మనసుదోచె..
రెండో రోజు ఆకట్టుకున్న ‘హార్టీ’ షో
నగరంలోని నెక్లెస్ రోడ్డులోగల పీపుల్స్ ప్లాజాలో కొనసాగుతోన్న తెలంగాణ తొలి ‘ఉద్యాన ప్రదర్శన-2015’ రెండో రోజైన మంగళవారం సందర్శకులతో కిటకిటలాడింది. ప్రదర్శనలోని కూరగాయలు, పండ్లు, పూల స్టాళ్లను పరిశీలించారు. తమ ఫ్లాట్లల్లో మొక్కలను పెంచుకునే విధానంపై నగర వాసులు మక్కువ చూపారు. డెలియా, గ్లాడిబ్లెస్, కోరియంటల్ లివీ, గ్రాఫీకలి కొనియాలుతో వివిధ పూల మొక్కల కొనుగోలు చేసేందుకు క్యూ కట్టారు.
ఆర్టిఫిషియల్ ప్లాంటింగ్ ఫ్లవర్స్ కూడా సందర్శకులను ఆకర్షించాయి. థాయిలాండ్ ఫ్లవర్స్, వాటర్ పెబెల్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. మహిళలు ఎక్కువగా వర్టికల్ గార్డెన్ సాగు విధానాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఆడినియమ్స్, టబ్ క ల్టివేషన్, హెల్త్‌ఫుడ్-హెల్త్ హైదరాబాద్ పేరిట స్టాల్స్‌లో ఉంచిన కొత్తిమీర, పాల ఆకు, టమోటా-చుక్కాకు, చిక్కుడు, కాకర, కరివేపాకు సాగు విధానంపై ఆరా తీశారు.
- సాక్షి, సిటీబ్యూరో