లారీల్లో కూలీల ప్రయాణంపై రవాణా శాఖ ఆంక్షలు విధించింది.
అనంతపురం: లారీల్లో కూలీల ప్రయాణంపై రవాణా శాఖ ఆంక్షలు విధించింది. కూలీలను తరలిస్తున్న లారీలపై పోలీసులు శనివారం భారీగా జరిమానా విధించారు. జరిమానా పై నిలదీసిన లారీ యజమానిపై ఎస్ఐ జగదీష్ చేయిచేసుకున్నారు. దీనికి నిరసనగా లారీ యజమానులు, కూలీలు రుద్రం పేటలో రాస్తారోకో నిర్వహించారు.