
శ్రీనివాస్ మృతదేహం
ఆదిలాబాద్‌రూరల్: పట్టణంలోని శాంతినగర్‌లో హోలీ వేడుకల్లో విషాదం నెలకొంది. శాంతినగర్‌కు చెందిన వసంతు, కమలబాయి దంపతుల రెండవ కుమారుడు పవర్ శ్రీనివాస్ (17) హోలీ సందర్భంగా స్నేహితులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నాడు. అనంతరం స్నానం చేసేందుకు సరదాగా స్నేహితులతో కలిసి మండలంలోని లాండసాంగ్వి వాగుకు వెళ్లాడు. అతనికి ఈత రాకపోవడంతో వాగులో గల్లంతయ్యాడు. తోటి మిత్రులు పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు. అందరితో కలిసి మెలిసి ఉండే శ్రీనివాస్ పట్టణంలోని ఓ కళాశాలలో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం పరీక్షకు సైతం హాజరయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment