సుపరిపాలనకే జిల్లాల విభజన
సుపరిపాలనకే జిల్లాల విభజన
Published Sun, Sep 11 2016 8:25 PM | Last Updated on Mon, Sep 4 2017 1:06 PM
చౌటుప్పల్ : ప్రజలకు పారదర్శకమైన సుపరిపాలనను అందించేందుకు ప్రభుత్వం జిల్లాలను విభజిస్తోందని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ తెలిపారు. చౌటుప్పల్‌లో ఆదివారం రూ.5 కోట్లతో చేపట్టిన కులవృత్తుల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం అంకిరెడ్డిగూడెంలో సీసీ రోడ్డు నిర్మాణానికి, మహిళల కుట్టుశిక్షణ భవన నిర్మాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత తాళ్లసింగారం గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి, ఎస్.లింగోటంలో సీసీ రోడ్డు, అసంపూర్తిగా ఉన్న గౌడ సంఘం భవనాన్ని పూర్తి చేసే పనులను ప్రారంభించారు. అనంతరం జైకేసారంలో సీసీ రోడ్డు, గౌడ సంఘం భవన నిర్మాణానికి పునాదిరాయి వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాల పునర్విభజనను ప్రజల అభీష్టం మేరకే చేస్తున్నామన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా 5 కోట్ల తాటి, ఈత, ఖర్జూర మొక్కలను నాటిస్తామన్నారు. చౌటుప్పల్‌లో రూ.1.50 కోట్లతో నీరా‡ పరిశ్రమను ఏర్పాటు చేయిస్తాననిపేర్కొన్నారు. స్థానిక పరిశ్రమల్లో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలిప్పించేందుకు కృషి చేస్తానన్నారు. దివీస్ కంపెనీలో ఉద్యోగాల కోసం కంపెనీ ఎండీతో మాట్లాడుతానన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ మహిళాభివృద్ధే దేశాభివృద్ధి అన్నారు. కార్యక్రమాల్లో ఎంపీపీ చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు పెద్దిటి బుచ్చిరెడ్డి, వైస్‌ఎంపీపీ కాయితీ రమేష్‌గౌడ్, సర్పంచ్‌లు బొంగు లావణ్య, సుర్వి మల్లేష్‌గౌడ్, చెన్నగోని విజయలక్ష్మీ, జీండ్రు నిర్మల, ఎం.దయాకరాచారి, ఎంపీటీసీ సభ్యుడు బత్తుల వరలక్ష్మీ, దాసోజు సుధారాణి, పిట్టల శంకరమ్మ, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.
Advertisement