
దుబాయ్: వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగబోయే వరల్డ్ టీ20కి పపువా న‍్యూగినియా క్వాలిఫై అయ్యింది. గ్రూప్-ఏలో భాగంగా ఆదివారం కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో పవువా న్యూగినియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. కెన్యాను 18.4 ఓవర్లలో 73 పరుగులకే కుప్పకూల్చి 45 పరుగుల తేడాతో చిరస్మరణీయమైన విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పవువా న్యూగినియా 19.3 ఓవర్లలో 113 పరుగులు చేసింది.
19 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ పవువాను నార్మన్ వనువా(54) గట్టెక్కించాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి హాఫ్ సెంచరీతో మెరిశాడు. దాంతో పవువా గౌరవప్రదమైన స్కోరును సాధించింది.ఆపై 114 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన కెన్యా ఏ దశలోనూ ఆకట్టుకోలేదు. స్వల్ప విరామాల్లో వికెట్లు కోల్పోతూ చివరకు పరాజయం చెందింది.
దాంతో గ్రూప్-ఎలో రన్‌రేట్ సాయంతో అగ్రస్థానంలో నిలిచిన పవువా వరల్డ్ టీ20కి అర్హత సాధించింది. ఇదే పవుమాకు తొలి వరల్డ్ టీ20 అర్హత. స్కాట్లాండ్-నెదర్లాండ్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ ఆధారంగా పవువా క్వాలిఫై ఆశలు ఆధారపడి ఉన్నప్పటికీ ఆ జట్టు విశేషంగా రాణించడంతో నెట్ రన్‌రేట్ ఆధారంగా వరల్డ్ టీ20లో అడుగుపెట్టడం విశేషం. నెదర్లాండ్స్ 12.3 ఓవర్లలో 130 పరుగుల లక్ష్యాన్ని సాధించినా ఆ జట్టు కంటే పవుమా మెరుగైన్ రన్‌రేట్‌తో ముందంజ వేసింది.
Comments
Please login to add a commentAdd a comment