
లైంగిక వేధింపులపై గళమెత్తండి: డీజీపీ పిలుపు
- 19న పీపుల్స్‌ప్లాజాలో భారీ ర్యాలీ
సాక్షి, హైదరాబాద్: బాలికలపై జరిగే లైంగిక వేధింపులను దాచకుండా ఫిర్యాదు చేయడం ద్వారా దోషులకు శిక్ష పడేలా చూడాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు డీజీపీ అనురాగ్‌శర్మ పిలుపునిచ్చారు. ఐజీ చారుసిన్హాతో కలసి ఆయన శుక్రవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. తల్లిదండ్రుల్లో, ఉపాధ్యాయుల్లో చైతన్యం తెచ్చేందుకు ఈనెల 15 నుంచి 19వ తేదీ వరకు పాఠశాలల్లో పెద్దఎత్తున ప్రచారం జరుపుతున్నామని చెప్పారు.
తొలిదశలో హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని పోలీసు సిబ్బందితో ప్రచారాన్ని నిర్వహిస్తున్నామన్నారు. సమాజంలో చైతన్యాన్ని తీసుకురావడానికి 19న నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో నాలుగు వేల మంది చిన్నారులతో ర్యాలీని నిర్వహిస్తున్నామని ఐజీ చారుసిన్హా తెలిపారు.