అనాలోచిత నిర్ణయాలవల్లే కష్టాలు
Published Mon, Dec 5 2016 2:49 AM | Last Updated on Tue, May 29 2018 4:26 PM
రాజంపాలెం(గోపాలపురం) : పెద్దనోట్ల రద్దు అనాలోచిత నిర్ణయమని, ఇలాంటి నిర్ణయాల వల్ల పేదలు, సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ళ నాని విమర్శించారు. గోపాలపురం మండలం రాజంపాలెంలో ఆదివారం నియోజకవర్గ కన్వీనర్ తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో మండల కన్వీనర్ పడమటి సుభాష్‌చంద్రబోస్ అధ్యక్షతన జరిగిన గపడగడపకు వైఎస్సార్ కార్యక్రమంలో నాని పాల్గొన్నారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దుతోపాటు రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ అస్తవ్యస్త విధానాల వల్ల జిల్లాలో అభివృద్ధి కుంటుపడిదని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా అమలు కావడం లేదని విమర్శించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సర్కారు పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. జిల్లాలో గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమం విజయవంతమైందని, దీనిలో ప్రజలు భాగస్వాములు అవుతున్నారని పేర్కొన్నారు. టీడీపీ అరాచక పాలనకు త్వరలో శుభం కార్డు పడనుందని, వై.ఎస్.జగ¯ŒSమోహ¯ŒSరెడ్డి నాయకత్వంలో వైఎస్సార్ సువర్ణ పాలన వస్తుందని నాని పేర్కొన్నారు.
చంద్రబాబుది రెండు నాల్కల ధోరణి
పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో చంద్రబాబు రెండునాల్కల ధోరణి మరోసారి బట్టబయలైందని ఆళ్లనాని విమర్శించారు. పెద్దనోట్లు రద్దు విషయం ముందే తెసుకున్న చంద్రబాబు నాయడు ఏడాది క్రితమే రూ.వెయ్యి రూ.500నోట్లు రద్దు చేయాలంటూ కేంద్రానికి లేఖరాశారని, రద్దయిన తర్వాత ప్రజల ఇబ్బందులు చూసి కేంద్రానికి లేఖ రాశానని చెప్పారని, ఆ తర్వాత ముఖ్యమంత్రుల సలహా సంఘానికి ఆయనను కేంద్రం కన్వీనర్‌గా నియమించగానే ఆ లేఖ సంగతి మరిచిపోయారని, కేంద్రానికి వంతపాడుతున్నారని ఆళ్లనాని ధ్వజమెత్తారు. ప్రజల అవస్థలను పట్టించుకోలేని చంద్రబాబునాయుడు గద్దె దిగాలని డిమాండ్ చేశారు. పెద్దనోట్ల రద్దులో చంద్రబాబునాయుడు ప్రధాన సూత్రదారని విమర్శించారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇ¯ŒSచార్జి పోల్నాటి బాబ్జి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వందనపు సాయిబాలపద్మ, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి చెలికాని రాజబాబు, జిల్లా క్రమశిక్షణాసంఘం సభ్యులు పోతుల రామతిరుపతిరెడ్డి, జిల్లా నాయకులు చనమలశ్రీనివాస్, పాముల పర్తి శ్రీనివాస్, కామిశెట్టి మల్లిబాబు, చిన్నం గంగాధర్, ఇళ్ళ భాస్కరరావు, కాండ్రేకుల శ్రీహరి పాల్గొన్నారు.
Advertisement