మధ్యతరగతి ఎంటర్‌టైన్‌మెంట్ వేదికగా పీపుల్స్ ప్లాజా
వీకెండ్స్‌లో సాగర తీరానికి క్యూ కడుతున్న జనం
ఖైరతాబాద్ : వీకెండ్ వస్తే చాలు నగరవాసులు నెక్లెస్ రోడ్డుకు క్యూ కడతారు. సాయం సంధ్య వేళ కుటుంబ సమేతంగా అక్కడికి విచ్చేసిన వారంతా ఆహ్లాదంగా గడుపుతారు. దీంతోపాటు అక్కడే ఉన్న పీపుల్స్ ప్లాజాలో అన్ని సీజన్లలో వివిధ రకాల ఎగ్జిబిషన్లు, సాంస్కృతిక కార్యక్రమాలకు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఈ వేదికే మధ్యతరగతి ప్రజలకు ఎంటర్‌టైన్‌మెంట్‌కు కేరాఫ్‌గా మారింది పీపుల్స్ ప్లాజా. ఇటీవల ఇక్కడ ఏర్పాటుచేసిన వింటర్ ఉత్సవ్ మేళా అన్ని వర్గాల ప్రజలనూ ఆకట్టుకుంటోంది. కుటుంబ సమేతంగా ఇక్కడికి విచ్చేసిన వారు రెండు గంటల పాటు ఉత్సాహంగా గడపుతారు.
ఎంటర్‌టైన్‌మెంట్ కేంద్రంగా..
ఈ ఎగ్జిబిషన్‌లో ఎమ్యూజ్మెంట్ రైడ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన గేమింగ్ జోన్, అన్ని రకాల ఉత్పత్తులనూ ఒకే వేదికగా వివిధ రకాల స్టాల్స్ అందుబాటులో ఉండటాయి. దీంతో వారాంతాల్లో ఇక్కడికి విచ్చేసేవారు షాపింగ్ మొదలుకుని ఎంటర్‌టైన్‌మెంట్ వంటి వివిధ రకాల అంశాల్లో ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం.. అబ్బురపరిచే సెల్ఫీ జోన్‌లలో ఫొటోలు దిగుతూ కాలక్షేపం చేస్తుంటారు. దీంతో వీకెండ్ అయితే చాలు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు భారీగా ఇక్కడికి క్యూ కడుతున్నారు. నూతన సంవత్సర వేడుకలను సైతం నగర వాసులు నెక్లెస్ రోడ్డు పొడవునా తిరుగుతూ ఎంజాయి చేస్తూ జరుపుకోవడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment