న్యూఢ్లిల్లీ: ఏడాదిపాటు ఈక్విటీ డెరివేటివ్స్ ట్రేడింగ్ నుంచి సెబీ నిషేధించడాన్ని సవాల్ చేస్తూ రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) తాజాగా సెక్యూరిటీస్ అపీలేట్ ట్రిబ్యునల్ (శాట్)ను ఆశ్రయించింది. ఆర్‌ఐఎల్ అప్పీలుపై శాట్ మే 3బుధవారం న విచారణ చేపట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. పదేళ్ల క్రితం నాటి ఈ కేసుకు సంబంధించి.. రిలయన్స్ పెట్రోలియం ఎఫ్‌అండ్‌వో విభాగంలో మోసపూరిత ట్రేడింగ్ ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ అక్రమంగా లాభాలు ఆర్జించిందన్న ఆరోపణలు ఉన్నాయి. వీటిని సమర్ధించిన సెబీ ఎఫ్ అండ్ వో సెగ్మెంట్ నుంచి నిషేదించడంతో పాటు భారీ జరిమానా విధించింది. వడ్డీతోసహా సుమారు వెయ్యికోట్లు చెల్లించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనేత తాము ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను పాల్పడలేదంటూ రియలన్స్ శాట్‌ను ఆశ్రయించింది.
అయితే రిలయన్స్ పెట్రోలియం ఆ తర్వాత మాతృసంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో విలీనం అయ్యింది. చట్టవిరుద్ధంగా లాభాల ఆర్జన ఆరోపణలపై రిలయన్స్‌తో పాటు 12 సంస్థలను ఈక్విటీ డెరివేటివ్స్ ట్రేడింగ్ కార్యకలాపాలు నిర్వహించకుండా ఏడాది పాటు నిషేధం విధిస్తూ సెబీ మార్చి 24న ఆదేశాలుజారీ చేసింది. గుజరాత్ పెట్రో కోక్, పెట్రో ప్రొడక్ట్ సప్లై, ఆర్తిక్ కమర్షియల్స్, ఎల్‌పీజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా, రెల్‌పోల్ ప్లాస్టిక్ ప్రొడక్ట్స్, ఫైన్ టెక్ కమర్షియల్స్, పైప్ లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా, మోటేచ్ సాఫ్ట్వేర్, దర్సన్ సెక్యూరిటీస్, రిలాజిస్టిక్స్ (ఇండియా), రిలాజిస్టిక్స్ (రాజస్థాన్), వినామరా యూనివర్సల్ ట్రేడర్స్ మరియు ధార్టి ఇన్వెస్ట్మెంట్ మరియు హోల్డింగ్స్ లపై వేటు వేసింది. దీంతో పాటు 2007 నవంబర్ 29 నుంచి 12 శాతం వడ్డీతో రూ. 447 కోట్లు కట్టాలని ఆర్‌ఐఎల్‌ను ఆదేశించింది. వడ్డీనే రూ. 500 కోట్లు కానుండటంతో ఆర్‌ఐఎల్ ఏకంగా రూ. 1,000 కోట్లకు చేరిన సంగతి తెలిసిందే.
రిలయన్స్ నిషేధంపై శాట్ విచారణ రేపే
Published Tue, May 2 2017 12:15 PM | Last Updated on Tue, Oct 16 2018 2:49 PM
Advertisement