
హోళీ.. యువతకు రంగేళీ!
భారత దేశాన్ని పండగల దేశం అంటారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎప్పుడు ఎదో ఒక పండగ కార్యక్రమంతో సందడి సందడిగా ఉంటుంది. దేశవ్యాప్తంగా ప్రజల్ని ఏకం చేసే పండుగల్లో హోళీ ఒకటి. హోళీ పండుగ మతాలు, కులాలు, ప్రాంతాల కతీతంగా, చిన్న పెద్ద అనే తేడాలేకుండా అందరూ కలిసి హోళీ జరుపుకోవడం ఎన్నో ఏళ్లుగా వస్తోంది.
వసంత రుతువు వచ్చిన సందర్భంగా ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ రోజున జరుపుకునే పండగను దేశంలోని వివిధ ప్రాంతాల్లో మహా పాల్గుణి, హోలికా, హోలికా దహన్, హోళీ అనే పేర్లతో పిలుస్తుంటారు. వివిధ ప్రాంతాల్లో ఏ పేరుతో హోళీని జరుపుకున్న రంగులు పండగగానే ప్రతి ఒక్కరి మనసులో ముద్ర వేసుకుంది. పసిపిల్లు, పెద్దలు, ఆడ, మగ అనే బేధం లేకుండా..స్నేహితులు, బంధువులు ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటూ ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండగ హోళీ.
వసంత కాలంలో వచ్చే రంగుల పండుగను, హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవముగా జరుపుకుంటారు. భారత్ లోనే కాకుండా నేపాల్, బంగ్లాదేశ్ వంటి తదితర దేశాల్లో ప్రజలు ఆనందంగా ఈ పండుగను వైభవంగా జరుపుకుంటారు. గుజరాత్ రాష్ట్రంలో 'గోవిందా ఆలా రే.. జరా మట్కి సంభాల్ బ్రిజ్ బాలా' అంటూ జానపద గీతాలతో కృష్ణుడిని ఆరాధిస్తూ యువతీ, యువకులు రంగుల్లో మునిగి తేలుతారు. హోళీ రోజున పాలు, పెరుగు ఉన్న కుండను తాడు కట్టి 'ఉట్టి కొట్టడం' అనే ఆటను ఆడుకుంటారు. ఉట్టి కొట్టడానికి యువకులు పిరమిడ్ రూపంలో ఏర్పడి పాలు, పెరుగు ఉన్న ఉట్టిని కొట్టడం హోళీ సందర్బంగా ఎన్నో శతాబ్దాలుగా గుజరాత్ సంస్కృతిలో ఓ భాగమైంది. ఎన్నో సంస్కృతులు, ఆచారాలున్న భారత దేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా హోళీని జరుపుకుంటారు. పాల్గుణ శుద్ద పూర్ణిమ రోజున కృష్ణ భగవానుడిని ఊయలలో వేసిన వేడుకకు గుర్తుగా బెంగాల్ లో డోలికోత్సవాన్ని జరుపుకుంటారు.
రాక్షస జాతికి చెందిన హిరణ్యకశ్యపుడిని విష్ణువు రూపంలో ఉన్న నరసింహస్వామి సంహరించడానికి గుర్తుగా కూడా హోళీని జరుపుకుంటారని చరిత్ర వెల్లడిస్తోంది. హిరణ్య కశ్యపుడి సోదరి హోళికా దహనాని గుర్తుగా ప్రతి ఏటా హోళికా దహనం చేస్తారని చెప్పుకుంటారు. హోళీకి సంబంధించి ఏన్నో విషయాలను, కథలను పురాణాలు వెల్లడిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా అందరూ ఆడుకునే హోళీ పండగను బాలీవుడ్, టాలీవుడ్ లో నిర్మించిన పలు చిత్రాల్లో పెద్ద పీట వేశారు.
'హోళీ కే దిన్' అంటూ షోలే చిత్రంలో హేమామాలిని, ధర్మేంద్రలపై చిత్రీకరించిన పాట అత్యంత ప్రాచుర్యం పొందింది. అలాగే 'సిల్ సిలా' చిత్రలో 'రంగ్ బర్సే' అంటూ అమితాబ్ వేసిన స్టెప్పులు భారతీయ హోళీ సంస్కతిలో ఓ భాగమైంది. హోళీ రోజున రంగ్ బరసే అంటూ యువతీ యువకులు చిందేడం చూస్తూనే ఉంటాం. ఇంకా లమ్హే చిత్రంలో 'మోహే చేడో నా', భాగ్ భన్ చిత్రంలో 'హోరి ఖేలే రాఘువీరా' మంగళ్ పాండే చిత్రంలో దేఖో ఆయీ హోళీ అనే పాటలు ఇప్పటికి మనలో ఉత్సాహాన్ని నింపుతాయి.
ఇవియే కాకుండా
డర్ చిత్రంలో అంగ్ సే ఆంగ్ లగానా సాజన్,
కామ్ చోర్ చిత్రంలో 'మాల్ దే గులాల్ మోహే, ఆయే హోలీ ఆయే రే',
జక్మీ చిత్రంలో ఆయీ రే ఆయీ రే హోలీ,
నవరంగ్ చిత్రంలో 'అరే జా రే హట్ నత్కత్',
కటీ పతంగ్ చిత్రంలో 'ఆజ్ నా చోడంగే బస్ హమ్ జోలీ ఖేలేంగే హమ్ హోళీ',
కోహినూర్ చిత్రంలో 'తన్ రంగ్ లో జి ఆజ్ మన్ రంగ్ లో'
ముంబై సే ఆయే మేరే దోస్త్.. 'కోయి భీఘా హై రంగ్ సే'
మదర్ ఇండియాలో 'హోళీ ఆయీ రే కన్హాయీ' పాటలే కాకుండా ఇటీవల వచ్చిన ఇత్నా మాజా క్యో ఆరా రహాహై.. అంటూ యే జవానీ హై దీవాని, రామ్ లీలా, గూండే చిత్రాల్లో పాటలు కూడా ప్రేక్షకులను ఆలరించడమే కాకుండా సంస్కృతిలో భాగమయ్యాయి.
బాలీవుడ్ కు తామేమి తగ్గమనే రీతిలో టాలీవుడ్ లో కూడా హోళీ పండగకు పెద్ద ప్రాధాన్యత ఇచ్చారు.
కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు.. రంగులోనే లైఫ్ ఉందిరా..
కొట్టు కొట్టు డోల్ దెబ్బ కొట్టూ
ఒంటి నిండా సత్తువుందిరా.. హోళీ హోళీ అంటూ నాగార్జున 'మాస్' చిత్రంలో దర్శకుడు లారెన్స్..
రంగు రబ్బా రబ్బా అంటుంది రంగు బరిసే..
గుండే షబ్బా షబ్బా అంటూ.. జూనియర్ ఎన్టీఆర్ 'రాఖీ' లో చిత్రంలో, రంగేళి హోళీ..రంగా కే మా కేళి.. ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి అంటూ ప్రభాస్ తో కృష్ణ వంశీ యువతీ, యువకుల్లో జోష్ ను పెంచారు.
ప్రతి ఏటా వచ్చే హోళీ పండగ జాతి సమైక్యతను పెంపొదించడమే కాకుండా కుల, మతాలకతీతంగా దేశ ప్రజలందర్ని ఒక్కటి చేస్తుందని ఆశిద్దాం!