World T20
-
19 పరుగులకే 6 వికెట్లు కోల్పోయినా..
దుబాయ్: వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగబోయే వరల్డ్ టీ20కి పపువా న్యూగినియా క్వాలిఫై అయ్యింది. గ్రూప్-ఏలో భాగంగా ఆదివారం కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో పవువా న్యూగినియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. కెన్యాను 18.4 ఓవర్లలో 73 పరుగులకే కుప్పకూల్చి 45 పరుగుల తేడాతో చిరస్మరణీయమైన విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పవువా న్యూగినియా 19.3 ఓవర్లలో 113 పరుగులు చేసింది. 19 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ పవువాను నార్మన్ వనువా(54) గట్టెక్కించాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి హాఫ్ సెంచరీతో మెరిశాడు. దాంతో పవువా గౌరవప్రదమైన స్కోరును సాధించింది.ఆపై 114 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన కెన్యా ఏ దశలోనూ ఆకట్టుకోలేదు. స్వల్ప విరామాల్లో వికెట్లు కోల్పోతూ చివరకు పరాజయం చెందింది. దాంతో గ్రూప్-ఎలో రన్‌రేట్ సాయంతో అగ్రస్థానంలో నిలిచిన పవువా వరల్డ్ టీ20కి అర్హత సాధించింది. ఇదే పవుమాకు తొలి వరల్డ్ టీ20 అర్హత. స్కాట్లాండ్-నెదర్లాండ్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ ఆధారంగా పవువా క్వాలిఫై ఆశలు ఆధారపడి ఉన్నప్పటికీ ఆ జట్టు విశేషంగా రాణించడంతో నెట్ రన్‌రేట్ ఆధారంగా వరల్డ్ టీ20లో అడుగుపెట్టడం విశేషం. నెదర్లాండ్స్ 12.3 ఓవర్లలో 130 పరుగుల లక్ష్యాన్ని సాధించినా ఆ జట్టు కంటే పవుమా మెరుగైన్ రన్‌రేట్‌తో ముందంజ వేసింది. -
చాంపియన్స్ ట్రోఫీకి చెల్లు
కోల్‌కతా: అయ్యో..! మళ్లీ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి కష్టకాలం వచ్చినట్లుంది. సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం బంగ్లాదేశ్‌లో మొదలైన ఈ ట్రోఫీ ఆడుతూ... అటకెక్కుతూ వచ్చింది. ఒకసారి ఈ వన్డే టోర్నీ రద్దయిందంటారు. ఆపేస్తారు. మరోసారి... కొన్నేళ్ల తర్వాత మళ్లీ నిర్వహిస్తామంటారు. ఆడిస్తారు. అలా సుదీర్ఘ విరామనంతరం గతేడాది ఇంగ్లండ్‌లో జరిగిన ఈ ట్రోఫీ... 2021లో భారత్‌లో జరగాల్సి ఉంది. కానీ ఐసీసీ తాజా నిర్ణయం ప్రకారం ఈ ట్రోఫీ జరగడం లేదు. దీని స్థానంలో టి20 ప్రపంచకప్ నిర్వహిస్తారు. ఇక్కడ జరిగిన ఐదు రోజుల ఐసీసీ ఎగ్జిక్యూటివ్‌ల బోర్డు మీటింగ్‌లో టోర్నీల మార్పు ను ఖరారు చేశారు. ఐసీసీ సభ్యదేశాలన్నీ 8 జట్ల చాంపియన్స్ ట్రోఫీకి బదులు 16 జట్లు తలపడే ప్రపంచ టి20 టోర్నీకి ఏకగ్రీవంగా మద్దతు తెలిపాయని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ డేవ్ రిచర్డ్సన్ వెల్లడించారు. బీసీసీఐ ప్రతినిధి అమితాబ్ చౌదరి కూడా టి20 మెగా ఈవెంట్‌కే మద్దతు పలికారు. దీంతో క్రికెట్ చరిత్రలో వరుసగా రెండేళ్లు ప్రపంచకప్ టి20 టోర్నీలు (2020–ఆస్ట్రేలియా, 2021 – భారత్) రెండోసారి జరుగనున్నాయి. 2009 (ఇంగ్లండ్), 2010 (వెస్టిండీస్)లో ఈ మెగా ఈవెంట్లు జరిగాయి. 2019, 2023లలో వన్డే ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో మధ్యలో చాంపియన్స్ ట్రోఫీ అసమంజసమని ఐసీసీ సభ్య దేశాలు భావించాయి. అందుకే రద్దుచేసి టి20 ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్లు రిచర్డ్సన్ తెలిపారు. అంతర్జాతీయం చేసేశారు... ఇప్పటిదాకా శాశ్వత సభ్య దేశాలు(10) ఆడితేనే అంతర్జాతీయ హో దా ఉండేది. ఇకపై పొట్టి ఫార్మాట్లో ఆడే మ్యాచ్‌లన్నీ అంతర్జాతీయం కానున్నాయి. అంటే ఐసీసీలోని 104 సభ్యదేశాలు పొట్టి క్రికెట్ ఆడితే వాటిని అంతర్జాతీయ టి20గా పరిగణిస్తారు. ఈ జూలై 1 నుంచి మహిళల జట్లు, వచ్చే జనవరి 1 నుంచి పురుషుల జట్లు ఆడేవన్నీ అంతర్జాతీయ మ్యాచ్‌లే. పొట్టి ఫార్మాట్‌తో క్రికెట్‌ను విశ్వవ్యాప్తం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ తెలిపింది. 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్? లాస్ ఏంజిల్స్ ఆతిథ్యమిచ్చే 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్ ఆటను చేర్చే అవకాశముంది. మెగా ఈవెంట్లో క్రికెట్‌ను చేర్చేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కృషి చేస్తుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే లాస్ ఏంజిల్స్‌లో క్రికెట్‌ను చూడొచ్చని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్సన్ వెల్లడించారు. పారిస్ (2024)లో జరిగే ఒలింపిక్స్‌లో కొత్త క్రీడలను చేర్చే తుదిగడువు ముగియడంతో తదుపరి ఈవెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పారు. -
ఆ ట్రోఫీ స్థానంలో టీ20 వరల్డ్ కప్..
కోల్‌కతా: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిర్వహించే ట్రోఫీల్లో చాంపియన్స్ ట్రోఫీ ఒకటి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆ వన్డే ట్రోఫీ ఇక నుంచి కనిపించే అవకాశాలు లేనట్లే కనబడుతోంది. చాంపియన్స్ ట్రోఫీ స్థానంలో రెండు వరల్డ్ టీ 20ల జరపాలన్న ఐసీసీ గత నిర్ణయానికి తాజాగా తొలి అడుగుపడింది. షెడ్యూల్ ప్రకారం 2021లో భారత్‌లో చాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉంది. కాగా, ఆ ట్రోఫీ స్థానంలో టీ 20 వరల్డ్ కప్‌ను నిర్వహించడానికి ఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి ఐసీసీ గ్లోబల్ బాడీ ఏకగీవ్ర ఆమోదం తెలిపినట్లు ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్సన్ తెలిపారు. సాధారణంగా చాంపియన్స్ ట్రోఫీలో ఎనిమిది జట్లకు మాత్రమే ఆడే అవకాశం ఉండగా, వరల్డ్ టీ 20 ద్వారా 16 జట్లను ఆడించేందుకు ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ‘ 2021లో భారత్‌లో జరగాల్సి ఉన్న చాంపియన్స్ ట్రోఫీ స్థానంలో వరల్డ్ టీ 20ని నిర్వహించనున్నాం. గేమ్‌ను మరింత ముందుకు తీసుకెళ్లడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నాం. దీనికి ఐసీసీ సభ్యత్వ దేశాల నుంచి ఆమోదం లభించింది’ అని నగరంలో జరిగిన వరల్ఢ్ క్రికెట్ బాడీ సమావేశం అనంతరం రిచర్డ్సన్ పేర్కొన్నారు. ఈ సమావేశానికి బీసీసీఐ నుంచి ప్రాతినిథ్యం వహించిన అమితాబ్ చౌదరి.. అనుకూలంగా ఓటు వేయడంతో టీ20 వరల్డ్‌కప్ నిర్వహణకు ఏకగ్రీవ ఆమోద ముద్ర పడినట్లు రిచర్డ్సన్ తెలిపారు. -
భారత టి20 అంధుల జట్టులో మనోళ్లు ముగ్గురు
కెప్టెన్‌గా అజయ్‌కుమార్ రెడ్డి జనవరి 28 నుంచి ప్రపంచకప్ ముంబై: స్వదేశంలో జరిగే ప్రపంచకప్ టి20 అంధుల క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 17 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు క్రికెటర్లకు స్థానం లభించింది. గుంటూరు జిల్లాకు చెందిన అజయ్ కుమార్ రెడ్డి జట్టుకు నాయకత్వం వహించనుండగా... టి. దుర్గా రావు (నల్లగొండ), డి. వెంకటేశ్వర రావు (విశాఖపట్నం) ఇతర సభ్యులుగా ఉన్నారు. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 12 వరకు జరిగే ఈ టోర్నమెంట్ ఫైనల్‌కు బెంగళూరు వేదికగా నిలుస్తుంది. జనవరి 5 నుంచి ఇండోర్‌లో జట్టుకు శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. విజేత జట్టుకు రూ. 20 లక్షలు, రన్నరప్ జట్టుకు రూ. 15 లక్షల ప్రైజ్‌మనీ ఇస్తారు. భారత్‌తోపాటు ఈ టోర్నీలో ఆస్ట్రేలియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, నేపాల్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ జట్లు పాల్గొంటున్నాయి. 2012లో పాకిస్తాన్లో జరిగిన తొలి టి20 అంధుల ప్రపంచకప్‌లో భారత జట్టు చాంపియన్‌గా నిలిచింది. భారత టి20 అంధుల జట్టు: అజయ్ కుమార్ రెడ్డి (కెప్టెన్), ప్రకాశ జయరామయ్య (వైస్ కెప్టెన్), దీపక్ మలిక్, రాంబీర్ సింగ్, సుఖ్రామ్ మాఝీ, టి.దుర్గా రావు, ఆర్.సునీల్, డి.వెంకటేశ్వర రావు, గణేశ్భాయ్ ముహుంద్కర్, ఫైజల్, ఫర్హాన్, కేతన్భాయ్ పటేల్, జఫర్ ఇక్బాల్, సోనూ గోల్కర్, అనీష్ బేగ్, ప్రేమ్‌కుమార్. -
'టీమిండియాతో పరాజయాన్ని మరచిపోలేను'
టి-20 ప్రపంచ కప్‌లో టీమిండియా చేతిలో ఎదురైన ఓటమి బంగ్లాదేశ్ క్రికెటర్లను ఇప్పటికీ వెంటాడుతోంది. బెంగళూరులో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ను ఓడించే అద్భుతమైన అవకాశాలను చేజార్చుకున్నందుకు బంగ్లా క్రికెటర్లు కుమిలిపోతున్నారు. ఈ పరాజయాన్ని మరచిపోవడం చాలా కష్టమని బంగ్లా బ్యాట్స్‌మన్ మహ్మదుల్లా మరోసారి ఆవేదన చెందాడు. ఈ మ్యాచ్‌లో ధోనీసేన చిరస్మరణీయ విజయం సాధించి నాకౌట్ అవకాశాలను కాపాడుకున్న సంగతి తెలిసిందే. చివరి మూడు బంతుల్లో బంగ్లా విజయానికి కేవలం రెండు పరుగులు కావాల్సి ఉండగా, వరసగా మూడు వికెట్లు కోల్పోయి ఊహించని రీతిలో పరాజయం మూటగట్టుకుంది. ఆ సమయంలో ముష్ఫికర్ రహీం, మహ్మదుల్లా క్రీజులో ఉన్నారు. హార్దిక్ పాండ్యా ఓవర్లో భారీ షాట్లకు ప్రయత్నించి వీరిద్దరూ క్యాచవుటయ్యారు. చివరి బంతికి ధోనీ.. ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను అద్భుతమైన రనౌట్ చేయడంతో బంగ్లా కల చెదిరిపోయింది. ఈ ఓటమి గురించి మహ్మదుల్లా మాట్లాడుతూ.. 'ఈ ఓటమిని ఎలా మరచిపోగలం? ముష్ఫికర్, నేను క్రీజులో ఉన్నాం. ఓడిపోతామని మేం ఊహించలేదు. నాలుగో బంతికి ముష్ఫికర్ అవుటయ్యాక భారీ షాట్‌కు ప్రయత్నించి తప్పు చేశా. సిక్స్ కొట్టడానికి షాట్ ఆడగా, బంతి గాల్లోకి లేచి ఫీల్డర్ చేతిలో పడింది. దీన్ని నమ్మలేకపోతున్నా. కనీసం సింగిల్ చేసినా గెలిచే అవకాశం ఉండేది. ఇది నా తప్పే. ఓటమికి నాదే బాధ్యత. భవిష్యత్‌లో ఇలాంటి తప్పులు చేయను. ఇలాంటి పరిస్థితుల్లో సురక్షితమైన అవకాశాన్ని ఎంచుకుంటా' అని మహ్మదుల్లా చెప్పాడు. -
'ధోనీసేనను ఓడిస్తే అద్భుతమే'
మొహాలీ: భారత గడ్డపై ఏ ఫార్మాట్లోనైనా ఆ జట్టుతో తలపడటం పెద్ద సవాల్ అని ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ అన్నాడు. స్వదేశంలో టీమిండియాను ఓడిస్తే అది అద్బుతమైన విజయమని చెప్పాడు. ఆస్ట్రేలియా జట్టులో ప్రతి ఆటగాడికీ ఈ విషయం తెలుసునని అన్నాడు. 2011లో భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచ కప్‌లో ధోనీసేన అద్భుతంగా ఆడిందని గుర్తుచేశాడు. టి-20 ప్రపంచ కప్‌లో భాగంగా ఆదివారం మొహాలీలో జరిగే మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా తలపడనున్న సంగతి తెలిసిందే. భారత్‌కు సెమీస్ బెర్తు దక్కాలంటే ఈ మ్యాచ్‌లో గెలిచితీరాలి. ఆసీస్‌కు కూడా ఈ మ్యాచ్ ఎంతో కీలకం. ప్రపంచ కప్ ముగిసిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతానని వాట్సన్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. మొహాలీ మ్యాచ్‌లో ఆసీస్ ఓడితే వాట్సన్‌కు ఇదే చివరి మ్యాచ్ అవుతుంది. భారత్‌తో జరిగే ఈ మ్యాచ్ కోసం ఉత్సుకతతో ఎదురు చూస్తున్నానని వాట్సన్ చెప్పాడు. కీలక మ్యాచ్‌లు ఆడేటపుడు మానసికంగా దృఢంగా ఉండటం అన్నిటికంటే ఎంతో ముఖ్యమని అభిప్రాయపడ్డాడు. -
టి కప్‌లో భారత్, ఆసీస్ రికార్డు ఇదీ..
మొహాలీ: మొహాలీ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా ఇరు జట్లకు ఎంతో కీలకం. టి-20 ప్రపంచ కప్ సెమీస్ బెర్తు దక్కాలంటే భారత్ ఈ మ్యాచ్ గెలిచితీరాలి. ఆసీస్‌ది ఇదే పరిస్థితి. ఇరు జట్లు చెరో రెండు విజయాలతో నాలుగేసి పాయింట్లతో ఉన్నాయి. ఆదివారం జరిగే ఈ మ్యచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టి-20 ఫార్మాట్లో టీమిండియాకు ఆసీస్‌పై ఘనమైన రికార్డు ఉంది. ఇరు జట్లు ఇప్పటి వరకు 12 టి-20 మ్యాచ్‌లు ఆడగా.. భారత్ 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, ఆసీస్ కేవలం నాలుగింటిలో నెగ్గింది. కాగా టి-20 ప్రపంచ కప్‌లో ఇరు జట్ల రికార్డు 2-2తో సమంగా ఉంది. ఈ ఈవెంట్ లో భారత్, ఆసీస్ ఎప్పుడెప్పుడు తలపడ్డాయంటే.. 2007 ప్రపంచ కప్: ఆరంభ టి-20 ప్రపంచ కప్ సెమీస్‌లో భారత్, ఆసీస్ తలపడ్డాయి. డర్బన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ధోనీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. యువరాజ్ సింగ్ (30 బంతుల్లో 70), ధోనీ (18 బంతుల్లో 36) రాణించడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 188 పరుగులు చేసింది. లక్ష్యసాధనలో ఆసీస్‌ను భారత బౌలర్లు 173 పరుగులకు కట్టడి చేశారు. దీంతో టీమిండియా 15 పరుగులతో విజయం సాధించింది. 2010 ప్రపంచ కప్: బ్రిడ్జిటౌన్లో జరిగిన మ్యాచ్‌లో ధోనీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కంగారూలు 184/5 స్కోరు చేయగా, లక్ష్యసాధనలో ధోనీసేన 135 పరుగులకు ఆలౌటైంది. భారత జట్టులో రోహిత్ శర్మ (46 బంతుల్లో 79) మినహా ఇతర బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. దీంతో ఆసీస్ 49 పరుగులతో భారీ విజయం సాధించింది. 2012 ప్రపంచ కప్: ఈ ఈవెంట్లోనూ ధోనీసేనకు కంగారూల చేతిలో ఓటమి ఎదురైంది. కొలంబోలో జరిగిన ఈ మ్యాచ్‌లోనూ టాస్ గెలిచిన ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత్ పూర్తి ఓవర్లలో 140/7 స్కోరు చేసింది. లక్ష్యసాధనలో ఒకే వికెట్ కోల్పోయిన ఆసీస్ ఘనవిజయం సాధించింది. 2014 ప్రపంచ కప్: గత ప్రపంచ కప్‌లో ధోనీసేన.. ఆసీస్‌పై ప్రతీకారం తీర్చుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. యువరాజ్ (40 బంతుల్లో 60), ధోనీ (24) సాయంతో 159/7 స్కోరు చేసింది. అనంతరం బౌలర్లు అశ్విన్ (4/11), అమిత్ మిశ్రా (2/13) రాణించి ఆసీస్ ను కుప్పకూల్చారు. దీంతో భారత్ 73 పరుగులతో భారీ విజయం సాధించింది. -
ధోనీలోని గొప్ప గుణం అదే: కోహ్లీ
మొహాలీ: తమ సామర్థ్యం మేరకు ఆడితే ఆస్ట్రేలియాపై విజయం సాధిస్తామని టీమిండియా బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ ధీమా వ్యక్తం చేశాడు. టి-20 ప్రపంచ కప్‌లో భాగంగా ఆదివారం ఆసీస్‌తో జరిగే కీలక మ్యాచ్‌కు ముందు రోజు కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. ఆసీస్ బలమైన జట్టని, కంగారూలు ఎంతో దూకుడుగా ఆడుతారని, అదే తరహాలో ఆడుతాననే నమ్మకముందని, సవాల్‌ను ఎదుర్కోవడాన్ని ఇష్టపడతానని చెప్పాడు. టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. ధోనీ చాలా ప్రశాంతంగా ఉంటూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాడని, అతనిలో గొప్ప గుణం అదేనని అన్నాడు. టి-20 ఫార్మాట్లో నిలకడగా రాణించడం చాలా కష్టమని చెప్పాడు. ఈ ఫార్మాట్లో పూర్తిగా దృష్టిపెట్టి ఆడటం చాలా అవసరమని అన్నాడు. మైదానంలో అడుగుపెట్టేటపుడు తాను ఒత్తిడికి గురికాకుండా, ఓ అవకాశంగా భావిస్తానని చెప్పాడు. ప్రత్యర్థి జట్టును చూసి భయపడకుండా, సవాల్‌గా తీసుకోవాలని సూచించాడు. ప్రపంచ కప్‌లో సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లను గెలిస్తే మరింత ఆత్మవిశ్వాసం పెరుగుతుందని కోహ్లీ అన్నాడు. -
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు జరిమానా
టి-20 ప్రపంచ కప్‌లో భారత్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో విజయం ముంగిట ఓడిపోయిన బంగ్లాదేశ్ జట్టుకు మ్యాచ్ ఫీజులో కోతపడింది. స్లో ఓవర్ రేట్‌తో బౌలింగ్ చేసినందుకు బంగ్లా కెప్టెన్ మోర్తజాకు మ్యాచ్ ఫీజులో 20 శాతం, ఇతర ఆటగాళ్లకు 10 శాతం చొప్పున జరిమానా విధించారు. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో నిర్ణీత సమయానికి బంగ్లా బౌలర్లు ఓ ఓవర్ తక్కువ వేశారు. దీంతో మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ బంగ్లా జట్టుకు జరిమానా వేశారు. చిరస్మరణీయమైన ఈ మ్యాచ్‌లో ఓడిపోతుందని భావించిన టీమిండియా పరుగు తేడాతో ఉత్కంఠ విజయం సాధించిన సంగతి తెలిసిందే. చివరి మూడు బంతుల్లో బంగ్లా విజయానికి రెండు పరుగులు అవసరం కాగా.. పరుగు కూడా చేయకుండా వరుసగా మూడు వికెట్లు కోల్పోయింది. -
హోలీతో టీం ఇండియా ఫుల్ జోష్
బంగ్లాదేశ్‌తో చిన్నస్వామి స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో చివరి మూడు బంతుల్లో మూడు వికెట్లు తీసి గట్టెక్కిన టీం ఇండియా గురువారం ఫుల్ జోష్ మీదుంది. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో ఆఖరి బంతి వరకు పోరాడి ఒక్క పరుగుతో విజయం సాధించిన భారత ఆటగాళ్లు హోలీ పండుగను హుషారుగా జరుపుకున్నారు. విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, హర్బజన్ సింగ్, శిఖర్ ధవన్, రోహిత్ శర్మలు, మహేంద్రసింగ్ ధోనిలు టీం ఇండియా బస్సులో రంగులు పూసుకుంటూ హోలీ పండగను సెలబ్రేట్ చేసుకున్నారు. బంగ్లాదేశ్ పై అనూహ్య రీతిలో గెలుపొందిన భారత్ సెమీస్ పై ఆశలు సజీవంగా ఉంచుకుంది. ప్రస్తుతం గ్రూప్ బీలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌లో గెలిస్తే ఫైనల్ ఫోర్లో చోటు దక్కే అవకాశం ఉంది. #Ind's @imVkohli and @harbhajan_singh wishing everyone a Happy Holihttps://t.co/HLrphNxzfM — BCCI (@BCCI) March 24, 2016 Happy Holi #Ind - @msdhoni @YUVSTRONG12 @harbhajan_singh @SDhawan25 @ImRo45 pic.twitter.com/kxme0s0II2 — BCCI (@BCCI) March 24, 2016 -
ఇంగ్లండ్‌పై విండీస్ ఘన విజయం
-
భారత్‌పై న్యూజిలాండ్ ఘన విజయం
-
టీ20 వరల్డ్ కప్: దాయాది జట్టు వచ్చేసింది!
కోల్ కతా: గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న అనిశ్చితి, ఊగిసలాటకు తెరదించుతూ దాయాది జట్టు భారత్ లో అడుగుపెట్టింది. కట్టుదిట్టమైన భద్రత నడుమ పాకిస్థాన్ జట్టు శనివారం సాయంత్రం కోల్ కతా చేరుకుంది. లాహోర్ నుంచి అబుధాబి చేరుకొని అక్కడ కాసింత విశ్రాంతి తీసుకున్న అనంతరం పాక్ క్రికెటర్లు ఎతిహడ్ విమానంలో కోల్ కతా చేరారు. టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ జట్టు పాల్గొనే విషయమై ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ధర్మశాలలో ఈ నెల 19న జరుగాల్సిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. స్థానికంగా తలెత్తిన ఆందోళనలతో ఈ మ్యాచు చివరికి కోల్ కతా మారింది. ఈ క్రమంలో భద్రత కారణాలు చూపుతూ భారత్ లో పర్యటన విషయమై పీసీబీ చివరివరకు మెలికలు పెడుతూ వచ్చిన సంగతి తెలిసిందే. పాక్ జట్టుకు పూర్తి భద్రత కల్పిస్తామని బీసీసీఐ, ఐసీసీతోపాటు భారత ప్రభుత్వం కూడా భరోసా కల్పించడంతో ఎట్టకేలకు ఆ జట్టు భారత్ లో అడుగుపెట్టింది. -
నూటికి 99శాతం వరల్డ్ కప్ టీమిండియాదే!
టీమిండియా ఎదురులేకుండా దూసుకుపోతోంది. వరుస విజయాలతో ఊపుమీద ఉన్న ధోనీ సేన తాజాగా ఆసియా కప్‌లోనూ ఇదే నిరూపించింది. ఏమాత్రం తొణకకుండా ఆసియా కప్ సాధించి.. రానున్న ఐసీసీ టీ-20 వరల్డ్ కప్‌లో తామే ఫేవరెట్ టీమ్ అని చాటింది. ఈ నేపథ్యంలో నూటికి 99శాతం ధోనీ సేననే పొట్టి వరల్డ్ కప్‌ను కైవసం చేసుకునే అవకాశముందని భారత మాజీ డాషింగ్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ధోనీ నేతృత్వంలో పర్ఫెక్ట్ విన్నింగ్ కాంబినేషన్ తో జట్టు ఉందని, ధోనీ నేతృత్వంలో రెండోసారి టీ-20 వరల్డ్ కప్ ట్రోఫీని టీమిండియా అందుకోవడం ఖాయంగా కనిపిస్తోందని సెహ్వాగ్ అంచనా వేశాడు. టీమిండియా జోరు చూస్తే.. టీ-20లో వరల్డ్ కప్‌లో మన జట్టే ఫేవరెట్ అని స్పష్టమవుతోంది. ఈ ఏడాది మొత్తం 11 టీ-20 మ్యాచులు ఆడిన టీమిండియా పదింటిలో ఘనవిజయాలు సాధించింది. ఆస్ట్రేలియా, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్, యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ వంటి జట్లను చిత్తు చేస్తూ తన సత్తా చాటింది. తాజాగా ఆసియా కప్ ఫైనల్లోనూ ధోనీ సేన ధనాధన్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టింది. ప్రస్తుతం మంచి బ్యాలెన్స్‌తో టీమిండియా వరల్డ్ కప్‌లోకి ఎంటరవుతున్నదని, ప్రపంచంలోని అన్ని జట్ల కన్నా మేటిగా టీమ్ కూర్పు ఉందని మరోవైపు ధోనీ కూడా స్పష్టం చేశాడు. దీంతో భారీ అంచనాల మధ్య టీమిండియా వరల్డ్ కప్‌లోకి ఎంటరవుతుండటం అభిమానుల్లో ఆశలు పెంచుతోంది. -
కోహ్లీ దూకుడుపై అఫ్రిది కామెంట్స్..
మీర్పూర్: దాయాది భారత్ పైనేకాక ఆతిథ్య బంగ్లాదేశ్ చేతిలో ఓడి కనీసం ఆసియా కప్ ఫైనల్స్ కు కూడా చేరుకోలేకపోయిన పాకిస్థాన్.. మార్చి 8 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్ ను సవాలుగా తీసుకుంది. తమ సన్నాహాలపై ఆ జట్టు కెప్టెన్ షాహిద్ అఫ్రిది శనివారం మీడియాతో మాట్లాడారు. గత టీ20 వరల్డ్ కప్ అనుభవాలతోపాటు భారత ఆటగాళ్ల గురించి ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు.. ప్రశ్న: రాబోయే టీ20 ప్రపంచకప్ కు సన్నాహాలెలా కొనసాగుతున్నాయి? అఫ్రిది: ఆసియా కప్ లో మేం ఘోరమైన తప్పులు చేశాం. బ్యాట్లు ఝుళిపించడంలో మావాళ్లు విఫలమయ్యారు. ఆరంభంలోనే వికెట్లు కోల్పోతే విజయం సాధించడం కష్టమవుతుంది. అయితే బౌలింగ్ దళం, మిడిల్ ఆర్డర్ మెరుగ్గా ఆడింది. బంగ్లాదేశ్, ఇండియాతో జరిగిన మ్యాచ్ ల్లో ఆ విషయం స్పష్టంగా కనపడింది. టీ20 ప్రపంచకప్ ఫేవరెట్ జట్లలో మేమూ ఒకరం. అయితే ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లు కూడా మా గ్రూప్ లోనే ఉన్నాయి. అంటే తదుపరి రౌండ్ కు చేరుకోవటానికి మేం చాలా కష్టపడాల్సిఉందన్నమాట. ఆమిర్ పునరాగమనం జట్టుకు బలం చేకూర్చినట్టుంది? అఫ్రిది: కచ్చితంగా. ఆసియా కప్ లో ఆమిర్ అదరగొట్టాడు. ప్రతి బంతిని మనసు, బుద్ధిని కలగలిపి విసిరాడు. ఒక కెప్టెన్ గా అంతకుమించి అతణ్ని నేనేమీ అడగలేను. నిజానికి ఆమిర్ పై తీవ్రమైన ఒత్తిడి ఉంది. ఫిక్సింగ్ ఆరోపణలను ఎదుర్కొనిమరీ జట్టులోకి వచ్చి రాణించడం అంత సులువైనపనేకాదు. అయితే సెలెక్టర్లు ఆమిర్ పై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయలేదతను. ఇండో- పాక్ పోరులో మొదట్లో మీదే పై చేయి. కానీ ఇటీవల భారత్ పై నెగ్గలేకపోతున్నారు? అఫ్రిది: కీలకమైన సందర్భాల్లో భారత్ తన ఆటతీరును మెరుగుపర్చుకుంది. అదే పనిని మేం చెయ్యలేకపోయాం. చివరి మ్యాచ్ లోనే చూడండి.. పిచ్ ను అర్థం చేసుకోవటంలో మేం విఫలమయ్యాం. తప్పులమీద తప్పులు చేశారం. దాంతో ఓటమిపాలయ్యాం. డిఫెండ్ చేసుకోగలిగే స్కోర్ లేనప్పుడు బౌలర్లు మాత్రం ఏం చేస్తారు? ఇప్పుడో కీలక ప్రశ్న.. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ మధ్య పోలికలేంటి? అఫ్రిది: నేను ఇదివరకు చెప్పా. సచిన్ ది ఒకరితో పోల్చుచూసే స్థాయికాదు. కోట్ల మందికి అతను ఆదర్శం. ఇండియాలోనేకాక ప్రపంచదేశాల్లోనూ ఆయనకు వేలమంది అభిమానులున్నారు. విరాట్ కోహ్లీ ఛాంపియన్ ప్లేయర్ అనటంలో సందేహంలేదు. అతని దూకుడు స్వభావం ఆటలో కలిసొచ్చేఅంశం. ప్రపంచంలో బెస్ట్ హిట్టర్స్ లో కోహ్లీ కూడా ఒకడు. తమదైన రోజున కోహ్లీ లాంటి ఆటగాళ్లను నిలువరించడం ఎవ్వరితరంకాదు. -
నేనేం మాట్లాడినా వినిపిస్తోంది!
మైక్రోఫోన్‌లపై ధోని అసంతృప్తి మిర్పూర్: మ్యాచ్ జరిగే సమయంలో మైదానంలో ఏర్పాటు చేసే మైక్రోఫోన్‌లపై భారత కెప్టెన్ ధోని తన అసంతృప్తిని ప్రదర్శించాడు. తాను సహచరులతో పంచుకునే వ్యూహాలు అందరికీ తెలిసిపోతున్నాయని అతను అన్నాడు. ‘జట్టులోని ఒక ఆటగాడు మరో ఆటగాడితో మాట్లాడే సమయంలో మైక్రోఫోన్లు పని చేయకుండా చూస్తామని మ్యాచ్ రిఫరీలు చెబుతున్నారు. కానీ అదేంటో నేను ఏం మాట్లాడినా అవి పట్టేస్తున్నాయి. ఈ వ్యవహారం అంతా అనుమానాస్పదంగా కనిపిస్తోంది. ఎవరైనా ఆటగాడు అనకూడని మాట అంటే మైక్ పని చేయడం లేదు కదా సమస్య లేదు అనిపిస్తుంది. కానీ నేను మాట్లాడినప్పుడు మాత్రం మైక్ ఆన్‌లోనే ఉంటోంది’ అని ధోని వ్యాఖ్యానించాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు మంచి ఇన్నింగ్స్‌లు ఆడగల సామర్థ్యం కోహ్లిలో ఉందని, అయితే అందరిలోకి అతనే గొప్ప అంటూ పోలికలు తేవడం తనకిష్టముండదని కెప్టెన్ చెప్పాడు. వరల్డ్ టి20 కోసం భారీ షాట్లు ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఇలాంటి పిచ్ తగినది కాదని పాక్‌తో మ్యాచ్ అనంతరం మహి అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మకు పరీక్షలు... ఆమిర్ బౌలింగ్‌లో స్వల్పంగా గాయపడిన రోహిత్ శర్మకు ముందు జాగ్రత్తగా ఎక్స్‌రే తీశారు. మ్యాచ్ తొలి బంతి నేరుగా రోహిత్ కాలి బొటనవేలిని తాకింది. శ్రీలంకతో మంగళవారం జరిగే మ్యాచ్ సమయానికే అతని గాయంపై స్పష్టత రావచ్చు. -
భారత జట్టు ఎంపిక రేపు
ముంబై: స్వదేశంలో జరిగే టి20 ప్రపంచకప్‌తో పాటు ఆసియాకప్ టి20 టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్ల ఎంపిక రేపు (శుక్రవారం) జరుగుతుంది. సందీప్ పాటిల్ నేతృత్వంలోని భారత సెలక్టర్లు ఢిల్లీలో సమావేశమై జట్టును ఎంపిక చేస్తారు. ఆస్ట్రేలియాలో సిరీస్ విజయం సాధించిన జట్టులో సభ్యులంతా దాదాపుగా ఈ జట్లలోకి ఎంపికయ్యే అవకాశం ఉంది. టి20 ప్రపంచకప్‌లో భారత్ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 15న న్యూజిలాండ్‌తో ఆడుతుంది. అలాగే ఆసియా కప్ ఫిబ్రవరి 24 నుంచి మార్చి 6 వరకు బంగ్లాదేశ్‌లో జరుగుతుంది. -
న్యూజిలాండ్ జట్టులో స్పిన్ త్రయం
వెల్లింగ్టన్: త్వరలో భారత్‌లో జరగబోయే వరల్డ్ ట్వంటీ 20 కప్ నేపథ్యంలో న్యూజిలాండ్ క్రికెట్ జట్టులో ముగ్గురు స్పిన్నర్లకు చోటు దక్కింది. భారత్ లోని పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని స్పిన్ త్రయానికి అవకాశం కల్పిస్తూ న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఆఫ్ స్పిన్నర్ నాథన్ మెకల్లమ్ తో పాటు, లెగ్ స్పిన్నర్ ఇష్ సోథీ, లెఫ్టార్మ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నార్ లకు అవకాశం కల్పించింది. ఈ మేరకు సోమవారం 15 సభ్యులతో కూడిన జట్టును కివీస్ ప్రకటించింది. న్యూజిలాండ్ వరల్డ్ టీ 20 జట్టు కేన్ విలియమ్సన్(కెప్టెన్), మార్టిన్ గప్టిల్, రాస్ టేలర్, హేన్నీ నికోలస్, గ్రాంట్ ఎలియాట్, కోరీ అండర్సన్, కోలిన్ మున్రో, లూక్ రోంచీ, మిచెల్ సాంట్నార్, నాథన్ మెకల్లమ్, టిమ్ సౌతీ, ట్రెంట్ బోల్ట్, మిచెల్ మెక్ లాన్గన్, ఆడమ్ మిల్నీ, ఇష్ సోథీ -
'వరల్డ్ టీ 20తో సమయం వృథా'
మెల్బోర్న్: త్వరలో భారత్‌లో జరగబోయే వరల్డ్ ట్వంటీ 20 సిరీస్ వల్ల సమయం వృథా తప్ప ఉపయోగం ఏమీ లేదని ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ రాన్ హారిస్ అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ ల ఎద్దడి ఎక్కువగా నేపథ్యంలో టీ 20 వరల్డ్ కప్ ను సమర్ధవంతంగా, అర్ధవంతంగా నిర్వహించడం కష్ట సాధ్యమన్నాడు. గత రెండేళ్ల క్రితం బంగ్లాదేశ్ లో జరిగిన వరల్డ్ కప్ నుంచి చూస్తే ఇప్పటివరకూ ఆసీస్ ఎనిమిది టీ 20 మ్యాచ్ లు మాత్రమే ఆడిందన్నాడు. 2015లో ఆసీస్ ఒక టీ 20 ఆడితే.. ఈ సంవత్సరం ఆరు మ్యాచ్ లు ఆడుతుందన్నాడు. ఈ ఏడాది భారత్ తో టీ 20 సిరీస్ ను ముగించుకున్న ఆసీస్ మూడు రోజుల వ్యవధిలో న్యూజిలాండ్ తో సిరీస్ కు సిద్ధం కావడం షెడ్యూల్లో ఉన్న బిజీని కనబరుస్తుందన్నాడు. ఇటువంటి తరుణంలో ఒక పెద్ద టోర్నీకి పూర్తి స్థాయి జట్టు సిద్ధంగా కావడం కష్టసాధ్యమన్నాడు. దీన్ని బట్టి చూస్తే రాబోయే టీ 20 వరల్డ్ కప్ ను సమయం వృథా టోర్నీగానే హారిస్ పేర్కొన్నాడు. -
ధోని సిద్ధం!
బెంగళూరు: త్వరలో భారత్ లో దక్షిణాఫ్రికాతో జరుగనున్న పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ కు మహేంద్ర సింగ్ ధోనీ సిద్ధమయ్యాడు. దక్షిణాఫ్రికా-భారత్ ల మధ్య అక్టోబర్ 2 వ తేదీ నుంచి ట్వంటీ 20 సిరీస్ తో పాటు, వన్డే సిరీస్ జరుగనుంది. దక్షిణాఫ్రికాతో సిరీస్ కు ధోని ఎంపికపై తొలుత కాస్త సందిగ్థంలో పడ్డ సెలెక్టర్లు..ఎట్టకేలకు తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ట్వంటీ 20 వరల్డ్ కప్ వరకూ ధోనికి విశ్రాంతి నివ్వాలని ముందుగా భావించినా.. దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్ కు ధోనిని ఎంపిక చేయాలని యోచిస్తున్నారు. భారత్ లో జరిగే ట్వంటీ 20 వరల్డ్ కప్ కు ఇంకా ఐదు నెలలో సమయం ఉన్న తరుణంలో.. దక్షిణాఫ్రికాతో జరిగే మూడు ట్వంటీ 20 మ్యాచ్ ల సిరీస్ ను సన్నాహక సిరీస్ గా ఉపయోగించుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్ కు ధోనికి బాధ్యతలు అప్పజెప్పడానికి సెలెక్టర్లు మొగ్గుచూపుతున్నారు. టీమిండియా ఆటగాళ్ల ఎంపికకు సంబంధించి ఆదివారం బీసీసీఐ సెలెక్టర్లు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ట్వంటీ 20 సిరీస్ తో పాటు, మూడు వన్డేలకు ఆటగాళ్లను ఎంపిక చేయనున్నారు. ప్రస్తుతం ధోనీతో పాటు విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ లు ఫిట్ గా ఉండటంతో వారి ఎంపిక ఖాయంగా కనిపిస్తోంది. దీంతో పాట మరికొంత మంది సీనియర్ ఆటగాళ్ల కూడా జట్టుకు అందుబాటులోకి రావొచ్చు. శిఖర్ ధవన్, మురళీ విజయ్, అజింక్యా రహానే, అంబటి రాయుడు తదితర ఆటగాళ్లను ఎంపిక చేసే అవకాశం ఉంది. కాగా, గత కొన్ని రోజుల క్రితం గాయంతో జట్టుకు దూరంగా ఉన్న శిఖర్ ధవన్ ఫిట్ నెస్ ను నిరూపించుకోవాల్సి ఉంది. దీంతో పాటు చక్కటి ట్వంటీ 20 రికార్డు కలిగి ఉన్న కేదర్ జాదవ్, మనీష్ పాండేలు ట్వంటీ 20లకు ఎంపికయ్యే అవకాశం ఉంది. స్పిన్నర్ల విభాగంలో అశ్విన్ కు తోడుగా హర్భజన్ ఎంపికయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా జింబాబ్వే సిరీస్ కు పక్కకు పెట్టిన రవీంద్ర జడేజా ఎంపిక అంశంపై కూడా సెలెక్టర్లు దృష్టి సారించే అవకాశం ఉంది. -
ఇంగ్లాండ్ 88 ఆలౌట్, నెదర్లాండ్ సంచలన విజయం!
టీ20 ప్రపంచకప్ మ్యాచ్ లో ఇంగ్లాడ్ జట్టుకు నెదర్లాండ్ జట్టు గట్టి షాక్ ఇచ్చింది. జాహుర్ ఆహ్మద్ చౌదరీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై నెదర్లాండ్ జట్టు 45 పరుగుల తేడాతో సంచలన విజయం నమోదు చేసింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ దిగిన నెదర్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. నెదర్లాండ్ జట్టులో అత్యధికంగా బారేసి 48, మైబర్గ్ 39 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ జట్టులో బ్రాడ్ కు 3 వికెట్లు, జోర్డాన్, బొపారాకు చెరో వికెట్ దక్కాయి. ఆతర్వాత 134 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్ జట్టు 88 పరుగులకే కుప్పకూలింది. నెదర్లాండ్ జట్టు బౌలర్లు ముదస్సర్ బుఖారీ, వాన్ బీక్ రాణించి మూడేసి వికెట్లు పడగొట్టారు. గుగ్టెన్, బోరెన్ చెరో వికెట్ పడగొట్టారు. ఇంగ్లాండ్ జట్టులో హేల్స్ (12), బొపారా(18), జోర్డాన్ (14) మాత్రమే రెండెంకెల స్కోరును నమోదు చేసుకున్నారు. మిగితావారందరూ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. నెదర్లాండ్ విజయంలో కీలకపాత్ర పోషించిన బుఖారీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. -
ఎదురులేని టీమిండియా
-
పాక్ జట్టులో సక్లైన్ గుబులు!
కరాచీ: పాకిస్థాన్ జట్టులో స్పిన్నర్ సక్లైన్ ముస్తాక్ రూపంలో కొత్త గుబులు మొదలైంది. ప్రపంచకప్ టీ20 టోర్నమెంట్ లో సెమీఫైనల్ బెర్త్ తో పోటీ పడనున్న తరుణంలో పాకిస్థాన్ కు చెందిన ప్రముఖ స్పిన్నర్ ఆ జట్టులో అశాంతి నింపాడు. సక్లైన్ ముస్తాక్ గురించి పాక్ జట్టు ఎందుకు గాబరా పడుతుందటే.. వెస్టిండీస్ జట్టులో స్పిన్ కోచ్ సేవలందిస్తున్నాడు. సక్లైన్ రాకతో బౌలింగ్ పటిష్టంగా మారడంతోపాటు శ్యామ్యూల్ బాద్రీ, సునీల్ నరైన్ లు ఇటీవల కాలంలో మెరుగ్గా రాణిస్తున్నారు. పాక్ జట్టు ఆటగాళ్ల బలహీనతల్ని దృష్టిలో ఉంచుకుని సక్లైన్ బద్రీ, నరైన్ లతో కలిసి వ్యూహం రచిస్తున్నారు. ఎలాగైనా పాక్ పై విజయం సాధించి సెమీఫైనల్ బెర్త్ ను ఖాయం చేసుకోవాలనే కృత నిశ్చయంతో విండీస్ ప్రణాళిక రచిస్తోంది. సక్లైన్ అండతో విండీస్ విజయం సాధిస్తో లేదో వేచి చూడాల్సిందే.