'ధోనీసేనను ఓడిస్తే అద్భుతమే' | ICC World T20: Against India, Watson expects the 'ultimate challenge' | Sakshi
Sakshi News home page

'ధోనీసేనను ఓడిస్తే అద్భుతమే'

Published Sat, Mar 26 2016 7:09 PM | Last Updated on Sun, Sep 3 2017 8:38 PM

'ధోనీసేనను ఓడిస్తే అద్భుతమే'

'ధోనీసేనను ఓడిస్తే అద్భుతమే'

మొహాలీ: భారత గడ్డపై ఏ ఫార్మాట్లోనైనా ఆ జట్టుతో తలపడటం పెద్ద సవాల్ అని ఆస్ట్రేలియా ఆల్రౌండర్ షేన్ వాట్సన్ అన్నాడు. స్వదేశంలో టీమిండియాను ఓడిస్తే అది అద్బుతమైన విజయమని చెప్పాడు. ఆస్ట్రేలియా జట్టులో ప్రతి ఆటగాడికీ ఈ విషయం తెలుసునని అన్నాడు. 2011లో భారత్లో జరిగిన వన్డే ప్రపంచ కప్లో ధోనీసేన అద్భుతంగా ఆడిందని గుర్తుచేశాడు. టి-20 ప్రపంచ కప్లో భాగంగా ఆదివారం మొహాలీలో జరిగే మ్యాచ్లో భారత్, ఆస్ట్రేలియా తలపడనున్న సంగతి తెలిసిందే. భారత్కు సెమీస్ బెర్తు దక్కాలంటే ఈ మ్యాచ్లో గెలిచితీరాలి. ఆసీస్కు కూడా ఈ మ్యాచ్ ఎంతో కీలకం.

ప్రపంచ కప్ ముగిసిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతానని వాట్సన్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. మొహాలీ మ్యాచ్లో ఆసీస్ ఓడితే వాట్సన్కు ఇదే చివరి మ్యాచ్ అవుతుంది. భారత్తో జరిగే ఈ మ్యాచ్ కోసం ఉత్సుకతతో ఎదురు చూస్తున్నానని వాట్సన్ చెప్పాడు. కీలక మ్యాచ్లు ఆడేటపుడు మానసికంగా దృఢంగా ఉండటం అన్నిటికంటే ఎంతో ముఖ్యమని అభిప్రాయపడ్డాడు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement