ఏం పదార్థాలు వాడారో 73 శాతం మంది భారతీయులు చదువుతున్నారన్న సర్వే
న్యూఢిల్లీ: మార్కెట్‌లో స్నాక్స్ కొనేటప్పుడు ప్యాక్‌పై ఉన్న వివరాలు తప్పనిసరిగా చదువుతున్నారా? అయితే ఈ లిస్ట్‌లో మీరూ ఉన్నట్టే. ఆహారపదార్థాలు, ప్రత్యేకించి స్నాక్స్ కొనేటప్పుడు దానిలో వాడిన పదార్థాలేంటి? అందులో ఏమాత్రం పోషక విలువలున్నాయని 73శాతం మంది భారతీయులు చదువుతున్నారని హెల్తీ స్నాకింగ్ రిపోర్ట్–2024 సర్వే తెలిపింది.
దేశవ్యాప్తంగా 6వేల మందిపై సర్వే నిర్వహించి నివేదికను ఆది వారం విడుదల చేసింది. వీరిలో 93 శాతం మంది ఆరో గ్యకరమైన ఆహార పదార్థాలను ఎంచుకోవడానికే ఇష్టపడుతున్నారని తెలిపింది. ఆహార కల్తీకి సంబంధించి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సుగంధ ద్రవ్యాలు, స్వీట్స్, ఇతర స్నాక్స్ ప్యాకెట్స్ కొనుగోలుదారులపై సర్వే నిర్వహించింది.
ప్రతి 10 మందిలో 9 మంది సంప్రదాయ చిరుతిళ్లకు బదులుగా ఆరోగ్యకరమైన స్నాక్స్ కొనాలని చూస్తున్నారని తెలిపింది. డ్రైఫ్రూట్స్, నట్స్, తృణధాన్యాలతో చేసిన సహజమైన ఉత్పత్తులను కొనడానికి ఇష్టపడుతు న్నారని తెలిపింది. డ్రై ఫ్రూట్స్, తామర గింజలతో చేసిన పేలాల (మఖనా)ను హెల్తీ స్నాక్‌గా గుర్తించారు. పోషకాలు అత్యధికంగా ఉన్న వీటిని కొనడానికి 67శాతం మంది భారతీయులు ఆసక్తి చూపుతున్నారని సర్వే వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment