
భాగ్యనగర వాసులకు ట్రాఫిక్ కష్టాలు
భాగ్యనగర వాసులకు ట్రాఫిక్ మరోసారి నరకాన్ని చూపింది. సికింద్రబాద్-పంజాగుట్ట మార్గంలో మంగళవారం ఉదయం భారీగా ట్రాఫిక్ స్తంభించింది.
హైదరాబాద్: భాగ్యనగర వాసులకు ట్రాఫిక్ మరోసారి నరకాన్ని చూపింది. సికింద్రబాద్-పంజాగుట్ట మార్గంలో మంగళవారం ఉదయం భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఉదయం 7 గంటల నుంచి 11.30 వరకు ట్రాఫిక్ కొనసాగడంతో దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
బేగంపేట ప్లైఓవర్ పై ఓ సిమెంట్ లారీ ఆగిపోవడంతో ట్రాఫిక్ స్తంభింయింది. దీన్ని తొలగించడంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించడంతో వాహనదారులకు తిప్పలు తప్పలేదు. వాహనాలు ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున నిలిచిపోవడంతో చీమల దండును తలపించాయి. వాహనాలు మెల్లగా కదలడంతో కొంచెం దూరం ప్రయాణానికే గంటల తరబడి సమయం పట్టింది. దీంతో కార్యాలయాలకు, కాలేజీలకు వెళ్లే వారు ఇబ్బందులకు గురైయ్యారు.