నేటికీ భూమి మూలం ఏమిటనేది శాస్త్రవేత్తలకు సైతం అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. భూమి చరిత్ర ఏమిటి? అది ఎలా పుట్టింది? దీనిపై జీవం ఎలా మొదలైంది?.. ఇలాంటి కొన్ని ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానాలు ఇప్పటి వరకు వెల్లడికాలేదు. అయితే ఇప్పుడు గ్రావిటీ హోల్ దీనికి సరైన సమాధానం చెప్పనున్నది. దీని సాయంతో శాస్త్రవేత్తలు భూమి ఆవిర్భావానికి గల కారణాలను తెలుసుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
పరిశోధనలో ఏమి తేలింది?
ఇటీవల బెంగుళూరులోని సెంటర్ ఫర్ ఎర్త్ సైన్సెస్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సంయుక్తంగా ఒక పరిశోధనను నిర్వహించాయి. హిందూ మహాసముద్రంలో గ్రావిటీ హోల్ ఉందన్న విషయాన్ని వారు గుర్తించారు. ఈ గురుత్వాకర్షణ కేంద్రం ఒక పురాతన సముద్ర అవశేషం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లక్షల సంవత్సరాల క్రితమే ఈ సముద్రం భూమి నుండి కనుమరుగైంది. ఈ పరిశోధన భూ ఆవిర్భావ రహస్యాల పొరలను తెరిచింది. దీని సాయంతో రానున్న కాలంలో వీటి ఆధారంగా భూమి మూలానికి సంబంధించిన పలు విషయాలు తెలుసుకోగలమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
గురుత్వాకర్షణ రంధ్రం ఎంత లోతున ఉంది?
పరిశోధకులు ఈ గురుత్వాకర్షణ రంధ్రంనకు ఐఓజీఎల్ అనే పేరు పెట్టారు. ఇది హిందూ మహాసముద్రంలో సుమారు రెండు మిలియన్ చదరపు మైళ్ల మేరకు విస్తరించి ఉంది. ఇక దీనిలోతు విషయానికి వస్తే ఇది భూమి క్రస్ట్ కింద 600 మైళ్లకు మించిన లోతున ఉంది. ఈ ఐఓజీఎల్ ఏనాడో అదృశ్యమైన టెథిస్ మహాసముద్రంలోని ఒక భాగమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం ఇది భూమి లోతుల్లో మునిగిపోయివుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాగా గోండ్వానా, లారాసియా ఖండాలను టెథిస్ మహాసముద్రం వేరుచేసిందని కూడా శాస్త్రవేత్తలు చెబుతుంటారు.
కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం..
శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం ఈ గురుత్వాకర్షణ రంధ్రం సుమారు రెండు కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడి ఉంటుందని, ఇది రాబోయే కొన్ని మిలియన్ సంవత్సరాల వరకు అలాగే ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా జరగడం వెనుక గురుత్వాకర్షణ శక్తి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి విపరీతమైన గురుత్వాకర్షణ శక్తి గుండా వెళుతున్నప్పుడు ఈ గ్రావిటీ హోల్ ఏర్పడివుంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ గురుత్వాకర్షణ రంధ్రంపై జరిగిన పరిశోధన వివరాలు జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్‌లో ప్రచురితమయ్యాయి.
ఇది కూడా చదవండి: ‘స్మైలింగ్ డెత్’ అంటే ఏమిటి? చనిపోయే ముందు ఎందుకు నవ్వుతుంటారు?
Comments
Please login to add a commentAdd a comment