సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజర్ ఆధ్వర్యంలో ఈ నెల 24 నుంచి 28 వరకు నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో 11వ గ్రాండ్ నర్సరీ మేళాను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఖాలిద్ అహ్మద్ జమీర్ తెలిపారు. మినిస్టర్ రోడ్‌లోని భరణి కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో న్యాయవాది శ్రీనివాసరావు, నిర్వాహకులు జావిద్ అహ్మద్‌లతో కలిసి వివరాలు వెల్లడించారు.
24న ఉదయం 9 గంటలకు మంత్రి హరీష్‌రావు ఈ మేళాను ప్రారంభిస్తారని చెప్పారు. ఈ మేళాలో అగ్రికల్చర్, హార్టికల్చర్‌కు సంబంధించిన మొక్కలు, రకరకాల పాట్స్, సీడ్స్, ఆర్గానిక్, ఇనార్గానిక్‌కు సంబంధించినవి లభిస్తాయని చెప్పారు. (క్లిక్: హైదరాబాదీలకు శుభవార్త.. బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు)
వివిధ రకాల గార్డెనింగ్‌కు చెందిన పద్ధతులైన వెర్టికల్ గార్డెనింగ్, హైడ్రోఫోనిక్, కిచన్ గార్డెనింగ్‌కు చెందిన రకరకాల మొక్కలతో పాటు అగ్రికల్చర్, హార్టికల్చర్‌లో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించినవి ఇక్కడ లభిస్తాయని చెప్పారు. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి రాత్రి 9గంటల వరకు ప్రవేశం ఉంటుందన్నారు. ప్రవేశ రుసుము రూ.20 మాత్రమేనని చెప్పారు. ఈ సందర్భంగా నర్సరీ మేళా బ్రోచర్‌ను ఆవిష్కరించారు. (క్లిక్: జీ+2 పర్మిషన్ తీసుకుని.. అయిదారు అంతస్తులు వేసారా?)
Comments
Please login to add a commentAdd a comment