Nursery Mela
-
హైదరాబాద్ : పీపుల్స్‌ప్లాజాలో నర్సరీ మేళా (ఫొటోలు)
-
మొక్కలు నాటి మంచి భవిష్యత్తునిద్దాం
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం మనం మొక్కలు నాటి భావితరాల వాళ్లకు మంచి భవిష్యత్తు ఇద్దా మని ఆర్థిక, వైద్యశాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపు నిచ్చారు. ఈనెల 26 నుంచి 30 వరకు నెక్లెస్‌రోడ్ పీపుల్స్ ప్లాజాలో గ్రాండ్ నర్సరీ మేళా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం మినిస్టర్స్ క్వార్టర్స్‌లో నర్సరీ మేళా బ్రోచర్‌ను హరీశ్ ఆవిష్కరించి మాట్లాడారు. ఐదు రోజుల పాటు నిర్వహించే ఈ షో లో హార్టికల్చర్ ఉత్పత్తులు, పండ్లు, కూరగాయల తోటలు, ఎరువులు, ఆర్గానిక్ ఉత్పత్తులు, అగ్రికల్చర్ ఎనర్జీ సేవింగ్ టెక్నాలజీ, అగ్రికల్చర్ సైన్స్, ఎడ్యుకేషన్, ఫుడ్ ఇండస్ట్రీ ఉత్పత్తులు ప్రదర్శిస్తారని వివరించారు. హైడ్రోఫోనిక్, టెర్రస్ గార్డెనింగ్, వర్టికల్ గార్డెనింగ్ వంటి నూతన టెక్నాలజీ ఈ షోలో ప్రదర్శిస్తారని, దేశవ్యాప్తంగా 150కుపైగా నర్సరీ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించారు. ప్రధానంగా డార్జిలింగ్, హరియాణా, ముంబై, బెంగళూరు, పుణే, షిర్డీ, కడియం, చెన్నై, తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాల నుంచి వచ్చిన ప్లాంట్స్ ప్రదర్శిస్తారన్నారు. మేళా ఇన్చార్జి ఖాలీద్ అహ్మద్ మాట్లాడుతూ మేళా ఉదయం 9 నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటుందని చెప్పారు. -
పీపుల్స్ ప్లాజాలో గ్రాండ్ నర్సరీ మేళా
-
నెక్లెస్ రోడ్డులో మొక్క సోయగం! (ఫోటోలు)
-
పీపుల్స్ ప్లాజాలో నర్సరీ మేళా.. టిక్కెట్ ధర ఎంతంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజర్ ఆధ్వర్యంలో ఈ నెల 24 నుంచి 28 వరకు నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో 11వ గ్రాండ్ నర్సరీ మేళాను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఖాలిద్ అహ్మద్ జమీర్ తెలిపారు. మినిస్టర్ రోడ్‌లోని భరణి కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో న్యాయవాది శ్రీనివాసరావు, నిర్వాహకులు జావిద్ అహ్మద్‌లతో కలిసి వివరాలు వెల్లడించారు. 24న ఉదయం 9 గంటలకు మంత్రి హరీష్‌రావు ఈ మేళాను ప్రారంభిస్తారని చెప్పారు. ఈ మేళాలో అగ్రికల్చర్, హార్టికల్చర్‌కు సంబంధించిన మొక్కలు, రకరకాల పాట్స్, సీడ్స్, ఆర్గానిక్, ఇనార్గానిక్‌కు సంబంధించినవి లభిస్తాయని చెప్పారు. (క్లిక్: హైదరాబాదీలకు శుభవార్త.. బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు) వివిధ రకాల గార్డెనింగ్‌కు చెందిన పద్ధతులైన వెర్టికల్ గార్డెనింగ్, హైడ్రోఫోనిక్, కిచన్ గార్డెనింగ్‌కు చెందిన రకరకాల మొక్కలతో పాటు అగ్రికల్చర్, హార్టికల్చర్‌లో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించినవి ఇక్కడ లభిస్తాయని చెప్పారు. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి రాత్రి 9గంటల వరకు ప్రవేశం ఉంటుందన్నారు. ప్రవేశ రుసుము రూ.20 మాత్రమేనని చెప్పారు. ఈ సందర్భంగా నర్సరీ మేళా బ్రోచర్‌ను ఆవిష్కరించారు. (క్లిక్: జీ+2 పర్మిషన్ తీసుకుని.. అయిదారు అంతస్తులు వేసారా?)