Lettuce
-
ఎప్పుడైనా పెసలుతో ఇలా పాలక్ ఇడ్లీ ట్రై చేశారా...?
పెసర-పాలకూర ఇడ్లీ.. కావలసినవి: పెసరపప్పు – కప్పు పాలకూర – కప్పు నూనె – రెండు టీస్పూన్లు ఉప్పు – రుచికి సరిపడా కారం – పావు టీస్పూను వంటసోడా – పావు టీస్పూను. తయారీ: పెసరపప్పును శుభ్రంగా కడిగి ఐదారు గంటలు నానబెట్టుకోవాలి నానిన పప్పును మెత్తగా గ్రైండ్ చేయాలి పాలకూరను కూడా శుభ్రంగా కడిగి మెత్తగా గ్రైండ్ చేయాలి ∙పాలకూర పేస్ట్‌లో రుబ్బిన పెసర పప్పు, కారం, వంటసోడా, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా సోడా ఉప్పు వేసి కలపాలి ∙పిండిని మరీ జారుడుగా కాకుండా తగినంత నీటిని చేరుస్తూ ఇడ్లీ పిండిలా కలుపుకోవాలి ∙ఇడ్లీప్లేటుకు కొద్దిగా నూనె రాసి పిండిని ఇడ్లీ ప్లేటులో వేసి ఆవిరి మీద ఉడికించాలి ∙పదిహేను లేదా ఇరవై నిమిషాలు ఉడికిస్తే ఇడ్లీ రెడీ పెసర పాలకూర ఇడ్లీలను పుదీనా చట్నీ లేదా సాంబార్‌తో వేడిగా వడ్డించాలి. (చదవండి: అరటికాయతో బజ్జీలు కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేయండి! అస్సలు వదిలిపెట్టరు..) -
పాలిచ్చే తల్లులు తినాల్సినవి..!
-
870 కిలోమీటర్లు ప్రయాణం చేసిన పాము..! తీరా చూస్తే
కాన్బెర్రా: కిచెన్‌లోకి పాము ప్రత్యక్షమైన సంఘటన ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరానికి చెందిన ఓ వ్యక్తికి ఎదురైంది. సిడ్నీకి చెందిన అలెక్స్ వైట్ ఒకరోజు సూపర్‌మార్కెట్‌కు వెళ్లి సరుకులను తీసుకొని వచ్చాడు. ఇంటికి వచ్చాక సరుకులను తీస్తుండగా ఒక్కసారిగా ఖంగు తిన్నాడు. అతడు తెచ్చిన పాలకూర ప్యాకెట్లో పాము ప్రత్యక్షమైంది. పాము బుసలు కొట్టడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. దీంతో అలెక్స్ భయపడిపోయి ప్యాకెట్‌ను దూరంగా విసిరేశాడు. అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ఆ పామును తీసుకొని వెళ్లారు. ఒకవేళ ఆ పాము కాటువేసి ఉంటే తీవ్రమైన పరిణామాలు ఉండేవని వైర్స్ రెస్యూ సిబ్బంది తెలిపారు. కాగా, అలెక్స్ వైట్ ఈ విషయాన్ని సూపర్ మార్కెట్ యాజమన్యానికి తెలిపాడు. పాము సూపర్ మార్కెట్లోకి ఎలా ప్రవేశించిందో అనే విషయాన్ని పరిశీలించగా, ఆస్ట్రేలియాలోని తూవూంబా నగరంలో ఒక ప్యాకింగ్ ప్లాంట్ నుంచి సిడ్నీకి 870 కిలోమీటర్లు పాము ప్రయాణం చేసినట్లు అధికారులు చెప్పారు. ప్యాక్ చేసిన ఉత్పత్తులలో మొదటిసారి పామును చూశామని స్థానిక సిబ్బంది తెలిపారు. అంతేకాకుండా ప్యాకింగ్ చేసిన కూరగాయల్లో తరచూ కప్పలు రావడం అక్కడ సర్వసాధారణమే. చదవండి: వైరల్: ఏనుగు డాన్స్ చూస్తే నవ్వకుండా ఉండలేం! -
పాలక్ కబాబ్స్
ఎన్నో పోషక విలువలు ఉన్న ఆకుకూర తో సాధారణంగా పప్పు, పొడి కూర, పనీర్‌తో చేస్తాం. కాని వెరైటీగా పాలకూరలో బంగాళాదుంపని కలిపి, కబాబ్స్ చేసి మీవాళ్లకి అందించండి. కొత్త రుచితో పాటు పోషకాలు కూడా సమృద్ధిగా అందించి ఆరోగ్యాన్నీ అందించండి ఇలా... తయారి సమయం: 30. నిమిషాలు కావలసినవి: పాలకూర కట్టలు – 2, చిన్నగా కట్ చేసుకోవాలి; బంగాళదుంపలు – రెండు; ఉల్లిపాయ – 1, సన్నగా కట్ చేసుకోవాలి; పచ్చిమిర్చి – 3; అల్లం తురుము – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; కొత్తిమీర – ఒక కట్ట, సన్నగా కట్ చేసుకోవాలి; బ్రెడ్ స్లైస్‌లు – రెండు; గరం మసాలా – చిటికెడు; నిమ్మరసం – రెండు టేబుల్ స్పూన్లు; ఉప్పు – రుచికి సరిపడా; నూనె – వేయించడానికి సరిపడా; తయారి: ∙ముందుగా బంగాళదుంపల్ని ఉడకబెట్టి పొట్టు తీసి మెత్తగా మెదుపుకోవాలి. ∙పై పదార్థాల్లో నూనె మినహా మిగతా పదార్థాలన్నీ కలపాలి. వడల్లా వత్తుకుని ఇరవై నిమిషాలు రిఫ్రిజరేటర్లో పెట్టి తియ్యాలి. ∙నాన్ స్టిక్ పెనం వేడయ్యాక, కొంత నూనె వేసి నాలుగు లేదా అయిదు కబాబ్స్ వేసి ఇరు వైపులా ఎరుపు రంగు వచ్చేలా వేయించాలి. ∙వేడివేడిగా టొమాటో సాస్ కాంబినేషన్‌తో అందిస్తే రుచిగా ఉంటాయి. -
గుజ్ వెజ్
పాలకూర, పచ్చిమిర్చి, మొక్కజొన్నతోనైనా... బెండకాయ, ఎండుకొబ్బరి, ఎండు మెంతి ఆకైనా శనగపిండి, కొత్తిమీర, అల్లం, ఆవాలైనా... దినుసులు మామూలే అయినా ఆకలి తీర్చే ఆహారాలూ... చవులూరించే పదార్థాలు జిహ్వకు ఇంపైన వంటకాలంటే నిజం... అవి గుజరాతీ వెజ్ రుచులే! శాకాహారపు షడ్రుచులే!! భేండి సమ్ధానియా కావల్సినవి: బెండకాయలు - 6 బంగాళదుంప - 1 (ఉడికించాలి) పచ్చిమిర్చి - 2; ఎండుకొబ్బరి - టీ స్పూన్ నువ్వులు - టీ స్పూన్ కసూరి మెంతి (ఎండు మెంతి ఆకులు) - అర టీ స్పూన్ నూనె - వేయించడానికి తగినంత తయారి: నువ్వులు వేయించి, పక్కనుంచాలి. బెండకాయలను నిలువుగా మధ్యకు కట్ చేసి, నూనెలో వేయిం చుకోవాలి. బంగాళదుంప, పచ్చిమిర్చి, మెంతి ఆకులు, అర టీ స్పూన్ ఉప్పు, పంచదార, పచ్చిమిర్చి కలిపి మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని వేయించిన బెండకాయల మధ్యలో కూరాలి. పైన నువ్వులు చల్లి, అలంకరణకు క్యాబేజీ, క్యారట్ తరుగులను పెట్టి సర్వ్ చేయాలి. ఢోక్లా కావల్సినవి: శనగపిండి - 2 కప్పులు పెరుగు - కప్పు; ఉప్పు - తగినంత పసుపు - అర టీ స్పూన్ పచ్చిమిర్చి ముద్ద - అర టీ స్పూన్ అల్లం ముద్ద - అర టీ స్పూన్ నూనె - 2 టేబుల్ స్పూన్లు నిమ్మరసం - టేబుల్ స్పూన్ వంటసొడా - టీ స్పూన్; ఆవాలు - టీ స్పూన్ కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి తరుగు - అర కప్పు తయారి వెడల్నాటి గిన్నెలో శనగపిండి, బాగా గిలక్కొట్టిన పెరుగు, కప్పు వేడి నీళ్లు పోసి ఉండలు లేకుండా కలపాలి. దీంట్లో ఉప్పు వేసి మరోసారి బాగా కలపాలి. 3-4 గంటలు వదిలేయాలి. తర్వాత పసుపు, పచ్చిమిర్చి ముద్ద వేసి కలపాలి.ఢోక్లా చేసే గిన్నె అడుగున నెయ్యి రాయాలి. (కుకర్ లో కూరగాయలను ఉడికించడానికి మరో అల్యూమీనియమ్ పాత్ర వస్తుంది. దీనిని వాడచ్చు) చిన్న గిన్నెలో నిమ్మరసం, సొడా, టీ స్పూన్ నూనె వే సి కలపాలి. ఈ మిశ్రమాన్ని పిండిలో వేసి మరోసారి బాగా కలపాలి. ఈ పిండిని నెయ్యి రాసిన గిన్నెలో పోయాలి.కుకర్ అడుగు భాగాన నీళ్లుపోసి, దానిపైన పిండి మిశ్రమం ఉన్న గిన్నెపెట్టాలి, పైన మూతపెట్టాలి కానీ, వెయిట్ (విజిల్)ను పెట్టకూడదు.మంట మీద కనీసం 20 నిమిషాలు ఉడికించాలి. మధ్య మధ్యలో నీళ్లు ఆవిరైపోయాయో లేదో సరిచూసుకుంటూ మరో 2 కప్పుల నీళ్లు కుకర్ అడుగు భాగాన పోస్తూ ఢోక్లాను పూర్తిగా ఉడనివ్వాలి. ఢోక్లా ఉన్న గిన్నెను బయటకు తీసి, ప్లేట్లో బోర్లించాలి. గుండ్రంగా వచ్చిన ఢోక్లాను కత్తితో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి గిన్నెలోకి తీసుకోవాలి.చిన్న మూకుడులో నూనె, పోపుగింజలు, తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లికాడల తరుగు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు పెట్టాలి. దీనిని ఢోక్లా మీద వేసి కలిపి, పచ్చికొబ్బరి తరుగు, కొత్తిమీర ఆకులతో అలంకరించి సర్వ్ చేయాలి. కోయా మట్కి కావల్సినవి: కోవా - 250 గ్రా.లు పిస్తాపప్పు - టేబుల్ స్పూన్ (వేయించి, తరిగి పెట్టుకోవాలి); నెయ్యి - టేబుల్ స్పూన్ తయారీ కడాయిలో నెయ్యి వేసి, కరిగాక అందులో కోవా వేసి వేయించాలి. రొట్టెల పీట మీద కోవా వేసి, చపాతీలా అదమాలి. (పలచగా కాకుండా మందంగా ఉండాలి) కోవా మీద పిస్తాపప్పు తరుగు వేసి, మడవాలి. కత్తితో డైమండ్ ఆకారంలో కట్ చేయాలి. అలంకరణకు సిల్వర్ లీఫ్‌ను ఉపయోగించాలి. మకరాజ్వాడీ కావల్సినవి: పాలకూర - 250 గ్రా.లు క్యాప్సికమ్ - 1 (తరగాలి) క్రీమ్ (పాలమీగడ) - టీ స్పూన్ పచ్చిమిర్చి - 3 నూనె - టేబుల్ స్పూన్ మొక్కజొన్న గింజలు (మకై) - 50 గ్రా.లు జీలకర్ర - అర టీ స్పూన్ ఆవాలు - అర టీ స్పూన్ పసుపు - చిటికెడు ఉప్పు - తగినంత తయారీ కడాయిలో నూనె వేసి జీలకర్ర, ఆవాలు వేయించాలి. దీంట్లో మొక్కజొన్న, పచ్చిమిర్చి, పాలకూర వేసి ఉడికించాలి. పసుపు, ఉప్పు వేసి కలపాలి. చివరగా బాగా గిలకొట్టిన పాల మీగడ వేసి కలిపి దించాలి. అన్నం లేదా రోటీలోకి వడ్డించాలి. కర్టెసి షెఫ్: పంకజ్ టూరిజం ప్లాజా, బేగం పేట్, హైదరాబాద్ -
పక్షవాతాన్ని తగ్గించే పాలకూర!
పక్షవాతం వచ్చే రిస్క్‌ను నివారించే విషయంలో పాలకూర సమర్థంగా ఉపయోగపడుతుందని చైనీస్ శాస్త్రవేత్తల అధ్యయనం నిరూపించింది. పాలకూరలోని ఫోలిక్ యాసిడ్ వల్ల ఈ ప్రయోజనం ఒనగూరుతుందని శాస్త్రజ్ఞులు తెలిపారు. మరీ ముఖ్యంగా హైపర్‌టెన్షన్ (హైబీపీ) వల్ల పక్షవాతం వచ్చే అవకాశాలను ఫోలిక్ యాసిడ్ బాగా నివారిస్తుందని, పాలకూరలో ఇది పుష్కలంగా ఉంటుందని వారు పేర్కొంటున్నారు. హైబీపీ ఉన్న 20,702 మందిపై నిర్వహించిన అధ్యయనంలో ఇది తేలింది. వీళ్లంతా హైబీపీని తగ్గించే ‘ఎనాలప్రిల్’ అనే మందును వాడుతున్నవారే. వీరికి మందుతో పాటూ ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండే పాలకూరలు, ఇతర ఆకుకూరల కాంబినేషన్లలలో ఆహారాన్ని అందించారు. అయితే ఫోలిక్ యాసిడ్‌ను క్రమం తప్పకుండా తమ ఆహారంలో తీసుకుంటున్నవారిలో స్ట్రోక్ వచ్చేందుకు అన్ని విధాలా రిస్క్ ఉన్నవారే అయినప్పటికీ అవి వచ్చే అవకాశాలు 21 శాతం పడిపోయాయని అధ్యయనవేత్తలు గుర్తించారు. పైగా దీనితో పాటు గుండెజబ్బులు (కార్డియోవాస్క్యులార్ డిసీజెస్) వచ్చే అవకాశాలు కూడా గణనీయంగా తగ్గాయి. ఈ పరిశోధన ఫలితాలను ‘ద జర్నల్ ఆఫ్ ద అమెరికన్ అసోసియేషన్’ అనే మెడికల్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
పాలకూరలో ‘ఇంధన’ సూత్రం!
మొక్కలు సూర్యకాంతిని ఉపయోగించుకుని కార్బన్ డయాక్సైడ్, నీటి అణువులను విడగొట్టి కార్బోహైడ్రేట్ల(పిండి పదార్థాల)ను తయారు చేసుకుంటాయని, ఈ పద్ధతిని కిరణజన్య సంయోగక్రియ అంటారనీ మనకు తెలిసిందే. అయితే.. సూర్యకాంతిని బాగా ఉపయోగించుకుని ఎక్కువ శక్తిగా మార్చుకోవడంలో మిగతా మొక్కల కంటే.. పాలకూర రెండాకులు ఎక్కువే చదివిందట! దీని ఆకుల్లో ఉండే ‘ఫోటోసిస్టమ్ 2’ అనే ప్రత్యేక ప్రొటీన్ల వ్యవస్థ మిగతా మొక్కల కంటే సూర్యకాంతిని ఎక్కువ సమర్థంగా ఉపయోగించుకుంటోందని పుర్దీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇంతవరకూ ఎవరూ తయారు చేయలేనంతగా సూర్యరశ్మి ద్వారా 60 శాతం సమర్థంగా హైడ్రోజన్ ఇంధనాన్ని తయారు చేయాలని ప్రయోగాలు మొదలుపెట్టిన ప్రొఫెసర్ యులియా పుష్కర్ నేతృత్వంలోని బృందం ఈ మేరకు పాలకూరలో అరుదైన సూత్రాన్ని గుర్తించింది. పాలకూర ఫొటోసిస్టమ్-2లోని ప్రొటీన్ల పనితీరు ఆధారంగా.. కృత్రిమ కిరణజన్య సంయోగక్రియ జరిపే పరికరాలను తయారు చేస్తే.. హైడ్రోజన్ ఇంధనాన్ని సులభంగా, పెద్ద మొత్తంలో తయారు చేయొచ్చని వారు భావిస్తున్నారు.