బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు జరిమానా | World T20: Bangladesh captain, players fined for slow over-rate against India | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు జరిమానా

Published Sat, Mar 26 2016 2:42 PM | Last Updated on Tue, Oct 2 2018 4:31 PM

బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు జరిమానా - Sakshi

బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు జరిమానా

టి-20 ప్రపంచ కప్లో భారత్తో జరిగిన ఉత్కంఠ పోరులో విజయం ముంగిట ఓడిపోయిన బంగ్లాదేశ్ జట్టుకు మ్యాచ్ ఫీజులో కోతపడింది. స్లో ఓవర్ రేట్తో బౌలింగ్ చేసినందుకు బంగ్లా కెప్టెన్ మోర్తజాకు మ్యాచ్ ఫీజులో 20 శాతం, ఇతర ఆటగాళ్లకు 10 శాతం చొప్పున జరిమానా విధించారు.

బుధవారం జరిగిన ఈ మ్యాచ్లో నిర్ణీత సమయానికి బంగ్లా బౌలర్లు ఓ ఓవర్ తక్కువ వేశారు. దీంతో మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ బంగ్లా జట్టుకు జరిమానా వేశారు. చిరస్మరణీయమైన ఈ మ్యాచ్లో ఓడిపోతుందని భావించిన టీమిండియా పరుగు తేడాతో ఉత్కంఠ విజయం సాధించిన సంగతి తెలిసిందే. చివరి మూడు బంతుల్లో బంగ్లా విజయానికి రెండు పరుగులు అవసరం కాగా.. పరుగు కూడా చేయకుండా వరుసగా మూడు వికెట్లు కోల్పోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement