slaped
-
రణ్వీర్ చెంప చెళ్లుమనిపించిన బాడిగార్డ్! అసలేం జరిగిందంటే..
ఇటీవల జరిగిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ ఫెస్టివల్లో షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్‌కు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. ఈవెంట్లో బాడిగార్డ్.. రణ్వీర్ చెంప చెళ్లుమనిపించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కాగా ప్రతి ఏటా నిర్వహించిన ప్రతిష్టాత్మక సైమా 2022 అవార్డు కార్యక్రమాన్ని శనివారం బెంగళూరులో ఘనంగా నిర్వహించారు. ఈ అవార్డు ఫంక్షన్‌కు దక్షిణాది చెందిన అగ్ర తారలతో పాటు బాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. చదవండి: సిసింద్రి టాస్క్‌లో ట్విస్ట్.. శ్రీహాన్‌కు షాకిచ్చిన గలాట గీతూ టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్, పూజా హెగ్డె, విజయ్ దేవరకొండ, సుకుమార్‌లు తదితరులు ముఖ్య అతిథులు పాల్గొన్నారు. ఇక బాలీవుడ్ స్టార్ హీరో అయిన రణ్వీర్ సింగ్ కూడా పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో ఆయన తనదైన స్టైల్లో సందడి చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. బాలీవుడ్ మోస్ట్ పాపులర్ యాక్టర్‌గా రణ్వీర్ ఈ అవార్డును కూడా అందుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ ఫంక్షన్‌కు హజరైన రణ్వీర్ బయట సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఇక వారితో సరదాగా మాట్లాడుతూ సెల్ఫీలకు ఫోజులు ఇస్తున్నాడు. చదవండి: నేను సినిమాలు మానేయాలని కోరుకున్నారు, అది బాధించింది: దుల్కర్ ఈ క్రమంలో రణ్వీర్ మీదకు ఎగబడుతున్న జనాలను పక్కనే ఉన్న బాడిగార్డ్స్ కంట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో బాడీగార్డ్ చేయి రణ్వీర్ చెంపకు గట్టిగా తగిలింది. దాంతో రణ్వీర్ ఒక్కసారిగా ఏం జరిగిందో అర్థం కాలేదు. గట్టిగా తగలడంతో కాసేపు చెంప మీద చేయి అలాగే ఉంచి అటూ ఇటూ చూస్తూ ఉండిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇక దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో షేర్ చేస్తున్నారు. Oops! Who slapped him?#RanveerSingh #slapped #Viral pic.twitter.com/0jzekvpOMr — Payal Mohindra (@payal_mohindra) September 13, 2022 -
చెంపలు వాయించింది
కర్ణాటక,మండ్య : మండ్య నగరం నుంచి పాండవపురకు వెళుతున్న కేఎస్ ఆర్టీసీ బస్సులో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ యువకుడి చెంప వాయించింది ఓ యువతి. ప్రస్తుతం ఈ వీడియో కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. మండ్య నగరం నుంచి పాండవపురకు యువతి గురువారం బస్సులో వెళ్తుండగా అదే బస్సులో వెనక సీటులో కూర్చున్న యువకుడు యువతిని తాకడం చేశాడు. ఓపిగ్గా చూసిన యువతి పరిస్థితి శ్రుతి మించడంతో ఒక్కసారిగా ఆగ్రహంతో సదరు యువకుడి చెంప చెల్లున వాయించింది. నీ చెల్లి, తల్లి ఉంటే ఇలాగే చేస్తావా అంటూ అతడిని ప్రశ్నించింది. బస్సులో ఒక్కసారిగా ఈ ఘటన జరగడంతో ప్రయాణికులు అప్రమత్తమయ్యారు. ఆ వెంటనే యువకుడు బస్సు నుంచి కిందకు దిగి వెళ్లిపోయాడు. -
విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన న్యాయవాది
మొయినాబాద్(చేవెళ్ల): న్యాయవాద వృత్తిలో ఉన్న ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. అతని ప్రవర్తనకు విసిగిపోయిన విద్యార్థిని బస్సులోనే అతని చెంప చెళ్లుమనిపించి పోలీసులకు అప్పగించింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. సీఐ సునీత తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నగరానికి చెందిన విద్యార్థిని(20) మొయినాబాద్ అమ్డాపూర్ చౌరస్తాలో ఉన్న జేబీఐఈటీ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతోంది. గురువారం నగరంలోని మెహదీపట్నం నుంచి కళాశాలకు వచ్చేందుకు పరిగి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎక్కింది. బస్సులో ప్రయాణిస్తున్న వికారాబాద్ జిల్లా పరిగికి చెందిన న్యాయవాది వెంకటరాములు విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. విద్యార్థిని రెండు మూడుసార్లు చెప్పినా అతని తీరు మారలేదు. పదేపదే అసభ్యకరంగా ప్రవర్తిస్తుండడంతో విసిగిపోయిన విద్యార్థిని బస్సులోనే అతని చెంప చెళ్లుమనిపించింది. మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ ఎదుట బస్సును ఆపి అతడిని పోలీసులకు అప్పగించింది. పోలీసులు సదరు న్యాయవాదిపై కేసు నమోదు చేశారు. -
అడ్డంగా బుక్కైన బేగంపేట్ ఏసీపీ
సాక్షి, హైదరాబాద్ : బేగంపేట్ ఏసీపీ రంగారావు తీరు వివాదాస్పదంగా మారింది. ఓ మహిళపై మీడియా ముందే చెయ్యి చేసుకుని అడ్డంగా బుక్కయ్యారు. ఈ వీడియో వైరల్ అవుతుండటంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 9వ తేదీన బొల్లారం పయొనీర్ బజార్‌లోని ఓ జ్యువెల్లరీ షాపులో దొంగతనం చోటు చేసుకుంది. కేసుకు సంబంధించి ముగ్గురు మహిళలను, దొంగసొత్తును అమ్ముతున్న మరో మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఆపై జర్నలిస్టుల ముందే ఏసీపీ రంగరావు మహిళ దొంగపై చెయ్యి చేసుకున్నారు. ఈ వీడియో మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. ఉన్నతాధికారులు ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. -
మహిళపై చెయ్యి చేసుకున్న బేగంపేట్ ఏసీపీ
-
బీజేపీ నేత, మాజీ ఎంపీ జంగారెడ్డిపై దాడి
-
లారీ యజమానిపై చేయిచేసుకున్న ఎస్ఐ
అనంతపురం: లారీల్లో కూలీల ప్రయాణంపై రవాణా శాఖ ఆంక్షలు విధించింది. కూలీలను తరలిస్తున్న లారీలపై పోలీసులు శనివారం భారీగా జరిమానా విధించారు. జరిమానా పై నిలదీసిన లారీ యజమానిపై ఎస్ఐ జగదీష్ చేయిచేసుకున్నారు. దీనికి నిరసనగా లారీ యజమానులు, కూలీలు రుద్రం పేటలో రాస్తారోకో నిర్వహించారు. -
ప్రయాణికురాలిపై మహిళా కానిస్టేబుల్ దాడి
ఆదిలాబాద్: బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికురాలిపై మహిళా కానిస్టేబుల్ చేయి చేసుకుంది. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. అకారణంగా కానిస్టేబుల్ తనపై దాడి చేసిందని బాధితురాలు.. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. వివరాలు.. కప్పర్ల గ్రామానికి చెందిన గంగూతాయి(18) అనే యువతి తలమడుగు మండలం ధరమ్‌పూర్ గ్రామం నుంచి అదిలాబాద్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎక్కింది. బస్సులో బాగా రద్దీ ఉండటంతో.. ఫుట్‌బోర్డులో నిలబడింది. అదే సమయంలో బస్సులో తోపులాట జరగడంతో పక్కనే ఉన్న మహిళా కానిస్టేబుల్‌ను అనూష ఢీకొంది. దీంతో కోపోద్రిక్తురాలైన మహిళా కానిస్టేబుల్.. 'కళ్లు కనిపించడం లేదా మీద పడతావెందుకు' అని ఆమెను దుర్భాషలాడింది. రద్దీ ఎక్కువగా ఉండటంతో అలా జరిగిందని గంగుతాయి చెప్పింది. 'మాటకు మాట బదులు చేప్తావా' అంటూ యువతిపై దాడిచేసి ఆమెను కొట్టింది. దీంతో యువతి తన తల్లిదండ్రులతో కలిసి ఆదిలాబాద్ టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ చేపడుతున్నారు.