3,500 కోట్లు చొప్పున) ఆ మొత్తం గ్యారంటీగా వచ్చే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయి. రేసులో అరబిందో గ్రూప్ ఉన్నప్పటికీ అదానీ, గోయెంకా కంపెనీలు ఫ్రాంచైజీలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. అహ్మదాబాద్ లక్ష్యంగా అదానీ ఐపీఎల్లో ఇప్పుడు ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, రాజస్తాన్, పంజాబ్ ఫ్రాంచైజీలున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో చేరే ఇంకో రెండు నగరాలేవో నేడు తేల్చేస్తారు. బరిలో అహ్మదాబాద్, లక్నో, ఇండోర్, గువాహటి, పుణే, ధర్మశాల, కటక్ ఉన్నప్పటికీ ప్రధానంగా అహ్మదాబాద్, లక్నోలే ఖరారు అవుతాయని ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. అయితే అహ్మదాబాద్, లక్నోలే ఫేవరెట్ నగరాలు. ముఖ్యంగా గుజరాత్‌కు చెందిన అదానీ గ్రూప్ అహ్మదాబాద్ లక్ష్యంగా టెండరు దాఖలు చేసింది. ఇప్పటికే ఐపీఎల్ ఫ్రాంచైజీ అనుభవమున్న ఆర్పీఎస్జీ (రాజీవ్ ప్రతాప్ సంజీవ్ గోయెంకా) గ్రూపు లక్నోను చేజిక్కించుకునే అవకాశముంది. ఐపీఎల్లో చెన్నై, రాజస్తాన్‌లు రెండేళ్ల నిషేధానికి గురైనపుడు పుణే (రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్)తో ఐపీఎల్‌లోకి ప్రవేశించింది. -
జీ మీడియా, ఇన్వెస్కో వివాదంపై క్లారిటీ ఇచ్చిన రిలయన్స్!
జీ ఎంటర్ ప్రైజెస్, ఇన్వెస్కో మధ్య వివాదంలో రిలయన్స్ పేరు రావడంపై చింతిస్తున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని రిలయన్స్ స్పష్టం చేసింది. జీ మీడియా సంస్థల్ని కొనుగోలు చేసేందుకు రిలయన్స్ నుంచి వచ్చిన ఆఫర్ చాలా తక్కువ వ్యాల్యుయేషన్‌తో ఉందని జీ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పునీత్ గోయెంకా షేర్ హోల్డర్లకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో రిలయన్స్ పేరు రావడంతో రిలయన్స్ స్పష్టతనిచ్చింది. 2021 ఫిబ్రవరి, మార్చిలో పునీత్ గోయెంకాతో తమ ప్రతినిధులు నేరుగా చర్చల్ని జరిపేందుకు ఇన్వెస్కో సహకరించిందని రిలయన్స్ తెలిపింది. తక్కువ ధరకే జీతో మా మీడియా ఆస్తులను విలీనం చేయడానికి మేము విస్తృత ప్రతిపాదన చేసాము. జీ సంస్థలతో పాటు తమ సంస్థల్ని వ్యాల్యుయేషన్ చేసేందుకు ఒకే తరహా ప్యారామీటర్స్ ఫాలో అయ్యామని రిలయన్స్ తెలిపింది. ఈ ప్రతిపాదనను అన్ని విలీన సంస్థలు ఉపయోగించుకోవడానికి ప్రయత్నించింది. జీ వాటాదారులతో సహా అందరికీ గణనీయమైన విలువను సృష్టించడానికి ప్రయత్నించామని రిలయన్స్ తెలిపింది. ప్రస్తుత మేనేజ్‌మెంట్‌తోనే నిర్వహణను కొనసాగించడానికి రిలయన్స్ ఎప్పుడూ ప్రయత్నిస్తుందని, వారి పనితీరును బట్టి ప్రతిఫలం అందిస్తుందని తెలిపింది.(చదవండి: మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. ధరెంతో తెలుసా?) ఈ ప్రతిపాదనలో గోయెంకాను మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగించాలన్న అంశం కూడా ఉందని, గోయెంకాతో పాటు టాప్ మేనేజ్మెంట్కు ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్ (ESOPs) ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా ఉందని రిలయన్స్ తెలిపింది. అయితే ప్రిఫరెన్షియల్ వారెంట్స్ ద్వారా వాటాలు పెంచుకోవాలని వ్యవస్థాపక కుటుంబం భావించడంతో గోయెంకాకు, ఇన్వెస్కోకు మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయని రిలయన్స్ వివరించింది. అయితే మార్కెట్ కొనుగోళ్ల ద్వారా తమ పెట్టుబడులు పెంచుకోవచ్చని ఇన్వెస్టర్లు అభిప్రాయపడ్డారు. ఇన్వెస్కో, జీ వ్యవస్థాపకుల మధ్య అభిప్రాయభేదాలు రావడంతో ఈ డీల్‌పై చర్చలు ముందుగు సాగలేదని రిలయన్స్ స్పష్టం చేసింది. -
కోల్ కతా ముఖ్య అతిథిగా పీలే
కోల్ కతా: వచ్చే నెలలో ఆరంభకానున్న ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) టోర్నీలో భాగంగా డిఫెండింగ్ చాంపియన్ అట్లాటికో డి కోల్‌కతా (ఏటీకే) జట్టుకు బ్రెజిల్ సాకర్ దిగ్గజం పీలే ముఖ్య అతిథిగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు కోల్ కతా జట్టు సహ యజమాని సంజీవ్ గోయింకా శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ' కోల్ కతా జట్టుకు ముఖ్య అతిథిగా పీలే వ్యవహరించనున్నారు. కేవలం కోల్ కతా మ్యాచ్ లకు దిశా నిర్దేశం చేయడానికే పీలే భారత్ కు రావడం లేదు. కోల్ కతా జట్టుతో పాటు ఉంటూ టోర్నీని వీక్షించేందుకు పీలే ఇక్కడకు వస్తున్నారు. ఈ విషయాన్ని ఓ వీడియో ద్వారా ఆయన వెల్లడించారు. అక్టోబర్ 13 వ తేదీన కోల్ కతా జట్టు ఆడే తొలి మ్యాచ్ కే పీలే మాతో కలవబోతుండటం చాలా ఆనందంగా ఉంది. ఆయనకు సాల్ట్ లేక్ స్టేడియంలో ఘన స్వాగతం పలుకుతాం' అని సంజీవ్ తెలిపారు. దీంతో పాటు ఆయన విద్యావేత్తలు, విద్యార్థులతో సమావేశం కూడా కానున్నట్లు పేర్కొన్నారు.