Lorry Owner
-
విశాఖపట్నంలో విషాదం.. నడిరోడ్డుపై..
గాజువాక (విశాఖపట్నం): ఒక లారీ యజమాని నడిరోడ్డుపై ఆత్మహత్య చేసుకున్నాడు. లారీ క్యాబిన్లో ఉన్న డీజిల్‌ను శరీరంపై పోసుకొని నిప్పు అంటించుకోవడంతో సంఘటనా స్థలంలోనే కాలి బూడిదయ్యాడు. మానసికంగా ఇబ్బంది పడుతుండటం వల్లే ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. గాజువాక దరి శ్రీనగర్ జంక్షన్లో సోమవారం చోటుచేసుకున్న ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తెలంగాణలోని నల్గొండ జిల్లా చిట్యాడ మండలం డెలిమనేడు ప్రాంతానికి చెందిన జి.నర్సిరెడ్డి (32)కి సొంత లారీ ఉంది. అతడే డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం మిర్యాలగూడ నుంచి ఒడిశా ప్రాంతానికి సరకు తీసుకెళ్లి అన్లోడ్ చేశాడు. అక్కడ ఇసుక లోడ్ చేసుకొని గాజువాక ప్రాంతానికి వచ్చాడు. ఇసుకలోడ్‌తో ఉన్న లారీని శ్రీనగర్ జంక్షన్‌లోని సర్వీస్ రోడ్డులో పార్కు చేసి సేదతీరాడు. ఇసుకను గాజువాక ప్రాంతంలో ఉన్న యార్డుకు తరలించకుండా అక్కడే ఉండిపోవడంతో అతడితోపాటు వచ్చిన మరో డ్రైవర్ మధు లారీని యార్డుకు ఆదివారం తీసుకెళ్లి అన్లోడ్ చేసి వచ్చాడు. ఆదివారం రాత్రి నర్సిరెడ్డి ఆ లారీలోనే నిద్రించగా మధు విశ్రాంతి తీసుకోవడం కోసం అక్కడికి సమీపంలోనే ఇతర డ్రైవర్ల వద్దకు వెళ్లాడు. సోమవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో నర్సిరెడ్డి తన లారీలో ఉన్న డీజిల్ క్యాన్‌ను తీసి నడిరోడ్డుపైకి వచ్చి తన శరీరంపై పోసుకొని నిప్పు అంటించుకున్నాడు. అదే సమయంలో అటువైపు వెళ్తూ గమనించిన పోలీస్ పెట్రోలింగ్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే నర్సిరెడ్డి పూర్తిగా కాలిపోవడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గాజువాక సీఐ సూరినాయుడు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రాథమిక విచారణ నిర్వహించారు. రెండు రోజులుగా నర్సిరెడ్డి మానసికంగా బాధపడుతున్నట్టు పోలీసులు తెలిపారు. అతడితో మాట్లాడటం కోసం తాను ఫోన్లో సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ స్పందించలేదని మృతుడి సోదరుడు కృష్ణారెడ్డి పోలీసులకు ఫోన్లో తెలిపారు. నర్సిరెడ్డికి ఇంకా వివాహం కాలేదు. అన్నదమ్ములతో కలిసే నివాసముంటున్నాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని సీఐ ఈ సందర్భంగా తెలిపారు. -
ఇన్స్పెక్టర్ స్వాతి గౌడ్‌పై రహస్య విచారణ!
-
ఎల్బీనగర్లో లారీ డ్రైవర్ పై దాడి
-
లారీ ఓనర్ దొంగ వేషాలు
మదనపల్లె: లారీ ఓనర్ దొంగ అవతారం ఎత్తి ఇళ్లలో చోరీలు చేస్తూ పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. మదనపల్లె డీఎస్పీ రాజేంద్రప్రసాద్, సీఐ నిరంజన్‌కుమార్ గురువారం స్థానిక ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మండలంలోని కొత్తపల్లె పంచాయతీ ఈశ్వరమ్మ ఇళ్లలో నివాసం ఉంటున్న మహ్మద్ రఫీక్(40)కి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. చిన్నతనం నుంచి లారీ డ్రైవర్. తర్వాత ఓ లారీ కొన్నాడు. ఈ క్రమంలో జూదం, మద్యం, చెడు వ్యసనాలకు అలవాటు పడి కష్టాల్లోకి కూరుకుపోయాడు. వడ్డీ వ్యాపారులు, బ్యాంకులలో అప్పులు తీర్చేందుకు రాత్రివేళ తాళాలు వేసిన ఇళ్లలో దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. మూడు నెలలుగా పట్టణంలోని పలు వీధులలో అర్ధరాత్రిళ్లు 13 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డాడు. దొంగిలించిన బంగారు ఆభరణాలను స్థానిక బంగారు దుకాణాలలో రూ.12 లక్షలకు తాకట్టు పెట్టాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి, నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సీఐ నిరంజన్‌కుమార్ ఆదేశాల మేరకు ఎస్ఐలు సుకుమార్, దస్తగిరి, సిబ్బంది శంకర, రాజేష్, శ్రీనివాస్ తదితరులు చాకచక్యంగా స్థానిక చిత్తూరు బస్టాండులో మహ్మద్‌రఫీక్‌ను అరెస్టు చేశారని డీఎస్పీ తెలిపారు. ప్రతిభ కనబరిచిన సీఐ, ఎస్ఐ, సిబ్బందికి డీఎస్పీ నగదు రివార్డు అందజేశారు. ఫోటోలు ఉన్నాయి. -
లారీ యజమానిపై చేయిచేసుకున్న ఎస్ఐ
అనంతపురం: లారీల్లో కూలీల ప్రయాణంపై రవాణా శాఖ ఆంక్షలు విధించింది. కూలీలను తరలిస్తున్న లారీలపై పోలీసులు శనివారం భారీగా జరిమానా విధించారు. జరిమానా పై నిలదీసిన లారీ యజమానిపై ఎస్ఐ జగదీష్ చేయిచేసుకున్నారు. దీనికి నిరసనగా లారీ యజమానులు, కూలీలు రుద్రం పేటలో రాస్తారోకో నిర్వహించారు. -
చలాన్ రాశాడని ట్రాఫిక్ ఎస్సైపై దాడి
లంగర్‌హౌస్ (హైదరాబాద్) : విధుల్లో ఉన్న ట్రాఫిక్ ఎస్సైపై మళ్లీ దాడి జరిగింది. కొద్ది నెలల్లోనే వివిధ ప్రాంతాల్లో ఈ ఎస్సైపైనే దాదాపు 20 సార్లకు పైగా దాడి జరగడం చర్చనీయాంశంగా మారింది. లంగర్‌హౌస్ పోలీసుల కథనం ప్రకారం... టి.మధు టోలీచౌకీ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా పని చేస్తున్నారు. శనివారం ఈయన మొఘల్‌నగర్ రింగ్‌రోడ్డు వద్ద విధులు నిర్వహిస్తున్నారు. కాగా మధ్యాహ్నం సమయంలో గుడిమల్కాపూర్ వైపు నుంచి ఓ లారీ అత్తాపూర్ వైపు వెళ్తోంది. ఎస్సై మధు ఆ లారీని ఆపారు. ప్రవేశం లేని సమయంలో లారీతో ఈ రోడ్డుపైకి ఎలా వచ్చావని డ్రైవర్‌ను ప్రశ్నించి, రూ.1100 చలాన్ విధించారు. అంతలోనే లారీ యజమాని సయ్యద్ హరీషుద్దీన్ అక్కడకు చేరుకుని ఎస్సైతో వాగ్వాదానికి దిగాడు. 'మా లారీలను పార్కు చేసే ప్రాంత సమీపానికి వచ్చి చలాన్లు రాసి వేధిస్తావా?' అని దుర్భాషలాడి ఎస్సైపై దాడి చేశాడు. ఎస్సై ఫిర్యాదు మేరకు లంగర్‌హౌస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.