Sat
-
వడ్డీతో సహా చెల్లించాల్సిందే.. కార్వీ కేసులో బ్యాంకులకు ఊరట
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్వీ స్టాక్ బ్రోకింగ్ కేసులో బ్యాంకింగ్‌కు అనుకూలంగా సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్) బుధవారం కీలక ఉత్తర్వులు వెలువరించింది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్)లు సంయుక్తంగా బ్యాంకులకు కార్వీ తాకట్టు పెట్టిన షేర్లను తిరిగి ఇవ్వాలని లేదా బ్యాంకులకు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కార్వీ రుణదాతలకు (బ్యాంకులకు) ఎన్ఎస్డీఎల్, ఎన్ఎస్ఈ, సెబీలు వార్షికంగా 10 శాతం వడ్డీ సహా షేర్ల విలువ రూ. 1,400 కోట్ల పరిహారం చెల్లించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. కేసు వివరాల్లోకి వెళితే... క్లయింట్ సెక్యూరిటీలను కార్వీ స్టాక్ బ్రోకింగ్ దుర్వినియోగం చేసిననట్లు సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) 2019లో ధ్రువీకరించింది. బ్యాంకుల వద్ద రూ.2,300 కోట్లకుపైగా విలువైన ఖాతాదారుల సెక్యూరిటీలను స్టాక్ బ్రోకర్ తాకట్టు పెట్టినట్లు పేర్కొంది. అయితే తాము బ్రోకరేజ్ సంస్థకు ఇచ్చిన రుణాలకుగాను (ప్లెడ్జ్ ఆధారంగా) ఈ తనఖా షేర్లను సర్దుబాటు చేసుకుంటామని యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ సెబీని అభ్యర్థించాయి. అయితే దీనిని సెబీ తిరస్కరించింది. తాకట్టు పెట్టిన సెక్యూరిటీలను బ్యాంకులకు బదిలీ చేయవద్దని రెగ్యులేటర్ డిపాజిటరీని ఆదేశించిన సెబీ, ఈ షేర్లను తిరిగి క్లయింట్ ఇన్వెస్టర్లకు బదిలీ చేయాలని డిపాజిటరీని ఆదేశించింది. దీనితో రుణ దాతలు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాయి. ట్రిబ్యునల్‌లో తాజాగా రెండు వేర్వేరు రూలింగ్ ఇస్తూ, సెబీ ఆదేశాలను తప్పుపట్టింది. -
శాట్‌లో పునీత్ గోయెంకాకు చుక్కెదురు
న్యూఢిల్లీ: జీ గ్రూప్ సంస్థల్లో కీలక హోదాలు చేపట్టరాదన్న సెబీ ఆదేశాల విషయంలో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీల్) మాజీ చీఫ్ పునీత్ గోయెంకాకు సెక్యూరిటీస్ అపీలేట్ ట్రిబ్యునల్ (శాట్)లో చుక్కెదురైంది. సెబీ ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు శాట్ నిరాకరించింది. ఈ అంశంపై తన సమాధానాన్ని సెప్టెంబర్ 4లోగా తెలియజేయాలంటూ సెబీకి సూచించింది. తుది విచారణను సెప్టెంబర్ 8కి వాయిదా వేసింది. కంపెనీ నిధులను సొంత ప్రయోజనాల కోసం దారి మళ్లించారంటూ జీల్ మాజీ చైర్మన్ సుభాష్ చంద్ర, ఆయన కుమారుడు గోయెంకాలపై అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు, వారు జీ గ్రూప్‌లోని నాలుగు సంస్థలకు, అలాగే జీల్–సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా విలీనంతో ఏర్పడే సంస్థలోనూ డైరెక్టర్లుగా గానీ కీలక నిర్వహణ హోదాల్లో (కేఎంపీ) గానీ ఉండరాదంటూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఇటీవల ఆదేశాలు ఇచ్చింది. వీటిని సవాల్ చేస్తూ పునీత్ గోయెంకా .. శాట్‌ను ఆశ్రయించారు. -
జీల్ ప్రమోటర్లకు శాట్ షాక్
ముంబై: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మధ్యంతర ఆదేశాలకు వ్యతిరేకంగా మీడియా దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్(జీల్) ప్రమోటర్లు చేసిన అప్పీల్‌ను సెక్యూరిటీస్ అపిల్లేట్ ట్రిబ్యునల్(శాట్) కొట్టివేసింది. (దేశంలో రిచెస్ట్ గాయని ఎవరో తెలుసా?ఏఆర్ రెహమాన్‌తో పోలిస్తే?) ఏడాదిపాటు లిస్టెడ్ కంపెనీలలో ఎలాంటి బాధ్యతలూ చేపట్టకుండా సెబీ నిలువరించడాన్ని వ్యతిరేకిస్తూ సుభాష్ చంద్ర, పునీత్ గోయెంకా శాట్‌ను ఆశ్రయించారు. నిధుల మళ్లింపు కేసులో వీరిరువురూ లిస్టెడ్ కంపెనీలలో ఎలాంటి డైరెక్టర్లు లేదా కీలక యాజమాన్య బాధ్యతలు చేపట్టకుండా సెబీ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఎస్సెల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర, జీల్ ఎండీ, సీఈవో పునీత్ గోయెంకా అïప్పీల్పై ఆదేశాలను జూన్ 27కు శాట్ రిజర్వులో ఉంచింది. (ఐటీఆర్ ఫైలింగ్‌లో తప్పుడు వివరాలిచ్చారో : స్ట్రాంగ్ వార్నింగ్) -
సెబీ ఉత్తర్వులపై శాట్‌కు సుభాష్ చంద్ర, పునీత్ గోయెంకా
న్యూఢిల్లీ: లిస్టెడ్ కంపెనీ దేనిలోనూ డైరెక్టర్ లేదా కీలకమైన మేనేజర్ హోదాలో కొనసాగకుండా సెబీ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఎస్సెల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర (జెడ్‌ఈఈఎల్– జీల్ చైర్మన్), జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఎండీ, సీఈఓ పునీత్ గోయెంకా సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్)ను ఆశ్రయించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. తమకు ఎటువంటి షోకాజ్ నోటీసు జారీ చేయకుండా, సహజ న్యాయ సూత్రాలను అనుసరించకుండా సెబీ ఈ రూలింగ్ ఇచ్చిందన్నది వారి వాదన అని ఆ వర్గాలు పేర్కొన్నాయి. మీడియా దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్(జీల్)కు చెందిన నిధుల అక్రమ మళ్లింపు వ్యవహారంలో సెబీ సోమవారం సుభాష్ చంద్ర, పునీత్ గోయెంకాలపై తాజా ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. వీరు తమ హోదాలను అడ్డుపెట్టుకుని సొంత లబ్ది కోసం నిధులను అక్రమంగా తరలించిన కేసులో సెబీ తాజా చర్యలు చేపట్టింది. చంద్ర, గోయెంకా.. జీల్‌సహా ఎస్సెల్ గ్రూప్‌లోని ఇతర లిస్టెడ్ కంపెనీల ఆస్తులను.. సొంత నియంత్రణలోని సహచర సంస్థల కోసం అక్రమంగా వినియోగించినట్లు సెబీ పేర్కొంది. పక్కా ప్రణాళిక ప్రకారం నిధుల అక్రమ వినియోగాన్ని చేపట్టినట్లు తెలియజేసింది. జీల్ షేరు 2018–19లో నమోదైన రూ. 600 స్థాయి నుంచి 2022–23కల్లా రూ. 200కు దిగివచ్చినట్లు సెబీ ప్రస్తావించింది. ఈ కాలంలో కంపెనీ అత్యంత లాభదాయకంగా నడుస్తున్నప్పటికీ షేరు విలువ పడిపోయినట్లు పేర్కొంది. వెరసి కంపెనీలో ఏవో అక్రమాలు జరుగుతున్న విషయాన్ని ఇది ప్రతిఫలించినట్లు వ్యాఖ్యానించింది. ఇదే సమయంలో కంపెనీలో ప్రమోటర్ల వాటా 41.62 శాతం నుంచి 3.99 శాతానికి పడిపోయినట్లు వెల్లడించింది. -
సత్యం స్కాం: 14 ఏళ్ల నిషేధం ఉత్తర్వులు పక్కకి, రామలింగరాజుకు ఊరట
న్యూఢిల్లీ: సత్యం కంప్యూటర్స్ స్కామ్‌లో రామలింగరాజు తదితరులను 14 ఏళ్ల పాటు సెక్యూరిటీస్ మార్కెట్ల నుంచి నిషేధిస్తూ సెబీ జారీ చేసిన ఉత్తర్వులను అప్పిలేట్ ట్రిబ్యునల్ శాట్ పక్కన పెట్టింది. 14 ఏళ్ల వ్యవధిని నిర్దేశించడానికి ఏ కారణమూ చూపలేదని పేర్కొంది. అలాగే ఒక్కొక్కరూ అక్రమంగా ఎంతెంత లబ్ధి పొందారో వేర్వేరుగా లెక్కించాల్సిందని సూచించింది. దీనిపై నాలుగు నెలల్లో కొత్తగా ఉత్తర్వులు ఇవ్వాలంటూ ఆదేశించింది. వివరాల్లోకి వెడితే .. ఖాతాల్లో అవకతవకలు బైటపడటంతో 2009లో సత్యం కంప్యూటర్స్ సంక్షోభంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ప్రమోటర్లయిన రామలింగ రాజు, రామ రాజులతో పాటు పలువురిపై కేసులు దాఖలయ్యాయి. ఆరుగురిని సెక్యూరిటీస్ మార్కెట్ల నుంచి 14 ఏళ్లు నిషేధించడంతో పాటు భారీగా జరిమానా విధిస్తూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ 2018లో రెండు ఉత్తర్వులు ఇచ్చింది. వీటిపై వారు సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా తాజా ఆదేశాలు వచ్చాయి. -
కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు భారీ ఊరట!
న్యూఢిల్లీ: ఆర్కాడియా షేర్, స్టాక్ బ్రోకర్లకు సంబంధించిన షేర్ తనఖా కేసులో కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్)లో ఊరట లభించింది. ఈ వ్యవహారంలో స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్ఈ డిపాజిటరీ సీడీఎస్ఎల్ (సెంట్రల్ డిపాజిటరీ సర్వీస్ లిమిటెడ్–ఇండియా) జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేసింది. నాన్-ట్రేడింగ్ సభ్యునికి ఆదేశాలు జారీ చేసే అధికారాలు ఎన్ఎస్ఈ, సీడీఎస్ఎల్కు ఉండబోవని అప్పీలేట్ అథారిటీ స్పష్టం చేసింది. (ఢిల్లీ టూ సిమ్లా: విమాన టికెట్ ధర కేవలం రూ. 2480) కేసు వివరాలు ఇవీ... మార్చి 2008లో, ఆర్కాడియా తన షేర్ల తాకట్టు ఆధారంగా కోటక్ మహీంద్రా బ్యాంక్ నుంచి రుణాన్ని పొందింది. తనఖా షేర్ల చట్టపరమైన, ప్రయోజనం పొందిన యజమాని ఆర్కాడియా మాత్రమేనని, సెక్యూరిటీ స్వాధీన చర్యలను బ్యాంక్ చేపట్టకూడదని ఈ మేరకు జరిగిన ఒప్పందం పేర్కొంది. అయితే డిసెంబర్ 2020 నాటికి, ఆర్కాడియా తన రీపేమెంట్ బాధ్యతల విషయంలో విఫలం అవడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో తాకట్టు పెట్టిన సెక్యూరిటీలను తమ స్వాధీనంలోకి తీసుకునే ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ఆర్కాడియాకు బ్యాంక్ 2021 ఫిబ్రవరి 15వ తేదీన తెలియ జేసింది. దీనితో ఆర్కాడియా ఈ వ్యవహారంపై ఎన్ఎస్ఈ న్యాయ విభాగాన్ని ఆశ్రయించింది. తనఖా పెట్టిన ఆర్కాడియా అనుమతి లేకుండా షేర్ల స్వాధీనం కుదరదని ఎన్ఎస్ఈ బ్యాంక్‌కు స్పష్టం చేసింది. ఎన్ఎస్ఈ ఆదేశాల నేపథ్యంలో ఆర్కాడియా డీమ్యాట్ అకౌంట్‌ను సీడీఎస్ఎల్ స్తంభింపజేసింది. దీనితో ఆర్కాడియా తనఖా పెట్టిన షేర్లను బ్యాంక్ తన స్వాధీనంలోకి తీసుకోలేకపోయింది. ఈ వివాదంపై అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను కోటక్ బ్యాంక్ ఆశ్రయించింది. (Vivo Y35: స్లిమ్ ఫోన్ ‘వై35’ ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?) రూలింగ్ ఇలా... స్టాక్ ఎక్స్చేంజ్గా ప్రతివాది (ఎన్ఎస్ఈ) దాని ట్రేడింగ్ సభ్యులపై మాత్రమే అధికార పరిధిని కలిగి ఉంటుందని శాట్ స్పష్టం చేసింది. ట్రేడింగ్ సభ్యుడు కాని అప్పీలుదారు (కోటక్ మహీంద్రా బ్యాంక్)తో సహా మరే ఇతర సంస్థకు ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేమని పేర్కొంది. అదేవిధంగా, డిపాజిటరీ కూడా తన అధికార పరిధిలో లేని ఏ ఇతర సంస్థకు వ్యతిరేకంగా ఎలాంటి ఆదేశాలను జారీ చేయలేదని, లేదా అప్పీలుదారుకు అనుకూలంగా తాకట్టు పెట్టిన సెక్యూరిటీలను స్తంభింపజేయ జాలదని స్పష్టం చేసింది.ఆర్కాడియా తనఖా షేర్లపై -
NSE: మాజీ చీఫ్ నారాయణ్‌కు ఊరట
న్యూఢిల్లీ: ఎన్ఎస్ఈ పరిపాలన నిర్వహణ లోపాలకు సంబంధించిన కేసులో ఆ సంస్థ మాజీ చీఫ్ రవి నారాయణ్‌కు శాట్‌లో ఊరట లభించింది. రవి నారాయణ్‌కు వ్యతిరేకంగా సెబీ ఇచ్చిన ఆదేశాలపై సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్) స్టే విధించింది. అది కూడా నాలుగు వారాల్లోపు సెబీ వద్ద రూ.50 లక్షలు డిపాజిట్ చేయాలని, ఈ షరతుకు లోబడే తమ ఉత్తర్వుల అమలు ఆధారపడి ఉంటుందన్న షరుతు విధించింది. రవి నారాయణ్ ఎన్ఎస్ఈ సీఈవోగా 2013 మార్చి 31 వరకు పనిచేశారు. 2013 ఏప్రిల్ నుంచి 2017 జూన్ వరకు ఎన్ఎస్ఈ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్‌కు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, వైస్ చైర్మన్‌గా వ్యవహరించారు. ఆ సమయంలో ఎన్ఎస్ఈలో చోటుచేసుకున్న పరిణామాలకు రవి నారాయణ్‌ను బాధ్యుడ్ని చేస్తూ సెబీ ఫిబ్రవరి 11న ఆదేశాలు జారీ చేసింది. సెబీ నమోదిత ఇంటర్ మీడియరీలు, ఏదేనీ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్తో భాగస్వామి కాకుండా రెండేళ్లపాటు ఆయనపై నిషేధం విధించింది. అలాగే రూ.2 కోట్ల పెనాల్టీ కట్టాలని కూడా ఆదేశించింది. దీనిపై నారాయణ్ శాట్‌ను ఆదేశించారు. నారాయణ్ నుంచి ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో బాధ్యతలను చేపట్టిన చిత్రా రామకృష్ణ.. అర్హతలు లేకపోయినా భారీ వేతనానికి వ్యక్తిగత సలహాదారుగా ఆనంద్ సుబ్రమణియన్‌ను నియమించినట్టు సెబీ గుర్తించింది. అంతేకాదు, సుబ్రమణియన్‌కు పెద్ద ఎత్తున అధికారాలను చిత్రా కట్టబెట్టినట్టు సెబీ తన ఆదేశాల్లో పేర్కొనడం గమనార్హం. చదవండి: మిస్టర్ ఆనంద్ సుబ్రమణియన్ రూ.2.05 కోట్లు కట్టండి.. లేదంటే? -
బుల్లి ఉపగ్రహం.. భళా!
తెనాలి: వాతావరణ సమాచారాన్ని సేకరించడానికి ‘లక్ష్య శాట్’ పేరుతో 400 గ్రాముల బుల్లి ఉపగ్రహాన్ని తయారుచేయడంతోపాటు దాన్ని విజయవంతంగా ప్రయోగించారు.. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కూరపాటి సాయి దివ్య. ఉపగ్రహ కమ్యూనికేషన్ విభాగంలో పీహెచ్డీ చేస్తున్న ఆమె తన సొంత పరిజ్ఞానంతో సాధించిన ఈ ఘనతకు అందరి అభినందనలు అందుకుంటున్నారు. బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన సాయి దివ్య కేఎల్ యూనివర్సిటీలో కమ్యూనికేషన్ అండ్ రాడార్ సిస్టమ్స్‌లో ఎంటెక్ చేశారు. తన పీహెచ్డీ థీసిస్‌లో భాగంగా తెనాలిలోని తన నివాసంలోనే ఎన్–స్పేస్ టెక్ అనే సంస్థను ప్రారంభించి.. ఉపగ్రహ తయారీని ఆరంభించారు. ఈ క్రమంలో లక్ష్య శాట్ పేరుతో ఉపగ్రహాన్ని సిద్ధం చేశారు. ఉపగ్రహానికి సంబంధించిన పేలోడ్, ప్రోగ్రాం కోడింగ్, విద్యుత్ వినియోగం అంచనా, సమాచార సేకరణ వంటి అంశాలన్నింటిపైన పట్టు సాధించిన సాయి దివ్య వాటి ఆధారంగా 400 గ్రాముల బుల్లి ఉపగ్రహాన్ని తయారుచేశారు. యూకే నుంచి ప్రయోగం.. గత నెల 15న లక్ష్య శాట్ ఉపగ్రహాన్ని యునైటెడ్ కింగ్డమ్ నుంచి బీ2 స్పేస్ అనే కంపెనీ ద్వారా స్ట్రాటో ఆవరణంలోకి పంపారు. ఎక్కువ ఎత్తుకు వెళ్లగలిగిన బెలూన్ సాయంతో దీన్ని ప్రయోగించారు. ఇది భూతలం నుంచి 26 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లి స్ట్రాటో ఆవరణంలో దాదాపు మూడు గంటలపాటు ఉందని సాయి దివ్య గురువారం తెనాలిలో మీడియాకు వివరించారు. లక్ష్య శాట్‌లోని అన్ని విభాగాలు ఎలాంటి లోపం లేకుండా పనిచేయటంతో ప్రయోగం విజయవంతమైందని తెలిపారు. అక్కడ తొమ్మిది రకాల వాతావరణ పరిస్థితులకు సంబంధించిన సమాచారాన్ని ఈ ఉపగ్రహంతో సేకరించానని చెప్పారు. ఈ సమాచారాన్ని ప్రస్తుతం విశ్లేషిస్తున్నానని వివరించారు. తెనాలిలో తాను నెలకొల్పిన ఎన్–స్పేస్ టెక్ సంస్థ ద్వారా తక్కువ ఖర్చుతో చిన్న, సూక్ష్మ ఉపగ్రహాలను అందుబాటులోకి తెస్తానన్నారు. లక్ష్య శాట్‌కు రూ.2 లక్షల వరకు ఖర్చయిందన్నారు. తన విజయాలకు తల్లిదండ్రులు నగజశ్రీ,, ప్రసాద్, భర్త కొత్తమాసు రఘురామ్ ఎంతో ప్రోత్సాహమందిస్తున్నారని తెలిపారు. -
కీలక ఆదేశాలు..చిత్రా అప్పీలుపై శాట్ విచారణ
న్యూఢిల్లీ: మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశాలను సవాలు చేస్తూ ఎన్ఎస్ఈ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణ దాఖలు చేసిన అప్పీలును సెక్యూరిటీస్ అపీలేట్ ట్రిబ్యునల్ (శాట్) విచారణకు స్వీకరించింది. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలంటూ సెబీని ఆదేశించింది. అలాగే సెబీ విధించిన రూ. 2 కోట్ల జరిమానా మొత్తాన్ని ఆరు వారాల్లోగా డిపాజిట్ చేయాలని చిత్రా రామకృష్ణను, ఆమెకు చెల్లించాల్సిన రూ. 4.73 కోట్ల మొత్తాన్ని ఇన్వెస్టర్ రక్షణ నిధి ట్రస్ట్‌లో కాకుండా ఎస్క్రో ఖాతాలో జమ చేయాలని నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీకి సూచించింది. తదుపరి విచారణను జూన్ 30కి వాయిదా వేసింది. వివరాల్లోకి వెడితే, ఎన్ఎస్ఈలో కార్పొరేట్ గవర్నెన్స్ లోపాల ఆరోపణల్లో చిత్రా రామకృష్ణకు సెబీ రూ. 2 కోట్ల జరిమానా విధించింది. సెలవుల ఎన్‌క్యాష్‌మెంట్ కింద ఆమెకు దఖలుపడే రూ. 1.54 కోట్లు, అలాగే రూ. 2.83 కోట్ల బోనస్‌ను జప్తు చేసుకుని, ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్ ట్రస్ట్‌లో జమ చేయాలని ఎన్ఎస్ఈకి సూచించింది. దీనితో పాటు ఈ వివాదంతో సంబంధమున్న మరికొందరిపై కూడా సెబీ జరిమానా విధించడంతో పాటు పలు చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలోనే సెబీ ఆదేశాలను సవాలు చేస్తూ చిత్రా రామకృష్ణ శాట్‌ను ఆశ్రయించగా తాజా ఉత్తర్వులు వచ్చాయి. చదవండి: నోట్ల రద్దుతో అలా..భారత్‌పై ప్రపంచబ్యాంకు కీలక వ్యాఖ్యలు..! -
ఫ్రాంక్లిన్ టెంపుల్టన్కు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థకు వ్యతిరేకంగా సెబీ ఇచ్చిన ఆదేశాలపై సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్) స్టే విధించింది. గతేడాది ఆరు డెట్ మ్యూచువల్ ఫండ్ పథకాలను ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ ఉన్నపళంగా మూసేయడం తెలిసిందే. ఈ విషయంలో నిబంధనల ఉల్లంఘన, ఇన్వెస్టర్ల ప్రయోజనాలకు నష్టం వాటిల్లినట్టు సెబీ తన విచారణలో భాగంగా తేల్చింది. మ్యూచువల్ ఫండ్స్‌విభాగాలకు సంబంధించిన నిబంధనలను తుంగలో తొక్కినట్టు గుర్తించింది. దీంతో ఆరు డెట్ పథకాల ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసిన రూ.512 కోట్లరూపాయల ఫీజులను, ఈ మొత్తంపై 12 శాతం వార్షిక వడ్డీ చొప్పున తిరిగి చెల్లించాలని ఆదేశించింది. రెండేళ్లపాటు కొత్తగా డెట్ పథకాలను ప్రారంభించకుండా వేటు వేసింది. జరిమానాలను కూడా విధించింది. ఈ ఆదేశాలను ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థ సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్) ముందు సవాలు చేసింది. వాదనలు విన్న శాట్..రూ.512 కోట్ల మొత్తాన్ని తిరిగి చెల్లించడం అన్నది చాలా అధిక మొత్తంగా అభిప్రాయపడింది. కనీస ఖర్చులను ఇందులో మినహాయించడం భావ్యంగా పేర్కొంది. దీంతోరూ.250 కోట్లను ఎస్క్రో ఖాతాలో మూడు వారాల్లోగా జమ చేయాలని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ను ఆదేశించింది. ఇప్పటికీ 21 డెట్ పథకాలను ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ సంస్థ నిర్వహిస్తుండగా.. వీటికి సంబంధించి ఒక్క ఫిర్యాదు కూడా లేకపోవడాన్ని శాట్ పరిగణనలోకి తీసుకుంది. ఆరు పథకాలను మూసేసినందున కొత్త పథకాలను ప్రారంభించకుండా అడ్డుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ కేసులో స్పందన దాఖలు చేయాలంటూ సెబీకి నాలుగువారాల వ్యవధినిచ్చింది. చదవండి : stockmarket : బ్యాంకుల దెబ్బ, నష్టాల్లో సూచీలు -
ఆరు కంపెనీలపై ట్రేడింగ్ ఆంక్షలు ఎత్తివేత
శాట్ ఆదేశాలు ముంబై: పార్శ్వనాథ్ డెవలపర్స్ సహా ఆరు కంపెనీలకు గురువారం ఊరట దక్కింది. ఈ కంపెనీల షేర్ల ట్రేడింగ్‌పై సెబీ విధించిన ఆంక్షలను స్టే రూపంలో సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్) పక్కన పెట్టింది. జాబితాలో పార్శ్వనాథ్ డెవలపర్స్, కవిట్ ఇండస్ట్రీస్, పిన్‌కాన్ స్పిరిట్, సిగ్నెట్ ఇండస్ట్రీస్, ఎస్‌క్యూఎస్ ఇండియా బీఎఫ్ఎస్ఐ, కె–కల్పన ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఈ కంపెనీల వాదన వినాలని, వీటి వ్యాపారాలపై దర్యాప్తు నిర్వహించాలని శాట్ ఆదేశించింది. దీంతో ఈ కంపెనీ షేర్లలో సోమవారం నుంచి ట్రేడింగ్ కొనసాగనుంది. 331 అనుమానిత షెల్ కంపెనీలపై సెబీ ట్రేడింగ్ ఆంక్షలకు ఆదేశించిన విషయం గుర్తుండే ఉంటుంది. సెబీ, స్టాక్ ఎక్సే ్చంజ్‌లు కంపెనీల వాదన వినాలని, వాటి వ్యాపార కార్యకలాపాలపై దర్యాప్తు నిర్వహించి, ఆరోపణలు నిజమని తేలితే చర్యలు తీసుకోవాలని శాట్ స్పష్టం చేసింది. -
జేకుమార్, ప్రకాశ్ ఇండస్ట్రీస్‌కు శాట్ ఊరట
♦ ట్రేడింగ్ ఆంక్షలపై స్టే ఉత్తర్వులు ♦ సెప్టెంబర్ 4కి విచారణ వాయిదా ♦ నేటి నుంచి షేర్లలో యథాప్రకారం ట్రేడింగ్ ముంబై: అనుమానాస్పద షెల్ కంపెనీల అభియోగాలతో ట్రేడింగ్‌పరమైన ఆంక్షలు ఎదుర్కొంటున్న జేకుమార్, ప్రకాశ్ ఇండస్ట్రీస్‌కి కాస్త ఊరట లభించింది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆంక్షలపై స్టే విధిస్తూ సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్) గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎలాంటి విచారణ లేకుండానే సెబీ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 4కి వాయిదా వేసింది. తాజా పరిణామంతో ఈ రెండు సంస్థల షేర్లలో శుక్రవారం నుంచి మళ్లీ యథాప్రకారం ట్రేడింగ్ జరగనుంది. ఈ మేరకు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ కూడా సర్క్యులర్లు విడుదల చేశాయి. రెండు సంస్థల షేర్లను నిఘా చర్యల (జీఎస్ఎం) పరిధి నుంచి తప్పించనున్నట్లు పేర్కొన్నాయి. 20 శాతం శ్రేణిలో వీటిలో ట్రేడింగ్‌కు అనుమతించనున్నట్లు వివరించాయి. ’అనుమానాస్పద డొల్ల కంపెనీలు’ ఆభియోగాలతో 331 సంస్థల షేర్లలో ట్రేడింగ్‌పై సెబీ ఆగస్టు 7న ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలోని కొన్ని కంపెనీల్లో దేశ విదేశాలకు చెందిన ప్రముఖ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కూడా ఉన్నాయి. సెబీ ఆదేశాలను సవాలు చేస్తూ జేకుమార్ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్, ప్రకాశ్ ఇండస్ట్రీస్ తమను ఆశ్రయించడంతో శాట్ తాజా ఉత్తర్వులు ఇచ్చింది. అటు స్టాక్ ఎక్సే్చంజీలు సైతం తమ నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని సూచించింది. విచారణ లేకుండానే ఆంక్షలు.. ‘పిటీషనర్లు వాదిస్తున్నట్లుగా.. కార్పొరేట్ వ్యవహారాల శాఖ (ఎంసీఏ) 2017 జూన్ 9న పంపిన లేఖలో అనుమానాస్పదమైనవిగా భావిస్తున్న 331 కంపెనీలు నిజంగానే డొల్ల కంపెనీలేనా లేక నిఖార్సయినవేనా అన్నది మాత్రమే సెబీ విచారణ జరపాల్సి ఉంది. కానీ ఎలాంటి విచారణ జరపకుండానే సెబీ ఆంక్షల ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది‘ అని ట్రిబ్యునల్ వ్యాఖ్యానించింది. పైగా ఎంసీఏ సూచనలను అమలు చేయడానికి సెబీ దాదాపు రెండు నెలల సమయం తీసుకోవడాన్ని బట్టి చూస్తే.. విచారణ లేకుండానే అత్యవసరంగా ఆదేశాలివ్వాల్సినంత పరిస్థితి కూడా లేదని స్పష్టంగా తెలుస్తోందని శాట్ పేర్కొంది. సదరు కంపెనీల వివరణ కూడా తీసుకున్న సెబీ హోల్‌టైమ్ మెంబరు.. మరింత సమాచారం కావాలని కోరినట్లు తమ దృష్టికి వచ్చినట్లు శాట్ పేర్కొంది. అయితే, ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతుండటంతో పిటీషనర్ల ప్రయోజనాలకు భంగం వాటిల్లుతున్న నేపథ్యంలో ఊరటనిచ్చేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు వివరించింది. -
రిలయన్స్ నిషేధంపై శాట్ విచారణ రేపే
న్యూఢ్లిల్లీ: ఏడాదిపాటు ఈక్విటీ డెరివేటివ్స్ ట్రేడింగ్ నుంచి సెబీ నిషేధించడాన్ని సవాల్ చేస్తూ రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) తాజాగా సెక్యూరిటీస్ అపీలేట్ ట్రిబ్యునల్ (శాట్)ను ఆశ్రయించింది. ఆర్ఐఎల్ అప్పీలుపై శాట్ మే 3బుధవారం న విచారణ చేపట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. పదేళ్ల క్రితం నాటి ఈ కేసుకు సంబంధించి.. రిలయన్స్ పెట్రోలియం ఎఫ్‌అండ్‌వో విభాగంలో మోసపూరిత ట్రేడింగ్ ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ అక్రమంగా లాభాలు ఆర్జించిందన్న ఆరోపణలు ఉన్నాయి. వీటిని సమర్ధించిన సెబీ ఎఫ్ అండ్ వో సెగ్మెంట్ నుంచి నిషేదించడంతో పాటు భారీ జరిమానా విధించింది. వడ్డీతోసహా సుమారు వెయ్యికోట్లు చెల్లించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనేత తాము ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను పాల్పడలేదంటూ రియలన్స్ శాట్‌ను ఆశ్రయించింది. అయితే రిలయన్స్ పెట్రోలియం ఆ తర్వాత మాతృసంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో విలీనం అయ్యింది. చట్టవిరుద్ధంగా లాభాల ఆర్జన ఆరోపణలపై రిలయన్స్‌తో పాటు 12 సంస్థలను ఈక్విటీ డెరివేటివ్స్ ట్రేడింగ్ కార్యకలాపాలు నిర్వహించకుండా ఏడాది పాటు నిషేధం విధిస్తూ సెబీ మార్చి 24న ఆదేశాలుజారీ చేసింది. గుజరాత్ పెట్రో కోక్, పెట్రో ప్రొడక్ట్ సప్లై, ఆర్తిక్ కమర్షియల్స్, ఎల్పీజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా, రెల్పోల్ ప్లాస్టిక్ ప్రొడక్ట్స్, ఫైన్ టెక్ కమర్షియల్స్, పైప్ లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా, మోటేచ్ సాఫ్ట్వేర్, దర్సన్ సెక్యూరిటీస్, రిలాజిస్టిక్స్ (ఇండియా), రిలాజిస్టిక్స్ (రాజస్థాన్), వినామరా యూనివర్సల్ ట్రేడర్స్ మరియు ధార్టి ఇన్వెస్ట్మెంట్ మరియు హోల్డింగ్స్ లపై వేటు వేసింది. దీంతో పాటు 2007 నవంబర్ 29 నుంచి 12 శాతం వడ్డీతో రూ. 447 కోట్లు కట్టాలని ఆర్ఐఎల్ను ఆదేశించింది. వడ్డీనే రూ. 500 కోట్లు కానుండటంతో ఆర్ఐఎల్ ఏకంగా రూ. 1,000 కోట్లకు చేరిన సంగతి తెలిసిందే. -
2016 నుంచి సరికొత్త ‘శాట్’
అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా తదితర దేశాల్లోని కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో అండర్గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి ప్రపంచవ్యాప్తంగా విద్యార్థుల ఆదరణ పొందిన పరీక్ష.. స్కాలాస్టిక్ అసెస్మెంట్ టెస్ట్(శాట్). అమెరికాలోని కాలేజీ బోర్డ్ నిర్వహించే ఈ పరీక్ష విద్యార్థుల్లోని రీడింగ్, రైటింగ్, మ్యాథమెటికల్ స్కిల్స్‌ను గుర్తించేలా ఉంటుంది. కాలానుగుణంగా ఇందులో మార్పులు తీసుకురావాలని కాలేజీ బోర్డ్ నిర్ణయించింది. శాట్‌ను మరింత ప్రభావవంతంగా, ఉపయోగకరంగా, ఫోకస్డ్గా మార్చాలని యోచిస్తోంది. మారిన(రీ డిజైన్డ్) శాట్‌ను 2016 నుంచి నిర్వహించనున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా.. సమకాలీనంగా శాట్‌ను రూపొందిస్తారు. కాలేజీ విద్యను విజయవంతంగా పూర్తిచేయడానికి, తర్వాత ఉద్యోగ జీవితంలో నిలదొక్కుకోవడానికి అవసరమైన నాలెడ్జ్, స్కిల్స్‌కు పెద్దపీట వేస్తారు. 2014, 2015లో విద్యార్థులు ప్రస్తుత విధానంలోనే ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది. శాట్‌లో 1600 స్కోర్ ఉంటుంది. ఎవిడెన్స్ బేస్డ్ రీడింగ్/రైటింగ్, మ్యాథమెటిక్స్.. వీటిలో ఒక్కో విభాగానికి 200 నుంచి 800 పాయింట్ స్కేల్‌పై స్కోర్‌ను కేటాయిస్తారు. వ్యాసం(ఎస్సే) స్కోర్‌ను ప్రత్యేకంగా గణిస్తారు. ఎస్సేను ఐచ్ఛికాంశం(ఆప్షనల్)గా మార్చనున్నారు. పరీక్ష వ్యవధి 3 గంటలు. ఎస్సేకు అదనంగా 50 నిమిషాలు కేటాయిస్తారు. శాట్‌లో ముఖ్యంగా 8 మార్పులు జరిగే అవకాశాలున్నాయి. పద సంపద: విద్యార్థుల ఆంగ్ల పద సంపద(వొకాబ్యులరీ)ను పరీక్షిస్తారు. ఇచ్చిన ప్యాసేజీలోని పదాలకు సందర్భానికి తగిన అర్థాలను వివరించాలని అడగనున్నారు. నిత్యజీవితంలో ఎక్కువగా ఉపయోగించే పదాలను ఇస్తారు. అందుకే విద్యార్థులు వొకాబ్యులరీపై పట్టు సాధించాలి. ఒక పదానికి వేర్వేరు సందర్భాల్లో ఎలాంటి అర్థాలుంటాయో తెలుసుకుంటే ఈ విభాగంలో ఎక్కువ స్కోర్ చేయొచ్చు. రీడింగ్/రైటింగ్ : శాట్‌లో కీలకమైన సెక్షన్.. ఎవిడెన్స్ బేస్డ్ రీడింగ్/ైరె టింగ్. ఇందులో సాహిత్యం, నాన్ ఫిక్షన్, హ్యుమానిటీస్, సైన్స్, హిస్టరీ, సోషల్ స్టడీస్ వంటి వాటి నుంచి ఇన్ఫర్మేషనల్ గ్రాఫిక్స్, మల్టీ పేరాగ్రాఫ్ ప్యాసేజీలు ఇస్తారు. ఇందులో సమస్యలకు రుజువులతో సహా పరిష్కార మార్గాలను చూపాల్సి ఉంటుంది. ప్యాసేజీపై విశ్లేషణ: రీ డిజైన్డ్ శాట్‌లో ఎస్సే సెక్షన్‌పై ఎక్కువ ఫోకస్ చేశారు. ప్యాసేజీని క్షుణ్నంగా చదివి, పాఠకులను మెప్పించేందుకు రచయిత చేసిన వాదనను విశ్లేషించాల్సి ఉంటుంది. విస్తృతంగా చదివే అలవాటు ఉన్నవారికి ఈ సెక్షన్ సులభమే. రీడింగ్, అనాలిసిస్, రైటింగ్ స్కిల్స్ పెంచుకోవాలి. మ్యాథమెటిక్స్: గణితంలో ప్రాబ్లమ్ సాల్వింగ్, డేటా అనాలిసిస్, ఆల్జీబ్రా వంటి వాటిలో విద్యార్థుల ప్రతిభను మరింత లోతుగా పరిశీలిస్తారు. కాలేజీ, కెరీర్లో సక్సెస్‌కు అవసరమైన జామెట్రిక్, ట్రిగొనోమెట్రిక్ స్కిల్స్ కూడా పరీక్షిస్తారు. రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్: సైన్స్, సోషల్ సైన్స్ సబ్జెక్టులతోపాటు కాలేజీ, కెరీర్‌కు సంబంధించిన విషయాలు, వాస్తవ ప్రపంచంలోని అంశాలపై ప్రత్యక్షంగా ప్రశ్నలు అడుగుతారు. ప్యాసేజీలు, ఫీచర్ చార్ట్‌లు, గ్రాఫ్‌లు కూడా ఇస్తారు. వీటిలో తప్పులను సరిచేయడంతోపాటు కుదించి, తిరగ రాయాల్సి ఉంటుంది. ఒక పరిస్థితిని వివరించి, దానికి సంబంధించిన ప్రశ్నలు వేస్తారు. ప్రపంచ, రాజకీయ పరిణామాలు: సైన్స్, హిస్టరీ, సోషల్ స్డడీస్‌లో ప్రశ్నలు సంధించి, అభ్యర్థుల రీడింగ్, రైటింగ్, లాంగ్వేజ్, అనలిటికల్ స్కిల్స్‌ను పరీక్షిస్తారు. తాజా ఆవిష్కరణలు, ప్రపంచ, రాజకీయ పరిణామాలు, ఆరోగ్యం, పర్యావరణం వంటి అంశాలపై కూడా ప్రశ్నలుంటాయి. మేధావుల బోధనలు: అమెరికా ఫౌండింగ్ డాక్యుమెంట్స్, డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్, బిల్ ఆఫ్ రైట్స్, ఫెడరలిస్ట్ పేపర్స్‌తోపాటు మహాత్మాగాంధీ, ఎడ్మండ్ బర్కీ వంటి రచయితలు, మేధావులు, ఆలోచనాపరుల బోధనలపై ప్రశ్నలు అడుగుతారు. ఫ్రీడమ్, జస్టిస్, హ్యుమన్ డిగ్నిటీపై కూడా విద్యార్థుల ప్రతిభను అంచనా వేస్తారు. తప్పు సమాధానాలు: ప్రస్తుతం శాట్‌లో తప్పు సమాధానాలకు స్కోర్‌లో కోత విధిస్తున్నారు. ఈ విధానాన్ని మార్చబోతున్నారు. మార్చిన శాట్‌లో రాంగ్ ఆన్సర్స్‌కు ఎలాంటి పెనాల్టీ ఉండదు. ఉత్తమమైన సమాధానాలు ఇచ్చే దిశగా విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ మార్పు చేశారు. ఎస్సేను ఐచ్ఛికం చేశారెందుకు? మల్టిపుల్ చాయిస్ ఎవిడెన్స్ బేస్డ్ రీడింగ్ అండ్ రైటింగ్ సెక్షన్లోనే విద్యార్థుల ఎడిటింగ్ వర్క్ నైపుణ్యాలను పరీక్షిస్తారు. ఈ నేపథ్యంలో ఇవే స్కిల్స్‌ను టెస్ట్ చేయడానికి ఎస్సే పరీక్ష అవసరం లేదని శాట్ వర్గాలు భావించాయి. మరోవైపు ఎస్సేపై కాలేజీ అడ్మిషన్ అధికారుల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వచ్చాయి. కొందరు దీనిపై మొగ్గుచూపగా, మరికొందరు అవసరం లేదని వాదించారు. అందుకే దీన్ని ఐచ్ఛికంగా మార్చారు. కాలిక్యులేటర్లు ఉపయోగించొచ్చా? శాట్ మ్యాథ్ టెస్ట్లోని రెండు సెక్షన్లలో కాలిక్యులేటర్లను అనుమతిస్తారు. ఈ గణన యంత్రాన్ని సక్రమంగా ఉపయోగించడం విద్యార్థులకు తెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఈ మార్పు చేశారు. మ్యాథమెటిక్స్‌లో నో-కాలిక్యులేటర్ సెక్షన్ కూడా ఉంది. ఏ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చు? పాత శాట్ లేక మార్చిన శాట్.. ఏ పరీక్ష స్కోర్ నైనా కళాశాలలు పరిగణనలోకి తీసుకోవచ్చు. ఈ రెండు పరీక్ష రాసిన విద్యార్థులు రెండు స్కోర్లను కళాశాలలకు పంపించుకోవచ్చు. 2016లో మార్చిన పరీక్ష మొదలయ్యాక.. పాత పరీక్ష ఉండదు. పీశాట్/ఎన్ఎంఎస్క్యూటీ కూడా మారతాయా? నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్‌కు అర్హత సాధించడానికి నిర్వహించే ప్రిలిమినరీ శాట్/నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ క్వాలిఫయింగ్ టెస్ట్(పీశాట్/ఎన్ఎంఎస్క్యూటీ)ని కూడా మార్చాలని కాలేజీ బోర్డ్, నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ కార్పొరేషన్ నిర్ణయించాయి. వెబ్సైట్: http://sat.collegeboard.org/ - లీసా జైన్, రిప్రజెంటేటివ్ ఆఫ్ ద కాలేజీ బోర్డ్ ఇన్ ఇండియా