
ముంబై: సినిమా ప్రేమికులకు జీ ఎంటర్టేన్‌మెంట్ లిమిటెడ్ శుభవార్త తెలిపింది. త్వరలో ‘సినిమా టు హోమ్’, జీప్లెక్స్ సేవలను వినియోగదారులకు అందించనుంది. కాగా తమ సినిమా టు హోమ్ సేవల ద్వారా వినియోగదారులు, సినీ నిర్మాతలకు ఎంతో మేలు కలుగుతుందని జీ ఎంటర్టేన్‌మెంట్ తెలిపింది. అయితే ఎంటర్టేన్‌మెంట్ ప్టాట్‌ఫార్మ్‌లో తమ సేవలు నూతన ఒరవడి సృష్టిస్తాయని పేర్కొంది. ఈ విషయమై జీ స్టూడియో సీఈఓ షారీక్ పటేల్ స్పందిస్తు.. నూతన సాంకేతికతో జీప్లెక్స్ సేవలను ప్రారంభించనున్నామని, వినియోగదారులకు తక్కువ ధరకే నాణ్యమైన సేవలను అందిస్తామని తెలిపారు.
కాగా తాము ప్రారంభించబోయే జీప్లెక్స్ సేవల పట్ల నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. మరోవైపు జీప్లెక్స్ సేవల ద్వారా వివిధ భాషలలో బ్లాక్ బ్లస్టర్ సినిమాలను అందించనున్నట్లు జీ సంస్థ రెవెన్యూ అధికారి అతుల్ దాస్ పేర్కొన్నారు. అయిత నాణ్యతలో నూతన ట్రెండ్ సృష్టిస్తామని జీ సంస్థ తెలిపింది. అత్యుత్తమ నాణ్యత అందించేందుకు అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని సంస్థ తెలిపింది. జీ 5 చానెల్‌లోను సీనిమా టు హోమ్ సేవలు అందుబాటులో ఉంటాయని, దేశంలో జీప్లెక్స్ సేవలు అక్టోబర్ 2న ప్రారంభించనున్నట్లు సంస్థ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment