
బేగంపేటలో చైన్ స్నాచింగ్
హైదరాబాద్: హైదరాబాద్లో మరోసారి చైన్ స్నాచర్స్ రెచ్చిపోయారు. బేగంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. బాలంరాయి చౌరస్తా వద్ద నడిచి వెళ్తున్న మహిళ మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసును బైక్‌పై వచ్చిన దుండగులు లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.