ముంబై: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మధ్యంతర ఆదేశాలకు వ్యతిరేకంగా మీడియా దిగ్గజం జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్(జీల్) ప్రమోటర్లు చేసిన అప్పీల్‌ను సెక్యూరిటీస్ అపిల్లేట్ ట్రిబ్యునల్(శాట్) కొట్టివేసింది. (దేశంలో రిచెస్ట్ గాయని ఎవరో తెలుసా?ఏఆర్ రెహమాన్‌తో పోలిస్తే?)
ఏడాదిపాటు లిస్టెడ్ కంపెనీలలో ఎలాంటి బాధ్యతలూ చేపట్టకుండా సెబీ నిలువరించడాన్ని వ్యతిరేకిస్తూ సుభాష్ చంద్ర, పునీత్ గోయెంకా శాట్‌ను ఆశ్రయించారు. నిధుల మళ్లింపు కేసులో వీరిరువురూ లిస్టెడ్ కంపెనీలలో ఎలాంటి డైరెక్టర్లు లేదా కీలక యాజమాన్య బాధ్యతలు చేపట్టకుండా సెబీ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఎస్సెల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర, జీల్ ఎండీ, సీఈవో పునీత్ గోయెంకా అïప్పీల్‌పై ఆదేశాలను జూన్ 27కు శాట్ రిజర్వులో ఉంచింది. (ఐటీఆర్ ఫైలింగ్‌లో తప్పుడు వివరాలిచ్చారో : స్ట్రాంగ్ వార్నింగ్)
Comments
Please login to add a commentAdd a comment