Peoples Plaza
-
అలరించిన జాతీయ సంస్కృతి మహోత్సవాలు (ఫొటోలు)
-
పీపుల్స్ ప్లాజా : జాతీయ సంస్కృతి మహోత్సవాలు–2024 (ఫొటోలు)
-
హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో ఘనంగా కైట్ ఫెస్ట్ వల్
-
ఉత్సాహంగా 10కే రన్ (ఫొటోలు)
-
హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో సరస్ ఫెయిర్ 2022
-
Pureathon 2022: ప్రతి ఒక్కరికి రుతుక్రమంపై అవగాహన అవసరం.. అందుకే ఈ పరుగు
Menstruation Awareness 2K 5K Run: మహిళల్లో రుతుక్రమం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని డాక్టర్ మంజుల అనగాని, టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ అన్నారు. ప్యూరథాన్ పేరుతో ఈ నెల 9న పీపుల్స్‌ప్లాజాలో నిర్వహించబోయే అవగాహన 2కే, 5కే రన్ సన్నాహక సమావేశాన్ని బంజారాహిల్స్‌లోని బ్లూ ఫాక్స్ హోటల్లో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ మంజుల అనగాని, హీరో సందీప్ కిషన్, దర్శకుడు మెహర్ రమేష్, నటి ఝన్సీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ మంజుల అనగాని మాట్లాడుతూ ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో బహిష్టు సమయంలో బాలికలను, మహిళలను అంటరాని వారుగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఎంత మాత్రం సమంజసం కాదన్న ఆమె.. మహిళల్లో రుతుక్రమం అనేది సర్వసాధారణమైన విషయమని ప్రతి తల్లి తమ ఇంట్లో ఉన్న భర్త, అన్న, తమ్ముడు, కుమారుడు ఇలా అందరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ విషయం గురించి అవగాహన లేకపోవడం వల్ల ఎంతో మహిళలు బహిష్టు సమయంలో సరైన రక్షణ చర్యలు లేక అనారోగ్యాల బారిన పడి మరణిస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయని అనగాని మంజుల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఇంట్లో మహిళలు ఎదుర్కొంటున్న ఈ సమస్యపై పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు శైలా తాళ్లూరి ముందుకు రావడం అభినందనీయం అన్నారు. రుతుక్రమం వచ్చినప్పడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీన ఉదయం 6 గంటలకు నిర్వహించబోయే 2కే, 5కే రన్లో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ రన్లో ఆర్టీసీ ఎండి సజ్జనార్‌తో, రాకొండ సీపీ మహేష్‌భగవత్, హీరోయిన్ కీర్తి సురేష్, సినీ నటుడు సత్యదేవ్, సింగర్ సిద్ శ్రీరామ్, సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అపోలో వైద్యురాలు షర్మిలా పెండ్యాల, సామాజిక వేత్త పార్వతి సుదర్శన్, ప్రేమా సుదర్శన్, ట్రాన్స్‌జెండర్ రచన పాల్గొన్నారు. చదవండి: Health Tips: అధిక రక్తపోటు ప్రాణాలకు కూడా ముప్పే! వీటిని తరచుగా తిన్నారంటే.. -
పీపుల్స్ ప్లాజాలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం
-
పీపుల్స్ ప్లాజాలో గ్రాండ్ నర్సరీ మేళా
-
నెక్లెస్ రోడ్డులో మొక్క సోయగం! (ఫోటోలు)
-
పీపుల్స్ ప్లాజాలో నర్సరీ మేళా.. టిక్కెట్ ధర ఎంతంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజర్ ఆధ్వర్యంలో ఈ నెల 24 నుంచి 28 వరకు నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో 11వ గ్రాండ్ నర్సరీ మేళాను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఖాలిద్ అహ్మద్ జమీర్ తెలిపారు. మినిస్టర్ రోడ్‌లోని భరణి కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో న్యాయవాది శ్రీనివాసరావు, నిర్వాహకులు జావిద్ అహ్మద్‌లతో కలిసి వివరాలు వెల్లడించారు. 24న ఉదయం 9 గంటలకు మంత్రి హరీష్‌రావు ఈ మేళాను ప్రారంభిస్తారని చెప్పారు. ఈ మేళాలో అగ్రికల్చర్, హార్టికల్చర్‌కు సంబంధించిన మొక్కలు, రకరకాల పాట్స్, సీడ్స్, ఆర్గానిక్, ఇనార్గానిక్‌కు సంబంధించినవి లభిస్తాయని చెప్పారు. (క్లిక్: హైదరాబాదీలకు శుభవార్త.. బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు) వివిధ రకాల గార్డెనింగ్‌కు చెందిన పద్ధతులైన వెర్టికల్ గార్డెనింగ్, హైడ్రోఫోనిక్, కిచన్ గార్డెనింగ్‌కు చెందిన రకరకాల మొక్కలతో పాటు అగ్రికల్చర్, హార్టికల్చర్‌లో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించినవి ఇక్కడ లభిస్తాయని చెప్పారు. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి రాత్రి 9గంటల వరకు ప్రవేశం ఉంటుందన్నారు. ప్రవేశ రుసుము రూ.20 మాత్రమేనని చెప్పారు. ఈ సందర్భంగా నర్సరీ మేళా బ్రోచర్‌ను ఆవిష్కరించారు. (క్లిక్: జీ+2 పర్మిషన్ తీసుకుని.. అయిదారు అంతస్తులు వేసారా?) -
హైదరాబాద్: నగరవాసులకు తీపి కబురు
సాక్షి, బంజారాహిల్స్: నగరవాసులకు తీపి కబురు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న నర్సరీ మేళా వచ్చేస్తోంది. ప్రకృతి ప్రియులకు చేరువలో నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు ఆలిండియా హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ షో పేరుతో పదో గ్రాండ్ నర్సరీ మేళా నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజర్ ఈ నర్సరీ మేళాను నిర్వహిస్తోంది. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంచుతారు. ప్రవేశ రుసుము రూ.20. చదవండి: పేరుకి కోటీశ్వరులు.. మరి అందులో కక్కుర్తి ఎందుకో ► ఈ మేళాలో వివిధ రకాల మొక్కలు, వివిధ ప్రాంతాల అరుదైన జాతులను ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా గార్డెనింగ్ మెథడ్స్, టెర్రస్ గార్డెనింగ్, వరి్టకల్ గార్డెనింగ్, హైడ్రోపోనిక్, కిచెన్ గార్డెనింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ► దేశవ్యాప్తంగా వివిధ జాతుల మొక్కలను ఇక్కడ అందుబాటులో ఉంచుతున్నారు. తాజా సాంకేతిక పరిజ్ఞానంతో మొక్కల పెంపకంపై అవగాహన కలిగించనున్నారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ మేళాలో వందస్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. నర్సరీ ప్లాంట్లు కూడా వివిధ రాష్ట్రాలకు చెందిన నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. ► గ్జోటిక్ ప్లాంట్స్, బోన్సాయ్, అడనీయం, ఇండోర్, అవుట్డోర్, హై క్వాలిటీ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్ ప్లాంట్స్, మెడిసినల్ అండ్ ఆక్సిజన్ ప్యూరిఫయింగ్ ప్లాంట్స్, ఆర్గానిక్ మొక్కలు, సేంద్రీయ ఎరువులు, సెరామిక్ అండ్ ఫైబర్ ప్లాంట్ స్టాండ్స్, హై క్వాలిటీ సీడ్స్, బల్బ్సŠ, టూల్స్, దేశీయ, అంతర్జాతీయ ఎక్విప్మెంట్ ఇక్కడ అందుబాటులో ఉంచుతున్నారు. కోవిడ్ మార్గదర్శకాలను అనుసరిస్తూ ఈ మేళా జరుగుతోంది. -
పీపుల్స్ ప్లాజాలో ఉద్యానవన ప్రదర్శన
-
రన్ ఫర్ హెల్త్
-
నేడు హైదరాబాద్ మారథాన్
- పీపుల్స్ ప్లాజా నుంచి బాలయోగి స్టేడియం వరకు - 20 వేల మందికి పైగా రన్నర్స్ పాల్గొనే అవకాశం - మారథాన్‌ను ప్రారంభించనున్న కేటీఆర్ - పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక హైదరాబాద్ మారథాన్‌కు సర్వం సిద్ధమైంది. ప్రజల్లో సమైక్యతా భావాన్ని, సామాజిక దృక్పథాన్ని, ఆరోగ్య స్పృహను పెంపొందించే లక్ష్యంతో తలపెట్టిన ఈ మారథాన్‌ను ఆదివారం నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజాలో నిర్వహించనున్నారు. జాతీయ, అంతర్జాతీయ రన్నర్స్తోపాటు వేలాది మంది హైదరాబాదీలు, వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు పాల్గొనే ఈ వేడుకకు రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై పరుగును ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవ వేడుకల్లో నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి పాల్గొంటారు. జీఎంసీ బాలయోగి స్టేడియంలో నిర్వహించే మారథాన్ ముగింపు కార్యక్రమంలో సైబరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్య, హైదరాబాద్ మారథాన్ రేస్ డైరెక్టర్ అభిజీత్ మధ్నూకర్ పాల్గొంటారు. కార్పొరేట్ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ నిపుణులతో పాటు సుమారు 20 వేల మంది యువతీ, యువకులు మారథాన్‌లో పాలుపంచుకోనున్నారు. జీవితాన్ని ఉత్తేజితం చేసే, ఉత్సాహభరితంగా మార్చే ఈ పోటీల్లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొని ప్రజల్లో స్ఫూర్తి నింపనున్నారు. అలాగే తాము ఎంచుకున్న రంగాల్లో విజయం సాధించిన విజేతలు, నిజజీవిత హీరోలు మారథాన్‌కు సరికొత్త సొబగులు అద్దనున్నారు. మరోవైపు 40కి పైగా స్వచ్ఛంద సంస్థలు తమ లక్ష్యాలను మారథాన్ ద్వారా ప్రజలకు తెలియజేయనున్నాయి. అలాగే పలు రంగాల్లో సేవలందజేస్తున్న స్వచ్ఛంద సంస్థల సందేశాన్ని తెలుపుతూ పలువురు రన్నర్స్ మారథాన్‌లో ప్లకార్డులను ప్రదర్శిస్తారు. మారథాన్‌లో గెలుపొందే స్త్రీ, పురుషులకు మూడు విభాగాల నుంచి రూ.7.2 లక్షల ప్రైజ్‌మనీని అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మరోవైపు మారథాన్ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మూడు విభాగాల్లో మారథాన్.. మారథాన్‌లో రకరకాల ఈవెంట్స్ ఉంటాయి. ఫుల్ మారథాన్, హాఫ్ మారథాన్, 10కే రన్‌గా మూడు విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. మొదట 42.2 కి.మీ. ఫుల్ మారథాన్ ఉదయం 5 గంటలకు ప్రారంభమవుతుంది. పీపుల్స్ ప్లాజా వద్ద మంత్రి కేటీఆర్ దీనిని ప్రారంభిస్తారు. ఫుల్ మారథాన్ సాగేదిలా.. పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమయ్యే ఫుల్ మారథాన్.. ఎన్టీఆర్ రోడ్, ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, రాజ్‌భవన్ రోడ్, పంజాగుట్ట ఫ్లైఓవర్, బంజారాహిల్స్ రోడ్–2, కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, జూబ్లీహిల్స్ రోడ్–36, మాదాపూర్ పోలీస్‌స్టేషన్, సైబర్టవర్స్, మైండ్‌స్పేస్ సర్కిల్, బయోడైవర్సిటీ పార్క్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, త్రిపుల్‌ఐటీ జంక్షన్, విప్రో సర్కిల్, గౌలిదొడ్డి, గోపన్‌పల్లి జంక్షన్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీదుగా జీఎంసీ బాలయోగి స్టేడియానికి చేరుకుని అక్కడ ముగుస్తుంది. హాఫ్ మారథాన్ దారి ఇదీ.. ఇక 21.1 కి.మీ. మేర సాగే హాఫ్ మారథాన్ ఉదయం 6 గంటలకు పీపుల్స్‌ప్లాజా వద్ద ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి నెక్లెస్ రోడ్, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, రాజ్‌భవన్ రోడ్, పంజాగుట్ట ఫ్లైఓవర్, బంజారాహిల్స్ రోడ్–2, కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, జూబ్లీహిల్స్ రోడ్–36, మాదాపూర్ పోలీస్‌స్టేషన్, సైబర్టవర్స్, మైండ్‌స్పేస్ సర్కిల్, బయోడైవర్సిటీ పార్క్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, త్రిపుల్‌ఐటీ జంక్షన్ నుంచి బాలయోగి స్టేడియానికి చేరుకుని ముగుస్తుంది. హైటెక్స్ నుంచి 10 కె రన్.. హైటెక్స్ ఎక్స్పో గ్రౌండ్ వద్ద ఉదయం 7 గంటలకు 10కె రన్ ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచి సైబర్టవర్స్, మైండ్‌స్పేస్ సర్కిల్, బయోడైవర్సిటీ పార్క్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, ఐఐఐటీ జంక్షన్ మీదుగా బాలయోగి స్టేడియానికి చేరుకుంటుంది. -
పీపుల్స్ ప్లాజా వద్ద పింక్‌థాన్ రన్
హైదరాబాద్: మహిళల ఆరోగ్యం- బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం నగరంలోని నక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వాద్ద ఆదివారం ఉదయం పింక్‌థాన్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్ జండా ఊపి రన్ ప్రారంభించారు. హాఫ్ మారథాన్(21కే), 10కే, 5కే, 3కే, 2కే రన్లు నిర్వహించారు. దీంతో ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, విద్యార్థినులు, ఔత్సాహికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో పోలీస్ ఎక్స్పో
-
వారిలో దేశభక్తి రగిలించడమే ధ్యేయం
► ‘సాక్షి’తో డీఏవీపీ అదనపు డైరెక్టర్ జనరల్ వేణుధర్ రెడ్డి సాక్షి, సిటీబ్యూరో: ‘సుదీర్ఘంగా సాగిన స్వాతంత్య్రోద్యమం గురించి నేటి తరాలకు పెద్దగా అవగాహన లేదు. ఒకవేళ తెలిసినా... మహాత్మాగాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్‌సింగ్, అల్లూరి సీతారామరాజు ఇలా కొందరి పోరాట యోధుల పేర్లే స్మరిస్తుంటాం. వీరితో పాటు వేల సంఖ్యలో స్వాతంత్య్ర సంగ్రామంలో పోరాడారు. అందరి ధన, మాన, ప్రాణ త్యాగాల ఫలితంగానే మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుతున్నాం. ఈ ఘట్టంలో అనేక ఉద్యమాలు, ప్రతిఘటనలు, పాదయాత్రలు, జాతిని ఏకం చేసే సమావేశాలు, ప్రసంగాలు, వీర మరణాలు.. ఇలా ఎన్నో రూపాలు ఆవిష్కృతమయ్యాయి. ఈ పరిణామ సంఘటనలను నేటి తరానికి సజీవంగా అందించి వారిలో జాతీయోద్యమ స్ఫూర్తిని, దేశభక్తిని రగిలించాలన్నదే మా ఉద్దేశం. స్వేచ్ఛా ఫలాల ప్రాధాన్యాన్ని వివరిస్తూ.. జాతి నిర్మాణానికి పునరంకితమయ్యే దిశగా యువతరానికి ప్రేరణ కలిగించడమే అంతిమ లక్ష్యం’ అని అడ్వరై్టజింగ్, విజువల్ పబ్లిసిటీ డైరెక్టరేట్ (డీఏవీపీ) అదనపు డైరెక్టర్ జనరల్ ఎన్.వేణుధర్ రెడ్డి పేర్కొన్నారు. డీఏవీపీ ఆధ్వర్యంలో నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో ‘70 ఏళ్ల స్వాతంత్య్రం– త్యాగాలను స్మరిద్దాం’ పేరిట ఈ నెల 19న ఫొటో ప్రదర్శన ప్రారంభించారు. పబ్లికేషన్ విభాగం ఆధ్వర్యంలో అపూర్వ పుస్తకాలు ప్రదర్శిస్తున్నారు. ఈనెల 23 వరకు కొనసాగే ఎగ్జిబిషన్ ప్రాధాన్యం, విశేషాలపై వేణుధర్ రెడ్డితో ‘సాక్షి’ ముచ్చటించింది. పుస్తకాలూ అపూర్వమైనవే... స్వాతంత్య్రోద్యమంలో కీలక భూమిక పోషించిన మహోన్నతుల విజయగాథలు, జీవిత చరిత్రలు, ప్రసంగాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని పబ్లికేషన్స్ డివిజన్ బిజినెస్ మేనేజర్ నాగేశ్వరరావు తెలిపారు. వీటిని డిస్కౌంట్ ధరలకు సందర్శకులకు విక్రయిస్తున్నామని చెప్పారు. అంతేగాక అరుదైన చిత్రాలతో కూడిన పుస్తకాలు కూడా విక్రయానికి ఉంచామన్నారు. మొత్తం 132 టైటిళ్ల పుస్తకాలు తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషలలో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. -
డిస్కౌంట్ ధరలో అపూర్వ చిత్రాలు
సాక్షి, సిటీబ్యూరో: పీపుల్స్‌ప్లాజాలో ఏర్పాటు చేసిన ‘70 ఏళ్ల స్వాతంత్య్రం – త్యాగాలను స్మరిద్దాం’ ఫొటో ఎగ్జిబిషన్ అరుదైన దృశ్యాల వేదికగా నిలుస్తోంది. దేశమంతా ఏకమై బానిస సంకెళ్లు తెంచిన ఘట్టాల చిత్రాలు అందరిలో స్ఫూర్తిని రగిలిస్తున్నాయి.1857 నుంచి మొదలైన స్వాతంత్య్ర సంగ్రామం మొదలుకొని స్వేచ్ఛా వాయువులు లభించిన 1947 ఆగస్టు 15 వరకు, తదనంతరం దేశంలో చోటుచేసుకున్న పరిణామాల దృశ్యమాలిక అందరినీ కట్టిపడేస్తోంది. కేవలం అరుదైన ఫొటోలే కాకుండా.. అపూర్వమైన పుస్తకాలూ కొలువు దీరాయి. మహనీయులు, స్వాతంత్య్ర సమరయోధుల విజయగాథలు, జీవితచరిత్ర తదితర పుస్తకాలు అందుబాటులో ఉంచారు. వీటిని డిస్కౌంట్ ధరకు సృదర్శకులకు విక్రయిస్తున్నారు. శుక్రవారం ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్ ఈనెల 23వ తేదీ వరకు కొనసాగుతుంది. ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకు సందర్శకులు వెళ్లొచ్చు. ఆనాటి స్వాతంత్య్ర సంగ్రామ ఘట్టాల్లో భాగంగా 1857 సెప్టెంబర్ 14న కమాండర్ కేంపీబెల్ సేనల దాడిలో ఛిద్రమైన కాశ్మీర్ గేటుతోపాటు స్వాతంత్య్ర తొలి వేడుకలు, సైనికులు కవాలు, విద్యుత్ వెలుగుల్లో ఢిల్లీ గేట్, తొలి కేబినెట్ భేటీ, తొలి రాష్ట్రపతిగా, ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మహోన్నతులు, కార్గిల్ యుద్ధ చిత్రాలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ ముద్ర, సంస్థానాల విలీనం, దేశానికి రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు, ప్రధానులుగా పనిచేసినవారి ఫొటోలు ప్రదర్శనలో ఉంచారు. -
నేడు స్వచ్ఛ ఆటోల పంపిణీ
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలో ఇంటింటి నుంచి చెత్తను తరలించేందుకు పారిశుధ్య కార్మికులకు అందజేసేందుకు ఇంకా మిగిలి ఉన్న 176 స్వచ్ఛ ఆటోలను మంగళవారం(నేడు)మునిసిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు పంపిణీ చేయనున్నారు. పీపుల్స్ ప్లాజాలో ఉదయం 10.30 గంటల కు జరిగే కార్యక్రమంలో ఈ స్వచ్ఛ ఆటోల పంపిణీతోపాటు 18 కొత్త స్వీపింగ్ మెషిన్లు, 37 రెఫ్యూజ్ కాంపాక్టర్లు, 326 కాంపాక్టర్ బిన్స్‌ను అందుబాటులోకి తేనున్నారు. -
పింకథాన్
-
పతాక స్థాయికి ఉత్సవాలు
- నేటితో తెలంగాణ అవతరణ వేడుకల ముగింపు - పీపుల్స్‌ప్లాజా నుంచి ట్యాంక్‌బండ్‌కు భారీ ర్యాలీ - హాజరవుతున్న గవర్నర్, సీఎం - వివిధ కళారూపాల ప్రదర్శన సాక్షి,సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల ముగింపునకు నగ రం సిద్ధమవుతోంది. భారీ స్థాయిలో ఈ వేడుకల నిర్వహణకు యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఆదివారం సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై ఉత్సవాలు నిర్వహించనున్నారు. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్ సహా ప్రముఖులంతా హాజరుకానున్నారు. పీపుల్స్ ప్లాజా నుంచి ట్యాంక్‌బండ్ వరకు లక్ష మందితో భారీ ప్రదర్శన నిర్వహించనున్నట్లు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. ముగింపు వేడుకలకు వేలాదిగా తరలి రావాలని, బంగారు తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. మరోవైపు తెలంగాణ సాంస్కృతిక, కళా వైభవాన్ని చాటేలా వివిధ కళా రూపాలను ట్యాంక్‌బండ్‌పై ప్రదర్శించనున్నారు. సుమారు 5 వేల మంది కళాకారులు వీటిలో పాల్గొంటారు. ధూంధాం, ఆట, పాటలు, బతుకమ్మలు, బోనాలతో సాయంత్రం 4 గంటల నుంచే ట్యాంక్‌బండ్‌పై సందడి నెలకొననుంది. రాత్రి 8 గంటలకు అవతరణ ఉత్సవాల ముగింపు సభ నిర్వహించనున్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా... తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం ట్యాంక్‌బండ్‌పై జరిగే భారీ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది. ట్యాంక్‌బండ్, పరిసర ప్రాంతాల్లో 50 పబ్లిక్ టాయ్లెట్లు ఏర్పాటు చేయడంతో పాటు రోడ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడానికి 500 మంది సఫాయి కార్మికులను విధుల్లో నియమిస్తున్నారు. అవతరణోత్సవాల ప్రారంభోత్సవంలో పరేడ్‌గ్రౌండ్‌లో ప్రదర్శించిన భారీ చీపురు శకటాన్ని తిరిగి ట్యాంక్‌బండ్‌పై ప్రదర్శనలో ఉంచనున్నారు. క్రీడాకారులతో ర్యాలీ, కాగడాల ప్రదర్శన తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. స్వయం సహాయక మహిళలు ఉత్సవాల్లో పాల్గొనేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. -
బహిరంగవేలం లేకుండా అద్దె ఎలా..?
హెచ్ఎండీఏ తీరును తప్పుపట్టిన హైకోర్టు... పీపుల్స్ ప్లాజాను రోజువారీ అద్దెకు ఇవ్వడంపై అభ్యంతరం అద్దె ఉత్తర్వులు నిలిపివేత హైదరాబాద్: నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ప్లాజాను ఎగ్జిబిషన్ నిర్వహణకు కేటాయింపు విషయంలో హైదరాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) వ్యవహరించిన తీరును హైకోర్టు తప్పుపట్టింది. ప్రభుత్వ స్థలానికి బహిరంగ వేలం నిర్వహించకుండా రోజువారీ అద్దె ప్రాతిపదికన కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. మహా ఉత్సవ్ పేరుతో ఈ నెల 7 నుంచి జూన్ 12వ తేదీ వరకు నిర్వహించనున్న ఎగ్జిబిషన్ కోసం పీపుల్స్ ప్లాజాను రోజువారీ అద్దె ప్రాతిపదికన ఈవెంట్ మేనేజర్‌కు కేటాయిస్తూ హెచ్ఎండీఏ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు నిలిపివేసింది. అత్యధిక మొత్తానికి బిడ్లు వేసిన వారికే పీపుల్స్ ప్లాజాను కేటాయించాలని, అవసరమైతే ఇందుకు సంబంధించి తిరిగి దరఖాస్తులను ఆహ్వానించాలని హెచ్ఎండీఏ అధికారులకు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి రెండు రోజుల క్రితం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తన దరఖాస్తును కాదని పీపుల్స్ప్లాజాను మహా ఉత్సవ్‌కు కేటాయించడాన్ని సవాలు చేస్తూ చేనేత చేతివృత్తుల ప్రదర్శన నిర్వహణదారు ఎల్.భరత్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి విచారించారు. తాను రోజుకు రూ.లక్ష చెల్లిస్తానని, పీపుల్స్ప్లాజాను తనకు కేటాయించాలంటూ చేసుకున్న దరఖాస్తును పట్టించుకోకుండా, రోజుకు రూ.51 వేలు చెల్లిస్తామన్న మహాఉత్సవ్కు కేటాయించారని భరత్‌రెడ్డి కోర్టుకు నివేదించారు. రూ.51 వేలు చెల్లించేందుకు సిద్ధపడి, అద్దె మొత్తంలో 50 శాతం చెల్లించిన వారికి స్థలం కేటాయించాలని 2007లో రూపొందించిన మార్గదర్శకాల ప్రకారమే మహాఉత్సవ్కు పీపుల్స్ప్లాజాను కేటాయించామని హెచ్ఎండీఏ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, బహిరంగ వేలం ద్వారా కాకుండా అద్దె ప్రాతిపదికన కేటాయింపు జరగడం ద్వారా అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఎక్కువ ఉందన్నారు. ప్రభుత్వ స్థలాలను బహిరంగ వేలం ద్వారానే కేటాయించాలని సుప్రీంకోర్టు సైతం పలు తీర్పులు ఇచ్చిందని గుర్తు చేశారు. రూ.లక్ష ఇచ్చేందుకు పిటిషనర్ సిద్ధమైతే, దేని ఆధారంగా రూ.51వేలు చెల్లిస్తానన్న వ్యక్తికి కేటాయింపు చేశారో అర్థం కాకుండా ఉందని పేర్కొన్నారు. -
కవిత్వం.. కొందాం రండి!
తోపుడు బండి... చాలా పరిచయం ఉన్న రవాణా సాధనం!. ఇప్పుడు సాహిత్యాన్ని మోయడానికి సిద్ధమవుతోంది.. నెక్లెస్‌రోడ్.. పీపుల్స్ ప్లాజా ప్లాట్‌ఫామ్ నుంచి నేడే ప్రయాణం.. సారథి... షేక్ సాదిఖ్ అలీ సాదిఖ్ అలీ పూర్వాశ్రమంలో జర్నలిస్ట్. చిన్నప్పటి నుంచే సాహిత్యమంటే మక్కువ. ఎనిమిదవ తరగతిలో ఉన్నప్పుడే నంది తిమ్మన ‘పారిజాతాపహరణం’ చదివారు. దాంతో ప్రబంధాల మీద ప్రేమ పుట్టింది. ఆ పిచ్చే ఇంటర్‌కొచ్చేసరికి గాలిబ్‌ను పరిచయం చేసింది. ఇంకో వైపు శ్రీశ్రీ మహాప్రస్థానాన్నీ చేతిలో పెట్టింది. అక్కడితో ఆగక డిగ్రీలో షెల్లీ, కీట్స్, బైరన్‌ల గొడవనూ వినిపించింది. అంతేనా అంటే కాదు మరింకా ఉన్నాయంటూ తిలక్, కృష్ణశాస్త్రి సాహిత్యం మీది మోహాన్ని తను ప్రేమించిన అమ్మాయి (భార్య) ఉషకు ప్రేమలేఖల రూపంలో తర్జుమా చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటారు. ‘ఆ రోజుల్లో కవిత్వపు పుస్తకాన్ని చేతిలో పట్టుకొని తిరిగే వారిని కవిగా, మేధావిగా గౌరవించేవారు. ఇప్పుడు ఆ గౌరవాన్ని బంగారానికి తొడుగుతున్నారు. కవిత్వానికి ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ఆ సాహిత్య ప్రక్రియకు నాటి మహర్దశను మళ్లీ కల్పించాలి. అందుకే ఈ తోపుడు బండిని ఎంచుకున్నా’ అని చెబుతారు సాదిక్ అలీ. అసలీ ఐడియా ఎలా వచ్చింది? కవిత్వాన్ని బతికించుకోవాలనే తన తపనకు కవి యాకూబ్ స్ఫూర్తయితే.. తోపుడుబండి ఆలోచనకు మొన్న హైదరాబాద్, విజయవాడల్లో జరిగిన బుక్‌ఫెయిర్స్ ప్రేరణ అంటారు ఆయన. పదేళ్లుగా క్షీణదశలో ఉన్న కవిత్వాన్ని కాపాడుకోవడానికి ఫేస్బుక్లో ‘కవిసంగమం’ పేరుతో యాకూబ్ చేస్తున్న కృషి తనను కదిలించింది. కవిత్వాన్ని బతికించడానికి యాకూబ్ చేస్తున్న ఒంటరి పోరాటంలో తనూ భాగస్వామిని కావాలని అప్పుడే అనిపించింది సాదిక్కి. దానికి తోడు కిందటేడాది చివర్లో ఇటు హైదరాబాద్, అటు విజయవాడలో జరిగిన బుక్ఫెయిర్లో కవిత్వపు పుస్తకాలకు ఉన్న డిమాండ్.. ఆయన ఆలోచనను ఆచరణలో పెట్టేలా చేసింది. ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో స్టాల్ నెంబర్ 88, విజయవాడ బుక్ ఫెయిర్‌లోని స్టాల్ నంబర్ 161లో కవిత్వపు పుస్తకాలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఫలానా పుస్తకం ఉందా అంటూ అడిగి మరీ కొన్న పాఠకులే కాదు ఫలానాది చదవండంటూ మేమిచ్చిన సలహా మేరకు ఆ పుస్తకాన్ని కొన్న వారూ ఉన్నారు. అప్పుడు అనిపించింది నాకు.. కవిత్వానికి ఆదరణ తగ్గలేదు. అది అచ్చయిన పుస్తకాలే పాఠకులకు అందట్లేదు. అలాంటి మంచి పుస్తకాలను పాఠకుల వాకిళ్ల ముందుకు తీసుకెళ్తే..?! అన్న ఆలోచన వచ్చింది. తిరుగు ప్రయాణంలోనే నా స్నేహితుడితో అన్నాను.. ‘వేణు.. (వాసిరెడ్డి వేణుగోపాల్) తోపుడుబండిలో కూరగాయలు, పళ్లు అమ్మినట్లు కవిత్వపు పుస్తకాలను అమ్మితే ఎలా ఉంటుంది’ అని. ప్రొసీడ్ అంటూ వెన్ను తట్టాడు వేణు. అట్లా తోపుడు బండి తయారైంది’ అని ఆ ఐడియా నేపథ్యాన్ని వివరించారు ఆయన. ఎక్కడ అమ్ముతారు.. ఈ ప్రశ్నకు.. ‘నేనే వీధి వీధి తిరుగుతూ అమ్ముతాను. ఇది నాకు ఓ యజ్ఞంలాంటిది’ అని సాదిఖ్ చెబుతారు. ‘నేటి నుంచి రోజూ హైదరాబాద్, సికింద్రాబాద్ వీధులన్నీ తిరుగుతాను. అచ్చు రూపంలో మంచి కవిత్వాన్ని పంచుతాను అందరికీ’ అంటారు. ‘ఈ బండితో రెండు తెలుగు రాష్టాల్లోని ఊరూవాడా తిరుగుతాను. మంచి కవిత్వం కొనండీ.. చదవండీ అని’ చెప్తానంటున్నారు. ఇప్పటికే ఫేస్‌బుక్‌లోని తన పోస్ట్‌లు చూసి ఖమ్మం, కర్నూల్, కరీనంగర్, నిజామాబాద్‌లాంటి పట్టణాల నుంచి చాలా రెస్పాన్స్ వస్తోందని చెప్పారు. ‘ఈ తోపుడుబండి కాన్సెప్ట్ యంగ్రైటర్స్కి ఓ భరోసా కావాలి. కవిత్వం రాయాలనుకునే రైటర్స్ పుస్తకాలను అచ్చువేసుకుంటే అమ్మి పెడ్తాను.. లేదా అచ్చువేయడానికైనా సిద్ధమే’అంటారు. అయితే ‘ఏది పడితే అది.. ఎలా పడితే అలా.. రాసేస్తే కవిత్వం అయిపోదు.. మంచి కవిత్వం రాయండి.. పాఠకులకు అసలైన కవిత్వపు రుచిని చూపించండి’ అంటూ కవులకు విజ్ఞప్తి చేస్తున్నారు. - శరాది -
మనసుదోచె..
రెండో రోజు ఆకట్టుకున్న ‘హార్టీ’ షో నగరంలోని నెక్లెస్ రోడ్డులోగల పీపుల్స్ ప్లాజాలో కొనసాగుతోన్న తెలంగాణ తొలి ‘ఉద్యాన ప్రదర్శన-2015’ రెండో రోజైన మంగళవారం సందర్శకులతో కిటకిటలాడింది. ప్రదర్శనలోని కూరగాయలు, పండ్లు, పూల స్టాళ్లను పరిశీలించారు. తమ ఫ్లాట్లల్లో మొక్కలను పెంచుకునే విధానంపై నగర వాసులు మక్కువ చూపారు. డెలియా, గ్లాడిబ్లెస్, కోరియంటల్ లివీ, గ్రాఫీకలి కొనియాలుతో వివిధ పూల మొక్కల కొనుగోలు చేసేందుకు క్యూ కట్టారు. ఆర్టిఫిషియల్ ప్లాంటింగ్ ఫ్లవర్స్ కూడా సందర్శకులను ఆకర్షించాయి. థాయిలాండ్ ఫ్లవర్స్, వాటర్ పెబెల్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. మహిళలు ఎక్కువగా వర్టికల్ గార్డెన్ సాగు విధానాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఆడినియమ్స్, టబ్ క ల్టివేషన్, హెల్త్ఫుడ్-హెల్త్ హైదరాబాద్ పేరిట స్టాల్స్‌లో ఉంచిన కొత్తిమీర, పాల ఆకు, టమోటా-చుక్కాకు, చిక్కుడు, కాకర, కరివేపాకు సాగు విధానంపై ఆరా తీశారు. - సాక్షి, సిటీబ్యూరో -
రాష్ట్ర తొలి ఉద్యాన ప్రదర్శన షురూ
⇒ ప్రారంభించిన తెలంగాణ సీఎం కేసీఆర్ ⇒ ‘చేను కబుర్లు’ రేడియో కార్యక్రమం కూడా.. ⇒ రూ. వెయ్యి కోట్లతో గోదాములు నిర్మిస్తాం: మంత్రి హరీశ్‌రావు ⇒ సూక్ష్మసేద్యం సబ్సిడీపై మంత్రి పోచారాన్ని నిలదీసిన రైతులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మొదటి ఉద్యానశాఖ ప్రదర్శనను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం హైదరాబాద్ నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ప్రారంభించారు. పూలు, పళ్లు, కూరగాయలతో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మొబైల్ కూరగాయలను సరఫరా చేసే ఆటోల పంపిణీ కార్యక్రమంతోపాటు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ‘చేను కబుర్లు’ అనే కొత్త రేడియో కార్యక్రమాన్ని కూడా ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ నిత్యం రైతులు ఎదుర్కొనే వ్యవసాయపరమైన సమస్యలకు పరిష్కారాలను రేడియోలో తెలంగాణ మాండలికంలో పాటలు, కథలు, నాటకాల రూపంలో చెబుతారన్నారు. ఇందుకోసం ఐదు కళాశాలల విద్యార్థులు రేడియో క్లబ్బులుగా ఏర్పడి వారి ప్రాంతాలకు చెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆకాశవాణి ద్వారా వినిపిస్తారన్నారు. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం హైదరాబాద్ ‘ఎ’ స్టేషన్ ద్వారా మధ్యాహ్నం 1.30 నుంచి 2 గంటల వరకు ప్రసారమవుతుందని, దీన్ని ఉపయోగించుకోవాలని రైతులను కేసీఆర్ కోరారు. కాగా, రాష్ట్రంలో ఏడాదిలో రూ. వెయ్యి కోట్లతో 13 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంగల గోదాములను ప్రతి మండలంలోనూ నిర్మిస్తామని మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ధర పడిపోయినప్పుడు రైతులు తమ ధాన్యాన్ని గోదాముల్లో ఆరు నెలల వరకు పెట్టుకోవచ్చన్నారు. దీనిపై రూ. 2 లక్షల వరకు రుణం కూడా పొందవచ్చన్నారు. నాబార్డు సాయంతో మరో రూ. వెయ్యి కోట్లతో కూడా గోదాముల నిర్మాణం చేపడతామన్నారు. వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది మార్చిలోగా వెయ్యి ఎకరాల్లో గ్రీన్హౌస్ చేపట్టాలనేది తమ లక్ష్యమని, రైతులకు ఉచిత సోలార్ పంపుసెట్లు అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అయితే పోచారం ప్రసంగిస్తుండగా కొందరు రైతులు వేదికపైకి వచ్చి సూక్ష్మసేద్యానికి సబ్సిడీ విషయమై ఆయన్ను నిలదీశారు. సూక్ష్మసేద్యం పరికరాలను ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం సబ్సిడీ, బీసీలకు 90 శాతం సబ్సిడీకి ఇస్తున్న ప్రభుత్వం ఇతరులకు 80 శాతం సబ్సిడీనే ఇస్తోందని, దీనివల్ల పేదలైన ఓసీలు నష్టపోతారన్నారు. అందువల్ల ఇతరులకు కూడా 90 శాతం సబ్సిడీ అందించాలని కోరారు. దీంతో కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. మంత్రి సహా అధికారులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇతర రైతులకు ఉన్న 80 శాతం సబ్సిడీని 90 శాతం ఇచ్చేందుకు సీఎంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు. దీంతో రైతులు శాంతించారు. సభలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రసంగించగా ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, వ్యవసాయ కమిషనర్ ప్రియదర్శిని, ఉద్యాన కమిషనర్ వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. ఉద్యాన ప్రదర్శన ఈ నెల 31 వర కూ జరగనుంది. ఫేస్బుక్, యూట్యూబ్‌లతో ఉద్యానశాఖ లింక్ ఉద్యానశాఖ చేపట్టే కార్యక్రమాలను ఫేస్బుక్, యూట్యూబ్‌లకు లింక్ చేశారు. వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య దీన్నిప్రారంభించారు. ఉద్యానశాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను, సీఎం కార్యక్రమాన్ని, సభలో వక్తల ప్రసంగాలను యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశారు.