ఏలూరు: హోళీ రోజున కొవ్వూరులో విషాదం చోటు చేసుకుంది. కొవ్వూరు సమీపంలోని కాపవరం గ్రామంలో హోళీ పండగ ఆడిన తర్వాత ముఖాలు కడుక్కుందామని పక్కనే ఉన్న చెరువులోకి దిగిన నలుగురు బాలురు ప్రమాదవశాత్తూ మునిగిపోయారు. స్థానికులు వెంటనే అప్రమత్తమై ముగ్గురు యువకులను రక్షించారు.
కాపవరానికి చెందిన గుమ్మాల సుధాకర్ (11) చనిపోయారు. గ్రామస్తులు సుధాకర్ మృతదేహన్ని చెరువు నుంచి వెలికి తీశారు. సుధాకర్ మృతితో అతడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.