Shah Rukh Khan: I Visit Telugu Theatre If Ram Charan Takes Me - Sakshi
Sakshi News home page

Shah Rukh Khan: రామ్‌చరణ్‌ తీసుకెళ్తానంటే తప్పకుండా వస్తా..

Published Sun, Jan 22 2023 12:21 PM | Last Updated on Sun, Jan 22 2023 1:03 PM

Shah Rukh Khan: I Visit Telugu Theatre If Ram Charan Takes Me - Sakshi

ఇందుకాయన.. ఎందుకు రాను? రామ్‌చరణ్‌ తీసుకెళ్తే తప్పకుండా వస్తా అని బదులిచ్చాడు. ఇది చూసిన

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌, స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణె జంటగా నటించిన చిత్రం పఠాన్‌. సిద్దార్థ్‌ ఆనంద్‌ డైరెక్ట్‌ చేసిన ఈ సినిమా యశ్‌ రాజ్‌ ఫిలింస్‌ నిర్మించింది. జాన్‌ అబ్రహం విలన్‌గా నటించాడు. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో జనవరి 25న విడుదల కానుంది. సినిమా రిలీజ్‌కు ఇంకా మూడు రోజుల వ్యవధి మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో AskSRK అంటూ అభిమానులతో ముచ్చటించాడు షారుక్‌.

ఈ సందర్భంగా పఠాన్‌ సినిమా అడ్వాన్స్‌ టికెట్లు, ఏకంగా థియేటరే బుక్‌ చేసుకున్నవారికి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని.. సినిమా విడుదలైన రోజు మీరు తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా థియేటర్‌కు వస్తారా? అని అడిగాడు. ఇందుకాయన.. ఎందుకు రాను? రామ్‌చరణ్‌ తీసుకెళ్తే తప్పకుండా వస్తా అని బదులిచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు.. చరణ్‌ అన్నా.. షారుక్‌ను తీసుకెళ్లు అని కామెంట్లు చేస్తున్నారు. మరి చెర్రీ ఏమైనా స్పందిస్తాడో? లేదో? చూడాలి.

చదవండి: ఆర్‌ఆర్‌ఆర్‌ బాలీవుడ్‌ మూవీయా?.. క్లాస్‌ పీకిన నెటిజన్లు
నమ్రతకు మహేశ్‌బాబు స్పెషల్‌ బర్త్‌డే విషెస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement