రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్-రాధికాల ప్రీ వెడ్డింగ్ వేడుకలు చాలా అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. మూడు రోజులు జరిగిన ఈ వేడుకల్లో సిని ప్రముఖులంతా ఆడి పాడి సందడి చేశారు. అయితే ఈ వేడుకల్లో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ టాలీవుడ్ నటుడు రామ్ చరణ్‌ని ఇడ్లీ అని సంబోధించడం చర్చనీయాంశంగా మారింది. షారుఖ్ ఫన్నీగా పిలిచారనుకుందామన్న అంత పెద్ద వేడుకలో పిలవడం చాలమందికి నచ్చలేదు. నార్త్ ఇండియన్ హీరోలకు దక్షిణాది హీరోలంటే చులకనే అంటూ రచ్చ మొదలయ్యింది. సరదా సంబోధన కాస్త సోషల్ మీడియాలో సీరియస్ ఇష్యూగా చర్చలకు తెరలేపింది. దక్షిణాది కాబట్టి ఇడ్డీ వడ అని షారుక్ హేళనగా సంబోధించినప్పటికీ..ఇడ్డీ భారతదేశ వంటకం మాత్రం కాదు. వివాదాస్పదంగా మారిన ఈ ఇడ్లీ వ్యాఖ్య నేపథ్యంలో అసలు ఇడ్లీ వంటకం మూలం ఏమిటీ? ఎక్కడ నుంచి ఈ అల్పహారం భారతదేశానికి వచ్చిందో చూద్దామా!.
మన భారతీయులకు ముఖ్యంగా దక్షిణాది వాళ్లు వేడి వేడి ఇడ్లీ, అందులోకి మంచి కొబ్బరి చట్నీ, వేడి వేడి సాంబార్ ఉంటే ప్రాణం లేచొస్తుందన్నట్లు భావిస్తారు. ఇది వారికి ఎంతో ఇష్టమైన అల్పాహారం కూడా. అయితే ఈ ఇడ్డీ వంటకం భారతీయ వంటకం కాదు. దాని మూలం భారతదేశానికి చెందింది ఎంత మాత్రం కాదు. కాస్త శరీరంలో నలతగా ఉన్న ఇడ్డీ తింటే తేలిగ్గా అరుగుతుందంటారు. ముఖ్యంగా వైద్యులు కూడా రోగులకు ఈ అల్పాహారాన్ని ప్రివర్ చేస్తారు. అలాంటి ఇడ్డీ ఎక్కడ నుంచి వచ్చిందనే విషయం గురించి కర్ణాటకకు చెందని ప్రముఖ ఆహార శాస్త్రవేత్త, పోషకాహార నిపుణుడు, కెటీ ఆచార్య సవివరంగా వెల్లడించారు.
ఇడ్లీ క్రీస్తూ పూర్వం 7 లేదా 12వ శతాబ్దంలో ఇండోనేషియాల్లో ఈ వంటకాన్ని చేసేవారట. వాళ్లు ఈ వంటాకాన్ని కెడ్లీ లేదా కేదారి అనిపిలిచేవారట. అయితే మన మన హిందూ రాజులు ఈ ఇండోనేషియాని పాలించడంతో సెలవుల్లో బంధువులను కలవడానికి భారత్‌కి వచ్చేవారట. అలా వస్తూ వస్తూ..తమ తోపాటు రాజ్యంలో ఉండే వంటవాళ్లను కూడా వెంటపెట్టుకుని తీసుకువెళ్లేవారట. అలా ఈ ఇండోనేషియ వంటకం భారత్‌లోకి వచ్చి ఇడ్లీగా స్థిరపడింది.
చరిత్రను పరిశీలిస్తే..
చారిత్రాత్మకంగా అరబ్బులు కూడా ఇడ్లీ వంటకంతో సంబంధం ఉందని మరో కథ చెబుతోంది. 'ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ ఫుడ్ హిస్టరీ అనే పుస్తకంలోనూ, 'సీడ్ టు సివిలైజేషన్ - ది స్టోరీ ఆఫ్ ఫుడ్' అనే మరో పుస్తకంలో భారతదేశంలో స్థిరపడ్డ అరబ్బులు హలాల్ ఆహారాల తోపాటు రైస్‌బాల్స్ తినేవారని, వాటిని కొబ్బరి గ్రేవీతో తినేవారని ఉంది. ఇక్కడ అరబ్బులు ఇడ్లీలను రైస్‌బాల్స్ అని పిలిచే వారని తెలుస్తోంది. అలా ఇడ్లీలు మన భారతీయ వంటకాల్లో భాగమయ్యాయి. అందుకు ఆధారాలు కూడా ఉన్నాయి.
ఇక ఏడోవ శతాబ్దాపు కన్నడ రచన "వద్దరాధనే" అనే గ్రంథంలో ఇడ్డీల గురించి ప్రస్తావించబడింది. వాటిని 'ఇద్దాలి'గా పిలిచినట్లు వాటి తయారీ గురించి సవివరంగా ఉంది. అలాగే పదవ శతాబ్దపు తమిళ వచనం పెరియ పురాణంలో కూడా ఈ వంటకం గురించి ప్రస్తావించబడి ఉంది. ఇది శైవ సాధువుల సముహం అయిన 63 నాయిర్ల జీవిత కథను వివరిస్తూ.. ఈ వంటకం వచ్చిన విధానం గురించి రాసి ఉంది.
ఇక మరో చారిత్రక ఆధారం ప్రకారం..క్రీస్తూ శకం 10వ శతాబ్దంలో ఘజనీ మహమ్మద్ సోమనాథ్ ఆలయం దాడి తర్వాత సౌరాష్ట్ర వ్యాపారులు దక్షిణ భారతదేశానికి రావడం జరిగింది. అప్పుడే ఈ ఇడ్లీ వంటకాన్ని కనుగొనడం జరిగింది. దానికి ఈ పేరు పెట్టడం జరిగిందని ఉంది. వీటన్నింటి బట్టి చూస్తే ఇడ్డీ అనే వంటకం మూలం భారత్ కాదని పేర్లు మార్చుకుంటూ మన దేశానికి వచ్చిందని స్పష్టం అవుతోంది. ఇవన్నీ ఎలా ఉన్నా ఈ ఇడ్లీ వంటకం మన దేశంలోని భారతీయల మనసులను దోచుకుని ఇష్టమైన వంటకంగా స్థిరపడిపోయిందనే విషయం గ్రహిస్తే మంచిది.
Comments
Please login to add a commentAdd a comment