టీ20 వరల్డ్ కప్: దాయాది జట్టు వచ్చేసింది! | Pakistan arrive in Kolkata for World T20 | Sakshi
Sakshi News home page

టీ20 వరల్డ్ కప్: దాయాది జట్టు వచ్చేసింది!

Published Sat, Mar 12 2016 8:28 PM | Last Updated on Sat, Mar 23 2019 8:32 PM

టీ20 వరల్డ్ కప్: దాయాది జట్టు వచ్చేసింది! - Sakshi

టీ20 వరల్డ్ కప్: దాయాది జట్టు వచ్చేసింది!

కోల్ కతా: గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న అనిశ్చితి, ఊగిసలాటకు తెరదించుతూ దాయాది జట్టు భారత్ లో అడుగుపెట్టింది. కట్టుదిట్టమైన భద్రత నడుమ పాకిస్థాన్ జట్టు శనివారం సాయంత్రం కోల్ కతా చేరుకుంది. లాహోర్ నుంచి అబుధాబి చేరుకొని అక్కడ కాసింత విశ్రాంతి తీసుకున్న అనంతరం పాక్ క్రికెటర్లు ఎతిహడ్ విమానంలో కోల్ కతా చేరారు.

టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ జట్టు పాల్గొనే విషయమై ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ధర్మశాలలో ఈ నెల 19న జరుగాల్సిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. స్థానికంగా తలెత్తిన ఆందోళనలతో ఈ మ్యాచు చివరికి కోల్ కతా మారింది. ఈ క్రమంలో భద్రత కారణాలు చూపుతూ భారత్ లో పర్యటన విషయమై పీసీబీ చివరివరకు మెలికలు పెడుతూ వచ్చిన సంగతి తెలిసిందే. పాక్ జట్టుకు పూర్తి భద్రత కల్పిస్తామని బీసీసీఐ, ఐసీసీతోపాటు భారత ప్రభుత్వం కూడా భరోసా కల్పించడంతో ఎట్టకేలకు ఆ జట్టు భారత్ లో అడుగుపెట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement