సాక్షి, హైదరాబాద్: హోలీ రోజున పోలీసు కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడిన కేసులో సికింద్రాబాద్ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ రెండో కుమారుడు అరవింద్ యాదవ్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అరవింద్ యాదవ్(24), అతని స్నేహితులైన బి.బాబూరావు(25), ఎ.రోహిత్‌కుమార్(28), ఎం.మనోహర్ యాదవ్(26)లను మంగళవారం ఉదయం అరెస్ట్ చేసిన హుస్సేనీఆలం పోలీసులు వారికి ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాక నాంపల్లి కోర్టుకు తరలించారు. కోర్టు వారికి రిమాండ్ విధించిన నేపథ్యంలో చంచల్‌గూడ జైలుకు తరలించారు.