ఓ లారీ ఓనర్‌పై దాడిచేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యువ అధికారిణి వ్యవహారం సంచలనంగా మారింది. రవాణా శాఖలో మోటార్ వెహికల్ ఇన్స్‌పెక్టర్(ఎంవీఐ)గా పనిచేస్తోన్న స్వాతి గౌడ్ కొందరు గుండాలతో కలిసి తనపై దాడి చేశారని శ్రీకాంత్‌రెడ్డి అనే వ్యక్తి ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. అదే సమయంలో ‘విధులకు ఆటంకం కల్గించాడ’ని లారీ ఓనర్‌పై స్వాతి గౌడ్ రివర్స్ కేసు పెట్టారు.