హోలీతో టీం ఇండియా ఫుల్ జోష్ | World T20: After Last-Ball Win Versus Bangladesh, Team India Celebrate Holi | Sakshi
Sakshi News home page

హోలీతో టీం ఇండియా ఫుల్ జోష్

Published Thu, Mar 24 2016 3:13 PM | Last Updated on Sun, Sep 3 2017 8:29 PM

హోలీతో టీం ఇండియా ఫుల్ జోష్

హోలీతో టీం ఇండియా ఫుల్ జోష్

బంగ్లాదేశ్‌తో చిన్నస్వామి స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో చివరి మూడు బంతుల్లో మూడు వికెట్లు తీసి గట్టెక్కిన టీం ఇండియా గురువారం ఫుల్ జోష్ మీదుంది. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో ఆఖరి బంతి వరకు పోరాడి ఒక్క పరుగుతో విజయం సాధించిన భారత ఆటగాళ్లు హోలీ పండుగను హుషారుగా జరుపుకున్నారు. విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, హర్బజన్ సింగ్, శిఖర్ ధవన్, రోహిత్ శర్మలు, మహేంద్రసింగ్ ధోనిలు టీం ఇండియా బస్సులో రంగులు పూసుకుంటూ హోలీ పండగను సెలబ్రేట్ చేసుకున్నారు.
 
బంగ్లాదేశ్ పై అనూహ్య రీతిలో గెలుపొందిన భారత్ సెమీస్ పై ఆశలు సజీవంగా ఉంచుకుంది. ప్రస్తుతం గ్రూప్ బీలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌లో గెలిస్తే ఫైనల్ ఫోర్‌లో చోటు దక్కే అవకాశం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement