కోల్ కతా ముఖ్య అతిథిగా పీలే | Pele to be present for entire ATK match, Goenka | Sakshi
Sakshi News home page

కోల్ కతా ముఖ్య అతిథిగా పీలే

Published Fri, Sep 25 2015 7:27 PM | Last Updated on Sun, Sep 3 2017 9:58 AM

కోల్ కతా ముఖ్య అతిథిగా పీలే

కోల్ కతా ముఖ్య అతిథిగా పీలే

కోల్ కతా: వచ్చే నెలలో ఆరంభకానున్న ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) టోర్నీలో భాగంగా డిఫెండింగ్ చాంపియన్ అట్లాటికో డి కోల్‌కతా (ఏటీకే) జట్టుకు బ్రెజిల్ సాకర్ దిగ్గజం పీలే ముఖ్య అతిథిగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు కోల్ కతా జట్టు సహ యజమాని సంజీవ్ గోయింకా శుక్రవారం మీడియాకు వెల్లడించారు.

 

' కోల్ కతా జట్టుకు ముఖ్య అతిథిగా పీలే వ్యవహరించనున్నారు. కేవలం కోల్ కతా మ్యాచ్ లకు దిశా నిర్దేశం చేయడానికే  పీలే భారత్ కు రావడం లేదు.  కోల్ కతా జట్టుతో పాటు ఉంటూ  టోర్నీని వీక్షించేందుకు పీలే ఇక్కడకు వస్తున్నారు.  ఈ విషయాన్ని ఓ వీడియో ద్వారా ఆయన వెల్లడించారు. అక్టోబర్ 13 వ తేదీన కోల్ కతా జట్టు ఆడే తొలి మ్యాచ్ కే  పీలే మాతో కలవబోతుండటం చాలా ఆనందంగా ఉంది.  ఆయనకు సాల్ట్ లేక్ స్టేడియంలో ఘన స్వాగతం పలుకుతాం' అని సంజీవ్ తెలిపారు. దీంతో పాటు ఆయన విద్యావేత్తలు,  విద్యార్థులతో సమావేశం కూడా కానున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement