ఎన్నో పోషక విలువలు ఉన్న ఆకుకూర తో సాధారణంగా పప్పు, పొడి కూర, పనీర్‌తో చేస్తాం. కాని వెరైటీగా పాలకూరలో బంగాళాదుంపని కలిపి, కబాబ్స్ చేసి మీవాళ్లకి అందించండి. కొత్త రుచితో పాటు పోషకాలు కూడా సమృద్ధిగా అందించి ఆరోగ్యాన్నీ అందించండి ఇలా...
తయారి సమయం: 30. నిమిషాలు
కావలసినవి: పాలకూర కట్టలు – 2, చిన్నగా కట్ చేసుకోవాలి; బంగాళదుంపలు – రెండు; ఉల్లిపాయ – 1, సన్నగా కట్ చేసుకోవాలి; పచ్చిమిర్చి – 3; అల్లం తురుము – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; కొత్తిమీర – ఒక కట్ట, సన్నగా కట్ చేసుకోవాలి; బ్రెడ్ స్లైస్‌లు – రెండు; గరం మసాలా – చిటికెడు; నిమ్మరసం – రెండు టేబుల్ స్పూన్లు; ఉప్పు – రుచికి సరిపడా; నూనె – వేయించడానికి సరిపడా;
తయారి: ∙ముందుగా బంగాళదుంపల్ని ఉడకబెట్టి పొట్టు తీసి మెత్తగా మెదుపుకోవాలి. ∙పై పదార్థాల్లో నూనె మినహా మిగతా పదార్థాలన్నీ కలపాలి. వడల్లా వత్తుకుని ఇరవై నిమిషాలు రిఫ్రిజరేటర్‌లో పెట్టి తియ్యాలి. ∙నాన్ స్టిక్ పెనం వేడయ్యాక, కొంత నూనె వేసి నాలుగు లేదా అయిదు కబాబ్స్ వేసి ఇరు వైపులా ఎరుపు రంగు వచ్చేలా వేయించాలి. ∙వేడివేడిగా టొమాటో సాస్ కాంబినేషన్‌తో అందిస్తే రుచిగా ఉంటాయి.
పాలక్ కబాబ్స్
Published Wed, Nov 21 2018 1:03 AM | Last Updated on Wed, Nov 21 2018 1:03 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment