Origin
-
క్యారమ్స్ కథ గురించి తెలుసా? ఎక్కడ? ఎపుడు పుట్టింది?
ఏమీ తోచనప్పుడు ఇంట్లోనే కూర్చుని ఆడుకునే ఆటల్లో ముఖ్యమైనది క్యారమ్స్. ఇద్దరు, నలుగురు కలిసి ఆడే ఈ ఆటంటే అందరికీ ఇష్టం. ఎవరికి ఎక్కువ కాయిన్స్ దక్కుతాయో ఎవరు రెడ్ కాయిన్స్‌ని చేజిక్కించుకుంటారో వారే ఈ ఆటలో విజేతలవుతారు. ఈ క్యారమ్స్ కథేమిటో తెలుసా?క్యారమ్స్ భారతదేశంలోనే పుట్టింది. ఎప్పుడు పుట్టిందనే సరైన లెక్కలు లేకపోయినా వందేళ్ల క్రితమే మన దేశంలోని సంపన్నుల ఇళ్లల్లో కొందరు క్యారమ్స్ ఆడేవారని అంచనా. 1935 నాటికి శ్రీలంక దేశంలో ఈ ఆటకు సంబంధించి పోటీలు ప్రారంభమయ్యాయి. 1958లో శ్రీలంక, భారత్ దేశాలు క్యారమ్స్ ఆటకు అధికారిక ఫెడరేషన్స్, క్లబ్స్ ఏర్పాటు చేశాయి. దీన్నిబట్టి అప్పటికే దేశంలో క్యారమ్స్ పాపులర్ అయ్యిందని అర్థం చేసుకోవచ్చు. 1988లో చెన్నైలో తొలిసారి ‘అంతర్జాతీయ క్యారమ్ సమాఖ్య’ (ఐసీఎఫ్)ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఈ క్యారమ్స్కి సంబంధించి విధివిధానాలు రూపొందించారు. అనంతరం పలు దేశాల్లో ఫెడరేషన్లు ఏర్పాటయ్యాయి. వాటి ఆధ్వర్యంలో జాతీయ ఛాంపియన్ షిప్స్ నిర్వహించడం మొదలు పెట్టారు. (పుట్టింది కెనడాలో... అన్నీ ఎదురుదెబ్బలే.. కట్ చేస్తే!) క్యారమ్స్ ఆడేందుకు శారీరకంగా ఇబ్బందిపడనక్కర్లేదు. బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు. కుటుంబంలోని వారంతా కలిసి ఆడుకోవచ్చు. దీంతో ఈ క్యారమ్స్ చాలా ప్రసిద్ధి చెందింది. 2000వ సంవత్సరం నాటికి అనేకమంది ఇళ్లల్లోకి క్యారమ్ బోర్డులు రావడం ఇందుకు ఉదాహరణ. 73.5 సెం.మీల ఎత్తు, 74 సెం.మీల వైశాల్యం కలిగిన ఈ బోర్డు ఆడేందుకు కాకుండా చూసేందుకూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ పరిమాణాన్ని అంతర్జాతీయ క్యారమ్ సమాఖ్య నిర్దేశించింది. క్యారమ్స్ ఆడేందుకు 19 కాయిన్స్, స్టైకర్ ఉండాలి. ఈ కాయిన్స్ తెలుపు, నలుపు, ఒకే ఒక్కటి మాత్రం ఎరుపురంగులో ఉంటాయి. బోర్డుపై ఆట సౌకర్యవంతంగా ఉండేందుకు బోరిక్ పౌడర్ వాడతారు. చెన్నైకి చెందిన ‘ఆంథోనీ మరియ ఇరుదయం’ అనే వ్యక్తి మన దేశంలో క్యారమ్స్ ఆటకు ప్రసిద్ధి చెందారు. రెండుసార్లు ప్రపంచ క్యారమ్స్ ఛాంపియన్ షిప్, తొమ్మిదిసార్లు నేషనల్ ఛాంపియన్ షిప్ గెలుచుకున్నారు. ఆయన కృషికి గుర్తింపుగా 1996లో ఆయనకు ‘అర్జున’ పురస్కారం ఇచ్చారు. క్యారమ్స్ కథ విన్నారుగా! ఖాళీ సమయాల్లో ఎంచక్కా ఆడుకోండి మరి! -
అంతులేని జాతి వివక్ష.. మూలాలను వెతుక్కుంటూ ఇంటిబాట..ఇక మాకు ఫ్రాన్స్ వద్దు..!
అలెక్స్ హేలీ ‘రూట్స్’. ఆఫ్రికా ఖండంలోని తనవారి మూలాలు వెతుక్కుంటూ వెళ్లిన ఓ నల్లజాతి అమెరికన్ చరిత్ర. ఆ నవల వెనక 12 ఏళ్ల ఎడతెగని అన్వేషణ, అధ్యయనం, పరిశోధన ఉన్నాయి. ఇప్పుడు ఫ్రాన్స్‌లోని నల్లజాతీయులు కూడా అలాగే తమ మూలాలు వెతుక్కుంటూ వెళ్లిపోతున్నారు. అయితే వారు వెళ్తున్నది పరిశోధనల కోసం కాదు. కాస్త మెరుగైన భవిష్యత్తు వేటలో. ఫ్రాన్స్‌లో వారికి ఎదురవుతున్న తీవ్ర జాతి వివక్షే ఈ వలసలకు ప్రధాన కారణం. ఫ్రెంచివారి మితిమీరిన జాతీయవాదాన్ని భరించలేక ఫ్రాన్స్‌ను వీడుతున్న ఆఫ్రికన్ల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఫ్రాన్స్‌లోనే పుట్టి పెరిగి, జీవితమంతా ఆ దేశంతోనే ముడిపడిందని అనుకున్న ఆఫ్రికన్లు కూడా అన్వేషిస్తూ ఈ జాబితాలో ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది... ఫ్రాన్స్‌ను వీడుతున్న నల్లజాతీయుల సంఖ్య బాగా పెరిగింది. ప్రధానంగా సెనెగల్ వాసులు ఫ్రాన్స్‌ను వీడి స్వదేశీ బాట పడుతున్నారు. ముస్లిం దేశమైన సెనెగల్ పురాతన ఫ్రెంచ్ కాలనీ. సెనెగల్‌తో ఫ్రాన్స్ సంబంధాలకు మూడు శతాబ్దాల పై చిలుకు చరిత్ర ఉంది. 1960లో సెనెగల్‌కు రాజకీయ స్వాతంత్య్రం వచి్చనా వ్యాపారం, జాతీయ భద్రత, సైనిక ఒప్పందాలు, భాగస్వామ్య సాంస్కృతిక ప్రోత్సాహం తదితరాల రూపంలో ఫ్రాన్స్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తోంది. సెనెగల్ నుంచి వలస వెళ్లిన వారు ఫ్రాన్స్‌లో పలు రంగాల్లో స్థిరపడ్డారు. కానీ ‘ప్రత్యేక సంబంధం’ఇప్పుడు బీటలు వారుతోంది. పెరిగిన జాత్యాహంకార నేరాలు ఫ్రాన్స్‌లో నల్లజాతీయులపై నిర్వహించిన సర్వేలో ఏకంగా 91 శాతం మంది తాము జాతి వివక్షకు గురైనట్టు చెప్పుకొచ్చారు. 85% మంది చర్మం రంగు ఆధారంగా వివక్షకు గురయ్యారు. ఇది బహిరంగ స్థలాల్లో 41 శాతం, పని ప్రదేశాల్లో 31 శాతముంది. చర్మం రంగు వల్ల ఉద్యోగం నుంచి ప్రమోషన్ల దాకా నల్ల జాతీయులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యాపరంగా కూడా తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు. ఇల్లు కొనడం, అద్దెకు తీసుకోవడంలో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు వాపోయారు. ఒక్క గత ఏడాదిలోనే ఫ్రాన్స్‌లో జాత్యహంకార నేరాలు మూడింట ఒక వంతు పెరిగినట్టు అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. 15,000 పై చిలుకు జాతి, మతాధార నేరాలు నమోదయ్యాయి. 2023 జూన్‌లో అల్జీరియా సంతతికి చెందిన నహెల్ మెర్జౌక్ (17) అనే టీనేజర్‌ను పోలీసులు కాలి్చచంపారు. వీటన్నింటి కారణంగా విద్యాధికులైన ఫ్రెంచ్ ఆఫ్రికన్ ముస్లింలు భారీ సంఖ్యలో నిశ్శబ్దంగా వలస బాట పట్టినట్టు పలు పరిశోధనల్లో తేలింది. అయితే వీరి సంఖ్య ఇదమిత్థంగా తెలియరావడం లేదు. జాతి, మతాధారిత గణాంకాల సేకరణపై ఫ్రాన్స్‌లో నిషేధమే ఇందుకు కారణం.మా విశ్వాసాలంటే చులకన 2015లో ఇస్లామిక్ ముష్కరులు పారిస్‌లో పలుచోట్ల దాడులకు పాల్పడ్డారు. వాటిలో ఏకంగా 130 దుర్మరణం పాలయ్యారు. నాటినుంచీ ఫ్రాన్స్‌లో ఇస్లామోఫోబియా తారస్థాయికి చేరింది. లౌకిక దేశమైన ఫ్రాన్స్‌లో హిజాబ్ ధారణ కూడా వివాదాస్పదంగా మారింది. దాన్ని 20 ఏళ్ల క్రితమే ప్రభుత్వ స్కూళ్లలో నిషేధించారు. ఈ మార్పులు ఆందోళనకరమని కాంగో సంతతికి చెందిన ఆడ్రీ మొంజెంబా అనే టీచర్ తెలిపారు. ఆమె రోజూ తన చిన్న కుమార్తెతో కలిసి బస్సు, రైలు మారి స్కూలుకు వెళ్తుంది. అక్కడ బురఖా తీసేసి లోనికి వెళ్లాల్సి వస్తుంది. ఇటీవలే కుటుంబంతో పాటు సెనగల్లో స్థిరపడ్డారామె. ‘‘ఫ్రాన్స్ నాది కాదని అనుకోవడం లేదు. కానీ మా విశ్వాసాలను, విలువలను గౌరవించే వాతావరణంలో నేను, నా పిల్లలు ఎదగాలనేది నా ఆకాంక్ష’’అంటోంది 35 ఏళ్ల మొజెంబా. సెనెగల్‌కు చెందిన 34 ఏళ్ల ఫటౌమాటా సిల్లాదీ ఇలాంటి కథే. ‘‘మా కుటుంబానికి మెరుగైన జీవితం కోసం మా నాన్న ఆఫ్రికా వదిలి ఇక్కడికొచ్చారు. అయితే మూలాలను ఎన్నటికీ మరవొద్దని నిత్యం చెప్పేవారు. ఆ వారసత్వాన్ని నేను మరిచిపోలేదు. అందుకే ఈ వివక్షను భరించే బదులు సెనెగల్ తిరిగి వెళ్తున్నా. అక్కడ టూరిజం వ్యాపారం చేసుకుంటా’’అని ఆయన చెప్పుకొచ్చారు. వెంటాడుతున్న వివక్ష.. మెంకా గోమెస్దీ ఇదే కథ. వివక్షను తట్టుకోలేక ఫ్రాన్స్‌ను వీడి తమ మూలాలకు తిరిగి వెళ్లాలనుకుంటున్న ఆఫ్రికన్ల కోసం సెనెగల్‌లో ట్రావెల్ ఏజెన్సీనే ఏర్పాటు చేశారాయన. ‘‘నేను ఫ్రాన్స్‌లోనే పుట్టి పెరిగా. కానీ ఇక్కడ జాత్యహంకారం భరిచలేనంతగా పెరిగింది. ఆరేళ్ల వయసులో స్కూల్లో నన్ను ఎన్–వర్డ్ అని పిలిచేవారు. నేను ఫ్రెంచివాన్నే అయినా నా తల్లిదండ్రులు ఎక్కడి నుంచో రావడమే ఇందుకు కారణం. ఆ వివక్ష నీడలా వెంటాడుతూనే ఉంది. ఇక చాలనిపించింద. ఇ అందుకే కుటుంబాన్ని, స్నేహితులను అందరినీ విడిచి మరీ సెనెగల్ వెళ్లిపోతున్న. ఇక నా భవిష్యత్తంతా ఆఫ్రికాలోనే’’అని చెప్పుకొచ్చారు. పుట్టినప్పటి నుంచీ ఫ్రాన్స్‌లోనే గడిపిన ఫాంటా గుయిరాస్సీ కూడా తల్లి జన్మస్థలమైన సెనెగల్ వెళ్లే ఆలోచనలో ఉంది. ‘‘కొన్నేళ్లుగా ఫ్రాన్స్‌లో రక్షణ లేదు. నా 15 కొడుకు వీధిలో స్నేహితులతో మాట్లాడుతుంటే పోలీసులు అవమానకరంగా తనిఖీ చేశారు. టీవీలో ఎప్పుడు చూసినా మాకు సంబంధించి ఏదో ఒక న్యూస్! ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళన వెంటాడుతోంది’’అన్నారామె.– సాక్షి, నేషనల్ డెస్క్ -
అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో 'ఇడ్లీ లొల్లి'.. అసలు ఈ ఇడ్లీ కథేంటంటే..?
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్-రాధికాల ప్రీ వెడ్డింగ్ వేడుకలు చాలా అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. మూడు రోజులు జరిగిన ఈ వేడుకల్లో సిని ప్రముఖులంతా ఆడి పాడి సందడి చేశారు. అయితే ఈ వేడుకల్లో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ టాలీవుడ్ నటుడు రామ్ చరణ్‌ని ఇడ్లీ అని సంబోధించడం చర్చనీయాంశంగా మారింది. షారుఖ్ ఫన్నీగా పిలిచారనుకుందామన్న అంత పెద్ద వేడుకలో పిలవడం చాలమందికి నచ్చలేదు. నార్త్ ఇండియన్ హీరోలకు దక్షిణాది హీరోలంటే చులకనే అంటూ రచ్చ మొదలయ్యింది. సరదా సంబోధన కాస్త సోషల్ మీడియాలో సీరియస్ ఇష్యూగా చర్చలకు తెరలేపింది. దక్షిణాది కాబట్టి ఇడ్డీ వడ అని షారుక్ హేళనగా సంబోధించినప్పటికీ..ఇడ్డీ భారతదేశ వంటకం మాత్రం కాదు. వివాదాస్పదంగా మారిన ఈ ఇడ్లీ వ్యాఖ్య నేపథ్యంలో అసలు ఇడ్లీ వంటకం మూలం ఏమిటీ? ఎక్కడ నుంచి ఈ అల్పహారం భారతదేశానికి వచ్చిందో చూద్దామా!. మన భారతీయులకు ముఖ్యంగా దక్షిణాది వాళ్లు వేడి వేడి ఇడ్లీ, అందులోకి మంచి కొబ్బరి చట్నీ, వేడి వేడి సాంబార్ ఉంటే ప్రాణం లేచొస్తుందన్నట్లు భావిస్తారు. ఇది వారికి ఎంతో ఇష్టమైన అల్పాహారం కూడా. అయితే ఈ ఇడ్డీ వంటకం భారతీయ వంటకం కాదు. దాని మూలం భారతదేశానికి చెందింది ఎంత మాత్రం కాదు. కాస్త శరీరంలో నలతగా ఉన్న ఇడ్డీ తింటే తేలిగ్గా అరుగుతుందంటారు. ముఖ్యంగా వైద్యులు కూడా రోగులకు ఈ అల్పాహారాన్ని ప్రివర్ చేస్తారు. అలాంటి ఇడ్డీ ఎక్కడ నుంచి వచ్చిందనే విషయం గురించి కర్ణాటకకు చెందని ప్రముఖ ఆహార శాస్త్రవేత్త, పోషకాహార నిపుణుడు, కెటీ ఆచార్య సవివరంగా వెల్లడించారు. ఇడ్లీ క్రీస్తూ పూర్వం 7 లేదా 12వ శతాబ్దంలో ఇండోనేషియాల్లో ఈ వంటకాన్ని చేసేవారట. వాళ్లు ఈ వంటాకాన్ని కెడ్లీ లేదా కేదారి అనిపిలిచేవారట. అయితే మన మన హిందూ రాజులు ఈ ఇండోనేషియాని పాలించడంతో సెలవుల్లో బంధువులను కలవడానికి భారత్‌కి వచ్చేవారట. అలా వస్తూ వస్తూ..తమ తోపాటు రాజ్యంలో ఉండే వంటవాళ్లను కూడా వెంటపెట్టుకుని తీసుకువెళ్లేవారట. అలా ఈ ఇండోనేషియ వంటకం భారత్‌లోకి వచ్చి ఇడ్లీగా స్థిరపడింది. చరిత్రను పరిశీలిస్తే.. చారిత్రాత్మకంగా అరబ్బులు కూడా ఇడ్లీ వంటకంతో సంబంధం ఉందని మరో కథ చెబుతోంది. 'ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఫుడ్ హిస్టరీ అనే పుస్తకంలోనూ, 'సీడ్ టు సివిలైజేషన్ - ది స్టోరీ ఆఫ్ ఫుడ్' అనే మరో పుస్తకంలో భారతదేశంలో స్థిరపడ్డ అరబ్బులు హలాల్ ఆహారాల తోపాటు రైస్‌బాల్స్ తినేవారని, వాటిని కొబ్బరి గ్రేవీతో తినేవారని ఉంది. ఇక్కడ అరబ్బులు ఇడ్లీలను రైస్‌బాల్స్ అని పిలిచే వారని తెలుస్తోంది. అలా ఇడ్లీలు మన భారతీయ వంటకాల్లో భాగమయ్యాయి. అందుకు ఆధారాలు కూడా ఉన్నాయి. ఇక ఏడోవ శతాబ్దాపు కన్నడ రచన "వద్దరాధనే" అనే గ్రంథంలో ఇడ్డీల గురించి ప్రస్తావించబడింది. వాటిని 'ఇద్దాలి'గా పిలిచినట్లు వాటి తయారీ గురించి సవివరంగా ఉంది. అలాగే పదవ శతాబ్దపు తమిళ వచనం పెరియ పురాణంలో కూడా ఈ వంటకం గురించి ప్రస్తావించబడి ఉంది. ఇది శైవ సాధువుల సముహం అయిన 63 నాయిర్ల జీవిత కథను వివరిస్తూ.. ఈ వంటకం వచ్చిన విధానం గురించి రాసి ఉంది. ఇక మరో చారిత్రక ఆధారం ప్రకారం..క్రీస్తూ శకం 10వ శతాబ్దంలో ఘజనీ మహమ్మద్ సోమనాథ్ ఆలయం దాడి తర్వాత సౌరాష్ట్ర వ్యాపారులు దక్షిణ భారతదేశానికి రావడం జరిగింది. అప్పుడే ఈ ఇడ్లీ వంటకాన్ని కనుగొనడం జరిగింది. దానికి ఈ పేరు పెట్టడం జరిగిందని ఉంది. వీటన్నింటి బట్టి చూస్తే ఇడ్డీ అనే వంటకం మూలం భారత్ కాదని పేర్లు మార్చుకుంటూ మన దేశానికి వచ్చిందని స్పష్టం అవుతోంది. ఇవన్నీ ఎలా ఉన్నా ఈ ఇడ్లీ వంటకం మన దేశంలోని భారతీయల మనసులను దోచుకుని ఇష్టమైన వంటకంగా స్థిరపడిపోయిందనే విషయం గ్రహిస్తే మంచిది. (చదవండి: నిమ్మచెక్కతో వంటింటి సమస్యలకు చెక్‌పెట్టండి) -
Year End 2023: ఆవిష్కరణల ఏడాది
అంతరిక్ష అన్వేషణ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ దాకా, గ్లోబల్ వారి్మంగ్ నుంచి పలు మానవ వికాసపు మూలాల దాకా శాస్త్ర సాంకేతిక రంగాల్లో 2023లో పలు నూతన ఆవిష్కరణలు చోటుచేసుకున్నాయి. ప్రపంచం దృష్టిని తమవైపుకు తిప్పుకోవడమే గాక భవిష్యత్తుపై కొంగొత్త ఆశలు కూడా కల్పించాయి. వినాశ హేతువైన గ్లోబల్ వారి్మంగ్‌లో కొత్త రికార్డులకూ ఈ ఏడాది వేదికైంది! 2023లో టాప్ 10 శాస్త్ర సాంకేతిక, పర్యావరణ పరిణామాలను ఓసారి చూస్తే... 1. చంద్రయాన్ దశాబ్దాల కృషి అనంతరం భారత్ ఎట్టకేలకు చందమామను చేరింది. తద్వారా చంద్రయాన్–3 ప్రయోగం చరిత్ర సృష్టించింది. పైగా ఇప్పటిదాకా ఏ దేశమూ దిగని విధంగా చంద్రుని దక్షిణ ధ్రువంవైపు చీకటి ఉపరితలంపై దిగిన రికార్డును కూడా చంద్రయాన్–3 సొంతంచేసుకుంది. ఇంతటి ప్రయోగాన్ని ఇస్రో కేవలం 7.5 కోట్ల డాలర్ల వ్యయంతో దిగి్వజయంగా నిర్వహించడం ప్రపంచాన్ని అబ్బురపరిచిందనే చెప్పాలి. చంద్రుని ఉపరితలంపై సల్ఫర్ జాడలున్నట్టు చంద్రయాన్–3 ప్రయోగం ధ్రువీకరించింది. రెండు వారాల పాటు చురుగ్గా పని చేసి దాన్ని ప్రయోగించిన లక్ష్యాన్ని నెరవేర్చింది. 2. కృత్రిమ మేధ ఈ రంగంలో కీలక ప్రగతికి 2023 వేదికైంది. 2022 చివర్లో ఓపెన్ఏఐ విడుదల చేసిన ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ ఈ ఏడాది అక్షరాలా సంచలనమే సృష్టించింది. ఆకా శమే హద్దుగా అన్ని రంగాల్లోకి చొచ్చుకుపోయింది. లీవ్ లెటర్లు ప్రిపేర్ చేసినంత సులువుగా సృజనాత్మకమైన లవ్ లెటర్లనూ పొందికగా రాసి పెడుతూ వైవిధ్యం చాటుకుంది. అప్పుడప్పుడూ తడబడ్డా, మొత్తమ్మీద అన్ని అంశాల్లోనూ అపారమైన పరిజ్ఞానం, నైపుణ్యంతో యూజర్ల మనసు దోచుకుంది. గూగుల్ తదితర దిగ్గజాలు కూడా సొంత ఏఐ చాట్బోట్లతో బరిలో దిగుతుండటంతో ఏఐ రంగంలో మరిన్ని విప్లవాత్మక పరిణామాలు వచ్చేలా ఉన్నాయి. 3. ఆదిమ ‘జాతులు’! మనిషి పుట్టిల్లు ఏదంటే తడుముకోకుండా వచ్చే సమాధానం... ఆఫ్రికా. అంతవరకూ నిజమే అయినా, మనమంతా ఒకే ఆదిమ జాతి నుంచి పుట్టుకొచ్చామని ఇప్పటిదాకా నమ్ముతున్న సిద్ధాంతం తప్పని 2023లో ఓ అధ్యయనం చెప్పింది. మన మూలాలు కనీసం రెండు ఆదిమ జాతుల్లో ఉన్నట్టు తేలి్చంది! 10 లక్షల ఏళ్ల కింద ఆఫ్రికాలో ఉనికిలో ఉన్న పలు ఆదిమ జాతులు హోమోసెపియన్ల ఆవిర్భావానికి దారి తీసినట్టు డీఎన్ఏ విశ్లేషణ ఆధారంగా అది చెప్పడం విశేషం! మూలవాసులైన అమెరికన్లు దాదాపు 20 వేల ఏళ్ల కింద ఉత్తర అమెరికాకు వలస వెళ్లి యురేషియాకు తిరుగు పయనమైనట్టు మరో అధ్యయనం తేల్చింది. 4. గ్రహశకలం ఓసిరిస్ నాసా ప్రయోగించిన ఒసిరిస్ రెక్స్ రోబోటిక్ అంతరిక్ష నౌక ఏడేళ్ల ప్రయాణం అనంతరం బెన్నూ గ్రహశకలంపై దిగింది. అక్కడి దాదాపు పావు కిలో పరిమాణంలో రాళ్లు, ధూళి నమూనాలను సేకరించి భూమికిపైకి పంపింది. అవి సెపె్టంబర్ 24న అమెరికాలోని ఉటా ఎడారి ప్రాంతంలో దిగాయి. వాటిని విశ్లేషించిన సైంటిస్టులు నీటితో పాటు భారీ మొత్తంలో కార్బన్ జాడలున్నట్టు తేల్చారు. బెన్నూ గ్రహశకలం భూమి కంటే పురాతనమైనది. దాని నమూనాల విశ్లేషణ ద్వారా భూమిపై జీవం ఆవిర్భావానికి సంబంధించిన కీలకమైన రహస్యాలు వెలుగు చూడవచ్చని భావిస్తున్నారు. 5. అత్యంత వేడి ఏడాది చరిత్రలో ఇప్పటిదాకా నమోదైన అత్యంత వేడి ఏడాదిగా 2023 ఓ అవాంఛనీయ రికార్డును సొంతం చేసుకుంది. ఏప్రిల్ నుంచి నవంబర్ దాకా ప్రతి నెలా ఇప్పటిదాకా అత్యంత వేడిమి మాసంగా నమోదవుతూ వచి్చంది! ఫలితంగా ఏడాది పొడవునా లిబియా నుంచి అమెరికా దాకా తీవ్ర తుఫాన్లు, వరదలు, కార్చిచ్చులు ఉత్పాతాలు సృష్టిస్తూనే వచ్చాయి. పైగా నవంబర్‌లో అయితే 17వ తేదీన భూ తాపంలో చరిత్రలోనే తొలిసారిగా 2 డిగ్రీల పెరుగుదల నమోదైంది! 2 డిగ్రీల లక్ష్మణ రేఖను తాకితే సర్వనాశనం తప్పదని సైంటిస్టులు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం వణికిస్తోంది. 6. సికిల్ సెల్‌కు తొలి జన్యుచికిత్స సికిల్ సెల్, బెటా థలస్సీమియా వ్యాధులకు తొలిసారిగా జన్యు చికిత్స అందుబాటులోకి వచి్చంది. వాటికి చికిత్స నిమిత్తం కాస్జెవీ 9క్రిస్పర్ కేస్9) జన్యు ఎడిటింగ్ టూల్ వాడకానికి బ్రిటన్ ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం లభించింది. ఈ థెరపీ ద్వారా రోగులకు నొప్పి నిదానించిందని, ఎర్ర రక్త కణాల మారి్పడి ఆవశ్యకత కూడా తగ్గుముఖం పట్టిందని తేలింది. కాకపోతే ఈ చికిత్స ఖరీదే ఏకంగా 20 లక్షల డాలర్లు! పైగా భద్రత అంశాలు, దీర్ఘకాలిక పనితీరు తదితరాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 7. ఊబకాయానికి మందు మధుమేహానికి ఔషధంగా పేరుబడ్డ వెగోవీ ఊబకాయాన్ని తగ్గించే మందుగా కూడా తెరపైకి వచ్చి సంచలనం సృష్టించింది. బరువును తగ్గించడం మాత్రమే గాక గుండెపోటు, స్ట్రోక్ తదితర ముప్పులను కూడా ఇది బాగా తగ్గిస్తుందని తేలడం విశేషం. వీటితో పాటు పలురకాల అడిక్షన్లకు చికిత్సగా కూడా వెగోవీ ప్రభావవంతంగా ఉపయోగపడుతోందని తేలింది. అయితే దీని వాడకం వల్ల థైరాయిడ్ క్యాన్సర్ వంటి సైడ్ ఎఫెక్టులు రావచ్చంటున్నారు! 8. పాపం పక్షిజాలం ప్రపంచవ్యాప్తంగా జంతుజాలానికి, మరీ ముఖ్యంగా పక్షిజాలానికి మరణశాసనం రాసిన ఏడాదిగా 2023 నిలిచింది! ప్రపంచ వ్యాప్తంగా లక్షల కొద్దీ పక్షి జాతుల జనాభాలో ఈ ఏడాది విపరీతమైన తగ్గుదల నమోదైనట్టు సైంటిస్టులు తేల్చారు. గత నాలుగు దశాబ్దాలుగా పెరుగుతూ వస్తున్న ఈ ధోరణి 2023లో బాగా వేగం పుంజుకున్నట్టు పలు పరిశోధనల్లో తేలింది. పురుగుమందుల విచ్చలవిడి వాడకమే పక్షుల మనుగడకు ముప్పుగా మారిందని తేలింది! 9. మూల కణాధారిత పిండం అండం, శుక్ర కణాలతో నిమిత్తం లేకుండానే కేవలం మూల కణాల సాయంతో మానవ పిండాన్ని సృష్టించి ఇజ్రాయెల్ సైంటిస్టులు సంచలనం సృష్టించారు. అది కూడా మహిళ గర్భంతో నిమిత్తం లేకుండా ప్రయోగశాలలో వారీ ఘనత సాధించారు. ఈ నమూనా పిండం ప్రయోగశాలలో 14 రోజుల పాటు పెరిగింది. ఆ సమయానికి సహజంగా తల్లి గర్భంలో ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఎదిగిందని తేలింది. మానవ పునరుత్పత్తి రంగంలో దీన్ని కీలక మైలురాయిగా భావిస్తున్నారు. ఇలాంటి మరిన్ని ప్రయోగాలకు ఇది ప్రేరణగా నిలుస్తుందని భావిస్తున్నారు. 10. కార్చిచ్చులు 2023లో కార్చిచ్చులు కొత్త రికార్డులు సృష్టించాయి. ముఖ్యంగా కెనడాలోనైతే పెను వినాశనానికే దారి తీశాయి. వీటి దెబ్బకు అక్కడ గత అక్టోబర్ నాటికే ఏకంగా 4.5 కోట్ల ఎకరాలు బుగ్గి పాలయ్యాయి! అక్కడ 1989లో నమోదైన పాత రికార్డుతో పోలిస్తే ఇది ఏకంగా రెట్టింపు విధ్వంసం. అమెరికా, బ్రిటన్, స్పెయిన్, నార్వే వంటి పలు ఇతర దేశాల్లోనూ కార్చిచ్చులు విధ్వంసమే సృష్టించాయి. వీటి దెబ్బకు జూన్ నెలంతా అమెరికాలో వాయు నాణ్యత ఎన్నడూ లేనంతగా తగ్గిపోయింది. హవాయి దీవుల్లో కార్చిచ్చుకు ఏకంగా 100 మంది బలయ్యారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రపంచ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న భారత సంతతి నేతలు
భారత సంతతికి చెందిన పలువురు నేతలు ప్రపంచంలోని వివిధ దేశాల్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి మరో దేశం చేరింది. సింగపూర్ నూతన అధ్యక్షునిగా భారత సంతతికి చెందిన థర్మన్ షణ్ముగరత్నం బాధ్యతలు చేపట్టారు. ఫలితంగా ప్రపంచంలోని పలు దేశాల రాజకీయాల్లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న భారతీయ మూలాలు కలిగిన నేతల జాబితాలో షణ్ముగరత్నం చేశారు. షణ్ముగరత్నం 70 శాతం ఓట్లతో ఘనవిజయం సాధించారు. ఆయన సింగపూర్ తొమ్మిదవ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. షణ్ముగరత్నం పదవీకాలం ఆరు సంవత్సరాలు. పెరుగుతున్న భారత సంతతినేతల ప్రభావం సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్ నూతన అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నం అభినందించారు. ప్రపంచ స్థాయిలో ఉన్నత పదవికి ఎన్నికైన భారతీయ వారసత్వానికి చెందిన అనేక మంది నాయకులలో థర్మన్ షణ్ముగరత్నం కూడా చేరారని ఆయన అన్నారు. షణ్ముగరత్నం విజయం ప్రపంచ వ్యాప్తంగా భారతీయుల ప్రభావానికి ప్రతీక అని లూంగ్ అన్నారు. ప్రపంచ రాజకీయాల్లో భారత సంతతి నేతలు.. 1. అమెరికాలో భారతీయ-అమెరికన్ కమ్యూనిటీకి పెరుగుతున్న ప్రభావం కమలా హారిస్ విజయంతో స్పష్టంగా కనిపిస్తుంది. అమెరికాకు తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్‌గా భారతీయ సంతతికి చెందిన హారిస్ నియమితులయ్యారు. దీనికి ముందు ఆమె 2017 నుండి 2021 వరకు కాలిఫోర్నియా సెనేటర్‌గా ఉన్నారు. డెమొక్రాట్ అయిన హారిస్ 2011 నుండి 2017 వరకు కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా కూడా పనిచేశారు. ఆమె కాలిఫోర్నియాలో ఇండియన్, జమైకన్ తల్లిదండ్రులకు జన్మించారు. 2. అమెరికా మధ్యంతర ఎన్నికలలో అధికార డెమొక్రాట్ పార్టీ నుండి ఐదుగురు భారతీయ మూలాలు కలిగిన నేతలు తమ హవా చాటారు. వారిలోరాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, ప్రమీలా జయపాల్, అమీ బెరా, శ్రీ తానేదార్ ఉన్నారు. వీరు యూఎస్ ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. ఇది కూడా చదవండి: 10 అనవసర విషయాలు.. వీటి జోలికి వెళ్లకపోవడమే శ్రేయస్కరం! 3. కాలిఫోర్నియాలో భారత సంతతికి చెందిన చెందిన ప్రముఖ రాజకీయ నేత హర్మీత్ ధిల్లాన్ ఇటీవలే రిపబ్లికన్ నేషనల్ కమిటీ (ఆర్ఎన్సీ) చైర్మన్ ఎన్నికలలో పోటీ చేశారు. 4. భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి వంటి నేతలు వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి తమ అభ్యర్థిత్వాన్ని సమర్పించారు. 5. రిషి సునాక్ గత ఏడాది బ్రిటన్‌కు మొదటి భారతీయ సంతతికి చెందిన ప్రధాన మంత్రి అయ్యారు. గోవాకు చెందిన సుయెల్లా బ్రేవర్మన్ అతని హోం సెక్రటరీగా పనిచేస్తున్నారు. బ్రేవర్మాన్ తర్వాత సునాక్ క్యాబినెట్లో గోవా మూలాలు కలిగిన రెండవ మంత్రి క్లైర్ కౌటిన్హో. కౌటిన్హో ఇటీవలే నూతన ఎనర్జీ సెక్యూరిటీ, నెట్ జీరో సెక్రటరీగా ప్రమోషన్ అందుకున్నారు. 6. సునాక్ కంటే ముందు ప్రీతి పటేల్.. బోరిస్ జాన్సన్ క్యాబినెట్లో హోం సెక్రటరీగా ఉన్నారు. జాన్సన్ క్యాబినెట్లో అలోక్ శర్మ అంతర్జాతీయ అభివృద్ధి కార్యదర్శిగా వ్యవహరించారు. 7. ఐర్లాండ్ ప్రధాన మంత్రి లియో ఎరిక్ వరద్కర్ కూడా భారతీయ సంతతికి చెందిన వారే కావడం గమనార్హం. వరద్కర్.. అశోక్, మిరియం వరద్కర్ దంపతుల మూడవ సంతానం. ఎరిక్ వరద్కర్ తండ్రి ముంబైలో జన్మించారు. 1960లలో యునైటెడ్ కింగ్డమ్కు తరలి వెళ్లారు. 8. ఆంటోనియో కోస్టా 2015 నుండి పోర్చుగల్ ప్రధాన మంత్రిగా ఉన్నారు. అతను సగం భారతీయుడు.. సగం పోర్చుగీస్. 9. కెనడాలో ఫెడరల్ మంత్రి అయిన మొదటి హిందువు అనితా ఆనంద్. ఆనంద్ ఈ ఏడాది జూలైలో ట్రెజరీ బోర్డు ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆమె తల్లిదండ్రులు భారతీయులు. తండ్రి తమిళనాడు, తల్లి పంజాబ్‌కు చెందినవారు. 10. కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో మంత్రివర్గంలో మరో ఇద్దరు భారతీయ సంతతికి చెందిన సభ్యులు కూడా ఉన్నారు. వారు హర్జిత్ సజ్జన్, కమల్ ఖేరా. 11. ప్రియాంక రాధాకృష్ణన్ న్యూజిలాండ్‌లో మంత్రి అయిన మొదటి భారతీయ సంతతికి చెందిన వ్యక్తి. మలయాళీ తల్లిదండ్రులకు చెన్నైలో జన్మించిన ఆమె ప్రస్తుతం కమ్యూనిటీ, వాలంటరీ సెక్టార్‌కు మంత్రిగా ఉన్నారు. 12. ట్రినిడాడ్, టొబాగో అధ్యక్షునిగా ఎన్నికైన క్రిస్టీన్ కార్లా కంగాలూ.. ఇండో-ట్రినిడాడియన్ కుటుంబంలో జన్మించారు. 13. భారత సంతతికి చెందిన న్యాయవాది, రచయిత ప్రీతమ్ సింగ్ 2020 నుండి సింగపూర్‌లో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. 14. దేవానంద్ శర్మ 2019లో ఆస్ట్రేలియన్ పార్లమెంట్ సభ్యుడైన మొదటి భారతీయ సంతతికి చెందిన వ్యక్తిగా నిలిచారు. 15. గయానా అధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ అలీ లియోనోరాలో ముస్లిం ఇండో-గయానీస్ కుటుంబంలో జన్మించారు. 16. ప్రవింద్ జుగ్నాథ్ జనవరి 2017 నుండి మారిషస్ ప్రధాన మంత్రిగా ఉన్నారు. అతను 1961లో హిందూ యదువంశీ కుటుంబంలో జన్మించారు. అతని ముత్తాత 1870లలో భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి మారిషస్‌కు వలస వెళ్లారు. 17. 2019 నుండి మారిషస్ అధ్యక్షుడు పృథ్వీరాజ్ సింగ్ రూపన్ భారతీయ ఆర్య సమాజ్ హిందూ కుటుంబంలో జన్మించారు. 18. చంద్రికాప్రసాద్ సంతోఖి 2020 నుండి సురినామ్ అధ్యక్షుడిగా ఉన్నారు. సంతోఖి 1959లో లెలీడోర్ప్‌లో ఇండో-సురినామ్ హిందూ కుటుంబంలో జన్మించారు. 19. వేవెల్ రాంకలవాన్ అక్టోబర్ 2020 నుండి సీషెల్స్ అధ్యక్షుడిగా ఉన్నారు. అతని తాత బీహార్‌కు చెందినవారు. భారతీయ వారసత్వానికి చెందిన 200 మందికి పైగా నాయకులు ప్రపంచవ్యాప్తంగా 15 దేశాల్లో ప్రజా సేవలో ఉన్నత స్థానాల్లో ఉన్నారని ఇండియాస్పోరా గవర్నమెంట్ లీడర్స్ లిస్ట్ తెలియజేస్తోంది. వీరిలో 60 మందికిపైగా నేతలు కేబినెట్ పదవుల్లో ఉన్నారు. ఇది కూడా చదవండి: నగరాలకు చెట్లు అందించే 12 ప్రయోజనాలివే! -
గ్రావిటీ హోల్లో భూ ఆవిర్భావ నమూనా?
నేటికీ భూమి మూలం ఏమిటనేది శాస్త్రవేత్తలకు సైతం అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. భూమి చరిత్ర ఏమిటి? అది ఎలా పుట్టింది? దీనిపై జీవం ఎలా మొదలైంది?.. ఇలాంటి కొన్ని ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానాలు ఇప్పటి వరకు వెల్లడికాలేదు. అయితే ఇప్పుడు గ్రావిటీ హోల్ దీనికి సరైన సమాధానం చెప్పనున్నది. దీని సాయంతో శాస్త్రవేత్తలు భూమి ఆవిర్భావానికి గల కారణాలను తెలుసుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పరిశోధనలో ఏమి తేలింది? ఇటీవల బెంగుళూరులోని సెంటర్ ఫర్ ఎర్త్ సైన్సెస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సంయుక్తంగా ఒక పరిశోధనను నిర్వహించాయి. హిందూ మహాసముద్రంలో గ్రావిటీ హోల్ ఉందన్న విషయాన్ని వారు గుర్తించారు. ఈ గురుత్వాకర్షణ కేంద్రం ఒక పురాతన సముద్ర అవశేషం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లక్షల సంవత్సరాల క్రితమే ఈ సముద్రం భూమి నుండి కనుమరుగైంది. ఈ పరిశోధన భూ ఆవిర్భావ రహస్యాల పొరలను తెరిచింది. దీని సాయంతో రానున్న కాలంలో వీటి ఆధారంగా భూమి మూలానికి సంబంధించిన పలు విషయాలు తెలుసుకోగలమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గురుత్వాకర్షణ రంధ్రం ఎంత లోతున ఉంది? పరిశోధకులు ఈ గురుత్వాకర్షణ రంధ్రంనకు ఐఓజీఎల్ అనే పేరు పెట్టారు. ఇది హిందూ మహాసముద్రంలో సుమారు రెండు మిలియన్ చదరపు మైళ్ల మేరకు విస్తరించి ఉంది. ఇక దీనిలోతు విషయానికి వస్తే ఇది భూమి క్రస్ట్ కింద 600 మైళ్లకు మించిన లోతున ఉంది. ఈ ఐఓజీఎల్ ఏనాడో అదృశ్యమైన టెథిస్ మహాసముద్రంలోని ఒక భాగమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం ఇది భూమి లోతుల్లో మునిగిపోయివుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాగా గోండ్వానా, లారాసియా ఖండాలను టెథిస్ మహాసముద్రం వేరుచేసిందని కూడా శాస్త్రవేత్తలు చెబుతుంటారు. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం.. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం ఈ గురుత్వాకర్షణ రంధ్రం సుమారు రెండు కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడి ఉంటుందని, ఇది రాబోయే కొన్ని మిలియన్ సంవత్సరాల వరకు అలాగే ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా జరగడం వెనుక గురుత్వాకర్షణ శక్తి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి విపరీతమైన గురుత్వాకర్షణ శక్తి గుండా వెళుతున్నప్పుడు ఈ గ్రావిటీ హోల్ ఏర్పడివుంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ గురుత్వాకర్షణ రంధ్రంపై జరిగిన పరిశోధన వివరాలు జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్‌లో ప్రచురితమయ్యాయి. ఇది కూడా చదవండి: ‘స్మైలింగ్ డెత్’ అంటే ఏమిటి? చనిపోయే ముందు ఎందుకు నవ్వుతుంటారు? -
సుందర్ పిచాయ్,సత్య నాదెళ్ల మాత్రమేకాదు, ఈ టాప్ సీఈవోల గురించి తెలుసా?
-
WHO: కరోనా మహమ్మారి మూలాల గురించి మీకు తెలిసిందే చెప్పండి!
చైనా ల్యాబ్ లీక్ కారణంగా కరోనా వచ్చిదంటూ యూఎస్ వాదిస్తుండగా.. అవాస్తవం అని చైనా పదే పదే తిరస్కరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోవిడ్-19 మూలాలు గురించి మీకు తెలిసిందే చెప్పండని శుక్రవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అన్ని దేశాలను కోరింది. 2019లో చైనాలో వచ్చిన ఈ కరోనా ప్రపంచ దేశాలను ఓ కుదుపు కుదిపేసింది. లక్షల్లో మరణాలు సంభవించగా, దేశాలన్ని ఆర్థిక సంక్షోభంలో కొట్టుకునే పరిస్థితకి దారితీసింది కూడా. ఈ కారణాల రీత్యా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ మహమ్మారి పుట్టుక గురించి బహిర్గతం చేయాల్సిందిగా ఆదేశించింది. అంతేగాదు దీని గురించి అంతర్జాతీయ దేశాలతో పంచుకోవడం చాలా ముఖ్యమని నొక్కి చెప్పారు. ఇప్పడు నిందలు వేసుకోవడం ముఖ్యం కాదని, ఈ మహమ్మారి ఎల ప్రారంభమైంది అనేదానిపై అవగాహన పెంచుకుని తద్వారా భవిష్యత్తులో ఇలాంటి అంటువ్యాధులను నిరోధించవచ్చని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ అన్నారు. ఈ కోవిడ్-19 మూలాన్ని గుర్తించడానికి సంబంధించిన ఏ చిన్న ప్రణాళికను డబ్ల్యూహెచ్ఓ వదిలిపెట్టలేదని నొక్కి చెప్పారు. ఈ విషయంలో వాస్తవాలు కావాలి 2021లో యూఎన్ ఈ మహమ్మారి మూలం తెలుసుకోవడానికి సైంటిఫిక్ అడ్వైజరీ గ్రూప్(ఎస్‌ఏజీఓ) గ్రూప్‌ను కూడా ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన డేటాను చైనా పంచుకోవాలని, ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించమని ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. అలాగే డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ ఈ విషయమై చైనా అగ్రనాయకులతో పలుమార్లు చర్చించినట్లు కూడా తెలిపారు. ఇలాంటి విషయాలను రాజకీయాలు చేయొద్దని అది పరిశోధనలను కష్టతరం చేస్తుంది, ఫలితంగా ప్రపంచ సురక్షితంగా ఉండదని చెప్పారు. ఇటీవలే యూఎస్‌లోని ప్రముఖ ఎనర్జీ డిపార్ట్‌మెట్ కరోనా మూలానికి వ్యూహాన్ ల్యాబ్ లీకే ఎక్కువగా కారణమని నివేదిక కూడా ఇచ్చింది. అదీగాక ఈ ఎనర్జీ డిపార్ట్మెంట్లోనే అత్యున్నత అధికారులు ఉండటంతో ఈ నివేదిక ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈమేరకు డబ్ల్యూహెచ్ఓలోని అంటువ్యాధుల ఎపిడెమియాలజిస్ట్ వాన్ కెర్ఖోవ్ మాట్లాడుతూ..ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారు, దీర్ఘకాల కోవిడ్‌తో జీవిస్తున్న వారి కోసం ఇదేలా ప్రారంభమైందనేది తెలుసుకోవడం నైతికంగా అత్యంత ముఖ్యం. శాస్త్రీయ అధ్యయనంలో ముందుకు తీసుకువెళ్లడంలో సహాయపడటానికి ఈ సమాచారం పంచుకోవడం అత్యంత కీలకం అని అన్నారు. -
కరోనా మూలాలు కనుక్కోండి: లేదంటే మరిన్ని మహమ్మారులు
న్యూయార్క్: కరోనా వైరస్ మహమ్మారి మూలాలపై ఎడతెగని చర్చ కొనసాగుతున్న క్రమంలో అమెరికాకు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు మరో కీలక విషయాన్ని ప్రకటించారు. కోవిడ్-19 మూలాలు పూర్తిగా అర్థం చేసుకోకపోతే కోవిడ్-26, కోవిడ్-32 కూడా వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. మహమ్మారి ఎలా ప్రారంభమైందో తెలియకపోవడం వల్ల భవిష్యత్తులలో వైరస్ మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని టెక్సాస్ చిల్డ్రన్స్ హాస్పిటల్ సెంటర్ ఫర్ వ్యాక్సిన్ డెవలప్మెంట్ కోడైరెక్టర్ పీటర్ హోటెజ్ తెలిపారు. కోవిడ్-19 ఆనవాళ్లు కనుక్కోలేకపోతే విలయాలు తప్పవని అమెరికా శాస్త్రవేత్త , అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాలంలో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) కమిషనర్‌గా ఉన్న స్కాట్ గాట్లిబ్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో మరిన్ని విలయాలను నివారించేందుకు చైనా ప్రభుత్వ సహకారం అవసరమని ఆయ పేర్కొన్నారు. సార్స్ సీవోవీ2 వైరస్ చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచే లీకైనట్లు ఆధారాలు బలపడుతున్నాయని, ఇలాంటి సమయంలో ప్రపంచ దేశాలకు చైనా సహకారం కావాలని, భవిష్యత్తు మహమ్మారులను అడ్డుకోవాలంటే ఈ చర్యలు తప్పవని స్కాట్ తెలిపారు. చైనాలో సుదీర్ఘ కాలం విచారణ చేపట్టేందుకు శాస్త్రవేత్తలను అనుమతించాలన్నారు. అలాగే అక్కడి మనుషులు, జంతువుల నుంచి రక్త నమూనాలు సేకరించేందుకు శాస్త్రవేత్తలను అనుమతించాలని హోటెజ్ తెలిపారు. సైంటిస్టులు, ఎపిడమాలజిస్ట్‌లు, వైరాలజిస్టులు, బ్యాట్ ఎకాలజిస్ట్ పరిశోధకులు హుబే ప్రావిన్సులో సుమారు ఆరు నెలలు ఉండాలని హోటెజ్ పేర్కొన్నారు. అంతేకాదు ఆంక్షలు, బెదిరింపులతో సహా, చైనాపై అమెరికా ఒత్తిడి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారి మూలాలు చైనాలోనే ఉన్నాయనే, నిజాలు చెప్పకుండా ప్రపంచాన్ని మోసం చేసిందని ట్రంప్ మొదటినుంచి చైనాపై మండిపడుతున్న సంగతి తెలిసిందే. అయితే వుహాన్‌లో చేపల మార్కెట్లో తొలుత వైరస్ ఆనవాళ్లను గుర్తించారు. జంతువుల నుంచి మనుషులకు ఆ వైరస్ సోకి ఉండి ఉంటుందని చాలామంది వైరాలజిస్టులు అంచనా వేశారు. దీనిపై బిన్న వాదనల మధ్య కొనసాగుతున్న ఈ చర్చ దాదాపు ఏడాదిన్నర తరువాత మే 23న వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదికతో మరింత రాజుకుంది. వుహాన్‌లో పనిచేసే ముగ్గురు పరిశోధకులకు 2019 నవంబర్ కన్నా ముందే వైరస్ సోకినట్లు పేర్కొనడంతో కరోనా ఆనవాళ్లపై అంతర్జాతీయంగా చర్చ తిరిగి మొదలైంది. మరోవైపు వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుండే లీక్ అయ్యిందా అనే దానిపై తమ నిఘా విభాగం కీలక అంచనాలు తమ వద్ద ఉన్నాయనీ, దీనిపై లోతైన దర్యాప్తు చేయాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల ఆదేశించారు. దీనిపై 90 రోజుల్లో తనకు నివేదించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. చదవండి : వ్యాక్సిన్: మందుబాబులకు పరేషాన్! కరోనా కల్లోలం: గూడు చెదిరిన గువ్వలు -
నేటికి పాలమూరుకు 130 ఏళ్లు
సాక్షి, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ పట్టణం ఆవిర్భవించి శుక్రవారం నాటికి 130 ఏళ్లు గడుస్తోంది. గంగా జమునా తహజీబ్‌కు ఆలవాలంగా ప్రముఖులతో కీర్తింపబడుతున్న ఈ ప్రాంతంలో పాలు, పెరుగు సమృద్ధిగా లభించేవని, చుట్టూర ఉన్న అడవుల్లో పాలుగారే చెట్లు అధికంగా ఉండటంతో పట్టణంలోని కొంత భాగాన్ని పాలమూరు అనే వారని కథనాలు ఉన్నప్పటికీ.. మహబూబ్‌నగర్‌ను అసిఫ్ జాహి వంశస్థుడైన 6వ నిజాం నవాబు మీర్ మహబూబ్ అలీఖాన్ బహద్దూర్ పేరు మీద నామకరణం చేశారని తెలుస్తోంది. గతంలో రుక్మమ్మపేట, చోళవాడి, పాలమూరుగా పిలువబడిన ఈ ప్రాంతాన్ని పరిపాలించిన అసఫ్జాహి రాజులు 1890, డిసెంబర్ 4న మహబూబ్‌నగర్‌గా మార్చారని చరిత్ర చెబుతోంది. శాతవాహన, చాళుక్య రాజుల పాలన అనంతరం గోల్కొండ రాజుల పాలన కిందికి వచ్చింది. 1518 నుంచి 1687 వరకు కుతుబ్షాహి రాజులు, అప్పటి నుంచి 1948 వరకు అసబ్‌జాహి నవాబులు పాలించారని, స్వాతం్రత్యానంతరం 1948, సెపె్టంబర్ 18న నైజాం సారథ్యంలోని హైదరాబాద్ రాష్ట్రాన్ని జాతీయ స్రవంతిలో కలిపిన సందర్భంగా ఇక్కడ ఉన్న భవనాలు, భూములను ప్రభుత్వం స్వా«దీనం చేసుకొని వాటిని వివిధ కార్యాలయాలకు వినియోగించారు. నిజాం భవనాలే ప్రభుత్వ కార్యాలయాలు.. నిజాం పాలనలో నిర్మించిన భవనాలను ప్రస్తుతం పలు ప్రభుత్వ కార్యాలయాలకు వినియోగిస్తున్నారు. వాటిలో కలెక్టరేట్, తహసీల్దార్ కార్యాలయం, జిల్లా కోర్టుల సముదాయం, ఎస్పీ కార్యాలయం, మైనర్ ఇరిగేషన్ ఈఈ ఆఫీస్, ఫారెస్టు ఆఫీసెస్ కాంప్లెక్స్, పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయం, ఆర్అండ్బీ అతిథిగృహం, ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, డీఈఓ ఆఫీస్, ఆర్అండ్బీ ఈఈ కార్యాలయం, జిల్లా జైలు, వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్, బ్రాహ్మణవాడిలోని దూద్‌ఖానా, పాత పోస్టల్ సూపరింటెండెంట్, షాషాబ్‌గుట్ట హైసూ్కల్, మోడల్ బేసిక్ హైస్కూల్, రైల్వేస్టేషన్ ఉన్నాయి. నేడు ఆవిర్భావ వేడుకలు.. ఆరో నిజాం నవాబ్మీర్ మహబూబ్ అలీఖాన్ బహదూర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో 130వ మహబూబ్‌నగర్ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ రహీం గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కోవిడ్ నిబంధనల మేరకు వేడుకలు జరుపుతామని పేర్కొన్నారు. -
కరోనా మూలాలు ఇండియాలో : చైనా శాస్త్రవేత్తలు
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ పుట్టుకపై చైనా శాస్త్రవేత్తలు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైరస్ పుట్టింది చైనాలోని వుహానేలోనే అని అమెరికా సహా ప్రపంచంలోని అనేక దేశాలు వాదిస్తున్నాయి. అయితే తాజాగా ఈ మహమ్మారి వైరస్ భారత్ లేదా బంగ్లాదేశ్‌లో పుట్టి ఉండొచ్చని షాంఘై ఇన్స్స్టిటయూట్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ పరిశోధకులు తాజా పరిశోధనాలో కొత్తవాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. వీరి వాదన ప్రకారం, గత ఏడాది డిసెంబర్లో వుహాన్‌లో వైరస్ వ్యాప్తికి ముందే భారత ఉపఖండంలో సదరు వైరస్ ఉనికిలో ఉందని పేర్కొన్నారు. నవంబర్ 17న మెడికల్ జర్నల్ ది లాన్సెట్ ప్రిప్రింట్ లో ‘ది ఎర్లీ క్రిప్టిక్ ట్రాన్స్మిషన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ సార్స్-కోవ్ -2 ఇన్ హ్యమూన్ హోస్ట్స్’ పేరుతో ఇది ప్రచురితమైంది. చైనీస్ వైరస్ అంటూ కరోనా వైరస్ పుట్టుకపై రేగిన దుమారం, భారత చైనా మధ్య రాజకీయ ఉద్రిక్తతల మధ్య చైనా తాజా వాదన అగ్నికి ఆజ్యం పోస్తోంద. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ బృందం వూహాన్లో కరోనాను గుర్తించకముందే 2019 వేసవిలోనే భారతదేశంలో ఇది ఉద్భవించిందని తెలిపింది. కోవిడ్-19 అసలు తమ దేశంలో పుట్టలేదని దీనికి, తగిన ఆధారాలున్నాయని పరిశోధకులు అంటున్నారు. జంతువుల నుంచి కలుషితమైన నీటి ద్వారా కరోనా వైరస్ మానవులలోకి ప్రవేశించిందని చైనా బృందం పేర్కొంది. కరోనా వైరస్ మూలాన్ని గుర్తించడానికి చైనా బృందం ఫైలోజెనెటిక్ విశ్లేషణను చేస్తోంది. ఈ పద్ధతి ద్వారా వుహాన్లోది 'ఒరిజినల్' వైరస్ అనే వాదనను తోసిపుచ్చింది. దీనికి బదులుగా బంగ్లాదేశ్, యుఎస్ఎ, గ్రీస్, ఆస్ట్రేలియా, ఇండియా, ఇటలీ, చెక్ రిపబ్లిక్, రష్యా లేదా సెర్బియా అనే ఎనిమిది దేశాల నుంచి వచ్చిందనే వాదనను తెరపైకి తీసుకొచ్చింది. విభిన్న ఉత్పరివర్తనాల ద్వారా వైరస్ మూలాన్ని గుర్తించే ప్రయత్నంలో ఈ బృందం ఫైలోజెనెటిక్ విశ్లేషణను చేసినట్టు పరిశోధన బృందం తెలిపింది. దీన్ని ప్రమాణంగా చూపుతూ, పరిశోధకులు మొదటి కేసులు వుహాన్‌లో నమోదవ్వలేదని వాదిస్తున్నారు. వైరస్ ఒకసారి పరివర్తన చెందడానికి ఎంత సమయం పడుతుందనే అంచనా, అక్కడ తీసిన నమూనాలతో పోల్చడం ద్వారా, వైరస్ మొదట భారత్‌లో జూలై లేదా ఆగస్టు 2019లో ఉద్భవించిందని వారు సిద్ధాంతీకరించారు. 2019 మే-జూన్ వరకు, ఉత్తర మధ్య భారతదేశం,పాకిస్తాన్లో తీవ్ర వేడి గాలులు కారణంగా తీవ్రమైన నీటి సంక్షోభం సంభంవించిందనీ ఫలితంగా మనుషులు, జంతువులు ఒకే నీటిని తాగడం వల్ల పుట్టిన మహమ్మారి ఇతర ప్రాంతాలకు విస్తరించిందని చెబుతోంది. మరోవైపు భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న వైరాలజిస్ట్ ముఖేష్ ఠాకూర్ షాంఘై అధ్యయనం ఫలితాలను తప్పుడు వాదనలు అంటూ తోసిపుచ్చారు. మరో ప్రపంచ నిపుణుడు డేవిడ్ రాబర్ట్సన్ సహా మరికొంతమంది కూడా చైనా పరిశోధకుల తాజా వాదనపై సందేహాన్ని వ్యక్తం చేశారు. కాగా కరోనా చైనా వైరస్ అనే వాదనను చైనా ఖండించండం ఇదే మొదటిసారి కాదు. గతంలో యుఎస్, ఇటలీలో మొదటి కోవిడ్-19 కేసులు నమోదైనట్లు వాదించింది. అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా విషయంలో చైనాపై విమర్శలు గుప్పించారు. అంతేకాదు చైనాకు డబ్ల్యూహెచ్‌వో వత్తాసు పలుకుతోందని ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరగాలని కూడా కొన్ని దేశాలు పట్టు బట్టాయి. ఈ నేపథ్యంలోనే 10 మంది నిపుణుల బృందంతో డబ్ల్యూహెచ్‌వో పరిశోధన అనంతరం చైనాలో కరోనావైరస్ చైనాలోనే పుట్టి ఉండవచ్చని అంచనాకు వచ్చారు. కానీ కరోనా వైరస్ పుట్టుకకు సంబంధించి వాస్తవ మూలాలపై శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు ఇంతవరకు నిర్ధారణ కాలేదు. -
కరోనా మూలాలు తేలాల్సిందే!
సిడ్నీ: కరోనా వైరస్ మహమ్మారి చైనాలోనే పుట్టిందన్న వాదనల మధ్య ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్ మరోసారి చైనాపై తన దాడిని ఎక్కుపెట్టారు. కరోనా వైరస్ పుట్టుపూర్వోత్తరాలు తెలుసు కోవడానికి ప్రపంచ దేశాలు తమ వంతు కృషి చేయాలని డిమాండ్ చేశారు. మరోసారి ఇలాంటి మహమ్మారి విజృంభించకుండా, ఏం జరిగిందో అర్థం చేసుకునేందుకు మనం చేయగలిగినదంతా చేయాలని చెప్పారు. ఐక్యరాజ్యసమితి సమావేశంలో మోరిసన్ మాట్లాడుతూ శనివారం ఈవ్యాఖ్యలు చేశారు. కరోనా మూలలపై విచారణ చేస్తేనే మానవాళికి మరో ప్రపంచ మహమ్మారి ముప్పు తప్పుతుందన్నారు. (కరోనా మరణాలపై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన) టెలికాన్ఫరెన్స్ వీడియో లింక్ ద్వారా ఐరాస్ 75 వ వార్షికోత్సవ సమావేశాల్లో ప్రసగించిన మోరిసన్ ప్రపంచ దేశాలను కరోనా వణికించిందని, మానవాళిని విపత్తులో ముంచిందని వ్యాఖ్యనిచారు. కోవిడ్-19 వైరస్ జెనెటిక్ మూలాన్ని, అది మానవులకు ఎలా వ్యాపించిందో గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ఎవరు టీకాను కనుగొన్నారో వారు ప్రపంచ దేశాలతో తప్పక పంచుకోవాలని ఇది నైతిక బాధ్యత అని పేర్కొన్నారు. ఈ విషయంలో ఆస్త్రేలియా వాగ్దానం చేస్తోందిని అలాగే అన్ని దేశాలు అలా చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది ప్రారంభంలో చైనాపై ప్రధాని దాడి తరువాత ఆస్ట్రేలియా చైనా మధ్య సంబంధాలు, వాణిజ్య యుధ్దం సెగలకు మోరిసన్ తాజా వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోస్తున్నాయి. కాగా ప్రపంచవ్యాప్తంగా విలయాన్ని సృష్టించిన కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిపై సర్వత్రా ఆగ్రహ జ్వాలలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తరువాత ఆస్ట్రేలియా డ్రాగన్‌ను టార్గెట్ చేసింది. అప్పటి నుండి చైనా ఆస్ట్రేలియాపై వాణిజ్య ఆంక్షలు విధించింది. బీఫ్ దిగుమతులను నిలిపివేసింది. వైన్ దిగుమతులపై యాంటీ డంపింగ్ దర్యాప్తును ప్రారంభించింది. చైనాలోని వుహాన్ సిటీలోని ఓ ప్రయోగశాలలో ఈ వైరస్ పుట్టిందంటూ ఇప్పటికే అమెరికాతో పాటు పలు పాశ్చాత్య దేశాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో దీని పుట్టు పూర్వోత్తరాలపై ఓ స్వతంత్ర దర్యాప్తు నిర్వహించాల్సిందేనని ప్రపంచ ఆరోగ్య సంస్ధపై ఒత్తిడి పెరుగుతోంది. (కరోనాపై లాన్సెట్ తాజా హెచ్చరికలు) -
కరోనా వైరస్ కృత్రిమంగా తయారి కాదు!
లాస్ ఏంజెలెస్: ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్–19 వ్యాధి కారక కరోనా వైరస్ పరిశోధనశాలలో కృత్రిమంగా తయారైంది కాదని, పరిణామ క్రమంలో భాగంగా ప్రకృతిలో సహజసిద్ధంగా పరిణమించిన సూక్ష్మజీవేనని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. గబ్బిలాల్లో ఉండిపోయి.. ఒకానొక సందర్భంలో మనుషులకు చేరిందని... తద్వారా లక్షల మందికి విస్తరించింనట్లు తాము అంచనా వేస్తున్నామని స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నేచర్ మెడిసిన్ తాజా సంచికలో ప్రచురితమైన పరిశోధన వ్యాసం ఇదే విషయాన్ని చెబుతోంది. (కరోనా: ఒక్కరోజే 475 మంది మృతి) కరోనా వైరస్‌తోపాటు సార్స్ తదితర వైరస్ల జన్యుక్రమాలను విశ్లేషించడం ద్వారా తామీ అంచనాకు వచ్చినట్లు తెలిపారు. కరోనా వైరస్ జన్యుక్రమంలో కృత్రిమంగా చేర్చిన భాగాలేవీ లేవని తద్వారా ఇది సహజసిద్ధంగా పరిణమించిన సూక్ష్మజీవి అనడంలో ఎలాంటి సందేహం లేదని ఈ పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్త క్రిస్టియాణ్ అండర్సన్ తెలిపారు. కరోనా వైరస్ మూలభాగం ఇతర వైరస్ల కంటే భిన్నంగా ఉందని... పైగా గబ్బిలాలు, పాంగోలిన్‌కు సంబంధించిన వైరస్‌లను పోలి ఉందని క్రిస్టియన్ వివరించారు. కోవిడ్–19 వ్యాప్తి చెందుతున్న తరుణంలో ఇది మానవ నిర్మితమైందన్న వదంతులు చాలా వ్యాపించాయని, వాటన్నింటికీ తమ పరిశోధన స్పష్టమైన సమాధానం చెబుతోందని అన్నారు. (కేసులు 2లక్షలు మరణాలు 8వేలు) -
అలా అరిచినందుకే.. శిక్షపడింది..!
లండన్ః పాకిస్తాన్ సంతతికి చెందిన ఓ వ్యక్తి ''అల్లాహ్ -ఒ-అక్బర్'', ''బూమ్'' అంటూ విమానంలో అరవడం, ప్రయాణీకులను భయభ్రాంతులకు గురిచేయడంతో అతడికి పది వారాల జైలు శిక్ష పడింది. అతడు వాడిన పదాలు తప్పు కాకపోయినప్పటికీ విమానంలో అలా ప్రవర్తించడాన్ని కోర్టు తప్పుబట్టింది. షెహరాజ్ సర్వార్ అనే వ్యక్తి విమానంలో అల్లకల్లోలం సృష్టించడంతో అతడికి లండన్ కోర్టు ఏడు వారాల జైలు శిక్ష విధించింది. ఫిబ్రవరి నెలలో దుబాయ్ నుంచి బర్మింగ్ హామ్ వెడుతున్న ఎమిరేట్స్ బోయింగ్ 777 విమానంలో ప్రయాణించినప్పుడు అతడు చేసిన హడావుడికి ప్రయాణీకులను హడలి పోయేలా చేసింది. కాసేపు ఏం జరుగుతోందో తెలియక అంతా ఖిన్నులైపోయారు. అల్లాహ్-ఒ-అక్బర్ అంటూ అతి పెద్ద గొంతుతో, భీకరంగా పదే పదే అరుస్తూ ప్రయాణీకుల గుండెల్లో విమానాలు పరిగెత్తిచాడు. చివరికి విమానం ల్యాండ్ అయిన తర్వాత కూడ 'బూమ్' అంటూ గట్టిగా అరిచి అందర్నీ భయపెట్టినట్లు బర్మింగ్ హామ్ క్రౌన్ కోర్టు ప్రాసిక్యూటర్ అలెక్స్ వారెన్ తెలిపారు. క్యాబిన్ సిబ్బంది కూర్చోమని చెప్పినా వినకుండా సదరు వ్యక్తి అరుస్తూనే ఉండటంతో కొందరు ప్రయాణీకులు ఆగ్రహంతో పోలీసులకు ఫిర్యాదు చేశారని, అనంతరం అతడ్ని అరెస్టు చేసినట్లు అలెక్స్ వారెన్ కోర్టుకు తెలిపారు. సర్వార్ హింసాత్మక ప్రవర్తనపై ప్రయాణీకులనుంచి వెల్లువెత్తిన నేరారోపణలను ఆయన కోర్టుకు వివరించారు. ప్రాసిక్యూషన్ వాదనలు విన్న న్యాయమూర్తి ఫ్రాన్సిస్ లయర్డ్ .. విమానంలో 38 ఏళ్ళ సర్వార్ విపరీత ధోరణితో ప్రవర్థించినట్లుగా నిర్ధారించారు. శిక్షించకుండా వదిలేస్తే మరోసారి విమానాల్లో ప్రయాణీకులను భయపెట్టే ఇటువంటి ప్రయత్నాలు జరిగే అవకాశం ఉండటంతో నిందితుడు సర్వార్ కు 10 వారాల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. నిందితుడికి జైలు శిక్ష ముగిసిన తర్వాత 12 నెలల పర్యవేక్షణ ఆర్డర్ తో విడుదల చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. సర్వార్.. పాకిస్తాన్ లోని తన అమ్మమ్మ అంత్యక్రియలకు వెళ్ళి తిరిగి వస్తుండగా ఇటువంటి ఘటన జరిగిందని, అతడు కలత చెంది ఉండటంతోనే ఇలా జరిగి ఉండొచ్చని వాదించిన నిందితుడి తరపు న్యాయవాది బల్బీర్ సింగ్ సైతం తన క్లైంట్ ప్రవర్తన అవివేకంతోనే జరిగిందని ఒప్పుకున్నారు. ప్రయాణీకులను భయపెట్టే విధంగా అల్లాహ్-ఒ-అగ్బర్ అంటూ అరవడం మూర్ఖత్వమే అయినప్పటికీ, దేవుడా నీవు ఎంతో గొప్పవాడవు అంటూ ప్రార్థించడమేనని, అతడి చర్యలు ఇతర ప్రయాణీకులకు ఇబ్బంది కలిగినందుకు క్షమించమంటూ సింగ్ కోర్టుకు విన్నవించారు.