ఎప్పుడైనా పెసలుతో ఇలా పాలక్‌ ఇడ్లీ ట్రై చేశారా...? | Green Moong Dal And Lettuce Idli Recipe | Sakshi
Sakshi News home page

ఎప్పుడైనా పెసలుతో పాలక్‌ ఇడ్లీ ట్రై చేశారా! ఆరోగ్యాని ఆరోగ్యం..రుచికి రుచి..!

Published Fri, Sep 29 2023 9:46 AM | Last Updated on Fri, Sep 29 2023 9:46 AM

Green Moong Dal And Lettuce Idli Recipe - Sakshi

పెసర-పాలకూర ఇడ్లీ..

కావలసినవి:
పెసరపప్పు – కప్పు
పాలకూర – కప్పు 
నూనె – రెండు టీస్పూన్లు 
ఉప్పు – రుచికి సరిపడా
కారం – పావు టీస్పూను
వంటసోడా – పావు టీస్పూను.


తయారీ:  పెసరపప్పును శుభ్రంగా కడిగి ఐదారు గంటలు నానబెట్టుకోవాలి  నానిన పప్పును మెత్తగా గ్రైండ్‌ చేయాలి  పాలకూరను కూడా శుభ్రంగా కడిగి మెత్తగా గ్రైండ్‌ చేయాలి ∙పాలకూర పేస్ట్‌లో రుబ్బిన పెసర పప్పు, కారం, వంటసోడా, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా సోడా ఉప్పు వేసి కలపాలి ∙పిండిని మరీ జారుడుగా కాకుండా తగినంత నీటిని చేరుస్తూ ఇడ్లీ పిండిలా కలుపుకోవాలి ∙ఇడ్లీప్లేటుకు కొద్దిగా నూనె రాసి పిండిని ఇడ్లీ ప్లేటులో వేసి ఆవిరి మీద ఉడికించాలి ∙పదిహేను లేదా ఇరవై నిమిషాలు ఉడికిస్తే ఇడ్లీ రెడీ  పెసర పాలకూర ఇడ్లీలను పుదీనా చట్నీ లేదా సాంబార్‌తో వేడిగా వడ్డించాలి. 

(చదవండి: అరటికాయతో బజ్జీలు కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేయండి! అస్సలు వదిలిపెట్టరు..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement