Viral: అచ్చం పుల్ల ఐస్‌ రూపంలో ఇడ్లీలు! | Photo Viral: Idli Ice Cream Stick Dipped In Sambar Social Media Viral | Sakshi
Sakshi News home page

Viral: అచ్చం పుల్ల ఐస్‌ రూపంలో ఇడ్లీలు!

Published Thu, Sep 30 2021 8:31 PM | Last Updated on Thu, Sep 30 2021 8:40 PM

Photo Viral: Idli Ice Cream Stick Dipped In Sambar Social Media Viral - Sakshi

దక్షిణ భారతదేశంలో ఇడ్లీ బ్రేక్‌ఫాస్ట్‌ చాలా ఫేమస్‌. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా ఇడ్లీలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇడ్లీలను సాంబార్‌తో తింటే రుచికరంగా ఉంటుందని నమ్ముతారు. అయితే సాధారంగా ఇడ్లీలు గుండ్రంగా ఉంటాయి. తాజాగా ఐస్ క్రీమ్ స్టిక్ రూపంలో ఉన్న ఇడ్లీలకు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో ఓ ఇడ్లీ ఐస్‌ క్రీమ్‌ స్టిక్ రూపంలో ఉండి.. సాంబారులో ముంచబడి ఉంది. పక్కనే మరో చిన్న గిన్నేలో చట్నీ కూడా ఉంది.

చదవండి:  Viral Food Challenge: రండి.. 20 నిమిషాల్లో తినండి 20 వేలు గెలవండి

ఈ ఫోటోను మైక్రో అంబీషియస్‌ అనే ఓ ట్విటర్ ఖాతా పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అదే విధంగా ‘ఒక్క ప్రశ్న, ఎందుకు??’ అని కాప్షన్‌ జతచేశారు. అయితే ఈ ఫోటోను చూసిన నెటిజన్లు స్పందిస్తూ.. ‘వావ్‌ అచ్చం ఐస్‌ క్రీమ్‌లా ఉన్నాయి ఇడ్లీలు’, ‘చిన్న పిల్లలు తినడానికి బాగుంటుంది’ అని కామెంట్లు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement